
నవమాసాలు మోయడం పిల్లల్ని కనడం అంత ఈజీ కాదంటోంది నటి రాధికా ఆప్టే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. మేమప్పుడే పిల్లల్ని ప్లాన్ చేయలేదు, అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది తెలుసుకుని షాకయ్యాను. డెలివరీకి వారం ముందు ఒక ఫోటోషూట్ చేశాను. నేనేంటి? ఇలా కనిపిస్తున్నాను అని చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. .

సడన్‌గా ఉబ్బిపోయా..
ఎందుకంటే అంతకుముందెప్పుడూ అంత బరువు పెరగలేదు. సడన్‌గా ఉబ్బిపోయాను. సరిగా నిద్రుండకపోయేది, ఉన్నట్లుండి నొప్పులు వచ్చేవి. అవన్నీ అనుభవిస్తున్నకొద్దీ నా ఆలోచనా విధానం మారిపోయింది. డెలివరీ అయి రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే నా శరీరం మళ్లీ వేరేలా కనిపిస్తోంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు చూస్తుంటే అప్పుడెందుకు నాపై నేను అంత చికాకుగా ఉన్నాననిపిస్తోంది.

అప్పుడు చిరాకుగా, ఇప్పుడు అందంగా!
నా శరీరంలోని మార్పులు ఇప్పుడు నాకు అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను ఎప్పటికీ జ్ఞాపకంగా దాచుకుంటాను. ఒకరికి జన్మనివ్వడం గొప్ప విషయమే! కానీ ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎవరూ బయటకు చెప్పుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కాగా రాధికా ఆప్టే డిసెంబర్ మొదటివారంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ తదితర చిత్రాల్లో ఈమె హీరోయిన్‌గా నటించింది.
చదవండి: బిగ్‌బాస్: మూడు రోజులకే రూ.2.5 కోట్లు! ఎవరికో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment