ది గ్రేట్ ఖలీకి తీవ్రగాయాలు | Ex-WWE Star The Great Khali Suffers Serious Head Injury in Pro Wrestling Match | Sakshi
Sakshi News home page

ది గ్రేట్ ఖలీకి తీవ్రగాయాలు

Published Thu, Feb 25 2016 10:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

ది గ్రేట్ ఖలీకి తీవ్రగాయాలు

ది గ్రేట్ ఖలీకి తీవ్రగాయాలు

ఉత్తరాఖండ్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్  జరుగుతున్న సమయంలో రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరుగుతున్న 'ది గ్రేట్ ఖలీ షో'లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్‌లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెస్లర్లుకు దడపుట్టించేలే ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్‌ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించారు. భారత్‌పేరును ఖలీ  రెస్లింగ్‌లో కూడా ఖండాతరాలు దాటేలా చేశారు. ఖలీ గాయాలనుంచి కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement