2022, అక్టోబర్ 5న టెక్సాస్‌లోని (అమెరికా) తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్ సారా లీ (30)కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని స్థానిక మెడికల్ అధికారులు తాజాగా వెల్లడించారు. సారా డెడ్ బాడీపై గాయాలు ఉండటంతో తొలుత పలు అనమానాలు వ్యక్తం చేసిన అధికారులు, తాజాగా విడుదల చేసిన అటాప్సీ రిపోర్ట్‌లో సారాది ముమ్మాటికీ ఆత్మహత్యేనని నిర్ధారించారు.
చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా?
బెక్సార్ కౌంటీ మెడికల్ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. యాంఫటమైన్స్, డాక్సిలామైన్, ఆల్కహాల్ కలిపి సేవించడం వల్ల సారా మరణించిందని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని, సారా శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి ముందు కింద పడటం వల్ల ఏర్పడ్డవేనని నిర్ధారించబడింది. దీంతో సారా మృతిపై గత కొద్ది రోజులుగా ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది.
WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7
— WWE (@WWE) October 7, 2022
అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సారాను ఎవరు ఏమీ చేయలేదు.. మరి అంత చిన్న వయసులో (30) ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందోనని డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సారా 2015 మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment) ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఆమె రెజ్లింగ్ ఛాంపియన్‌గానే కాకుండా అమెరికన్ టీవీ పర్సనాలిటీగా కూడా అందరికీ సుపరిచితం.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001,
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment