official meetings
-
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అత్యుత్సాహం
సాక్షి,అనంతపురం: టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల సమావేశంలో పుత్రోత్సాహం చూపించారు. కలెక్టరేట్లో అభివృద్ధి, సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ కుమారుడు వీక్షిత్ హాజరయ్యారు. వీక్షిత్కు ఏ పదవీ లేకపోయినా అధికారులు పెద్దపీట వేశారు. సమావేశంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వీక్షిత్ హాజరవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బావ అధికారిక సమావేశంలో బావమరిది హాజరు...వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం
పాట్న: మరోసారి వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. బిహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ అధికారిక సమావేశంలో లాలు ప్రసాద్ అల్లుడు హాజరవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలో మంత్రి తేజ్ ప్రతాప్ సంబంధించిన శాఖపరమైన సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆర్జేడీ పై అధికార పార్టీ బీజేపీ విమర్శల దాడి చేసింది. వాస్తవానికి తేజ్ ప్రతాప్ ఆగస్టు 16న మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజున ఆయనకు కేటాయించిన పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల శాఖ బాధ్యతలు చేపట్టారు. ఐతే ఆగస్టు 17న అరణ్య భవన్లో అటవీ వాతావరణ మార్పుల శాఖ సమీక్ష సమావేశానికి తేజ్ ప్రతాప్ అధ్యక్షత వహించారు. అప్పుడు జరిగిన అధికారుల సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు శైలేష్ కుమార్ కూడా వచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 18న బిహార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో కూడా తేజ్ ప్రతాప్ మరోసారి సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కూడా శైలేష్ రావడమే కాకుండా ఆయనతోపాటు కలిసి కూర్చోవడంతో పెద్ద దూమారం రేగింది. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టింది. "తేజ్ ప్రతాప్‌ని ఎవ్వరూ తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మంత్రులందరిలోనూ ఆర్జేడీ కోటా కుమారుడు శైలేష్ యాదవ్ అత్యంత తెలివైనవాడు అతని ఆశీస్సులు తేజ్ ప్రతాప్‌కు ఉంటే ఉత్తమ మంత్రిగా ఎదుగుతాడు." అని ఎద్దేవా చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి శైలేష్‌ని ఉద్దేశించి విమర్శిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు!) -
‘ఆమె నా అర్థాంగి.. నాలో సగభాగం’
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ మీడియాపై గుర్రుమన్నారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆయన భార్య కనిపించడాన్ని ప్రశ్నించిన మీడియాపై ఆయన రుసరుసలాడారు. ‘ఆమె నా అర్థాంగి. నాలో సగభాగం’ అంటూ ప్రశ్న అడిగిన వెంటనే కాస్తంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. శిరోమణి అకాళీదల్-బీజేపీ ప్రభుత్వ హయాంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఈసారి ఆమె భర్త పోటీ చేసిన తూర్పు అమృతసర్ సీటు నుంచి పోటీ చేయకుండా తప్పుకున్నారు. దీంతో అక్కడి నుంచి సిద్ధూ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై విజయం సాధించారు. అయితే, సిద్ధూ విజయం సాధించినప్పటి నుంచి పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుండగా భార్య కౌర్ కూడా ఆయనతో ఉంటున్నారు. దీనిపై మీడియా సిద్ధూను ప్రశ్నించింది. ‘ఆమె మంత్రి కారు, ఒక ఎమ్మెల్యే కూడా కారు. అయినా మీరు పాల్గొనే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు కనిపిస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. దీంతో కాస్తంత అసహనానికి లోనైనా సిద్ధై వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె నాలో సగం అని సమాధానం ఇచ్చారు. మరోపక్క, మూడుసార్లు ఎంపీ అయిన తన భర్తకంటే ఆమెకే ఎక్కువగా రాజకీయ అనుభవం ఉందని అన్నారు. అంతకుముందు టీవీ షోల్లో పాల్గొనే అంశంపై మీడియా రచ్చచేసిందని కూడా సిద్ధూ మండిపడిన విషయం తెలిసిందే.