anchor suma
-
యాంకర్ సుమ ముఖ్య పాత్రలో ప్రేమంటే?
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా, ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమాకు ‘ప్రేమంటే?’ అనే టైటిల్ ఖరారైంది. ‘థ్రిల్– యూప్రాప్తిరస్తు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా పతాకాలపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.తొలి సీన్‌కి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో రానా క్లాప్ ఇచ్చారు. ‘‘నిర్మాతగా జాన్వీ నారంగ్‌కు ఇది తొలి సినిమా. సునీల్, భరత్ నారంగ్‌ల మార్గదర్శకత్వంలో జాన్వీ నారంగ్ కంటెంట్–బేస్డ్ సినిమా ప్రపంచంలోకి తన ప్రయాణాన్నిప్రారంభించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో సునీల్ నారంగ్, అభిషేక్ నామా, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రావు, జనార్ధన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, సహ–నిర్మాత: ఆదిత్య మెరుగు. -
Bigg Boss: ఆగిపోయిన లైవ్ స్ట్రీమింగ్, చివరి గెస్టుగా సుమ
యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే! బిగ్‌బాస్ హౌస్‌లోకి చివరి గెస్టుగా యాంకర్ సుమ ఎంట్రీ ఇచ్చింది. ఫైనలిస్టులతో టాస్కులాడిస్తూ వారిని ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలోనే కొన్ని సరదా ప్రశ్నలడిగింది. మూడు రోజులు స్నానం చేయకుండా ఉన్నారా? అంటే మూడు కాదు నాలుగు రోజులు స్నానం చేయలేదని తెలిపింది ప్రేరణ.వేరేవాళ్ల టూత్ బ్రష్‌ను వాడారా? అంటే నబీల్, నిఖిల్, అవినాష్, గౌతమ్.. నలుగురూ అవునని తలూపారు. ఛీ బాయ్స్.. ఇలా ఉన్నారేంట్రా బాబూ అని సుమ, ప్రేరణ తల పట్టుకున్నారు. తర్వాత వీళ్లతో మరిన్ని గేమ్స్ ఆడించింది. ఇకపోతే రేపే బిగ్‌బాస్ ఫైనల్. ఇప్పటికే హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆగిపోయింది. ప్రేక్షకులు ఓట్లు వేయడం కూడా ముగిసిపోయింది. విజేతను ప్రకటించడమే మిగిలి ఉంది. నిఖిల్, గౌతమ్ మధ్య భారీ పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కూకట్‌పల్లిలో యాంకర్ సుమ సందడి (ఫొటోలు)
-
రాకీ అవెన్యూస్ వివాదంపై వివరణ ఇచ్చిన యాంకర్ సుమ
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేయడంతో చాలామంది రోడ్డున పడ్డారు. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి తమ నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని ఆ సంస్థ మోసం చేసిందని వారు ఆరోపించారు. ఆ సంస్థను ఒక యాడ్ ద్వారా సుమతో పాటు ఆమె భర్త, రాజీవ్ కనకాల ప్రమోట్ చేయడంతో తామందరం పెట్టుబడి పెట్టామని వారు తెలిపారు. దీంతో సుమ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా యాంకర్ సుమ సోషల్‌మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.'రాకీ అవెన్యూస్కు సంబంధించిన ఒక యాడ్‌లో నేను గతంలో నటించాను. నా వృత్తిలో భాగంగా 2016-2018 వరకు మాత్రమే వారితో ఒప్పందం ఉంది. ఆపై ఆ ప్రకటనలు రద్దు చేయబడ్డాయి. ఈ ప్రకటనలు ఇప్పుడు అనధికారమైనవి అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. పైన పేర్కొన్న వ్యవధి తర్వాత నేను ఏ సందర్భంలోనూ రాకీ అవెన్యూస్కు సంబంధించిన యాడ్‌లో కనిపించలేదు. అయితే, కొంత కాలం తర్వాత పాత ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఇటీవలి కాలంలో నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుంచి కొన్ని లీగల్ నోటీసులను అందుకున్నాను. ఆపై వారి నోటీసులకు నేను సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో రాకీ అవెన్యూలకు పంపిన లీగల్ నోటీసులో కొనుగోలుదారుల జాబితాను కూడా పరిశీలించమని వారిని కోరాను. నేను కూడా ఈ సమస్యను పరిష్కరించేందకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. తప్పుడు సమాచారాన్ని అరికట్టండి. అధికారిక ఛానెల్‌ల నుంచి వచ్చే ఏదైనా ప్రకటనలు, ప్రమోషన్లు, వీడియోలను ధృవీకరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలని నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.' అని సుమ తెలిపారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
యాంకర్ సుమకు స్టేజీపై ముద్దు పెట్టిన నటుడు
యాంకర్ సుమ ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. పంచ్‌లు వేయడమే కాదు, ఎదుటివాళ్లు వేసే పంచ్‌లకు రివర్స్ కౌంటర్ ఇవ్వడమూ తెలుసు. ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమకు తాజాగా ఓ ఇబ్బందిరక పరిస్థితి ఎదురైంది. తంగలాన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు డేనియల్ కాల్టగిరోన్ను స్టేజీపైకి ఆహ్వానించిన సుమ.. అతడితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది. షేక్ హ్యాండ్ ఇస్తే..అందరూ బాగున్నారా? మీరు తప్పకుండా ఈ సినిమాను ఆగస్టు 15న చూడాలి అని చెప్పించింది. చివర్లో చిన్న ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించింది. ఇక్కడ ఉండే అమ్మాయిల్లో సుమయే అందంగా ఉంది అని నటుడితో అనిపించింది. ఆ లైన్ కరెక్ట్‌గా చెప్పడంతో సంతోషంతో షేక్ హ్యాండ్ ఇచ్చింది. కానీ డేనియల్.. ఆమె చేతికి ముద్దు పెట్టడంతో అవాక్కయింది. వెంటనే తమాయించుకుని సరదాగా స్పందించింది. కవర్ చేసిన సుమఓరి నాయనో.. రాజా, ఈయన మా అన్నయ్య.. రాఖీ పండగ వస్తోంది అంటూ కవర్ చేసి.. అన్నయ్య సన్నిధి.. అని పాటందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. పార్వతి తిరువోతు, మాళివక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 15న విడుదల కానుంది. చదవండి: ధనుష్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా..: హీరో సోదరి -
ఈ అమ్మాయి నా మీద వేసిన జోక్ అర్థం అవ్వటానికి మూడు రోజులు పట్టింది
-
సుమ వింత ఫోటో షూట్.. భయపడిపోయిన రాజీవ్, ఫన్నీ వీడియో వైరల్
ఒకవైపు టీవీ షోలు.. మరోవైపు సినిమా ఈవెంట్స్‌తో దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా కొనసాగుతున్నారు యాంకర్ సుమ. ఎలాంటి షో అయినా.. ప్రొగ్రామ్ అయినా యాంకర్‌గా సుమ ఉండాల్సిందే. కొంతమందికి అయితే ఆమె యాంకరింగ్ సెంటిమెంట్‌గాను మారింది. (చదవండి: సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా..భర్తగా గర్వంగా ఉంది: అక్షయ్ కుమార్) ఆమె కోసం కొన్ని సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తనదైన యాంకరింగ్‌తో అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది సుమ. కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ యాంకరమ్మ. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటుంది. (చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి) ఇక ఇటీవల వింత ఫోటో షూట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది సుమ. తన కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా రిలీజ్ టైమ్‌లో హీరోయిన్ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఆ ఫోటో షూట్ సమయంలో రాజీవ్ రియాక్షన్ ఎలా ఉందో తెలియజేస్తూ ఓ వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో సుమ ఫోటో కోసం రకరకాల పోజులు ఇస్తుంటే.. రాజీవ్ ‘వామ్మో.. వాయమ్మో’అంటూ దండం పెట్టేశాడు. ‘నా ఫోటో షూట్ సమయంలో భర్త రియాక్షన్ ఇది’ అంటూ ఆ వీడియోని షేర్ చేసింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘రాజీవ్ గారు మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్’, ‘సుమ అక్క రోజు రోజుకి మీ వయసు తగ్గిపోతుంది’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ కొడుకు
-
పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ కొడుకు
-
పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ తనయుడు, ఏమైందంటే?
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల పోలీసులకు దొరికాడు. ఓ పార్టీకి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఇతడిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా? మరేం లేదు ప్రాంక్.. ఈ మధ్య రచ్చ చేయడం, చివర్లో అది తూచ్, ఉత్తుత్తే అనేయడం ఫ్యాషన్ అయిపోయింది. సినిమా వాళ్లయితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ చిత్రాలకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. యాంకర్ సుమ తనయుడు రోషన్ కూడా ఇదే అనుసరించాడు. వెరైటీ స్టంట్.. 'బబుల్గమ్' సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మానస చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రవిక్రాంత్ దర్శకత్వం వహించాడు. ఆ మూవీ కోసం తాజాగా కొత్త రీతిలో ప్రమోషన్ చేశారు.. పోలీసులకు దొరికిపోయినట్లు ఓ స్కిట్ వేశారు. అందులో భాగంగా తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా కారులో వెళ్తున్న రోషన్‌ను ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అసలే ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు ఏరులై పారుతుంది. కారు డిక్కీలో సూట్‌కేసులు.. వాటిని నియంత్రిచడం కోసం కార్లు, ఇతర వాహనాలను పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. అలా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులు రోషన్ కారును అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగితే రోషన్ స్నేహితులు తలతిక్క సమాధానాలు చెప్పారు. చివరకు కారు డిక్కీ ఓపెన్ చేయించగా అందులో సూట్‌కేసులు కనిపించాయి. అవి తెరవడానికి తటపటాయించడమే కాకుండా పోలీసులతోనే డీల్ కుదుర్చుకోవాలని చూశారు. కానీ పోలీసులు వినకుండా సూట్‌కేసులు ఓపెన్ చేయాల్సిందేనని పట్టుపట్టారు. అప్పుడు సుమ.. ఇప్పుడు ఆమె తనయుడు.. చేసేదేం లేక సూట్‌కేసులు ఓపెన్ చేయగా వాటిలో స్వీట్లు ఉండటం చూసి పోలీసులు షాకవుతారు. అక్కడ జిలేబీలు, బబుల్ గమ్స్ ఉన్నాయి. అంటే మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఇది బబుల్ గమ్ సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని! ఇది చూసిన జనాలు.. మరీ ఇలాంటి స్టంట్లు అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. అప్పుడేమో అల్లరి నరేశ్ ఉగ్రం రిలీజ్ సమయంలో యాంకర్ సుమను అరెస్ట్ చేసినట్లు నమ్మించి సినిమాకు కావాల్సినంత హైప్ తెచ్చుకున్నారు. ఇప్పుడేమో సుమ కుమారుడు పోలీసులకు దొరికినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. చదవండి: నెలసరి ఆలస్యం.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్ -
యాంకర్ సుమతో నాని మరియు కార్తీ జోకులు
-
ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ 10 లీటర్ల రిలీజ్
-
జిమ్‌లో చెమటోడుస్తున్న లావణ్య, టమాటతో సుమ ఫన్నీ వీడియో
► దుబాయ్‌లో తల్లి బర్త్‌డే సెలబ్రేట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ► చీరలో క్యూట్ లుక్‌తో అదరగొడుతున్న హనీరోజ్ ► జిమ్‌లో చెమటోడుస్తున్న లావణ్య త్రిపాఠి ► టమాటలతో సుమ ఫన్నీ వీడియో ► వంపుసొంపులు చూపిస్తోన్న సిరి హన్మంత్ ► అందం, ఆత్మస్థైర్యం కలగలిస్తే ప్రియాంక సింగ్ ► మేడ్ ఇన్ హెవెన్ 2 రిలీజ్ డేట్ పోస్టర్ షేర్ చేసిన శోభిత ధూళిపాళ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) -
సుమతో విబేధాలు? అందుకే అలా చేస్తున్నా: రాజీవ్ కనకాల
బుల్లితెరపై యాంకర్ సుమ స్టార్.. వెండితెరపై రాజీవ్ కనకాల ఓ చిన్నపాటి స్టార్. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఎందుకో మరి గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సంపాదన విషయంలోనూ అభిప్రాయబేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి. అదంతా ఏమీ లేదని చెప్పినా వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల తన వైవాహిక జీవితం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చనిపోతాను అనగానే బాధ్యత తీసుకున్నా 'మా అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు. చెన్నైలో సినిమా ఇన్స్టిట్యూట్ పెడుతున్నారనగానే జాబ్ మానేసి అక్కడికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే ఇన్స్టిట్యూట్ మూసేశారు. అమ్మ మళ్లీ రాష్ట్ర ఉద్యోగం కొట్టింది. నాన్న నటుడిగా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ గుర్తింపు పొందాడు. తర్వాత ఆయన దర్శకుడిగా మారి సినిమాలు తీశాడు. 1985లో సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం. అప్పటినుంచి వరుసగా కష్టాలే! ఎప్పుడూ డబ్బులుండేవి కాదు. రూ.100, రూ.500 కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నాన్నకు వారి సోదరులతో కలహాలు వచ్చాయి. వీటన్నింటిని తట్టుకోలేకపోయిన ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. నేనున్నా కదా నాన్న అని సర్ది చెప్పి పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్నా. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయాను. సుమతో విబేధాలు.. అందుకోసమే అలా చేస్తున్నా కంటి మీద కునుకు లేకుండా వరుస సీరియల్స్ చేసేవాడిని. పెళ్లయిన తర్వాత ఇద్దరం కలిసి అప్పులు అంతా తీర్చేశాం. మధ్యలో ఒకసారి ఓ సీరియల్‌కు డైరెక్షన్ చేశాను. ఏడాదిదాకా ఏ సినిమా ఛాన్సూ రాలేదు. అందుకే నేను నటనకే అంకితమయ్యాను. సుమ, నేను సంతోషంగా ఉన్నాం. మా మధ్య దూరం పెరిగిందని లేనిపోనివి రాస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే అప్పుడప్పుడూ తన ప్రోగ్రామ్‌లకు హాజరవుతున్నాను. కలిసి రీల్స్ కూడా చేస్తున్నాం. ఈ విడాకుల రూమర్స్ విని నేను బాధపడ్డాను. కానీ సుమ అయితే ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత నేను కూడా లైట్ తీసుకోవడం మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చదవండి: అందుకే సౌత్‌ను పట్టించుకోను.. అక్కడ హీరో, దర్శకుడు కాంప్రమైజ్ అడిగారు: నటి రెండో భార్యతో కలిసి తిరుమలను దర్శించిన ప్రభుదేవా -
రంగబలితో బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం
‘‘సుధాకర్‌గారు, నేను ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకున్నాం. పవన్ చెప్పిన ‘రంగబలి’ కథ మా ఇద్దరికీ నచ్చడంతో ఈ మూవీ చేశాం. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. ‘రంగబలి’తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అని హీరో నాగశౌర్య అన్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి యాంకర్ సుమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగశౌర్య మాట్లాడుతూ–‘‘ఇప్పటి వరకూ సుధాకర్‌గారికి వచ్చిన లాభాల కంటే ‘రంగబలి’ కి వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ‘రంగబలి’తో పవన్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాగశౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారు. సుధాకర్‌గారు ఎక్కడ రాజీపడకుండా తీశారు’’ అన్నారు పవన్ బాసంశెట్టి. ‘‘రంగబలి’ టీమ్‌తో పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు యుక్తి తరేజ. ‘‘రంగబలి’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్స్ కిషోర్ తిరుమల, శ్రీకాంత్ ఓదెల. -
అమ్మకు బంగారు బహుమతిచ్చిన యాంకర్ సుమ
యాంకరింగ్‌లో సుమను ఢీ కొట్టేవారే లేరు. ప్రస్తుతం టాప్ యాంకర్లుగా రాణిస్తున్నవారు కూడా సుమ యాంకరింగ్‌కు ఫ్యాన్సే! పంచులు, కౌంటర్లు, జోక్స్లతో ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తుంది సుమ. ఎంతటివారైనా ఆమె మాటల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే! అంతటి ధీశాలి సుమ అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా సుమ మదర్స్‌డే(మే 14)ను పురస్కరించుకుని తన తల్లి విమల కోసం ఏదైనా గిఫ్ట్ కొనేందుకు షాపింగ్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన సొంత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇక్కడ కూడా తన చలాకీ మాటలతో అభిమానులను ఎంటర్టైన్ చేసింది చివరగా తన తల్లి కోసం ఒక సింపుల్ ఐటం సెలక్ట్ చేసుకున్నట్లు చెప్పింది. చివరగా.. అమ్మకు ఏమిచ్చినా సరిపోదు కాబట్టి వీటన్నిటితోపాటు బోలెడంత ప్రేమను కూడా ఇచ్చేయండి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే టాలీవుడ్లో జరిగే చిన్నాపెద్ద ఈవెంట్లకు సుమ ఉండాల్సిందే! ఏ కార్యక్రమాన్ని అయినా సక్సెస్ఫుల్ చేయడంలో సుమ దిట్ట. తను టీవీ షోలు, ఇంటర్వ్యూలే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లు కూడా చేస్తుందన్న విషయం తెలిసిందే! కెరీర్ తొలినాళ్లలో నటిగా కొన్ని సినిమాలు చేసిన సుమ ఇటీవల జయమ్మ పంచాయితీ సినిమాతో మెప్పించింది కూడా! చదవండి: రూ.132 కోట్ల నష్టం.. భర్త కోమాలోకి.. మూడుసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా -
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు)
-
పూజా హెగ్డేతో డేట్‌కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా రిలీజైన తొలిరోజే నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా అఖిల్ కెరీర్లో ఇంకో డిజాస్టర్‌గా ఏజెంట్ మిగిలిపోయింది. చదవండి: (ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్) ఇక సినిమా ఫెయిల్యూర్‌పై స్వయంగా నిర్మాత అనిల్ సుంకర కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రీసెంట్గా సుమ షోకి గెస్టుగా వెళ్లిన అఖిల్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏ హీరోయిన్గా డేట్‌కి వెళ్తారు అని అడగ్గా.. ఏమాత్రం ఆలోచన లేకుండా పూజా హెగ్డే అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు. ఇక హీరో రామ్‌చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, హార్ట్‌బీట్ అంటూ పేర్కొన్నాడు. ఇక నాగార్జునకు తెలియకుండా గోడదూకి వెళ్లానని, ఇప్పటికీ ఆయనకు ఈ విషయం తెలియదంటూ సీక్రెట్ బయటపెట్టేశాడు అఖిల్. చదవండి: బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి -
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు)
Anchor Suma: భర్తతో కలిసి లక్ష్మీ పూజలో పాల్గొన్న సుమ (ఫొటోలు) -
యాంకర్ సుమ అరెస్ట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటల ప్రవాహంతో 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. పేరుకు మలయాళీ అయినా తెలుగులో గలగల మాట్లాడుతూ తన కామెడీ, పంచ్ టైమింగ్‌లతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఆమె లేకుండా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు దాదాపు ఉండవని చెప్పాలి. అంతటి సామర్థ్యం ఉన్న సుమను తాజాగా అరెస్ట్ చేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె చేతికి బేడీలు వేసి వ్యాన్‌లో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సుమకి ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే సుమను నిజంగా అరెస్ట్ చేయలేదట. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా అరెస్ట్ చేశారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల ప్రమోషన్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అల్లరి నరేస్ నటిస్తున్న సినిమా ఉగ్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సుమతో ఇలా స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసారన్నమాట. CI Shiva Kumar on duty! Your favourite anchor is in my control. The #Ugram begins. Details at 5.04 PM. https://t.co/5aQDlhlNdN — Allari Naresh (@allarinaresh) April 12, 2023 -
రొమాన్స్ లేదా అఖిల్.. ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ
-
అదీ సుమక్క లెక్క
-
హీరోగా మారిన యాంకర్ సుమ కొడుకు.. ఫస్ట్‌లుక్ అవుట్.. డైరెక్టర్ ఎవరంటే
స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత చదువులపై ఫోకస పెట్టాడు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. త్వరలో రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అయితే అది ఏ మూవీ, ఏ ప్రోడక్షన్ అనేది సస్పెన్స్‌లో ఉంది. ఈ క్రమంలో మార్చి 15న రోషన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన ఇచ్చారు మేకర్స్. చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ నటి అంతేకాదు హీరోగా డెబ్యూ ఇస్తున్న రోషన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్ పేరేపు.. రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రం రూపొందుతోంది. పి విమల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్లో రోషన్ డిజేగా కనిపించాడు. తనయుడు లుక్‌ను షేర్ చేస్తూ సుమ మురిసిపోయింది. ‘ఎట్టకేలకు నీ కల నిజమైంది రోషన్’ అంటూ సుమ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. Team @maheshwarimovie wishes #RoshanKanakala a very Happy Birthday 💥 #ProductionNo1 pic.twitter.com/KTmKFsMme6 — Ravikanth Perepu (@ravikanthperepu) March 15, 2023 View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) చదవండి: ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని -
యాంకర్ సుమ పిల్లలు ఇప్పుడెలా ఉన్నారో తెలుసా? (ఫొటోలు)
-
24 ఏళ్ల బంధం.. ఆన్లైన్లో ఇలా: సుమ కనకాల
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ ఎవరంటే మొదట వినిపించే పేరు సుమ. అంతలా ఫేమ్ సంపాదించుకుంది కేరళ అమ్మాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ సుమ మాత్రం లోకల్ అన్న విధంగా ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా సరే సుమ ఉందంటే ఆ రేంజే వేరు. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడడం, సమాయానుకూలంగా పంచ్‌లు వేయడంలో ఆమెకు ఆమె సాటి. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయింది. ఇక టాలీవుడ్లో రాజీవ్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. ఏ పాత్రలోనైనా మెప్పించడం ఆయనతే సొంతం. ఇక వీరిద్దరి ప్రేమ పెళ్లి సంగతులు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లయి వీరికి 24 ఏళ్లు పూర్తయింది. వివాహా వార్షికోత్సావాన్ని కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సుమ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెడుతున్నారు. సుమ షేర్ చేసిన ఆ వీడియో కాల్లో ఇద్దరు పాట పాడుతూ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటక్కడ.. పలుకిక్కడ అంటూ సుమ పాట పాడగా.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా' అంటూ రాజీవ్ కనకాల పాడుతూ వీడియో కాల్లో కనిపించారు. ఏదేమైనా సుమక్క యాంకరింగే కాదు.. ఇలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్!... నెట్టింట వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టలేదు. ఎన్టీఆర్30 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో వేదికపైనే ఎన్టీఆర్ 30 అప్డేట్స్ ఇవ్వాలంటూ యాంకర్ సుమ ఎన్టీఆర్‌ను డైరెక్టుగా అడిగేయడంతో ఎన్టీఆర్ ఎందుకో గానీ కాస్త సీరియస్ అయినట్లు కనిపించారు. 'అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే'.. అంటూ సుమకు కౌంటర్ వేశాడు. అనంతరం ఫ్యాన్స్‌కి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "నాకు ఒంట్లో బాగోలేకపోయినా .. మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. బాడీ పెయిన్స్ వలన ఎక్కువ సేపు నిలబడలేను కూడా .. ప్లీజ్ అర్థం చేసుకోండి. అప్డేట్, అప్డేట్ అని ఇబ్బంది పెట్టకండి. ప్రతి రోజూ, ప్రతి గంటా అప్డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్ పెరిగిపోతోంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. ఒకవేళ అప్డేట్ ఉంటే ఇంట్లో మా భార్య కంటే ముందే మీకు విషయం చెబుతాం'' అంటూ తారక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
Anchor Suma: గొప్ప మనసు చాటుకున్న యాంకర్ సుమ
తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడుతూ.. సమాయానుకూలంగా పంచ్‌లు వేస్తూ ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ బిగినింగ్‌లో పలు సీరియల్స్‌లో నటించిన సుమ.. ఆ తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చి యాంకర్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న సుమ.. అప్పుడప్పుడు తనలో ఉన్న నటిని కూడా పరిచయం చేస్తుంది. ఆ మధ్య ఆమె లీడ్ రోల్లో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా చేసింది. అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ, నటన పరంగా సుమకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా ఒకవైపు యాంకరింగ్ మరోవైపు యాక్టింగ్‌తో ఇప్పటికీ ఫుల్ బిజీగా ఉంది సుమ. ఇదిలా ఉంటే తాజాగా సుమ చేసిన ఓ మంచి పనికి నెటిజన్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సుమ చెన్నై లోని ఒక కాలేజ్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. ప్రేక్షకులు నన్ను ఆదరించి ఇంతదాన్ని చేశారు. అందుకే వారి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్” అనే సంస్థ నా డ్రీమ్. నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను’అని సుమ చెప్పుకొచ్చింది. సుమ చేస్తున్న మంచి పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్ చేసిన సుమ! అసలేం జరిగిందంటే..
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. సామాన్య ప్రజలే కాదు సినీ సెలబ్రెటీల్లో సైతం ఆయనను అభిమానించే వారు ఎందరో ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండ ఇండస్ట్రీ స్వయంగా కృషితో ఎదిగి ఆశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన పలకరిస్తే చాలు, ఆయనతో ఒక్క మాట మాట్లాడితే చాలు అని అభిమానుల ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. ఇక చిరంజీవితో సినిమా చేయడమంటే దర్శక-నిర్మాతలు, నటీనటులు అదృష్టంగా భావిస్తారు. అలాంటి మెగాస్టారే స్వయంగా మెసేజ్ చేస్తే ఓ స్టార్ యాంకర్ అవాయిడ్ చేసిందట. ఆమె మరెవరో కాదు యాంకర్ సుమ కనకాల. చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవైయిడ్ చేసిన సుమ! అసలేం జరిగిందంటే.. మూడు, నాలుగేళ్లు వరుసగా సుమకు మెసేజ్ చేస్తే కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని చిరు తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ఇంతకి అసలేం జరిగిందంటే.. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సక్సెస్ జోష్‌లో ఉన్న చిరంజీవి సుమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షోలో పాల్గొన్నారు. చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, నటుడు వెన్నెల కిషోర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమ చిరు లీక్స్‌లో ఏమైనా లీక్స్ ఉన్నాయా! అని అడగ్గా.. ఏకంగా సుమకే ఎసరు పెట్టారు చిరంజీవి. సుమ గురించి ఓ విషయం లీక్ చేస్తున్నానంటూ అసలు విషయం చెప్పారు. చదవండి: రష్మిక టాటూ అర్థమెంటో తెలుసా? దాని వెనక ఇంత స్టోరీ ఉందా! ‘‘మూడు, నాలుగేళ్లుగా సుమకు హ్యాపీ బర్త్‌డే, గార్డ్ బ్లెస్ యూ, స్టే బ్లెస్డ్’ అంటూ సుమకు మెసేజ్‌లు పెడుతూనే ఉన్నాను. కానీ కనీసం ఆమె రిప్లై కూడా ఇవ్వలేదు. చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఎకైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది సుమనే’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సుమ స్పందిస్తూ.. ఏకంగా చిరంజీవి గారు మెసేజ్ చేస్తారని తాను అసలు ఊహించలేదని, కనీసం నెంబర్ కూడా క్రాస్ చెక్ చేసుకోలేదని వివరణ ఇచ్చింది. అనంతరం చిరు మాట్లాడుతూ.. 2022లో ఓ ఈవెంట్లో సుమ కలిసినప్పుడు ఇలా మెసేజ్ చేశానని చెప్పగానే తాను చాలా సంతోషించిందన్నారు. అంతేకాదు సారీ కూడా చెప్పి నెంబర్ తీసుకుందని ఆయన చెప్పారు. -
యాంకరింగ్‌కు బ్రేక్? టీవీ కోసమే పుట్టానన్న సుమ
తెలుగు బుల్లితెర టాప్ యాంకర్ ఎవరని అడిగితే సుమ కనకాల అని టపీమని చెప్తారు. 15 ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వచ్చినా ఎవ్వరూ ఆమె స్థానాన్ని పొందడం కాదు కదా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఆ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది సుమ. టీవీ షోలే కాదు, ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు.. ఏదైనా సరే సుమ ఉండాల్సిందే.. ఆమె మలయాళీ అయినా పదహారణాల తెలుగమ్మాయిగా రెడీ అయి అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఆమెది. తన కామెడీ, పంచ్ టైమింగ్లకు కొదవే లేదు. తాజాగా ఆమె యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సుమ స్పందించింది. 'ఇటీవల న్యూఇయర్ ఈవెంట్ చేశాం. ఆ ప్రోమో రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. అందులో నేను కొంత ఎమోషనలైన మాట వాస్తవమే. కానీ ఈవెంట్ అంతా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు.. ఏం కంగారుపడకండి. నేను టీవీ కోసమే పుట్టాను, ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి' అని ఓ వీడియో రిలీజ్ చేసింది సుమ. చదవండి: తొలి సంపాదన రూ.350: భరత్ ధమాకా.. కలెక్షన్స్ ఎంతంటే -
అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన యాంకర్ సుమ
యాంకర్ సుమ కనకాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా సుమ ఉండాల్సిందే అనేంతగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె పంచులు కామెడీ టైమింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది. యాంకరింగ్ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా సుమ లేని టెలివిజన్ అంటే కాస్త కష్టమేనంటున్నారు ఆమె ఫ్యాన్స్. -
మసూద మూవీ టీం ఇంటర్వ్యూ
-
యాంకర్ సుమ సంపాదనే ఎక్కువా?: రాజీవ్ కనకాల ఏమన్నాడంటే?
సుమ- రాజీవ్ కనకాల.. ఒకరు బుల్లితెర స్టార్, మరొకరు వెండితెర ప్రముఖ నటుడు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్న వీరిద్దరూ ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సంపాదన విషయంలో వీరి మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయని తరచూ కొన్ని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ రూమర్‌పై స్పందిస్తూ రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 'మా మధ్య ఎప్పుడూ అభిప్రాయబేధాలు రాలేవు. సుమ వర్కింగ్ ఉమెన్, సంపాదిస్తుంది. టీవీలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ ఆదాయం వస్తుందని జనాలు అనుకుంటారు. నేను సంపాదించేది నేను సంపాదిస్తాను. సవాలక్ష మంది సవాలక్ష రకాలుగా అనుకుంటారు.. నేను అదేం పట్టించుకోను. ఆమె టీవీలో బిజీ అవకముందు నేను బోలెడన్ని సినిమాలు చేసి సంపాదించిన ప్రాపర్టీలు ఉన్నాయి. అయినా మా మధ్య అలాంటి ప్రస్తావనే రాదు. మీ దృష్టిలో.. నా కంటే సుమ సంపాదన ఎక్కువే' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చదవండి: దమ్ముంటే అడ్డుకో.. తొడకొట్టి సవాల్ విసిరిన శ్రీహాన్ ఓరి దేవుడా దివాలి దావత్ -
యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట
బుల్లితెరపై యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె షో అంటే కంటెస్టెంట్స్‌కే కాదు ప్రేక్షకుల్లో సైతం జోష్ వస్తుంది. తనదైన పంచ్‌లు, వాక్చాతుర్యంతో అందరిని అబ్బురపరుస్తుంది సుమ. మైక్ పట్టుకుంటే చాలు గలగల మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే టీవీ షోలు మాత్రమే స్టార్ హీరోల మూవీ ఈవెంట్స్, ప్రీ-రిలీజ్, ప్రమోషన్స్ సుమ లేకుండ ఉండవు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ షోలోనే కాదు సోషల్ మీడియా వేదికగానూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానల్‌ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ ఈ చానల్ ద్వారా తన వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె షేర్ చేసుకుంటుంది. తాజాగా షేర్ చేసిన ఓ స్పెషల్ వీడియోలో తన పెళ్లి రోజులను గుర్తు చేసుకుంది ఆమె. వాళ్ల అమ్మ 80వ పుట్టిన రోజు సందర్భంగా సుమ తల్లికి ఖరీదైన చీర కొనిపెట్టింది. ఈ సందర్భంగా షాపింగ్‌కు వెళ్లిన సుమ అక్కడ షాపింగ్ మాల్లో తన పెళ్లి చీర ఖరీదు ఎంతో చెప్పింది. అక్కడ తల్లితో కలిసి ఆమె చీరలు చూస్తుండగా.. ఇవన్ని రూ. 15 వేల లోపు చీరలని, మీరేంజ్ సారీస్ పై ఫ్లోర్లో ఉంటాయని సేల్స్‌మాన్ చెప్పాడు. అతడి మాటలకు సుమ మేం ఈ రేంజ్‌లోనే తీసుకుంటామంటూ తనదైన స్టైల్లో పంచులు వేసింది. అక్కడ చీరలు, వాటి ప్రత్యేకత, డిజైన్స్ గురించి ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తనకు ఓ చీర నచ్చగా దాని ధరెంత అని అడిందామె. చదవండి: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన మహేశ్ బాబు రూ. 2 లక్షలు అని చెప్పడంతో షాకైన సుమ.. తాను ఇప్పటివరకు ఇంత కాస్ట్లీ చీర కట్టలేదని, పెళ్లికే రూ. 11 వేల చీర కట్టానంటూ అసలు విషయం చెప్పేసింది. ఇక స్టార్ యాంకర్ అయిన సుమ తన పెళ్లి చీర ఖరీదు చెప్పడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన సుమ పెళ్లి చీర ధర చర్చనీయాంశమైంది. ‘అప్పట్లో రూ. 11 వేలు అంటే కాస్ట్లీ యే కదా అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మీ రెంజ్‌కి ఇది తక్కువే’ అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. కాగా రాజీవ్‌తో పెళ్లి సమయానికి సుమ అప్పడప్పుడే యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. యాంకర్ కంటే ముందు ఆమె పలు టీవీ పలు సీరియల్స్‌లో నటించింది. కాగా రాజీవ్ కనకాల-సుమల పెళ్లి 1999 ఫిబ్రవరి 10న జరిగింది. -
యాంకర్ సుమ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నటి
బుల్లితెరపై యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె షో అంటే కంటెస్టెంట్స్‌కే కాదు ప్రేక్షకుల్లో సైతం జోష్ వస్తుంది. తనదైన పంచ్‌లు, వాక్చాతుర్యంతో అందరిని అబ్బురపరుస్తుంది సుమ. మైక్ పట్టుకుంటే చాలు గలగల మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే టీవీ షోలే కాదు స్టార్ హీరోల మూవీ ఈవెంట్స్, ప్రీ-రిలీజ్, ప్రమోషన్స్ అంటే సుమ లేకుండ అవి ఉండవు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ గొప్ప మనసు చాటుకుంటోంది. చదవండి: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్ ఇందుకు తాజా సంఘటనే ఉదాహరణ. ఆమె హోస్ట్ చేస్తున్న ఓ షోలో సీనియర్ నటి సుభాషిని అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమ లేకపోతే తాను ఇప్పుడు ఇలా మీ ముందు ఉండేదానిని కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే సుమనే కారణం. ఎంతో కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న. వైద్యంగా కోసం సుమ ఆర్థికంగా సహాయం చేస్తుంది. నాకు ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమ. చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే నువ్వు నా కడుపున పాపగా పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు’ అని అనడంతో సుమ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. వెంటనే నటి సుభాషిని దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకుంది. ఇలా ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవడం స్టేజ్‌పై ఒక్కసారిగా సైలెంట్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘సుమ తన మాటలతో అందరిని మన్ననలు పొందడమే కాదు.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ గొప్ప వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నారు’ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
యాంకర్ సుమకు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్
యాంకర్ సుమకు తృటితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పుడు కాదు.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. షూటింగ్ నిమిత్తం ఆమె ఓ అడవిలో ఉన్న చిన్న నీటి ప్రవాహం వద్ద నిలబడింది. అక్కడ ఉన్న రాళ్లు పీచు పట్టి ఉండడంతో కాలు జారి కిందపడింది. తనను తాను కంట్రోల్ చేసుకొని వెంటనే లేచి బయటకు వచ్చేసింది. (చదవండి: సరికొత్త కాన్సెఫ్ట్‌తో నయనతార కొత్త చిత్రం?) దీనికి సంబంధించిన వీడియోని తాజాగా సుమ తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త సుమక్క.. మీకేమైనా అయితే ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రొడక్షన్స్ టీమ్స్‌కి.. టోటల్‌గా ఎంటర్టైన్మెంట్కే ఇబ్బంది’. అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక జయమ్మ పంచాయితీ సినిమా విషయాకొస్తే.. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ కథ ఇది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మే 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
సుమ యాంకరింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టనుందా?
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా ‘జయమ్మ పంచాయితీ’సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచి సినిమాల్లోనూ నటిస్తానని స్వయంగా సుమ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో యాంకరింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టేస్తుందా అన్న అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఈ విషయంపై సుమ స్పందించింది. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. బుల్లితెరను వదిలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని, వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కంటిన్యూ అవుతానని వెల్లడించింది. -
సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ
బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది సుమ. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. (చదవండి: హాలీడే మూడ్‌లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్ కామెంట్) తన చేతిపై ఉన్న పంచబొట్టు సీక్రెట్‌ని కూడా రిలీల్ చేశారు. చేతిపై ‘వెంకన్న’అని పచ్చబొట్టు వేయించుకున్నారు సుమ. ఆ పేరు వెనక ఉన్న సీక్రెట్ ఏంటని అడిగితే.. సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పారు. సెకండాఫ్‌లో ఆ పేరు ఎందుకు వేయించుకున్నానో అందరికి తెలుస్తుందని సుమ చెప్పుకొచ్చారు. ఇక రాజీవ్ కనకాలతో సినిమా చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. మంచి కథలు దొరికితే కచ్చితంగా చేస్తానని చెప్పారు. -
విడాకులపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్ అందించారు. మే19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది సుమ. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్‌పై స్పందించింది. 'మనస్పర్థల కారణంగా విడాకుల వరకు వెళ్లారు అన్న వార్తలు నిజమేనా అని యాంకర్ అని ప్రశ్నించగా.. రాజీవ్‌తో నాకు పెళ్లయి 23ఏళ్లు అవుతుంది. ఈ 23ఏళ్లలో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇలా రూమర్స్ వచ్చినప్పుడుల్లా మా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా పుకార్లకు కొంతవరకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాను. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణమే. సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదు. వీటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి ఉన్నాం' అంటూ చెప్పుకొచ్చింది. -
చరణ్‌కు ఉపాసన అంటే భయమా ? నాన్న అంటే భయమా ?..
Anchor Suma Question To Ram Charan In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (ఏప్రిల్ 23) యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల అభిమానులు పంపిన ప్రశ్నలను అడగ్గా చిరంజీవి, చరణ్, కొరటాల శివ సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ను సుమ 'ఇంట్లో ఎవరికీ భయపడతారు నాన్నకా? ఉపాసనాకా?' అని ఆసక్తికర ప్రశ్న అడిగింది. దానికి జవాబుగా 'తెలియదు గానీ.. మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే.' అని తెలిపాడు రామ్ చరణ్. ఈ సమాధానం విన్న చిరంజీవి 'అది నన్ను చూసి నేర్చుకున్నావ్. సుఖపడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు.' అని నవ్వుతూ పేర్కొన్నారు. చదవండి: ఇంతకుముందు చూడని మెగాస్టార్‌ను చూస్తారు: మెహర్ రమేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Jayamma Panchayathi : బూతులు తిట్టిన యాంకర్ సుమ!
బుల్లితెర యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’.ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరక్కెకిన ఈసినిమాలో సుమ జయమ్మ పాత్రలో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలీవరీ ఆకట్టుకుంటుంది. అయితే తొలినుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన సుమ ట్రైలర్ చివర్లో మాత్రం బూతు డైలాగ్ చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా చాలా కాలం తర్వాత సుమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కావడంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మించారు. మే6న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!
Anchor Suma Son Roshan 2nd Movie With Two Directors: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమ సొంత నిర్మాణంలో రోషల్ హీరోగా ఓ సినిమా చేయడబోతున్నాడు. ఇప్పటి వరకు అయితే ఈ మూవీ సెట్స్‌పైకి రాకముందే రోషన్ తన రెండో సినిమాను లైన్లో పెట్టినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా పై చదువుల కోసం అమెరికా వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియా తిరిగి వచ్చాడు. ఇక వచ్చి రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటాడు. చదవండి: ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె అంతేకాదు కొడుకును ఎప్పుడెప్పుడు సినిమాల్లో తీసుకుద్దామని సుమ, రాజీవ్‌లు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రోషన్ ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాకుండానే తాజాగా రెండో సినిమాకు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఇందుకోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్లను తన రెండో సినిమా కోసం లైన్లో పెట్టాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం వహించగా.. మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించనున్నాడని సమాచారం. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
RRR: తారక్, చరణ్, రాజమౌళితో యాంకర్ సుమ రచ్చ రచ్చ
Anchor Suma Hilarious Fun With RRR Team: ఆర్ఆర్ఆర్ (మార్చి 25).. ప్రపంచ దేశాల తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ తేదీ దగ్గర పడుతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ హీరోలు, దర్శకుడు ఓ రేంజ్లో మూవీని ప్రమోట్ చేస్తున్నారు. విదేశాల్లో సైతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ ఈవెంట్స్‌ను నిర్వహించారు. ఇక కొద్ది రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలు వరసగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం యాంకర్ సుమతో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. చదవండి: జీవితమంతా అంధకారమే: ప్రణీత షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా సుమ వారిని ఓ ఆటాడేసుకుంది. ఆర్ఆర్ఆర్ విడుదలపై వచ్చిన రకరకాల మీమ్స్ చూపిస్తూ సుమ రచ్చ రచ్చ చేసింది. అలాగే తారక్ కూడా సుమను ముసలమ్మ, నీకు నోరు పారేసుకునే గయ్యాలి అత్త పాత్రలు సెట్ అవుతాయంటూ ఆటపట్టించాడు. ఒకప్పుడు మనకి నిర్మలమ్మ గారు ఉన్నారు, కానీ ఈ రోజు లేరు. ఛాయాదేవి గారు, సూర్య కాంతం గారు, నిర్మలమ్మ గారు.. ఇప్పుడు వారి లోటు తీర్చేందుకు యాంకర్ సుమ సెట్ అవుతుందని కీరవాణి ఇంటర్య్వూలో చెప్పానన్నాడు. చదవండి: అందుకే ఫిలిం మేకర్‌గా నేను ఫెయిల్యూర్: రాజమౌళి షాకింగ్ కామెంట్స్ అంతేగాక సుమ గయ్యాలి అత్త పాత్ర చేస్తే అదే సినిమాలో రాజీవ్ కూడా ఉండాలని, కాకపోతే నోరు పడిపోయిన మొగుడు రోల్ చేయాలంటూ సెటైర్లు వేశాడు. దానికి సుమ కూడా ఆహా రాజా వినడానికి ఇది ఎంత బాగుందో అంటూ ఎంజాయ్ చేసింది. అంతేగాక ఆర్ఆర్ఆర్ షూటింగ్ సెట్లో తారక్, చరణ్‌ల అల్లరి, మూవీపై వస్తున్న మీమ్స్‌పై వారితో చర్చించింది. ఈ క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలతో ఇంటర్య్వూలో మొత్తం ఆసక్తిగా సాగింది. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటు చేసుకున్న ఈ ఫుల్ ఇంటర్య్వూను ఇక్కడ చూసేయండి. -
యాంకర్ సుమ కొడుకు ఇలా మారిపోయాడేంటి?
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రోషన్.. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తమ తనయుడి కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు సుమ, రాజీవ్ బాగానే ప్రయత్నిస్తున్నారు. సొంతంగా ఓ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. గతేడాదిలోనే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా రోషన్ ఫోటోలు నెట్టింట్ వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సుమ.. రోషన్ బర్త్‌డే(మార్చి 15)సందర్భంగా మంగళవారం తన ఇన్‌స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తమ కుమారుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ షేర్ చేసిన ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. అతను రోషనేనా? ఇలా మారిపోయాడేంటి? అప్పుడే అంత పెద్దొడు అయిపోయాడా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే రోషన్, సుమ తల్లీకొడుకుల్లా కాకుండా అక్క, తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. రోషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫొటోలో రోషన్ చాలా పొడవుగా, క్యాజువల్ లుక్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ
Anchor Suma Reveals About The Secrets She Hide From Long Time: యాంకర్ సుమ కనకాల..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతుంది. ఆడియో ఫంక్షన్, ఈవెంట్ సహా పలు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సుమ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలాకాలంగా దాచిపెట్టిన ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. చదవండి: 'గుండె తరుక్కుపోతుంది..సమంత ఎలా భరిస్తుందో' 'చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. నేను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నా. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట. దీన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేసి చూశాను. కానీ ఫలితం లేదు. ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైంది.చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పడు మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామెజ్ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం' అంటూ వీడియోను షేర్ చేసింది. చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ -
ఆ నటి పరువు తీసేసిన యాంకర్ సుమ.. షోలో ఏం చేసిందంటే!
సుమ కనకాల.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్‌లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్యక్రమం, ఆడియో ఫంక్షన్, ఈవెంట్ అయిన యాంకర్‌గా సుమ ఉండాల్సిందే. ఇక బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ సుమ చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ముందుటుంది. తాజాగా ఓ సీరియల్ నటి చేసిన పనిని షేర్ చేస్తూ..ఇది ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఇటీవలె సీరియల్ ఆర్టిస్టులు సుహాసిని, వైష్ణవి, తేజస్విని, మోనిష్ తాను హోస్ట్ చేసిన షోకు వచ్చారని, ఈ సందర్భంగా మెహిందీ టాస్క్ ఇచ్చినట్లు సుమ తెలిపింది. అయితే టాస్క్‌లో భాగంగా నటి తేజస్విని తన చేతిపై గడ్డి తింటున్న ఆవు అంటూ ఓ డిజైన్ వేసిందని, ఇది ఏ కోశాన కూడా అలా కనిపించడం లేదంటూ నటి పరువు తీసేసింది. రియల్ మెహిందీ కావడంతో ఇంకా పోవడం లేదని, ఇది ఎప్పుడు పోతుంది తేజూ అంటూ సుమ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక నటి తేజూ కూడా అక్కా.. అంటూ ఫన్నీ ఎమోజీని కామెంట్ రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కూడా అది ఆవులా అస్సలు లేదని ఫన్నీగా బదులిస్తున్నారు. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) చదవండి : ఒక్క వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల భర్త డైలాగ్ చెప్పి ధైర్యం నూరిపోసిన సుమ.. వీడియో వైరల్ -
భర్త డైలాగ్ చెప్పి ధైర్యం నూరిపోసిన సుమ.. వీడియో వైరల్
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. టీవీ ఉన్న ప్రతి ఇంటివారికి ఆమె చుట్టమే. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా ఏలుతోంది. ఎలాంటి షో అయినా, ప్రోగ్రామ్ అయినా సుమ ఉండే చాలు హిట్టయినట్లే. అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది సుమ. ఇక బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ యాంకరమ్మ. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటుంది. ఇక కరోనా లాక్డౌన్ వల్ల మరింత ఫ్రీ దొరకడంతో సోషల్ మీడియాలో దూకుడు పెంచేసింది. కరోనా భయంలో అల్లాడుతున్న ప్రజలకు తన వీడియోల ద్వారా ధైర్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే పలు వీడియో ద్వారా కరోనా జాగ్రత్తలు చెప్పిన సుమ.. తాజాగా తన భర్త రాజీవ్ కనకాల డైలాగ్ చెప్పి ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసింది. నితిన్ హీరోగా నటించిన ‘సై’సినిమాలో కోచ్‌గా రగ్బీ కోచ్‌గా రాజీవ్ కనకాల నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్‌లో నితిన్ టీమ్ ఓడిపోతుంటే.. రాజీవ్ ఓ భారీ డైలాగ్ చెప్పి వారికి ధైర్యాన్ని అందిస్తాడు. తాజాగా ఆ డైలాగ్‌ని సుమ అచ్చు గుద్దినట్లు చెప్పింది. అందరు ధైర్యంగా ఉండాలి.. ఎప్పుడైతే భయపడతామో మనలోని ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే.. మంచి విషయాలు వినండి, భయపెట్టే వాటిని చూడకండని’ అంటూ ఫ్యాన్స్‌కి సలహా ఇచ్చింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత
తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ గాయని సునీత. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన గొంతుతో వందలాది పాటలకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు. ఇక ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో ఈ ఏడాది జనవరి 9న వ్యాపారవేత్త రామ్ వీరపనేని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సునీత తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్ షోలో ఈ జంట తమ ప్రేమ బంధాన్ని వివరించింది. సునీత ప్రేమను పొందడానికి ఏడేళ్లు నిరీక్షించానని రామ్ చెప్పుకొచ్చారు. ‘ఏడేళ్లుగా సునీతను ఇష్టపడుతూ వచ్చాను. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ నేరుగా ఆమెతో చెప్పలేదు’అని రామ్ అన్నారు. ఇక ఇదే విషయమై సునీత మాట్లాడుతూ.. ‘రామ్ నాతో కేవలం ‘ఇంకేంటీ‘ అంటూ మాత్రమే అనేవాడు. దాంట్లో అర్థాన్ని తెలుసుకోలేకపోయాను. రామ్ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేదాన్ని కాదు. నేను అసలు పెళ్లికి సిద్ధంగా లేను.. కానీ లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగింది. ఏదో పని కోసం కాల్ చేసిన రామ్.. ఫోన్లోనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాత నేనూ పెళ్లికి ఓకే చెప్పాను’ అని తమ లవ్‌స్టోరిని వెల్లడించారు. -
బిగ్‌బాస్: వైల్డ్‌కార్డు ఎంట్రీగా సుమ.. పంచులే పంచ్‌లు
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజస్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బిగ్ రియాల్టీ షోకి ఆదరణ తగ్గినప్పుడల్లా వైల్డ్‌కార్డు ఎంట్రీలను పంపి టీఆర్పీ రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఇలా ఇప్పటికే ముగ్గురు వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇవ్వగా.. వారిలో కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ తక్కువ రోజులకే బయటకు వచ్చారు. మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ అవినాష్ మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే షోని మరింత రసవత్తరంగా మార్చే పనిలో పడ్డారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ సారి ప్రముఖ యాంకర్ సుమ కనకాలను బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది స్టార్‌మా. ప్రోమోలో సుమ తన సూట్ కేసుతో ప్రత్యేక్షం అయ్యింది. (చదవండి : బిగ్‌బాస్: క్లాసిక్ లుక్ వెనుక బాస్ బ్యూటీ!) వైల్డ్‌కార్డ్ ఎంట్రీకి ఎలా ఒప్పుకున్నావ్ సుమా అని నాగార్జున అడగ్గా.. ‘ఏం చెయ్యాలి సర్.. పాండమిక్ చాలా మార్పులు తీసుకొచ్చింది.. అందుకే ఇంట్లోకి వచ్చాను’ సుమ చెప్పుకొచ్చారు. ఇక హౌస్మేట్స్ పాలిట నేను వైల్డ్‌కార్డు అవ్వబోతున్నానను అంటూ తనదైన శైలీలో చెప్పి గంతులేశారు. అలాగే తనదైన పంచులతో హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జునను ఓ ఆట ఆడుకుంది. ఇక సుమ వైల్డ్ కార్డు ఎంట్రీతో తనకు రానున్న ఐదు వారాలు ఫుల్ ఫన్ ఉంటుందని నాగ్ తెలిపారు. అంతేకాదు సుమను లోపలికి పంపిస్తున్నట్లు కూడా ప్రోమోలో చూపించారు. (చదవండి : సమంత శారీ, జ్యువెలరీ ఖరీదు ఎంతో తెలుసా) అయితే ఇదంతా నిజమా లేదా ఏమైనా ట్విస్ట్ ఉండనుందా అనేది తెలియరాలేదు. ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజన్లో తొమ్మిదవ వారం నడుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సగం రోజుల్నీ పూర్తి చేసుకుంది. ఇప్పుడు హౌజ్ లోకి సుమ ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే హౌస్‌లోకి మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ ఉంటుందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ.. యాంకర్ సుమ వస్తారని ఎవరూ ఊహించలేదు. నాల్గో వైల్డ్‌కార్డు ఎంట్రీగా సింగర్ మంగ్లీ వస్తుందని పుకార్లు వచ్చాయి కానీ.. సుమ ఎంట్రీతో అది ఒట్టి పుకారే అని తేలిపోయింది. అయితే సుమ ఎంట్రీని కూడా నమశక్యంగా లేదు. ఏదో బిగ్‌ట్విస్ట్ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఒకవేళా కనుక సుమ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్’లోక ఎంట్రీ ఇస్తే ఓ రేంజ్లో ఉంటుంది షో.. అని చెప్పవచ్చు. సుమ ఎంట్రీతో ప్రేక్షకులకు మరింత కిక్ అందనుంది. -
రాజీవ్‌పై సుమ ఎమోషనల్ ట్వీట్.. వైరల్
తెలుగు టెలివిజన్ రంగంలో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు యాంకర్ సుమ. తన యాంకరింగ్ టాలెంట్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దశాబ్ద కాలంగా తెరపై ఎన్నో సినీ కార్యక్రమాలను, ఈవెంట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. తన భర్త రాజీవ్ కనకాల టాలీవుడ్లో పెద్ద నటుడే అయినప్పటికీ తన కంటే ఎక్కువ క్రేజ్ సుమ సొంతం చేసుకుందని చెప్పక తప్పదు. అంతేకాదు ఇండస్ట్రీలో మంచి జోడీగా కూడా వీరిద్దరికి గుర్తింపుఉంది. (షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) అయితే ఈ మధ్య కాలంలో సుమ-రాజీవ్ వైవాహిక జీవింత గురించి పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. వారి వివాహ బంధంలో విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారని పుకార్లు షికారు చేశాయి. అంతేకాదు రాజీవ్ నుంచి సుమ విడాకులు కూడా కోరిందని సోషల్ మీడియా కోడైకూసింది. ఈ వార్తలు టీ టౌన్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. అయినా కూడా ఈ జోడీ కనీసం స్పందించకపోవడంతో అంతా నిజమేఅని అనుకున్నారు. ఈ క్రమంలోనే సుమ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియా రాయుళ్ల ఊహాగానాలను పటాపంచల్ చేసింది. తమపై వస్తున్న వార్తలకు చెక్‌పెడుతూ.. సుమ తన ట్విటర్ ఖాతా ద్వారా రాజీవ్‌పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ సందేశం ఇచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. రాజీవ్ కనకాలను ఆప్యాయంగా హత్తుకుని ఎమోషనల్‌గా భావాన్ని చూపించింది. ’నా ప్రియమైన రాజా.. మై లవ్.. ఎప్పటికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ఆనందం’ అంటూ తమ వైవాహిక జీవితం ఎంత బలంగా ఉందో చాటిచెప్పింది. అందమైన జంట అని కొందరు కామెంట్ పెడుతుండగా.. ఇంత అన్యోన్యమైన కపుల్ మధ్య అనవసరమైన రూపర్స్ ఆపండి అంటూ మరికొంతమంది రిప్లే ఇస్తున్నారు. భార్యాభర్తలు అన్నాక వారి మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ సోషల్ మీడియాలో పెద్దవి చేసి చూపించడం సరైనది కాదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. My dearest raja , my ❤️ , oneness and happiness forever #Rajeevkanakala pic.twitter.com/rxSqffqulm — Suma Kanakala (@ItsSumaKanakala) September 14, 2020 -
రాజీవ్ కనకాల సోదరి మృతి
-
యాంకర్ సుమ ఆడపడుచు మృతి
సాక్షి,హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భర్త రచయిత పెద్ది రామారావు కాగా ఆమె తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాలకు శ్రీలక్ష్మీ ఏకైక కుమార్తె. ఆమె ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటింటి మంచి నటిగా గుర్తింపుపొందారు. కాగా రాజీవ్ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. (కనకాల.. చెరగని జ్ఞాపకంలా..) -
వెండితెర నటుడిగానూ ఆదరించండి
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టీవీ షోస్ ద్వారా పాపులర్ అయిన ‘సుడి గాలి’ సుధీర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. ఈ చిత్రంలో ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో కె. శేఖర్‌రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. నిర్మాత రాజ్ కందుకూరి, యాంకర్ సుమ అతిథులుగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక జరిగింది. ‘‘సుధీర్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ బాగుంటుంది. ఈ ట్రైలర్ నాకు నచ్చింది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుమ. ‘‘కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటి వరకు నన్ను బుల్లితెరపై ఎలా సపోర్ట్ చేశారో, అలాగే వెండితెరపై కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘ఈ సినిమాలో కథ కన్నా కొన్ని జీవితాలు కనిపిస్తాయి. కామెడీ టైమింగ్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సుధీర్‌ని హీరోగా ఎంపిక చేశాం. కథ నచ్చి ప్రజాగాయకుడు గద్దర్ ఇందులో ఓ పాట పాడి నటించారు’’ అన్నారు రాజశేఖర్. ‘‘మా బ్యానర్ ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శేఖర్. లిరిసిస్ట్ సురేష్ గంగుల, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. -
యువ కళా కెరటం
జవహర్‌నగర్: ఇటు నృత్యం.. అటు సాహిత్యంలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్‌కు చెందిన వేములవాడ శివకుమార్. పేదరికం కళకు అడ్డు కాదని నిరూపిస్తున్నాడు. నృత్యంతో మొదలైన తన ప్రస్థానం ప్రస్తుతం సాహిత్యం దిశగా సాగుతోంది. ఆల్బమ్స్ సైతం రూపొందిస్తున్నాడు. ఆరో తరగతి నుంచే డ్యాన్స్ నేర్చుకున్న శివ.. ఆ విద్యను పది మందికి అందజేస్తున్నాడు. ఆల్బమ్స్ రూపకల్పన... ఇంటర్ పూర్తి చేసిన శివకుమార్ జవహర్‌నగర్‌లో ‘అమ్మ’ నృత్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. తక్కువ ఫీజులు తీసుకుంటూ నటన, నృత్యంలో శిక్షణనిస్తున్నాడు. శివకుమార్ నృత్య రంగంలో రాణిస్తూనే.. మరోవైపు లఘు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ‘అమ్మ క్రియేషన్స్’ పేరుతో ‘చెలియా సఖియా.. అందాల పువ్వేదో.. ‘అను అను అనురాగం.. హృదయమా... కళ్లలోనూ కలలే కంటూ’ అనే గీతాలతో ఓ ఆల్బమ్ రూపొందించాడు. భవిష్యత్‌లో సినీ రంగంలో అడుగు పెట్టాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాడు. లిరిక్ రైటర్ కావాలని.. సాధ్యమైనంత వరకు కళను పది మందికి పంచడమే నా ఆశయం. ఇప్పటి వరకు ఎన్నో కవితలు రాశాను. ‘ఇట్స్ మై లవ్’ ఆల్బమ్ విడుదల చేశాను. మ్యూజిక్ యాంకర్ భార్గవ్‌తో రెండు పాటలను చిత్రీకరించాను. దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. యాంకర్ రవి, లాస్యలతో ఆల్బమ్ రూపొందించాం. భవిష్యత్‌లో సినీగేయ రచయిత కావడమే నా ధ్యేయం. – శివకుమార్ -
పండుగ రోజు పులిహోర.. ఎవరైనా వస్తున్నారా ?
సాక్షి, హైదారాబాద్ : టీవీ వ్యాఖ్యాత సుమ పరిచయం అవసరం లేని పేరు. ప్రతిరోజు పలు టీవీ చానళ్లలో సందడి చేస్తూనే ఉంటారు. ఆడియో ఫంక్షన్లు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ అందరినీ అలరిస్తారు. ఇటీవల సుమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు లైవ్‌లోకి వచ్చి సోషల్ మీడియా అభిమానులను ఆనందిపచేస్తుంటారు. ఇక సంక్రాంతి పండుగ రోజు కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. అంతే ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. సుమ పులిహోర కలుపుతున్న వీడియోని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వీడియోలో సుమ ఏమన్నారంటే.. ‘‘ పులిహోర.. చింతపండుతో పులిహోర చేస్తున్నాను. ఇదిగో చింతపండు గుజ్జు. ఇదిగో పులిహోర (అదే సమయంలో అక్కడికి తన పెంపుడు కుక్క రావడంతో.. ఏయ్.. నువ్ ఇటు రావద్దు అంటారు). ఎవరైనా వస్తున్నారా పులిహోర టేస్ట్ చేయడానికి..’’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
పులిహోర.. చింతపండుతో పులిహోర
-
రోడ్డు భద్రతా ఉద్యమంలో మేము సైతం
సాక్షి,సిటీబ్యూరో: రోడ్డు భద్రతా ఉద్యమంలో తాము కూడా భాగస్వాములమవుతామని, రవాణాశాఖ కార్యక్రమాలకు మద్దతునిస్తామని సినీనటుడు రాజీవ్ కనకాల,ఆయన సతీమణి యాంకర్ సుమ అన్నారు. గురువారం డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ కోసం వారు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా అధికారులు దశరథం, జీపీఎన్ ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి ఇద్దరి డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ ప్రక్రియను ముగించారు. -
అప్పుడాయన నవ్విన నవ్వు ఇంకా గుర్తుంది!
‘‘నేను వ్యాఖ్యానం చేసిన పలు కార్యక్రమాలకు ఏయన్నార్ అతిథిగా వచ్చేవారు. అలా ఆయనతో కొంత పరిచయం ఏర్పడింది. అయితే, ఆ మహానటునితో బంధం బలపడింది మాత్రం ‘మట్టిమనుషులు’ సీరియల్ టైమ్‌లోనే. అందులో నేను ఆయనకు కూతురిగా చేశాను. ఆయనతో నటించడానికి భయపడుతుంటే, నాతో చనువుగా మాట్లాడి నాలోని భయాన్ని పోగొట్టారు. సెట్లో అక్కినేనిగారుంటే ఆ సందడే వేరు. నాపై పుత్రికావాత్సల్యాన్ని ప్రదర్శించేవారాయన. ‘తెలుగమ్మాయివి కాకపోయినా.. నీ తెలుగు చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అనేవారు. అక్కినేని అన్నపూర్ణగారు కూడా నాపై ఎంతో అభిమానాన్ని చూపించేవారు. ‘నువ్వు ఫలానా ప్రోగ్రామ్‌లో... అలా చేశావ్, ఇలా చేశావ్’ అని నాకే గుర్తు చేసేవారామె. ఆ పుణ్యదంపతుల అభిమానాన్ని చూరగొనడం నా అదృష్టం. 84వ పుట్టినరోజు సందర్భంగా తొలిసారి అక్కినేనిగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో నేను అన్న తొలి మాట... ‘మీకు 84 ఏళ్లు అంటే నమ్మను’ అని. అప్పుడు ఆయన నవ్విన నవ్వు నాకింకా గుర్తుంది. ‘మా టీవీ’లో ప్రసారమైన ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమం నా జీవితంలో మరచిపోలేనిది. 74 వారాల పాటు అక్కినేని జీవితాన్ని ఆవిష్కరించిన ఆ కార్యక్రమంలో ఆయన్ను ప్రశ్నలడిగే భాగ్యం నాకు దక్కింది. నాగేశ్వరరావుగారికి పొగడ్తలంటే అస్సలు పడదు. మనుషుల్ని ఆయన చదివినట్లు ఎవరూ చదవలేరు. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతం. శతాబ్దాల క్రితం జరిగిన విషయాలను కూడా నిన్ననో మొన్ననో జరిగినట్లు ఈజీగా చెప్పేసేవారు. ఏయన్నార్ ఒక్కో సినిమా ఒక్కో పాఠం. ఒక్కో మలుపు ఒక్కో సందేశం. అందులో నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి.యాదృచ్ఛికంగా ఏయన్నార్ చివరి ఇంటర్వ్యూ కూడా నేనే చేశాను. ఆయన పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది ఇదే రోజున ఆయన మనవళ్లు సుమంత్, సుశాంత్, నాగచైతన్యలతో కలిపి ఏయన్నార్‌తో చేసిన ఇంటర్వ్యూ అది. ఆ తర్వాత నెల రోజులకే ఆయనకు కేన్సర్ అన్న విషయం బయటపడింది. మళ్లీ పార్ధివ దేహాన్నే చూడగలిగాను. ఆయన భౌతికంగా లేరు కానీ.... తెలుగు సినిమా బతికున్నంత వరకూ సినిమాల రూపంలో ఎప్పుడూ మనముందే ఉంటారు’’. సంభాషణ: బుర్రా నరసింహ -
ఓనమాలు నేర్పిన ఓనమ్
ఓనమ్... మళయాళీలు పది రోజుల పాటు... వేడుకగా, ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ... రకరకాల వంటలతో, సంప్రదాయ నృత్యాలతో... ఆటలతో... పడవల పోటీలతో... పులి వేషాలతో... తెలుగువారి దసరాలను త లపించే పండుగ... ఇంటికి పంటలు చేరి భోగభాగ్యాలతో తులతూగే పండుగ... రేపు ‘ఓనమ్’... తెలుగింటి కోడలుగా మనలో ఒకరైపోయిన పరహారణాల కేరళ కుట్టి సుమ ‘సాక్షి’కి చెప్పిన ఓనమ్ పండుగ కబుర్లు... మీరు మలయాళీ ఇంటి ఆడపడుచు! తెలుగింటి కోడలు! మరి ఓనమ్ బాగా సెలబ్రేట్ చేస్తారా? సుమ: నేను చిన్నతనం నుంచీ ఇక్కడే అంటే హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. మా పెళ్లయినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్ పండుగ వేడుకగా జరుపుకుంటున్నాను. మా ఇంట్లో అటు తెలుగు పండుగలు, ఇటు కేరళ పండుగలు - రెండూ బాగా చేసుకుంటాం. కిందటేడాది మానాన్నగారు పోవడంతో ఆ ఒక్క సంవత్సరమే చేయలేదు. పండుగను ఎలా జరుపుకుంటారు? సుమ: ఓనమ్ పండుగ పది రోజులూ ఇంటి ముందర కళ్లాపి జల్లి, నేల తడిగా ఉండగానే పువ్వులతో పూక్కళమ్ చేస్తారు. అంటే పూల ముగ్గులాంటిదన్నమాట. సాధారణంగా అందరూ పది రోజులూ చేస్తారు. అయితే నేను నా షూటింగులలో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కరోజు మాత్రమే రకరకాల పూలతో అందంగా అలంకరించి, ఆనందిస్తాను. ఓనమ్ సందర్భంగా ప్రత్యేక వంటలు ఏమేం చేస్తారు? సుమ: ఈ పండుగకు సాధారణంగా 13 రకాల వంటకాలు చేస్తారు. మేం మాత్రం అవియల్, ఓలెన్, ఇంజుప్పులి, పాలడ పాయసం, కరి (సెనగపప్పు వంటకం), అనాస లేదా మామిడికాయతో పచ్చడి చేస్తాం. ప్రతి ఏడాదీ ఈ వంటలన్నీ నేనే చేస్తాను. ఈసారి మా అమ్మ కూడా నా దగ్గరే ఉన్నారు కనుక ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓనమ్ నాడు మీ ఆచారవ్యవహారాలు ఎలా ఉంటాయి? సుమ: ఈ పండుగ నాడు అప్పడం కంపల్సరీ. అరటిపండు (వేందరప్పళన్) ను ఇడ్లీ రేకులలో ఉంచి ఆవిరి మీద ఉడికించి తింటాం. ఈ అరటిపండును నెల రోజుల పసి పాపలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా బలాన్నిస్తుంది. ఆవిరి మీద ఉడకపెట్టడం వలన ఇందులోని పోషకాలు ఎక్కడికీ పోవు. ఓనమ్ పండుగకు తప్పనిసరిగా అరటి ఆకులోనే భోజనం చేస్తాం. నాకు అందులో తినడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకులో పాలడ పాయసం వేసుకుని అది అటూ ఇటూ జారిపోతూ ఉంటే చేత్తో గబగబ దగ్గరకు లాక్కుంటూ తినడం భలే సరదాగా ఉంటుంది. నేను కొంచెం చిలిపి పనులు చేస్తుంటాను. నా ఆకు క్లీన్‌గా ఉండాలని, (నవ్వుతూ) నేను అన్నం తినడం పూర్తయిన తర్వాత, నా ఆకులో ఉన్న కరివేపాకు, పచ్చి మిర్చి వంటి వాటిని పక్క వాళ్ల ఆకులలోకి వాళ్లు చూడకుండా తోసేస్తాను. ఈ పండుగకు ప్రత్యేకంగా ముండుమ్ వేష్టి ధరిస్తాం (ఇది ఓనమ్ ప్రత్యేకం). ఇంతకీ మీరు మొట్టమొదటసారి వంట చేసినప్పుడు మీ అనుభవం ఏమిటి? సుమ: పెళ్లయిన పదిహేను రోజులకు మొదటిసారి రాజీవ్ నన్ను పచ్చి మిర్చి పచ్చడి చేయమన్నారు. ఆయన కోరిక మేరకు వంట చేయడానికి వంట గదిలోకి సంతోషంగానే అడుగుపెట్టాను. రాజీవ్ ఉద్దేశం కొబ్బరిలో పచ్చి మిర్చి కలిపిన పచ్చడి! కానీ నేను కేవలం పచ్చి మిర్చితో అనుకుని, పచ్చి మిర్చిలో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పి అన్నంలో వడ్డించాను. ఆ పచ్చడి కలుపుకుని తినేసరికి, ఇంక చూడాలి... రాజీవ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా కళ్లలోనూ బాధతో నీళ్లు తిరిగాయి. రాజీవ్‌కి అందరు దేవుళ్లతో పాటు, మా కుటుంబ సభ్యులూ కళ్ల ముందు సాక్షాత్కరించారు. మరి, ఆ తరవాత వంట నేర్చుకున్నారా? సుమ: ఆ తరవాత అనుభవం మీద అదే వచ్చేసింది. వంట చేయడం నాకు ఇష్టమే. కానీ సమయం మాత్రం లేదు. పండుగలకు, వంటమనిషి ఊరెళ్లినప్పుడు, పిల్లలు అడిగితే చేసిపెట్టడం... అంతే తప్ప మిగతా సమయాల్లో వంట చేయాల్సిన అవసరం ఉండదు. మలయాళీలు అన్ని వంటల్లోనూ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారంటారు? సుమ: కొలెస్ట్రాల్ చింత పెరిగిపోవడంతో, ఇప్పుడు కొబ్బరి నూనెతో వంటలు చేయడం బాగా తగ్గిపోయింది. కొన్ని ప్రత్యేకమైన వంటకాలకు మాత్రమే కొబ్బరి నూనె వాడతున్నాం. మీ జీవితంలో ఓనమ్ పండుగ పోషించిన ప్రత్యేక పాత్ర గురించి ఎక్కడో విన్నాం... సుమ: అవును. సికింద్రాబాద్‌లో మలయాళీలకు ప్రత్యేకంగా ‘కేరళ అసోసియేషన్’ అని ఒకటి ఉంది. దానికి మా నాన్నగారు మేనేజర్‌గా ఉండేవారు. అక్కడ ప్రతి యేడూ ఓనమ్ పండుగనాడు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఏమాత్రం భయపడకుండా నేను వాటిలో పాల్గొనేదాన్ని. అందువల్ల నాకు స్టేజ్ ఫియర్ పోయింది. అలా నా ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఓనమ్ పండుగ వల్లే వచ్చింది. ఇప్పుడు యాంకర్‌గా ఇంత సక్సెస్ సాధించగలిగానంటే అందుకు కారణం ఓనమ్ పండుగే. అలా ఓనమ్ నుంచి ఓనమాలు నేర్చుకున్నాను. - సంభాషణ: డా. వైజయంతి పాలడ పాయసం కావలసినవి: పాలడ (రైస్ అడ) - ముప్పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నెయ్యి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; కిస్మిస్ - టేబుల్ స్పూను; పాలు - 2 కప్పులు; బెల్లం తురుము - పావు కప్పు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారీ: రైస్ అడను రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత అవి బాగా పొంగి కనపడతాయి. అప్పుడు నీళ్లు వడకట్టి చల్ల నీళ్లలో వేసి వార్చాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో పాలు, బెల్లం తురుము, ఏలకుల పొడి, నానబెట్టి తీసిన పాలడ వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత దించి, వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి అందించాలి. ఇంజిప్పులి కావలసినవి: నూనె - 5 టేబుల్ స్పూన్లు; అల్లం - అర కేజీ (సన్నగా తురమాలి); ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను; కొబ్బరి ముక్కలు - 2 కప్పులు; కరివేపాకు - 2 రెమ్మలు; చిన్న ఉల్లిపాయలు - పావు కేజీ; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేయాలి); పసుపు - అర టీ స్పూను; ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు - 100 గ్రా. (నానబెట్టాలి); బెల్లం తురుము - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి వేడి చేయాలి అల్లం తురుము వేసి వేయించి, ఉప్పు జత చేసి దోరగా వేయించి దించి పక్కన ఉంచాలి మిగిలిన నూనెను బాణలిలో వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొబ్బరి ముక్కలు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక కరివేపాకు జత చేయాలి చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించాలి వేయించి ఉంచుకున్న అల్లం తురుము, చింతపండు పులుసు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి బెల్లం తురుము వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. చక్క ఎరిసెరి కావలసినవి: పచ్చిగా ఉన్న పనస తొనలు - పావు కేజీ; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - అర కప్పు; జీలకర్ర - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 2; కొబ్బరినూనె - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 4; చిన్న ఉల్లి పాయలు - 5; కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు తయారీ: ముందుగా పనస తొనలలోని గింజలు వేరు చేసి తొనలను నాలుగైదు ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మూత పెట్టి ఉడకించాలి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల నీళ్లు మిక్సీలో మెత్తగా చేసి పక్కన ఉంచాలి పనస ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి మరొక బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఎండు మిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికించి ఉంచుకున్న పనస ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి దించేయాలి అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి. -
రిలేషణం : ఆమె నీరు లాంటిది!
ఒక మాటల ప్రవాహాన్ని అక్షరాల్లో బంధించవచ్చా? పరిగెత్తే పాదరసాన్ని పిడికిట్లో పట్టుకోవచ్చా? ఉరకలేసే జలపాతాన్ని అరచేత్తో అడ్డుకోవచ్చా? ఏమో కష్టమే... సుమ కూడా అంతే! ఆమె ఒక ప్రవాహం, ఒక ఉత్సాహం, ఒక విస్మయం. రెండు దశాబ్దాల ఆ సుమ సమ్మోహనంలో పడిపోని, పరవశులవని తెలుగువారు లేరు. బుల్లితెర అవధులు దాటి ఇంటింటా గుబాళించిన ఆ సుమ సౌగంధికా పరిమళాల పయాణంలో కొన్ని జ్ఞాపకాల్ని ఆమె ఆడపడుచు శ్రీలక్ష్మి గుర్తుచేసుకునే ప్రయత్నమే ఈ వారం రిలేషణం. తన గురించి ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడ మొదలుపెట్టాలి. మా పరిచయం ఒక సీరియల్ షూటింగ్లో మొదలైంది. కొంతకాలమయ్యాక, అన్నయ్య, సుమ మధ్య స్నేహం మొదలైంది. అలా మా స్నేహం కూడా బలపడింది. అందుకే తనను వదినలా కాకుండా ఫ్రెండ్‌లాగే చూస్తాను. పెళ్లయిన కొత్తలో అన్నయ్య బాగా బిజీగా ఉండేవాడు. దాంతో మేమిద్దరమే షాపింగ్‌కు వెళ్లేవాళ్లం. తనను నా కోసమే పెళ్లి చేసుకున్నావని అన్నయ్యను ఆటపట్టించేదాన్ని. యాంకర్‌గా సుమ గురించి నాకంటే ప్రేక్షకులకే ఎక్కువ తెలుసు. తను అన్ని రకాల క్యారెక్టర్స్ ఎలా చేయగలుగుతుందోనని ఆశ్చర్యపోతాను. ఒక టీవీ ప్రోగ్రామ్‌లో పంచావతారం చేసినప్పుడు అందులో క్రిటిక్రావు పాత్రను చూసి థ్రిల్లయ్యాను. ఎంతో అబ్జర్వేషన్ ఉంటే తప్ప, అలాంటి టిపికల్ పాత్ర చేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్రెండ్ గెట్ టూ గెదర్ జరిగినప్పుడు, తను అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. తను అబ్జర్వేషన్‌లోకి వచ్చిన కొత్త క్యారెక్టర్స్‌ను ఇమిటేట్ చేసి తెగ నవ్విస్తుంది. ఒకసారి మా పాప బర్త్‌డే జరుగుతోంది. అప్పుడు నేను బిజీగా ఉండటంతో, ఏమీ అరేంజ్మెంట్స్ లేకుండా పార్టీ అరేంజ్ చేశాను. పిల్లలు ఒకటే గొడవ చేస్తున్నారు. అప్పుడు తను అందరినీ కూర్చోపెట్టి వరుసగా పది రకాల ఆటలు ఆడించింది. తను ఏదైనా చాలా స్పాంటేనియస్‌గా చేస్తుంది. నా కెరీర్ విషయంలో తను చాలా సపోర్ట్‌గా నిలిచింది. ఒక సినిమా చేస్తుండగా, నాకు కొంచెం దెబ్బలు తగిలాయి. యూనిట్ అంతగా స్పందించలేదు. ఆ సందర్భంలో కొంచెం బాధగా అనిపించి, యాక్టింగ్ కెరీర్ వదిలేద్దామనుకున్నాను. అప్పుడు తనే నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది. మా కుటుంబానికే కాదు, ఎవరు అవసరంలో ఉన్నా తను ముందుంటుంది. మూడేళ్ల క్రితం ఒకసారి ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాం. మేము లోపల కూర్చున్నాం. అంతలో సుమ ఒక భారీ లగేజ్ మోసుకుని వస్తోంది. ఆ లగేజ్ ఎవరిదని అడిగితే, ఒక్క నిమిషం అంటూ ముందుకు వెళ్లి వేరే దగ్గర పెట్టి వచ్చి అప్పుడు చెప్పింది. ఎవరో పెద్దావిడ మోయలేక ఇబ్బంది పడుతుంటే కొంచెం సాయం చేశానని. మేము మా కెరీర్స్‌లో ఎంత బిజీగా ఉన్నా, చాలా సంతోషమేసినప్పుడు, బాధేసినప్పుడు వెంటనే మాట్లాడుకుంటాం. ఇంకా పిల్లల బర్త్‌డే పార్టీలకు కలుస్తుంటాం. ప్రతి చిన్న అకేషన్‌కు కలవడానికి ప్రయత్నిస్తాం. మగాళ్లు బిజీగా ఉంటే అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరినీ వ్యాన్‌లో వేసుకుని, బయటకు తీసుకెళతాం. ఇంకా తన గురించి నా అబ్జర్వేషన్స్ చెప్పాలంటే, సుమ యాంకరింగ్ మాత్రమే కాకుండా ఇంకా మేనేజ్మెంట్, ఆర్గనైజింగ్ వంటివి బాగా హ్యాండిల్ చేయగలదు. సీఈవో లాంటి పదవిని తను చాలా సులువుగా మేనేజ్ చేయగలదు. ఇంకోమాట, తను క్లాసికల్ సాంగ్స్ కూడా పాడుతుంది. వీణ కూడా నేర్చుకుంది. సింగర్ అయ్యుంటే కూడా తను చాలా బాగా రాణించేది. ఫిజికల్‌గా, మెంటల్‌గా తనను తను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి యోగ, ప్రాణాయామం చేస్తుంది. తను నీరు లాంటిది. ఎందులోనైనా, ఎవరితోనైనా చాలా సులువుగా కలిసిపోతుంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి