Women wrestling
-
Olympics: స్కోర్లు సమం.. అయినా భారత రెజ్లర్ ఓటమి! కారణం?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ రితికా హుడాకు చేదు అనుభవం ఎదురైంది. అద్భుత ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన ఆమె.. క్వార్టర్ ఫైనల్లో ఓటమిని మూటగట్టుకుంది. అయితే, కాంస్య పతక రేసు ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి.కాగా హర్యానాకు చెందిన రితికా హుడా.. మహిళల 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ తరఫున ప్యారిస్ బరిలో దిగింది. హంగేరీ రెజ్లర్ బెర్నాడెట్ న్యాగీతో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 12-2తో రితికా పైచేయి సాధించింది. తద్వారా ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడా విజేతగా నిలిచింది. ఫలితంగా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అయితే, అక్కడ మాత్రం రితికకు కఠినసవాలు ఎదురైంది.కిర్గిస్తాన్‌కు చెందిన టాప్ సీడ్ ఐపెరి మెడిట్ కిజీతో రితికా క్వార్టర్స్‌లో తలపడింది. అయినప్పటికీ తన శక్తినంతటినీ ధారపోసి.. కిజీని నిలువరించేందుకు రితికా ప్రయత్నించింది. ఆఖరి వరకు పట్టుదలగా పోరాడి 1-1తో స్కోరు సమం చేసింది. అయితే, కౌంట్‌బ్యాక్ రూల్ ప్రకారం.. కిజీ చివరి పాయింట్ గెలిచింది.దీంతో ఐపెరి మెడిట్ కిజీని రిఫరీ విజేతగా ప్రకటించారు. అయితే, కిజీ గనుక ఫైనల్ చేరితే రితికాకు రెపిచెజ్లో పోటీపడే అవకాశం ఉంటుంది. ఇందులో గెలిస్తే రితికాకు కాంస్యమైనా ఖాయమవుతుంది.కౌంట్‌బ్యాక్ రూల్ అంటే ఏమిటి?యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) నిబంధనల ప్రకారం.. బౌట్ ముగిసేసరికి ఇద్దరు రెజ్లర్లు సమానంగా పాయింట్లు సాధిస్తే.. ‘టై’ బ్రేక్ చేయడానికి కౌంట్‌బ్యాక్ రూల్‌ను వాడతారు. ఈ క్రమంలో తమకు ఇచ్చిన మూడు అవకాశాల్లో ఎవరైతే.. ప్రత్యర్థిని ఎక్కువ సేపు హోల్డ్ చేసి.. తక్కువ తప్పులు చేస్తారో.. అదే విధంగా చివరగా ఎవరు టెక్నికల్ పాయింట్ సాధిస్తారో వారినే విజేతగా ప్రకటిస్తారు.రితికా- కిజీ మ్యాచ్‌లో.. కిజీ తప్పు కారణంగా రితికకు తొలి పాయింట్ వచ్చింది. అయితే, తర్వాతి బౌట్లో కిజీ పాయింట్ స్కోరు చేసి పైచేయి సాధించింది. ఫలితంగా రిఫరీ ఆమెను విజేతగా ప్రకటించారు. -
Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మరో భారత రెజ్లర్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మహిళల 76 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16(ప్రిక్వార్టర్స్)కు అర్హత సాధించిన రితికా హుడా.. హంగేరికి చెందిన బెర్నాడెట్ న్యాగీతో తలపడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ బౌట్లో బెర్నాడెట్‌పై 12-2తో రితికా పైచేయి సాధించింది.ఈ క్రమంలో.. ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడాను విజేతగా ప్రకటించారు. ఫలితంగా ఆమె క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా బౌట్ జరుగుతున్నపుడు ఇద్దరు రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే.. రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి.. పది పాయింట్ల ఆధిక్యంలో ఉన్న రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా తేలుస్తారు. క్వార్టర్ ఫైనల్లో రితిక.. కిర్గిస్తాన్‌కు చెందిన ఐపెరి మెడిట్ కిజీతో తలపడనుంది.ఇప్పటికి ఆరు కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల 57 కేజీల విభాగంలో మూడో స్థానం సాధించిన అమన్ భారత్ పతకాల సంఖ్యను ఆరుకు చేర్చాడు. ఇక మరో రెజ్లర్ వినేశ్ ఫొగట్ సైతం 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, వెయింగ్ రోజున 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంగా స్వర్ణ పతక బౌట్లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు భారత్‌కు ప్యారిస్‌లో ఐదు కాంస్యాలు(షూటింగ్లో మూడు, హాకీ ఒకటి, రెజ్లింగ్‌లో ఒకటి), ఒక రజతం(నీరజ్ చోప్రా- జావెలిన్ త్రో) వచ్చాయి.చదవండి: CASలో ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. ప్రకటన విడుదలShe's UNSTOPPABLE!! 🔥Reetika Hooda dominated her Hungarian opponent with a 12-2 victory in her first bout & storms into the quarterfinals! Catch all the Olympic action LIVE on #Sports18 and stream FREE on #JioCinema 👈#OlympicsOnJioCinema #Paris2024 #Wrestling pic.twitter.com/tbqoXjPb2K— JioCinema (@JioCinema) August 10, 2024 -
ప్రధానిలో నిర్దయ చూస్తే బాధేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఉదంతంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా నిరసనగా ఖేల్ రత్న, అర్జున అవార్డులను రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఢిల్లీలో రోడ్డుపై వదిలేయడం తెలిసిందే. ఆ వీడియోను రాహుల్ ఆదివాంర ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రధానిని వైఖరిని ఎండగట్టారు. ‘‘భారతదేశంలోని ప్రతి అమ్మాయి ఆత్మాభిమానానికి అత్యంత విలువ ఇస్తుంది. అవార్డులు, పురస్కారాలన్నీ ఆ తర్వాతే. ఇలాంటి ధైర్యశాలుల కంటే ‘బాహుబలి’ వంటి పరపతి గల వ్యక్తుల నుంచి పొందే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయా?’’ అని మోదీని ప్రశ్నించారు. ‘‘ప్రధాని అంటే దేశ రక్షకుడు. ఇంతటి తీవ్రమైన అంశంలో ఇంత నిర్దయగా వ్యవహరించడం చాలా బాధేస్తోంది’’ అన్నారు. -
WFI: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ
Bajrang Punia Returns Padma Shri: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పద్మ శ్రీ అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. మహిళా రెజ్లర్లకు అవమానం జరిగిన దేశంలో తాను ఇలాంటి ‘గౌరవానికి’ అర్హుడిని కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్.. తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో.. నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉద్యమానికి యువత అండగా నిలబడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన మేర స్పందన రాలేదు. ఈ క్రమంలో విచారణ కమిటీ నియామకం జరగగా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం గురువారం (డిసెంబరు 21) ఢిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అనితా షెరాన్‌పై.. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. బ్రిజ్ భూషణ్‌కు ప్రధాన అనుచరుడిగా పేరొందిన అతడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ వంటి ఒలింపిక్ విజేతతో పాటు నిరసనలో భాగమైన వినేశ్ ఫొగాట్.. వీరికి మద్దతుగా నిలిచిన బజరంగ్ పునియా తదితరులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ మళ్లీ డబ్ల్యూఎఫ్ఐలో పెత్తనం చెలాయించడం ఖాయమంటూ సాక్షి.. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఒలింపియన్ బజరంగ్ పునియా సైతం ఓ అడుగు ముందుకు వేశాడు. సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. ‘‘ప్రియమైన ప్రధాన మంత్రి గారు.. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. మీ పనులతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయినప్పటికీ.. మీ దృష్టిని ఆకర్షించడం ద్వారా దేశంలో రెజ్లర్ల పరిస్థితి గురించి తెలియజేయడానికి నేను మీకు లేఖ రాస్తున్నాను. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిరసనలో నేను కూడా పాల్గొన్నాను. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేము ఆందోళన విరమించాం. కానీ.. ఇంతవరకు బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మూడు నెలలు గడుస్తున్నా అతడిపై ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మేము మరోసారి వీధుల్లోకి రావాలని భావిస్తున్నాం. ఏప్రిల్ నుంచి మళ్లీ నిరసనకు దిగుతాం. కనీసం అప్పుడైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే ఆశ. జనవరిలో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది కంప్లైంట్ చేశారు. అయితే, ఏప్రిల్ నాటికి వారి సంఖ్య ఏడుకు తగ్గింది. అంటే పన్నెండు మంది మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ ప్రభావితం చేశారు’’ అంటూ బజరంగ్ పునియా సంచలన విషయాలు వెల్లడించాడు. मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023 -
'ప్రతి అవకాశంలో మహిళా రెజ్లర్లను వేధించాడు'
ఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఆయనపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తజకిస్థాన్‌లో ఈవెంట్ సందర్భంగా ఓ రెజ్లర్‌ను గదిలోకి పిలిచి హగ్ చేసుకునేందుకు ప్రయత్నించారని కోర్టుకు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిరసన తెలిపితే.. తాను తండ్రిలాగే దగ్గరికి తీసుకున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్పారని న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను దురుద్దేశంతో తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనానికి వెల్లడించారు. ఇవన్నీ బ్రిజ్ భూషణ్ దురుద్దేశంతోనే చేశాడని పోలీసులు తెలిపారు. మహిళా రెజ్లర్ల ఆరోపణలను పరిశీలించడానికి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ కూడా బ్రిజ్ భూషణ్‌ను నిర్దేషిగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణల దర్యాప్తుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. అందుకు సంబంధించిన రిపోర్టును బయటకు వెల్లడించలేదు. కానీ ఓ కాపీని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు అందించారు. మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో గరిష్ఠంగా మూడేళ్లు ఉంటుంది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరుగురు మహిళా రెజ్లర్లు జూన్ 15న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారణ చేపడుతోంది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి -
చేజేతులా తలవంపులు!
విశ్వవేదికపై భారతదేశానికి కీర్తి, పతకాలు తెచ్చిపెట్టిన ఒక క్రీడ... ఇప్పుడు అంతర్జాతీయంగా నలుగురిలో నగుబాటుకు కారణంగా మారిందంటే తప్పెవరిది? గడచిన నాలుగు ఒలిపింక్స్‌లోనూ వరుసగా మన దేశానికి పతకాలు సాధించి పెట్టిన రెజ్లింగ్‌లో ఆటగాళ్ళు ఇప్పుడు కనీసం భారత జాతీయ పతాకం నీడన అధికారికంగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వీలు లేకుండా పోయిందంటే ఆ పాపం ఎవరిది? మన అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ ఏడాది మొదట్లో వీధికెక్కి, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లు్యఎఫ్‌ఐ) అప్పటి అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలు చేసినప్పటి నుంచి గత ఎనిమిది నెలల్లో రోజుకో వివాదం మన రెజ్లింగ్‌ను చుట్టుముడుతూనే ఉంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలతో సతమతమవుతున్న భారత సమాఖ్యను అంతర్జాతీయ రెజ్లింగ్ పర్యవేక్షక సంఘం ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ (యుడబ్లు్యడబ్లు్య) తాజాగా సస్పెండ్ చేసింది. నిర్ణీత గడువు లోగా ఎన్నికలు జరపనందుకు పడ్డ ఈ సస్పెన్షన్ వేటు మన రెజ్లింగ్ భవితపై నీలినీడలు పరిచింది. ఈ సస్పెన్షన్ మరీ ఊహించనిదేమీ కాదు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. వివాదాల్లో కూరుకుపోయిన భారత రెజ్లింగ్ సమాఖ్యను చక్కదిద్దుకోవా ల్సిందిగా మన క్రీడాయంత్రాంగ పెద్దలను అభ్యర్థిస్తూనే ఉంది. దోవకు రాకుంటే సస్పెన్షన్ వేటు వేయక తప్పదని జూన్‌లో హెచ్చరించింది. జూలైలోనూ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. భారత రెజ్లింగ్ సమాఖ్యలో అంతర్గత వర్గ పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. మరోపక్క సమాఖ్య ఎన్నికల్ని వివిధ కోర్టులు నిలిపివేశాయి. చివరకు సహనం నశించిన అంతర్జాతీయ సంఘం అన్నంత పనీ చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. సమస్యను ఆదిలోనే పరిష్కరించని మన క్రీడా అధికారుల అసమర్థత ఇక్కడి దాకా తెచ్చింది. ఈ సస్పెన్షన్ వల్ల ఆటగాళ్ళపై వ్యక్తిగతంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు. కానీ, దేశానికి మాత్రం తీరని తలవంపులు. ఎలాగంటే, ఈ సెప్టెంబర్ 16 నుంచి బెల్గ్రేడ్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మన రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగానే పోటీలో పాల్గొనాల్సిన పరిస్థితి. ఇలా మన కుస్తీయోధులు అన్ని రకాల పోటీల్లో పాల్గొనవచ్చు. పతకాలు సాధించవచ్చు. కానీ, జాతీయ పతాకం ధరించడానికి లేదు. సాక్షాత్తూ బంగారు పతకం సాధించి, పోడియమ్పై నిలబడినప్పటికీ ప్రాంగణంలో మన జాతీయ గీతాన్ని వినిపించరు. వారి ప్రతిభా ప్రదర్శన, గెలిచే పతకాలు... ఇలా ఏవీ భారతదేశపు లెక్కలోకి రావు. అదీ ఈ సస్పెన్షన్‌తో దాపురించే దుఃస్థితి. ఒకవేళ ఇంత జరుగుతున్నా సరే ఇప్పుడిప్పుడే ఎన్నికలు నిర్వహించకుంటే, దరిమిలా సస్పెన్షన్‌ను ఎత్తివేయ కుంటే... అప్పుడిక మన భారత రెజ్లర్లు రానున్న ఒలింపిక్స్ సహా ఏ అంతర్జాతీయ పోటీలోనూ దేశం తరఫున పోటీ చేసే వీలుండదు. ఇది దేశ ప్రతిష్ఠకే మాయని మచ్చ. ఇందుకు నిందించాల్సింది మన భారత రెజ్లింగ్ సమాఖ్యను, మన పాలకులనే! లైంగికంగా వేధించినట్టు సాక్ష్యాధారాలు లభించినప్పటికీ, దేశానికి పతకాల పంట పండించిన రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డున పడి ధర్నాలు చేసినప్పటికీ ఇవాళ్టికీ మన ఏలికలకు చీమ కుట్టినట్టయినా లేదు. సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పాలక బీజేపీ పార్లమెంట్ సభ్యుడైన బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవ డానికి ఇప్పటికీ మన పాలకులకు చేతులు రావడం లేదు. పేరుకు పదవిలో నుంచి పక్కకు తప్పు కున్నప్పటికీ, తన వారినే మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టి కథ నడిపించాలని చూస్తున్న నిందితుడిని అడ్డుకొనేందుకు మన ప్రభుత్వాలకు మనస్కరించడం లేదు. బాధిత రెజ్లర్లకూ, చక్రం తిప్పాలని చూస్తున్న బడాచోర్లకూ మధ్య చిక్కుకున్నది కేవలం రెజ్లింగ్ కాదు... దేశ పరువు ప్రతిష్ఠలు! లైంగిక ఆరోపణల వ్యవహారంతో ఇప్పటికే దేశం పరువు పోగా, తాజా సస్పెన్షన్‌తో తలకొట్టేసినట్టయింది. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడా సంఘాలు గనక రాజకీయ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఇలాగే ఉంటుంది. ఆటలు, ఆటగాళ్ళ ప్రయోజాల పరిరక్షణ వెనక్కి పోయి, క్రీడలతో సంబంధం లేని అంశాలు ముందుకు వస్తాయి. దేశంలోని అనేక ఇతర క్రీడా సంఘాల్లోనూ ఇదే జరిగింది. సమయానికి ఎన్నికలు జరపలేదంటూ నిరుడు ప్రపంచ ఫుట్‌బాల్ పర్యవేక్షక సంఘం ‘ఫిఫా’ మనదేశ ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, హాకీ ఫెడరేషన్లు సైతం ఈ కారణాలతోనే మన సంఘాల్ని నిషేధిస్తామని హెచ్చరించాయి. క్రీడా నియమావళిని పాటించట్లేదంటూ సాక్షాత్తూ భారత సర్కారే 2020 జూన్‌లో 54 జాతీయ క్రీడా సమాఖ్యల గుర్తింపును ఉపసంహరించింది. నియమాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీ హైకోర్ట్ గత ఏడాది దాదాపు పాతిక క్రీడాసంఘాలకు అక్షింతలు వేసింది. అయినా పరిస్థితి మారలేదు. రాజకీయాలకు బలవుతున్న సంఘాల్లో ఒకటిగా మన రెజ్లింగ్ సైతం నిలిచింది. విచిత్రంగా కొందరు ప్రస్తుత పరిస్థితికి ఆటగాళ్ళను తప్పుబడుతున్నారు. లైంగిక వేధింపుల అంశాన్ని బయటకు చెప్పడమే వారి నేరమన్నట్టుగా, వారిని ‘ధర్నా జీవులు’ అంటూ బ్రిజ్‌భూషణ్ నిస్సిగ్గుగా బురద జల్లుతున్నారు. ఇకనైనా పాలకులు, క్రీడా అధికారులు కళ్ళు తెరవాలి. దీర్ఘ కాలం సస్పెన్షన్ కొనసాగితే అంతర్జాతీయ పోటీలకు ఆహ్వానాలు తగ్గుతాయి. ప్రపంచ సంఘం నుంచి ఆర్థిక సహకారమూ తగ్గుతుంది. ఆటగాళ్ళ కెరీర్ దెబ్బ తింటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, సంక్షోభ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి. అలాకాక ప్రభుత్వం ఇప్పటికీ మౌనం వీడకపోతే కష్టమే! దేశప్రతిష్ఠ కన్నా దేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని భావిస్తే అది మహా పాపమే! -
‘పసిడి’ ఆశలు ఆవిరి! ఇక ఏ గొడవా లేదు..
Asia Games 2023- న్యూఢిల్లీ: ట్రయల్స్ లేకుండా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు మినహాయింపు పొందిన మహిళా స్టార్ రెజ్లర్, డిఫెండింగ్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ తాజాగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకొంది. మోకాలు గాయం వల్ల హాంగ్జౌ ఈవెంట్లో పాల్గొనడం లేదని మంగళవారం ఆమె ప్రకటించింది. దీంతో మినహాయింపు అనుచితమంటూ కోర్టుకెక్కిన అంతిమ్ పంఘాల్కు 53 కేజీల కేటగిరీలో లైన్ క్లియరైంది. ఆ విభాగంలో ట్రయల్స్‌లో నెగ్గి ఆసియా ఈవెంట్‌కు అర్హత సంపాదించినప్పటికీ... వినేశ్ బరిలో ఉండటం వల్ల ఆమె స్టాండ్‌బైగా కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వినేశ్ తనంతట తానుగా తప్పుకోవడంతో ఇక ఏ గొడవా లేకుండా అంతిమ్ ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ‘పసిడి’ ఆశలు ఆవిరి ‘ట్రెయినింగ్‌లో ఎడమ మోకాలుకు గాయమైంది. స్కానింగ్‌లో గాయం తీవ్రత దృష్ట్యా సర్జరీ తప్పనిసరని వైద్యులు సూచించడంతో ఈ నెల 17న ముంబైలో ఆపరేషన్ చేయించుకుంటాను. దీనివల్ల జకార్తా ఆసియా క్రీడల్లో (2018) సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనుకున్న నా ఆశలు ఆవిరయ్యాయి’ అని వినేశ్ వాపోయింది. రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులపై వినేశ్, భజరంగ్, సాక్షి మాలిక్ తదితరులు పలుమార్లు జంతర్‌మంతర వద్ద నిరసనకు దిగారు. డబ్లూఎఫ్ఐ అడ్‌హక్ కమిటీ వినేశ్, భజరంగ్‌లకు నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశమివ్వడం వివాదానికి కారణమైంది. దీనిపై ట్రయల్స్ గెలిచిన అంతిమ్ కోర్టును ఆశ్రయించింది. చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
ఆ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్‌ది ఆత్మహత్యే
2022, అక్టోబర్ 5న టెక్సాస్‌లోని (అమెరికా) తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) సూపర్ స్టార్ సారా లీ (30)కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని స్థానిక మెడికల్ అధికారులు తాజాగా వెల్లడించారు. సారా డెడ్ బాడీపై గాయాలు ఉండటంతో తొలుత పలు అనమానాలు వ్యక్తం చేసిన అధికారులు, తాజాగా విడుదల చేసిన అటాప్సీ రిపోర్ట్‌లో సారాది ముమ్మాటికీ ఆత్మహత్యేనని నిర్ధారించారు. చదవండి: ధోని క్రేజ్.. ఐపీఎల్ ఫాలో అవుతున్నాడా? బెక్సార్ కౌంటీ మెడికల్ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. యాంఫటమైన్స్, డాక్సిలామైన్, ఆల్కహాల్ కలిపి సేవించడం వల్ల సారా మరణించిందని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని, సారా శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి ముందు కింద పడటం వల్ల ఏర్పడ్డవేనని నిర్ధారించబడింది. దీంతో సారా మృతిపై గత కొద్ది రోజులుగా ఉన్న అనుమానాలకు తెరపడినట్లైంది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అయితే ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సారాను ఎవరు ఏమీ చేయలేదు.. మరి అంత చిన్న వయసులో (30) ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందోనని డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సారా 2015 మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment) ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఆమె రెజ్లింగ్ ఛాంపియన్‌గానే కాకుండా అమెరికన్ టీవీ పర్సనాలిటీగా కూడా అందరికీ సుపరిచితం. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001, మెయిల్: roshnihelp@gmail.com -
భారత స్టార్ రెజ్లర్ భర్త అనుమానాస్పద మృతి
Commonwealth Games 2022 Bronze Medallist Pooja Sihags Husband Dies: బర్మింగ్‌హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజర్ల్ పూజా సిహాగ్ ఇంట్లో విషాదం నెలకొంది. నిన్న (ఆగస్ట్ 27) రాత్రి సిహాగ్ భర్త అజయ్ నందల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హర్యానాలోని రోహ్తక్ నగర పరిసర ప్రాంతంలో నందల్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. నందల్ మృతదేహం లభించిన ప్రాంతంలో అతని స్నేహితుడు రవి, మరో వ్యక్తిని అచేతనావస్థ స్థితిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా, అజయ్ నందల్ ఆకస్మిక మరణంపై అతని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అజయ్‌కు అతని స్నేహితుడు రవి డ్రగ్స్ అలవాటు చేశాడని, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే అజయ్ మృతి చెంది ఉంటాడని ఆరోపించాడు. అజయ్ తండ్రి ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని వెల్లడించారు. స్వతహాగా రెజ్లర్ అయిన అజయ్ నందల్.. క్రీడల కోటాలో ఇటీవలే ఆర్మీ ఆఫీసర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అజయ్ నందల్ భార్య, భారత స్టార్ మహిళా రెజ్లర్ పూజా సిహాగ్.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. చదవండి: డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ -
CWG: నన్ను క్షమించండి.. మహిళా రెజ్లర్ కన్నీటి పర్యంతం.. ప్రధాని మోదీ ట్వీట్!
Commonwealth Games 2022: భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లోత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పూజ సాధించిన పతకం ఆనందోత్సవాలకు కారణమవుతుందన్న ఆయన.. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆమెను ఓదార్చారు. కాగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా సాగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో పూజా గెహ్లోత్ కాంస్య పతకం సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (50 కేజీల) విభాగంలో కెనడాకు చెందిన మాడిసన్ బియాంక పార్క్స్ తో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో పూజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో స్కాట్లాండ్ రెజ్లర్ క్రిస్టెలీ లెమోఫాక్ లిచిద్జియోతో ప్లే ఆఫ్‌లో తలపడింది. ఇందులో భాంగా 12-2తో విజయం సాధించి కాంస్య పతకం గెలిచింది. అయితే, సెమీ ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన పూజా.. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. నన్ను క్షమించండి! తాను కాంస్య పతకానికే పరిమితమైనందుకు క్షమించాలంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై జాతీయ గీతం వినిపించలేకపోయానంటూ భారతావనిని క్షమాపణలు కోరింది. ఈ మేరకు పూజా గెహ్లోత్ మాట్లాడుతూ.. ‘‘నేను సెమీ ఫైనల్ చేరుకున్నాను. కానీ ఓడిపోయాను. నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. జాతీయ గీతం వినిపించాలనుకున్నా.. కానీ అలా చేయలేకపోయాను.. నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. వాటిని సరిదిద్దుకుంటాను’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ పూజను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘పూజా.. నీ పతకం సెలబ్రేషన్స్‌కు కారణమవుతుంది. క్షమాపణకు కాదు! నీ జీవిత ప్రయాణం మాకు ఆదర్శం. నీ విజయం మాకు సంతోషాన్నిచ్చింది. మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి.. భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలి’’ అంటూ పూజాకు అండగా నిలిచారు. నవీన్, రవి దహియా, వినేశ్ ఫొగట్ రెజ్లర్లు అదరగొట్టారు.. కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత రెజ్లర్ అద్భుత విజయాలు అందుకున్నారు. ఈ క్రీడా విభాగంలో భారత్‌కు మొత్తంగా ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు లభించాయి. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్, వినేశ్ ఫొగట్, రవి దహియా, నవీన్ స్వర్ణ పతకాలతో మెరవగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్, పూజా గెహ్లోత్, పూజా సిహాగ్, దీపక్ నెహ్రా కాంస్య పతకాలు గెలిచారు. చదవండి: Rohit Sharma-Rishabh Pant: పంత్ ప్రవర్తనపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో! Pooja, your medal calls for celebrations, not an apology. Your life journey motivates us, your success gladdens us. You are destined for great things ahead…keep shining! ⭐️ https://t.co/qQ4pldn1Ff — Narendra Modi (@narendramodi) August 7, 2022 -
World Junior Wrestling: ఒక రజతం, రెండు కాంస్యాలు..
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు కూడా పురుషులకు ధీటుగా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా సంజూ (62 కేజీలు), భటేరి (72 కేజీలు) పసిడి పోరుకు అర్హత సంపాదించారు. దీంతో వీరిద్దరికి కనీసం రజత పతకాలు ఖాయమయ్యాయి. గురువారం ఫైనల్లో ఓడిన బిపాష (76 కేజీలు) రజతంతోనే సరిపెట్టుకుంది. సిమ్రన్ (50 కేజీలు), సితో (55 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. (అప్పుడు ఎందుకు నవ్వలేదు: రవి దహియాను ప్రశ్నించిన ప్రధాని మోదీ) మహిళల 76 కేజీల టైటిల్ బౌట్లో బిపాష 0–10 స్కోరు (టెక్నికల్ సుపిరియారిటీ)తో ప్రత్యర్థి కైలీ రెనీ వెల్కెర్ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. 65 కేజీల కేటగిరీ సెమీ ఫైనల్లో భటేరి 3–2తో అమినా రొక్సానా (రొమేనియా)ను ఓడించింది. ఫైనల్లో ఆమె మాల్డొవాకు చెందిన ఇరినా రింగాసితో తలపడనుంది. 62 కేజీల సెమీస్‌లో సంజూ దేవి 8–5తో బిర్గుల్ సొల్తనొవా (అజర్బైజాన్)పై గెలిచింది. తుది పోరులో ఆమె... ఎలీనా కసబియెవా (రష్యా)తో పోటీపడనుంది. 50 కేజీల కాంస్య పతక పోరులో సిమ్రన్ 7–3తో నటాలియా వరకిన (బెలారస్)పై, 55 కేజీల విభాగంలో సితో 11–0తో మెల్డా డెర్నెక్సి (టర్కీ)పై గెలుపొందారు. 59 కేజీల కేటగిరీలో కుసుమ్కు నిరాశ ఎదురైంది. కాంస్యం కోసం తలపడిన ఆమె 1–3తో జాలా అలియెవా (అజర్బైజాన్) చేతిలో ఓడింది. 72 కేజీల సెమీ స్లో సనేహ్ 0–11తో కెన్నెడీ అలెక్సిస్ (అమెరికా) చేతిలో ఓడింది. ఆమె కాంస్యం కోసం పోటీ పడనుంది. భారత పురుష రెజ్లర్లు రజతం సహా 6 పతకాలు సాధించగా... మహిళా రెజ్లర్లు ఇప్పటికే ఒక రజతం, రెండు కాంస్య పతకాలు గెలిచారు. -
నంబర్‌వన్ ర్యాంక్‌కు అడుగు దూరంలో...
భారత మహిళా రెజ్లర్ నవ్‌జ్యోత్ కౌర్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కేవలం అడుగు దూరంలో నిలిచింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నవ్‌జ్యోత్ కౌర్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఘనత సాధించిన నవ్‌జ్యోత్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కూడా రెండో స్థానంలో ఉండటం విశేషం. -
నిరాశపరిచిన బబితా కుమారి
భారత మహిళా రెజ్లర్ బబితా కుమారి నిరాశపరిచింది. ప్రిక్వార్టర్ పైనల్స్ లో భాగంగా గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో గ్రీస్ రెజ్లర్ మరియా ప్రివోలరాకీ చేతిలో 5-1 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత మరియా 3-0తో ఆధిక్యంలో ఉండగా ఆట ముగిసేసరికి మరో రెండు పాయింట్లు సాధించింది. మరోవైపు బబితా కేవలం ఒకే పాయింట్ సాధించడంతో ఓటమి ఖరారైంది. అయితే గ్రీస్ రెజ్లర్ మరియా ఫైనల్లో ప్రవేశిస్తే బబితాకు సాక్షి మాలిక్ కు లభించినట్లుగా మరో అవకాశం దక్కుతుంది.