యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే! బిగ్‌బాస్ హౌస్‌లోకి చివరి గెస్టుగా యాంకర్ సుమ ఎంట్రీ ఇచ్చింది. ఫైనలిస్టులతో టాస్కులాడిస్తూ వారిని ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలోనే కొన్ని సరదా ప్రశ్నలడిగింది. మూడు రోజులు స్నానం చేయకుండా ఉన్నారా? అంటే మూడు కాదు నాలుగు రోజులు స్నానం చేయలేదని తెలిపింది ప్రేరణ.
వేరేవాళ్ల టూత్ బ్రష్‌ను వాడారా? అంటే నబీల్, నిఖిల్, అవినాష్, గౌతమ్.. నలుగురూ అవునని తలూపారు. ఛీ బాయ్స్.. ఇలా ఉన్నారేంట్రా బాబూ అని సుమ, ప్రేరణ తల పట్టుకున్నారు. తర్వాత వీళ్లతో మరిన్ని గేమ్స్ ఆడించింది. ఇకపోతే రేపే బిగ్‌బాస్ ఫైనల్.
ఇప్పటికే హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆగిపోయింది. ప్రేక్షకులు ఓట్లు వేయడం కూడా ముగిసిపోయింది. విజేతను ప్రకటించడమే మిగిలి ఉంది. నిఖిల్, గౌతమ్ మధ్య భారీ పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment