ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మరో భారత రెజ్లర్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మహిళల 76 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16(ప్రిక్వార్టర్స్)కు అర్హత సాధించిన రితికా హుడా.. హంగేరికి చెందిన బెర్నాడెట్ న్యాగీతో తలపడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ బౌట్‌లో బెర్నాడెట్‌పై 12-2తో రితికా పైచేయి సాధించింది.
ఈ క్రమంలో.. ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడాను విజేతగా ప్రకటించారు. ఫలితంగా ఆమె క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా బౌట్ జరుగుతున్నపుడు ఇద్దరు రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే.. రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి.. పది పాయింట్ల ఆధిక్యంలో ఉన్న రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా తేలుస్తారు. క్వార్టర్ ఫైనల్లో రితిక.. కిర్గిస్తాన్‌కు చెందిన ఐపెరి మెడిట్ కిజీతో తలపడనుంది.
ఇప్పటికి ఆరు
కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల 57 కేజీల విభాగంలో మూడో స్థానం సాధించిన అమన్ భారత్ పతకాల సంఖ్యను ఆరుకు చేర్చాడు. ఇక మరో రెజ్లర్ వినేశ్ ఫొగట్ సైతం 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
అయితే, వెయింగ్ రోజున 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంగా స్వర్ణ పతక బౌట్‌లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు భారత్‌కు ప్యారిస్‌లో ఐదు కాంస్యాలు(షూటింగ్‌లో మూడు, హాకీ ఒకటి, రెజ్లింగ్‌లో ఒకటి), ఒక రజతం(నీరజ్ చోప్రా- జావెలిన్ త్రో) వచ్చాయి.
చదవండి: CASలో ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. ప్రకటన విడుదల
She's UNSTOPPABLE!! 🔥
Reetika Hooda dominated her Hungarian opponent with a 12-2 victory in her first bout & storms into the quarterfinals! Catch all the Olympic action LIVE on #Sports18 and stream FREE on #JioCinema 👈#OlympicsOnJioCinema #Paris2024 #Wrestling pic.twitter.com/tbqoXjPb2K— JioCinema (@JioCinema) August 10, 2024
Comments
Please login to add a commentAdd a comment