navjot kaur
-
టీమిండియాను వదలని మహమ్మారి.. తాజాగా మరొకరికి పాజిటివ్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందాన్ని కరోనా మహమ్మారి వీడటం లేదు. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు ప్లేయర్లు (సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్) మహమ్మారి బారిన పడగా.. తాజాగా మహిళా హాకీ జట్టు మిడ్ ఫీల్డర్ నవ్‌జోత్ కౌర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నవ్‌జోత్‌కు ఇవాళ (జులై 30) ఉదయం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఐసోలేషన్‌కు తరలించారు. ఆమెకు మరో రెండు రోజుల్లో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని భారత బృందానికి సంబంధించిన అధికారి తెలిపారు. ఒకవేళ అప్పటికీ ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రాకపోతే కామన్వెల్త్ విలేజ్ నుంచి స్వదేశానికి పయనం కావాల్సి ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడా గ్రామంలో రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూడటం పరిపాటిగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో భాగంగా ఘనాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 5-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం -
నిరాపరాధిగా బయటపడ్డ సిద్ధూ భార్య
నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్.. అమృత్సర్ రైలు దుర్ఘటన కేసు నుంచి నిరపరాధిగా బయపడ్డారు. దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 19న అమృత్సర్ సమీపంలోని రైల్వేట్రాక్ మీద గుంపుగా నిలబడి రావణకాష్టాన్ని తిలకిస్తున్న వారి మీదుగా లోకల్ ట్రైన్ దూసుకెళ్లడంతో 60 మంది మరణించారు. ఆ ఘటనలో.. రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు అమృత్సర్ అసెంబ్లీ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్‌తో పాటు, ఇతర నాయకుల పైన కేసులు నమోదయ్యాయి. నిర్వాహకుల అలక్ష్యం తప్ప, ఇందులో కౌర్ బాధ్యతారాహిత్యం ఏమీ లేదని తాజా నివేదిక తేల్చింది. కౌర్ భర్త సిద్ధూ కాంగ్రెస్ పాలనలోని పంజాబ్‌లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎం.పి. సావిత్రీబాయి ఫూలె పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక ధోరణికి, విభజన రాజకీయాలకు విసిగి వేసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఎంపీగా మాత్రం పదవీకాలం పూర్తయ్యే వరకు ఆమె కొనసాగుతారు. ఫూలే బి.ఎస్.బి. సెక్టార్ కోఆర్డినేటర్‌గా 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో బి.జె.పి.లో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బల్హా ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బారైచ్ ఎంపీగా విజయం సాధించారు. రెండు రోజుల క్రితం డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహాలకు, ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక వనరుల్ని దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళితున్న సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సావిత్రీబాయి ఫూలే విమర్శించారు. అంటార్కిటిక్ సముద్రంలో చెలరేగిన తుఫాను వల్ల దారి తప్పిన ఒంటరి బ్రిటిష్ నావికురాలు ఒకరిని చిలీ అధికారులు రక్షించారు. సూసీ గుడ్‌ఆల్ అనే ఆ సాహస యాత్రికురాలిని కేప్ హార్న్‌కు 2000 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించి సురక్షితంగా, భద్రంగా దక్షిణమెరికా ఒడ్డుకు చేర్చారు. అప్పటికి రెండు రోజులుగా ఆ కల్లోల సముద్రంలో ధైర్యంగా నిలదొక్కుకుని ప్రపంచంతో ఆమె కమ్యూనికేషన్ ఏర్పచుకోగలిగారు. -
నంబర్‌వన్ ర్యాంక్‌కు అడుగు దూరంలో...
భారత మహిళా రెజ్లర్ నవ్‌జ్యోత్ కౌర్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కేవలం అడుగు దూరంలో నిలిచింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నవ్‌జ్యోత్ కౌర్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఘనత సాధించిన నవ్‌జ్యోత్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కూడా రెండో స్థానంలో ఉండటం విశేషం. -
నవజ్యోత్ కౌర్ ‘పసిడి’ పట్టు
బిష్కెక్ (కిర్గిస్తాన్): భారత మహిళా రెజ్లర్ నవజ్యోత్ కౌర్ కొత్త చరిత్ర లిఖించింది. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. శుక్రవారం జరిగిన మహిళల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 28 ఏళ్ల నవజ్యోత్ కౌర్ 9–1తో మియు ఇమాయ్ (జపాన్)పై ఘనవిజయం సాధించింది. ఐదోసారి ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నవజ్యోత్ పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఆమెకు రజతం (2013లో), కాంస్యం (2011లో) లభించాయి. మరోవైపు సాక్షి మలిక్ 62 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి రౌండ్లో సాక్షి చైనా రెజ్లర్ జియోజువాన్ లువో చేతిలో ఓడిపోయింది. లువో ఫైనల్‌కు చేరడంతో సాక్షికి కాంస్య పతకం కోసం నిర్వహించే ‘రెప్‌చేజ్’’ రౌండ్లో పోటీపడే అవకాశం దక్కింది. ‘రెప్‌చేజ్’ తొలి రౌండ్లో 10–0తో జియె చోయ్ (కొరి యా)ను ఓడించిన సాక్షి... కాంస్య పతక పోరులో 10–7తో కసిమోవా (కజకిస్తాన్)పై గెలిచింది. -
‘ఆమె నా అర్థాంగి.. నాలో సగభాగం’
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ మీడియాపై గుర్రుమన్నారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆయన భార్య కనిపించడాన్ని ప్రశ్నించిన మీడియాపై ఆయన రుసరుసలాడారు. ‘ఆమె నా అర్థాంగి. నాలో సగభాగం’ అంటూ ప్రశ్న అడిగిన వెంటనే కాస్తంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. శిరోమణి అకాళీదల్-బీజేపీ ప్రభుత్వ హయాంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఈసారి ఆమె భర్త పోటీ చేసిన తూర్పు అమృతసర్ సీటు నుంచి పోటీ చేయకుండా తప్పుకున్నారు. దీంతో అక్కడి నుంచి సిద్ధూ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై విజయం సాధించారు. అయితే, సిద్ధూ విజయం సాధించినప్పటి నుంచి పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుండగా భార్య కౌర్ కూడా ఆయనతో ఉంటున్నారు. దీనిపై మీడియా సిద్ధూను ప్రశ్నించింది. ‘ఆమె మంత్రి కారు, ఒక ఎమ్మెల్యే కూడా కారు. అయినా మీరు పాల్గొనే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు కనిపిస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. దీంతో కాస్తంత అసహనానికి లోనైనా సిద్ధై వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె నాలో సగం అని సమాధానం ఇచ్చారు. మరోపక్క, మూడుసార్లు ఎంపీ అయిన తన భర్తకంటే ఆమెకే ఎక్కువగా రాజకీయ అనుభవం ఉందని అన్నారు. అంతకుముందు టీవీ షోల్లో పాల్గొనే అంశంపై మీడియా రచ్చచేసిందని కూడా సిద్ధూ మండిపడిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌లోకి సిద్ధూ భార్య
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆవాజ్–ఎ–పంజాబ్ నేత పర్గత్ సింగ్ కూడా తమ పార్టీలో చేరతారని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ తెలిపారు. సిద్ధూ కూడా వీరి బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్–ఎ–పంజాబ్ పార్టీని స్థాపించడం తెలిసిందే. కౌర్ కూడా భర్త బాటలోనే నడిచారు. ఇటీవలే బీజేపీకి ఆమె రాజీనామా చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సొంతంగా పోటీ బరిలోకి దిగాలని మొదట సిద్ధూ భావించారు. అయితే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదన్న ఆలోచనతో ఆయన వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తరపున ఆయన ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. -
కపిల్ షో నుంచి సిద్ధూ ఎందుకు తప్పుకున్నాడు?
ముంబై: కపిల్ శర్మ కామెడీ నైట్ షో అభిమానులకు నిరాశ కలిగించే వార్త. కామెడీ ‘గురు' నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నాడు. అక్టోబర్ నుంచి ఈ షోలో అతడు కనిపించడు. ఈ విషయాన్ని సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ ధ్రువీకరించారు. పంజాబ్ రాజకీయాలపై ఆయన దృష్టిసారించాలనుకుంటున్నారని వెల్లడించారు. అక్టోబర్ 1న అమృతసర్ చేరుకుని తన సొంత పార్టీ ఆవాజ్-ఏ-పంజాబ్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు. ‘పంజాబ్ రాజకీయాలపై పూర్తి సమయం వెచ్చించాలన్న ఉద్దేశంతో కపిల్ శర్మ కామెడీ షో నుంచి సిద్ధూ తప్పుకుంటున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఎపిసోడ్ల షూటింగ్ పూర్తి చేశారు. తనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నంటున్న వారందరికీ సిద్ధూ వీడ్కోలు చెప్పేశార’ని నవ్యజోత్ కౌర్ తెలిపారు. పార్టీకి పూర్తి సమయం వెచ్చించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న సిద్ధూకు అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.