బిగ్‌బాస్‌: మూడు రోజులకే రూ.2.5 కోట్లు! ఎవరికో తెలుసా? | Do You Know About Who Is The Highest Paid Contestant In Bigg Boss History? Charged Rs 2.5 Crore For 3 Days | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ చరిత్రలోనే అత్యధిక పారితోషికం.. ఆమెకు రెండున్నర కోట్లు!

Published Wed, Dec 18 2024 1:47 PM | Last Updated on Wed, Dec 18 2024 3:03 PM

Bigg Boss Highest Paid Contestant who Charged Rs 2 5 crore for 3 Days

రియాలిటీ షోలకు బాస్‌.. బిగ్‌బాస్‌. ఈ షోను ఆదరించేవాళ్లు ఎంతోమంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో విజయవంతంగా రన్‌ అవుతోంది. షో గెలిచినవారికి కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ఇస్తుంటారు. తెలుగులో విజేతకు రూ.50 లక్షలు ఇస్తుండగా హిందీలో మొదట్లో రూ.1 కోటి ఇచ్చేవారు. ఆరో సీజన్‌ నుంచి మాత్రం అది తగ్గుతూ వచ్చింది. 

కోట్లల్లో రెమ్యునరేషన్‌
మధ్యలో రూ.30 లక్షలదాకా వెళ్లిన ప్రైజ్‌మనీ ప్రస్తుత సీజన్‌లో మాత్రం రూ.50 లక్షలుగా ఉంది. అయితే వీటితో సంబంధం లేకుండా కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్‌ కూడా ఇస్తుంటారు. కొందరు ఈ పారితోషికం రూపంలోనే లక్షలు, కోట్లు సంపాదించారు. అలా బిగ్‌బాస్‌ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్నది ఎవరో తెలుసా? కెనడియన్‌ నటి పమేలా ఆండర్సన్‌. ఈమె హిందీ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొంది. 

సెకండ్‌ ప్లేస్‌లో ఎవరంటే?
ముచ్చటగా మూడు రోజులు హౌస్‌లో ఉండి వెళ్లిపోయింది. అందుకుగానూ రూ.2.5 కోట్ల పారితోషికం తీసుకుందట! కాగా పమేలా.. స్కూబీ డూ,స్నేరీ మూవీ 3, స్నాప్‌డ్రాగన్‌ చిత్రాలతో పాటు బేవాచ్‌ యాక్షన్‌ సిరీస్‌లోనూ నటించింది. చివరగా ద లాస్ట్‌ షోగర్ల్‌ అనే సినిమాతో మెప్పించింది. ఈ బ్యూటీ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న కంటెస్టెంట్‌ గ్రేట్‌ ఖాలి అని తెలుస్తోంది. ఇతడు వారానికి రూ.50 లక్షలవరకు తీసుకున్నాడట! తర్వాతిస్థానంలో కరణ్‌వీర్‌ బొహ్ర రూ.20 లక్షలు అందుకున్నట్లు భోగట్టా!

చదవండి: ఆస్కార్‌లో నిరాశ.. లాపతా లేడీస్‌ను సెలక్ట్‌ చేయడమే తప్పంటున్న డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement