Watch Video: Akhil Akkineni Says Naga Chaitanya Is A Silent Killer, Deets Inside - Sakshi
Sakshi News home page

Akhil Akkineni : నాగచైతన్య సైలెంట్‌గా అన్నీ చేసేస్తాడు.. సీక్రెట్‌ చెప్పేసిన అఖిల్‌

Published Mon, Apr 10 2023 1:17 PM | Last Updated on Mon, Apr 10 2023 2:32 PM

Naga Chaitanya Is Silent Killer Says Akhil Akkineni Comments Viral - Sakshi

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్‌. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వార్‌కి రెడీ అవుతోంది. అఖిల్‌ కెరీర్‌లో తొలిసారి పాన్‌ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్‌ స్పీడు పెంచారు మేకర్స్‌.

తాజాగా యాంకర్‌ సుమతో ముచ్చటించిన అఖిల్‌ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాన్న షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని ఇంటికి వచ్చాక మొత్తం సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తారు. సినిమాల గురించి డిస్కషన్స్‌ చేయరు.

మా అన్న నాగచైతన్య కూడా అంతే. సేమ్‌ నాన్న లాగే. పైకి నేను నాటీ(చిలిపి)గా కనిపిస్తా కానీ నాకంటే ఎక్కువ నాటీ చై. సైలెంట్‌ కిల్లర్‌. అన్నీ సైలెంట్‌గా చేసేస్తాడు అంటూ నాగచైతన్య సీక్రెట్‌ను రివీల్‌ చేసేశాడు. ప్రస్తుతం చైపై అఖిల్‌ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement