
భారత మహిళా రెజ్లర్ నవ్‌జ్యోత్ కౌర్
భారత మహిళా రెజ్లర్ నవ్‌జ్యోత్ కౌర్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కేవలం అడుగు దూరంలో నిలిచింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నవ్‌జ్యోత్ కౌర్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఘనత సాధించిన నవ్‌జ్యోత్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కూడా రెండో స్థానంలో ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment