‘ఆమె నా అర్థాంగి.. నాలో సగభాగం’ | She is my Better Half: Sidhu | Sakshi
Sakshi News home page

‘ఆమె నా అర్థాంగి.. నాలో సగభాగం’

Published Wed, Mar 22 2017 3:23 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

‘ఆమె నా అర్థాంగి.. నాలో సగభాగం’

‘ఆమె నా అర్థాంగి.. నాలో సగభాగం’

చండీగఢ్‌: కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ క్రికెటర్‌ మీడియాపై గుర్రుమన్నారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆయన భార్య కనిపించడాన్ని ప్రశ్నించిన మీడియాపై ఆయన రుసరుసలాడారు. ‘ఆమె నా అర్థాంగి. నాలో సగభాగం’ అంటూ ప్రశ్న అడిగిన వెంటనే కాస్తంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. శిరోమణి అకాళీదల్‌-బీజేపీ ప్రభుత్వ హయాంలో సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఈసారి ఆమె భర్త పోటీ చేసిన తూర్పు అమృతసర్‌ సీటు నుంచి పోటీ చేయకుండా  తప్పుకున్నారు.

దీంతో అక్కడి నుంచి సిద్ధూ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై విజయం సాధించారు. అయితే, సిద్ధూ విజయం సాధించినప్పటి నుంచి పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుండగా భార్య కౌర్‌ కూడా ఆయనతో ఉంటున్నారు. దీనిపై మీడియా సిద్ధూను ప్రశ్నించింది. ‘ఆమె మంత్రి కారు, ఒక ఎమ్మెల్యే కూడా కారు. అయినా మీరు పాల్గొనే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు కనిపిస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు.

దీంతో కాస్తంత అసహనానికి లోనైనా సిద్ధై వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె నాలో సగం అని సమాధానం ఇచ్చారు. మరోపక్క, మూడుసార్లు ఎంపీ అయిన తన భర్తకంటే ఆమెకే ఎక్కువగా రాజకీయ అనుభవం ఉందని అన్నారు. అంతకుముందు టీవీ షోల్లో పాల్గొనే అంశంపై మీడియా రచ్చచేసిందని కూడా సిద్ధూ మండిపడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement