
ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, వేలెత్తిచూపించినవారే తలదించుకునేలా చేయాలి.. తిట్టినవారితోనే పొగిడించుకోవాలి.. ఇవన్నీ చేసి చూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో అతడు ఏం కోల్పోయాడో దాన్ని ఈ సీజన్‌లో తిరిగి సంపాదించాడు. అప్పుడు మూటగట్టుకున్న నెగెటివిటినీ తన మాటతీరుతో, ఆటతీరుతో కడిగిపారేశాడు.
అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నప్పుడు నవ్వినవాళ్లే ఈడు మగాడ్రా బుజ్జి అంటున్నారు! బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వైల్డ్ ఫైర్‌లా మారాడు. టైటిల్ రేసులో ఉన్న నిఖిల్‌కు గట్టి పోటీనిచ్చాడు. గతంలో ఫైనల్స్‌కు రాకుండానే వెనుదిరిగిన గౌతమ్ ఇప్పుడేకంగా టాప్ 2లో చోటు దక్కించుకున్నాడు. వారానికి రూ.1.75 లక్షల చొప్పున సంపాదించాడు. అంటే బిగ్‌బాస్ హౌస్‌లో పారితోషికం రూపేణా పది వారాలకుగానూ దాదాపు రూ.17,50,000 వెనకేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment