అశ్వత్థామకు చావు లేదన్నది అందరికీ తెలుసు. కానీ ఈ అశ్వత్థామకు తిరుగులేదని నిరూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో తనకు తాను అశ్వత్థామ అన్న బిరుదు ఇచ్చుకున్నాడు. అప్పుడు తనపై సెటైర్లు వేసినవాళ్లే.. ఎనిమిదో సీజన్‌కు వచ్చేసరికి చప్పట్లు కొట్టారు. గౌతమ్ మాట తీరు, ఆటతీరుకు ఫిదా అయ్యారు. ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచిన్నప్పటికీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గౌతమ్ తాజాగా సాక్షి.కామ్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు చూసేయండి..
ట్రోలింగ్‌పై మీ అభిప్రాయం?
గౌతమ్: గత సీజన్‌లో నేను కొన్ని పొరపాట్లు చేశాను. అందుకు నాపై ట్రోలింగ్ జరిగింది. తర్వాత నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుని ఎనిమిదో సీజన్‌లో అడుగుపెట్టాను. మొదటివారం ఎలిమినేషన్ అంచున నిలబడినప్పుడు బాధపడ్డాను. కానీ నాకు ఒక అవకాశం వచ్చిందన్నప్పుడు ధృడంగా నిలబడ్డాను, గట్టిగా ఆడాను. అశ్వత్థామ అంటే ట్రోల్ చేసినవారే మళ్లీ అదే పేరుతో పొగిడారు. నాకెంతో పాజటివిటీ దొరికింది. ఈ జర్నీని నేనెప్పటికీ మర్చిపోలేను.
ఫినాలే వరకు రావడానికి మణికంఠ కారణమని భావిస్తున్నారా?
గౌతమ్: లేదు. ఒక్క వారం మణికంఠ వల్ల సేవ్ అయ్యాను. కానీ ఫినాలే వరకు నా స్వయంకృషితో వచ్చాను.
చిరంజీవి సతీమణి సురేఖగారిని ఎప్పుడు కలుస్తారు?
గౌతమ్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని త్వరలోనే కలుస్తాను.
గత సీజన్‌లో నాగార్జున గ్రూప్ గేమ్స్ తప్పన్నారు. ఈ సీజన్‌లో మాత్రం గ్రూప్ గేమ్స్ తప్పేం కాదని వెనకేసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?
గౌతమ్: నేనూ చాలా మీమ్స్‌లో చూశాను. ఫ్రెండ్స్‌గా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడటం తప్పు కాదు. కానీ గ్రూప్‌గా ఉంటూ వేరేవాళ్లను టార్గెట్ చేయడం తప్పు. అది నాకు నచ్చలేదు.
విన్నర్ అయినందుకు నిఖిల్‌ను అభినందించారా?
గౌతమ్: ఫినాలే స్టేజీపై వెంటనే కంగ్రాట్స్ చెప్పాను. కానీ ఎపిసోడ్‌లో వేయలేదు. అలాగే నాగార్జునగారు కూడా నేను చరిత్ర సృష్టిస్తానని మెచ్చుకున్నారు. అది కూడా ఎపిసోడ్‌లో వేయలేదు.
రెమ్యునరేషన్ సంతృప్తికరంగా ఉందా?
గౌతమ్: గత సీజన్ కంటే రెట్టింపు పారితోషికం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment