బిగ్‌బాస్ 8 ట్రోఫీ గెలిచిన నిఖిల్ చాలా సెన్సిటివ్. చిన్నచిన్న విషయాలకే ఎమోషనలైపోయి కంటతడి పెట్టుకుంటుంటాడు. హౌస్‌లో అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. ముఖ్యంగా మొదట్లో సోనియాతో, తర్వాత యష్మితో ఎక్కువ క్లోజ్ అయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో తను సింగిల్ కాదంటూ లవ్‌స్టోరీ బయటపెట్టాడు.
హౌస్‌లో కన్నీళ్లు
సీరియల్ నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండానే వెల్లడించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్‌లను ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా? అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేదు. భవిష్యత్తులోనూ తనతోనే కలిసుంటా.. తనే నా భార్య అని ఫిక్సయిపోయా! షో అయిపోగానే తన దగ్గరికే వెళ్తాను.
యూటర్న్?
ఆమె కోప్పడుతుందని తెలుసు. అయినా వెళ్తా.. తిడితే పడతాను, కొడితే కొట్టించుకుంటాను.. పిచ్చి లేస్తే లేపుకెళ్లిపోతా.. షో అయిపోగానే నీ ముందు నిలబడతా.. అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్చేశాడు. తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో అడుగుపెట్టిన నిఖిల్‌ను యాంకర్ అర్జున్ అంబటి ఇదే ప్రశ్న అడిగాడు. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్‌గా తన దగ్గరకే వెళ్తానన్నావు.. మరి వెళ్తున్నావా? అని ప్రశ్నించాడు.
ఆలస్యంగానైనా..
అందుకు నిఖిల్ బయటకు వెళ్లేదాక తెలియదు పరిస్థితి! అని చెప్పాడు. అప్పుడేమో వెంటనే వెళ్తానని ఇప్పుడేమో పరిస్థితులు చూసి చెప్తానంటున్నాడేంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఆలస్యంగానైనా నిఖిల్.. కావ్య దగ్గరకు వెళ్లి తన ప్రేమను నిలబెట్టుకుంటాడేమో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment