The Great Khali Shocking Reply To Fans Instagram Vulgar Comments - Sakshi
Sakshi News home page

కాళిపై ట్రోలింగ్.. ఫ్యాన్స్​​ చిల్లర కామెంట్లపై గుస్సా

Published Sat, Jun 5 2021 8:26 PM | Last Updated on Sun, Jun 6 2021 6:14 PM

Wrestler Great Khali Reacts On Instagram Vulgar Comments - Sakshi

రెజ్లింగ్ ద్వారా మన దేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన ఘనత రెజ్లర్  ది గ్రేట్​ కాళీది. రియాలిటీ స్పోర్ట్స్​ షో డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టిన మొదట్లోనే అండర్​టేకర్​ లాంటి క్రేజ్​ ఉన్న రెజ్లర్​ను రింగ్ కరిపించడం, హెవీవెయిట్ ఛాంపియన్​షిప్​ గెలవడంతో  కాళి ఒక్కసారిగా హాట్ టాపిక్​గా మారాడు. అఫ్​ కోర్స్​..  ఆ తర్వాత కాళీ రెజ్లింగ్​ కెరీర్​ డౌన్​ ఫాల్​తోనే నడిచింది. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో అభిమానుల తిక్క కామెంట్లతో కాళిని విసిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కూల్ మ్యాన్​ స్పందించాల్సి వచ్చింది. 

దలీప్​సింగ్​ రాణా అలియాస్​ ది గ్రేట్ కాళి.. ఇన్​స్టాగ్రామ్​ ద్వారా రెగ్యులర్​గా ఫ్యాన్స్​తో టచ్​లో ఉంటాడు. అయితే ఈ మధ్య ఓ ఉదయం కాళి ఇన్​స్టా లైవ్ ద్వారా ఫ్యాన్స్​తో ఇంటెరాక్ట్ అయ్యాడు. ఆ టైంలో కొందరు ‘కరోనా పేషెంట్లకు నోటి ద్వారా ఆక్సిజన్​ అందించండి సార్​’, ‘బట్టల్లేకుండా ఆ వీడియో ఏంటండి?’, ‘గ్యాస్​ బాంబుతో సోఫాను పాడుచేయకండి’.. అంటూ చిల్లర కామెంట్లు పెట్టారు. దీంతో కాళి, కామెంట్ సెక్షన్​ను లిమిట్​గా సెట్​​ చేశాడు. అయితే తర్వాతి వీడియోలో ఇన్​స్టా పాలసీ ప్రకారం అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక ఆ చిల్లర కామెంట్లను కొందరు స్క్రీన్​ షాట్స్ తీసి​ వైరల్ చేయడంతో.. ఆ వ్యవహారం మరింత ముదిరింది.

కాళి ఏ ఫొటో పెట్టినా.. వీడియో పెట్టినా.. దాని కింద తిక్క కామెంట్లే కనిపించాయి. ఈ వ్యవహారం మీమ్స్​ పేజీలలో కూడా వైరల్ అయ్యింది. ఇక సాధ్యం కానీ కోరికలను, పనికి మాలిన కామెంట్లతో మొత్తానికి కాళికి చిర్రెత్తుకొచ్చేలా చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ 48 ఏళ్ల రెజ్లర్​ స్పందించాడు. ‘‘నాకు సపోర్ట్​గా నిలుస్తున్న వాళ్లందరికీ థ్యాంక్స్​. నా ఇన్​స్టా వీడియోలను, సంభాషణలను ఆస్వాదించండి. మంచి కామెంట్లు చేయండి. కానీ, చిల్లర కామెంట్స్​ చేసి మీ విలువల్ని దిగజార్చుకోకండి’ అంటూ సున్నితంగానే ఫ్యాన్స్​ను కోరాడు కాళి. అటుపై ఫ్యాన్స్​తో కొంత సరదా సంభాషణను కూడా కొనసాగించాడు. మరి ఫ్యాన్స్​ ఇకనైనా ట్రోల్స్​ చేయకుండా ఉంటారేమో చూడాలి. 

కాగా, హిమాచల్ ప్రదేశ్​కు చెందిన దలీప్​సింగ్​ బాల్యం కష్టాలతోనే సాగింది. ఆర్థిక కష్టాలతో చదువుకు దూరమై తోట పనుల్లో చేరిన దలీప్ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్త దగ్గర బాడీగార్డుగా పని చేశాడు. అటుపై భారీ కాయంతో బాడీ బిల్డర్ కాంపిటీషన్ల ద్వారా రెజ్లింగ్ కెరీర్​లోకి అడుగుపెట్టి.. చివరికి డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ఫేమస్ అయ్యాడు. పంజాబ్​ పోలీసాఫీసర్​గా పనిచేస్తూనే.. మరోవైపు రెజ్లింగ్ కెరీర్​ కొనసాగించాడు. అటుపై సినిమాల్లోనూ మెరిశాడు కూడా. 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ‘హాల్ ఆఫ్​ ఫేమ్’​ గౌరవం అందుకున్నాడు ది గ్రేట్ కాళి.

చదవండి: మహిళా రెజ్లర్​కు చేదు అనుభవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement