![Lalu Prasads Son In Law Attend Tej Pratap Official Meatting Controversy - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/19/Yadav.jpg.webp?itok=rqO6NQHm)
పాట్న: మరోసారి వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. బిహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ అధికారిక సమావేశంలో లాలు ప్రసాద్ అల్లుడు హాజరవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలో మంత్రి తేజ్ ప్రతాప్ సంబంధించిన శాఖపరమైన సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆర్జేడీ పై అధికార పార్టీ బీజేపీ విమర్శల దాడి చేసింది.
వాస్తవానికి తేజ్ ప్రతాప్ ఆగస్టు 16న మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజున ఆయనకు కేటాయించిన పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల శాఖ బాధ్యతలు చేపట్టారు. ఐతే ఆగస్టు 17న అరణ్య భవన్‌లో అటవీ వాతావరణ మార్పుల శాఖ సమీక్ష సమావేశానికి తేజ్ ప్రతాప్ అధ్యక్షత వహించారు. అప్పుడు జరిగిన అధికారుల సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు శైలేష్ కుమార్ కూడా వచ్చారు.
ఆ తర్వాత ఆగస్టు 18న బిహార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో కూడా తేజ్ ప్రతాప్ మరోసారి సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కూడా శైలేష్ రావడమే కాకుండా ఆయనతోపాటు కలిసి కూర్చోవడంతో పెద్ద దూమారం రేగింది. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టింది. "తేజ్ ప్రతాప్‌ని ఎవ్వరూ తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మంత్రులందరిలోనూ ఆర్జేడీ కోటా కుమారుడు శైలేష్ యాదవ్ అత్యంత తెలివైనవాడు అతని ఆశీస్సులు తేజ్ ప్రతాప్‌కు ఉంటే ఉత్తమ మంత్రిగా ఎదుగుతాడు." అని ఎద్దేవా చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి శైలేష్‌ని ఉద్దేశించి విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు!)
Comments
Please login to add a commentAdd a comment