Great Khali
-
గ్రేట్ ఖలీ కాలు పెట్టగానే.. టయోటా ఫార్చ్యూనర్ ఫసక్! వైరల్ వీడియో
Viral Video: అత్యంత ప్రసిద్ధ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లలో ఒకరైన ది గ్రేట్ ఖలీ (Great Khali) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన ఏకైక భారతీయ సంతతి వ్యక్తి ఆయన. 2007లో ఈ టైటిల్ సాధించారు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యుడైన ఖలీని నేషనల్ హీరోగా భావిస్తుంటారు. డ్రైవింగ్‌ను కూడా ఆస్వాదించే గ్రేట్ ఖలీ పలు మోడళ్ల కార్లు, బైక్‌లను నడుపుతుంటాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తుంటాడు. అలాంటి వీడియో ఒకటిప్పడు వైరల్‌గా మారింది. బాగా పాపులర్ అయిన టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఎస్‌యూవీలోకి ఖలీ ఎక్కుతున్న వీడియో అది. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలోకి ఎక్కేందుకు గ్రేట్ ఖలీ కాలు పెట్టాడు అంతే... దాని ఫుట్‌బోర్డ్ ఒక్కసారిగా విరిగిపోయింది. భారీ, బలిస్టమైన శరీరం ఉన్న ఖలీ ధాటికి ఆ ఎస్యూవీ తట్టుకోలేక పోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజెన్లు వామ్మో.. గ్రేట్ ఖలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో సరదాగా తీసిందా లేక నిజంగా జరిగిందా అనేది కచ్చితంగా తెలియలేదు. View this post on Instagram A post shared by Car Reels India (@carreelsindia) -
మీరెప్పుడూ చూడని గ్రేట్ ఖలీ రైడింగ్ వీడియో.. ఓ లుక్కేసుకోండి!
Khali Royal Enfield Riding: బాక్సింగ్ గురించి తెలిసినవారికి ప్రత్యేకంగా 'గ్రేట్ ఖలీ' (Great Khali) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచిన ఈయన రిటైర్ అయిన తరువాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అప్పటి నుంచి కొన్ని టీవీ యాడ్స్‌లో నటించడం, 2015లో పంజాబ్‌లో కాంటినెంటల్ రెజ్లింగ్ స్కూల్ ప్రారంభించడం వంటివి చేసి కాలం గడుపుతున్నారు. ఇటీవల ఖలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదలైన ఒక వీడియోలో ఖలీ 'రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్' నడపడం చూడవచ్చు. ఈ సంఘటన చూడటానికి బొమ్మ బైకుపై ఆజానుబాహుడున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అత్యంత బరువైన బైకుల్లో ఒకటైన బుల్లెట్ ఖలీ ముందు చిన్న బైకుగా మారిపోయింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది దీనిని లైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఖలీ బైకుని రైడ్ చేస్తూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇంటర్‌సెప్టర్ 650, బుల్లెట్, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి వాటిని రైడ్ చేస్తూ కూడా కనిపించాడు. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. నిజానికి ఖలీ ఎత్తు 7 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏ బైకైనా అతని పరిణామంతో పోలిస్తే మరగుజ్జు మాదిరిగా కనిపిస్తుంది. బైకులు మాత్రమే కాకుండా ఆయన వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లను కలిగి ఉన్నప్పటికీ.. అతని పరిమాణానికి అనుకూలంగా కస్టమైజ్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) -
'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా!
డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్.. భారత్ రెజ్లర్ గ్రేట్ ఖలీ కన్నీటిపర్యంతం అయ్యాడు. అతను ఎందుకు ఏడ్చాడన్నది అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది. విషయంలోకి వెళితే.. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఖలీని.. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలివ్వాలని అడిగారు. అందుకు ఆనందంగా ఒప్పుకున్న ఖలీ చిరునవ్వుతో వారి దగ్గరికి వచ్చి ఫోటోలకు ఫోజిచ్చాడు. కానీ సెకన్ల వ్యవధిలోనే అతని మొహంలో మార్పు కనిపించింది. అప్పటిదాకా సంతోషంగా కనిపించిన ఖలీ.. ఒక్కసారిగా దుఃఖంతో కుమిలిపోయాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఖలీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడన్నది ఎవరికి అర్థం కాలేదు. వారు తనపై చూపించిన అభిమానానికి ఖలీ కన్నీళ్లు పెట్టుకున్నారా? లేదంటే అభిమానుల్లో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారా? అన్న విషయం తెలియరాలేదు. కాగా 19 సెకెన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటివరకు 40వేల మంది వీక్షించారు. భారత్ తరపున వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో పాల్గొని 'ది గ్రేట్ ఖలీ'గా అంతర్జాతీయ ఖ్యాతి గడించాడు. 'గ్రేట్ ఖలీ' అసలు పేరు దలీప్ సింగ్ రాణా. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మోర్ జిల్లాలోని ధీరైనా గ్రామంలో జన్మించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో లెజెండరీ.. హండర్ టేకర్‌ను ఓడించి ఖలీ అప్పట్లో సంచలనం సృష్టించాడు. కాగా ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఖలీ.. 2021లో ''WWE HALL OF FAME''లో చోటు సంపాదించాడు. ఇక పలు బాలీవుడ్, హాలివుడ్ సినిమాల్లోనూ నటించిన ఖలీ అలియాస్ దలీప్ రాణా.. పంజాబ్ పోలీస్‌లో అసెస్టింట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఇటీవలే రాజకీయ అరంగేట్రం ఇచ్చిన ఖలీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. what made Khali Sir cry? pic.twitter.com/mrFKUTdM5A — Viral Bhayani (@viralbhayani77) August 12, 2022 చదవండి: Cheteshawar Pujara: తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం Abhinav Bindra: 34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?.. మూడు ముక్కల్లో సమాధానం -
రెజ్లర్ కాళి ఇంట విషాదం
ఛండీగఢ్: వరల్డ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ‘డబ్ల్యూడబ్ల్యూఈ’లో ఎంట్రీ ఇచ్చి.. కొద్దిరోజుల్లోనే ఇంటర్నేషనల్ ఫేమ్ దక్కించుకున్నాడు రెజ్లర్ కాళి. ఆ తర్వాత కరోనా, తన కాంట్రాక్ట్ రెన్యువల్ కాకపోవడంతో రింగ్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంట విషాదం నెలకొంది. దలీప్ సింగ్ రాణా అలియాస్ కాళి తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. దలీప్ సింగ్ తల్లి తండీదేవి.. గత కొంతకాలంగా అనారోగ్యంతో లూధియానాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. కాళి స్వస్థలం సర్మౌర్ జిల్లా ధిరానియా గ్రామంలో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, పేద కుటుంబం నుంచి వచ్చిన దలీప్.. చిన్నతనంలో చదువుకు దూరమైన కూలీ పనులు చేశాడు. తన భారీ కాయాన్నే పొట్టకూటి కోసం ఉపయోగించుకుని.. ది గ్రేట్ కాళి పేరుతో రెజ్లింగ్ కెరీర్లోకి అడుగుపెట్టాడు. తక్కువ టైంలోనే అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు. ఓవైపు పంజాబ్ పోలీసాఫీసర్‌గా పనిచేస్తూనే.. మరోవైపు రెజ్లింగ్ కెరీర్ కొనసాగించాడు. 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవం అందుకున్నాడు ది గ్రేట్ కాళి. చదవండి: చిల్లర కామెంట్లు.. ఫ్యాన్స్‌పై కాళి గుస్సా -
రెజ్లర్ కాళికి ఏమైంది?
రెజ్లింగ్ ద్వారా మన దేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన ఘనత రెజ్లర్ ది గ్రేట్ కాళీది. రియాలిటీ స్పోర్ట్స్ షో డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టిన మొదట్లోనే అండర్టేకర్ లాంటి క్రేజ్ ఉన్న రెజ్లర్‌ను రింగ్ కరిపించడం, హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవడంతో కాళి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాడు. అఫ్ కోర్స్.. ఆ తర్వాత కాళీ రెజ్లింగ్ కెరీర్ డౌన్ ఫాల్తోనే నడిచింది. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో అభిమానుల తిక్క కామెంట్లతో కాళిని విసిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కూల్ మ్యాన్ స్పందించాల్సి వచ్చింది. దలీప్‌సింగ్ రాణా అలియాస్ ది గ్రేట్ కాళి.. ఇన్స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు. అయితే ఈ మధ్య ఓ ఉదయం కాళి ఇన్‌స్టా లైవ్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటెరాక్ట్ అయ్యాడు. ఆ టైంలో కొందరు ‘కరోనా పేషెంట్లకు నోటి ద్వారా ఆక్సిజన్ అందించండి సార్’, ‘బట్టల్లేకుండా ఆ వీడియో ఏంటండి?’, ‘గ్యాస్ బాంబుతో సోఫాను పాడుచేయకండి’.. అంటూ చిల్లర కామెంట్లు పెట్టారు. దీంతో కాళి, కామెంట్ సెక్షన్‌ను లిమిట్‌గా సెట్ చేశాడు. అయితే తర్వాతి వీడియోలో ఇన్‌స్టా పాలసీ ప్రకారం అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక ఆ చిల్లర కామెంట్లను కొందరు స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేయడంతో.. ఆ వ్యవహారం మరింత ముదిరింది. కాళి ఏ ఫొటో పెట్టినా.. వీడియో పెట్టినా.. దాని కింద తిక్క కామెంట్లే కనిపించాయి. ఈ వ్యవహారం మీమ్స్ పేజీలలో కూడా వైరల్ అయ్యింది. ఇక సాధ్యం కానీ కోరికలను, పనికి మాలిన కామెంట్లతో మొత్తానికి కాళికి చిర్రెత్తుకొచ్చేలా చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ 48 ఏళ్ల రెజ్లర్ స్పందించాడు. ‘‘నాకు సపోర్ట్‌గా నిలుస్తున్న వాళ్లందరికీ థ్యాంక్స్. నా ఇన్‌స్టా వీడియోలను, సంభాషణలను ఆస్వాదించండి. మంచి కామెంట్లు చేయండి. కానీ, చిల్లర కామెంట్స్ చేసి మీ విలువల్ని దిగజార్చుకోకండి’ అంటూ సున్నితంగానే ఫ్యాన్స్‌ను కోరాడు కాళి. అటుపై ఫ్యాన్స్‌తో కొంత సరదా సంభాషణను కూడా కొనసాగించాడు. మరి ఫ్యాన్స్ ఇకనైనా ట్రోల్స్ చేయకుండా ఉంటారేమో చూడాలి. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన దలీప్‌సింగ్ బాల్యం కష్టాలతోనే సాగింది. ఆర్థిక కష్టాలతో చదువుకు దూరమై తోట పనుల్లో చేరిన దలీప్ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్త దగ్గర బాడీగార్డుగా పని చేశాడు. అటుపై భారీ కాయంతో బాడీ బిల్డర్ కాంపిటీషన్ల ద్వారా రెజ్లింగ్ కెరీర్లోకి అడుగుపెట్టి.. చివరికి డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ఫేమస్ అయ్యాడు. పంజాబ్ పోలీసాఫీసర్‌గా పనిచేస్తూనే.. మరోవైపు రెజ్లింగ్ కెరీర్ కొనసాగించాడు. అటుపై సినిమాల్లోనూ మెరిశాడు కూడా. 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవం అందుకున్నాడు ది గ్రేట్ కాళి. చదవండి: మహిళా రెజ్లర్‌కు చేదు అనుభవం -
టాలీవుడ్‌కి రెజ్లింగ్ స్టార్
ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు ఈ ఏడడుగుల రెజ్లర్. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో, అమెరికన్ టీవీ షోల్లో నటించిన ఖలీ ‘బిగ్‌బాస్ 4’లో కూడా కనిపించి అభిమానులను అలరించారు. స్పోర్ట్స్ డ్రామాగా జయంత్ తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో నీలేష్ ఎటి, ఇజబెల్లా జంటగా నటిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ నేపథ్యంలో సినిమా రూపొందుతుండటంతో ఇస్లామిక్ దేశంలో చిత్రీకరణ జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘నరేంద్ర’ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, ఈ సినిమాతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, కెమెరా: విరీన్ తంబిదొరై, సంగీతం: రామ్ సంపత్, కథ–దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ. -
CWE పోటీల్లో రెజ్లర్ ఖలీ విజయం
-
ది గ్రేట్ ఖలీకి తీవ్రగాయాలు
ఉత్తరాఖండ్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరుగుతున్న 'ది గ్రేట్ ఖలీ షో'లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెస్లర్లుకు దడపుట్టించేలే ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించారు. భారత్పేరును ఖలీ రెస్లింగ్‌లో కూడా ఖండాతరాలు దాటేలా చేశారు. ఖలీ గాయాలనుంచి కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.