Lalu Prasad Yadav
-
కుంభమేళాపై లాలూ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహాకుంభమేళాకు అసలేమైనా అర్థం..పర్థం ఉందా..?అది ఓ అర్థం లేని వ్యవహారం’ అని లాలూ అన్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం చెందడం దురదృష్టకరమని వ్యాఖ్యానించే సందర్భంలో లాలూ మహా కుంభమేళాపై ఈ వ్యాఖ్యలు చేశారు.రైల్వేశాఖ విఫలమవడం వల్లే న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగిందన్నారు. రైల్వే మంత్రి దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందేనన్నారు.అయితే మహాకుంభమేళాపై లాలూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు హిందువులపై ఆర్జేడీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని బీహార్ బీజేపీ చీఫ్ మనోజ్శర్మ అన్నారు. బిహార్ ఎన్నికలు వస్తున్న వేళ ఓ వర్గం వారిని బుజ్జగించేందుకే లాలూ మహాకుంభమేళాను టార్గెట్ చేశారని శర్మ మండిపడ్డారు. -
సీఎం నితీష్, మాజీ సీఎం లాలుపై అసభ్య పాటలు... గాయకుడు అరెస్ట్
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌లను అసభ్యకరంగా వర్ణిస్తూ పాటలు పాడిన భోజ్‌పురి గాయకుడు సూరజ్ సింగ్‌ను నవాడ పోలీసులు అరెస్టు చేశారు.నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌లపై సూరజ్ సింగ్ అభ్యంతరకరమైన రీతిలో పాటలు పాడిన విషయమై సీనియర్ అధికారులకు ఫిర్యాదు అందిన దరిమిలా వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. భోజ్‌పురి పాటలు బీహార్‌లో ఎంతో ఆదరణ పొందుతుంటాయి. అయితే ఈ పాటలు అశ్లీలంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాగా భోజ్‌పురి సింగర్ సూరజ్ సింగ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌లపై అభ్యంతరకరంగా పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోను పోలీసులు గుర్తించారు. ప్రముఖ నేతలను అవమానించిన ఆ గాయకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటపై జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కేసు గురించి సైబర్ డీఎస్పీ ప్రియా జ్యోతి మాట్లాడుతూ ఈ కేసులో సూరజ్ సింగ్ అనే గాయకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
‘అమిత్‌షాకు మతి భ్రమించింది’
పాట్నా : ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మతి భ్రమించింది. వెంటనే ఆయన రాకీయాల నుంచి తప్పుకోవాలని’ అని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ప్యాషనైందంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ‘అమిత్ షాకు మతి భ్రమించింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అమిత్‌షా రగిలిపోతున్నారు. ఆయన తీరును ఖండిస్తున్నా. అంబేద్కర్ గొప్పవారు. అమిత్‌షా రాజకీయాలను వదిలేయాలి' అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.पगला गया है अमित शाह !इस्तीफा देकर जल्द दे जल्द भाग जाए केंद्रीय गृह मंत्री !संविधान रक्षक - लालू प्रसाद यादव@laluprasadrjd 🔥🔥#तड़ीपार_माफ़ी_मांग pic.twitter.com/uOaBHFBtSw— सरपंच साहेब (@sarpanchsaheb3) December 19, 2024అంతకుముందు,బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడారు. అమిత్ షా,బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆరోపించారు. అంబేద్కర్ మా ఫ్యాషన్. మా ప్రేరణ. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఎవరు అవమానించినా మేం అంగీకరించం. అలాంటి వ్యక్తులు ద్వేషాల్ని రగిల్చే వారు. రాజ్యాంగ వ్యతిరేకులు,పార్లమెంటులో ఉపయోగించిన భాష ఆమోదించదగిన అంశం కాదు. రాజ్యంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేద్కర్ ప్రస్తావన తెచ్చారు. అంబేద్కర్, అంబేద్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలను డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ వెలుపల నిరసన చేపట్టాయి. ఆ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార, విపక్ష ఎంపీల మధ్య జరిగిన తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. -
Bihar:మరో ‘కుటుంబ ఆధిపత్యం’.. ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు
గయ: బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. బీహార్‌లోని నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక స్థానమైన గయ ఇప్పుడు జితన్ రామ్ మాంఝీ కుటుంబానికి దక్కింది.గయా జిల్లాలోని ఇమామ్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి గతంలో జితన్ రామ్ మాంఝీ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఎంపీ అయిన తర్వాత ఈ స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ఆయన కోడలు, బీహార్ ప్రభుత్వ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ భార్య దీపా మాంఝీ విజయం సాధించారు. ఫలితంగా బీహార్ రాజకీయాల్లో జితన్ రామ్ మాంఝీ కుటుంబ పరపతి పెరిగింది. ఇప్పుడు ఆయన కుటుంబంలో ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.జితన్ రామ్ మాంఝీ కేంద్ర మంత్రిగా, ఆయన కుమారుడు సంతోష్ కుమార్ బీహార్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్నారు. ఇదే కుటుంబానికి చెందిన జ్యోతి మాంఝీ బారాచట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు దీపా మాంఝీ ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా అయ్యారు. జితన్‌రామ్ మాంఝీ 1980లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఘోర పరాజయం పాలవడంతో, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిగా నియమించారు. ఏడాది తరువాత అతను కూడా రాజీనామా చేశారు.అనంతరం జితన్ రామ్ మాంఝీ 2015లో హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీని స్థాపించి ఎన్డిఎలో చేరి ఇమామ్‌గంజ్ నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. 2015 నుండి మే 2024 వరకు ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జూన్ 2024లో మొదటిసారిగా ఎంపీ అయ్యారు. గయ నుంచి ఎంపీ అయిన తర్వాత మోదీ కేబినెట్లో కూడా చోటు దక్కించుకుని ఎంఎస్ఎంఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: వామదేవుడి వృత్తాంతం -
జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలకాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను జూన్‌లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. -
ల్యాండ్ ఫర్ జాబ్ : లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురు దెబ్బ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూపై సీబీఐ మరో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో లాలూతో పాటు మరో 71 మందిని చేర్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే ఆ ఛార్జ్ షీట్లపై విచారణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి జులై 6న తేల్చనున్నారు.గత మే 29న ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సీబీఐని నిలదీశారు. ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రతి తేదీకి మరింత సమయం కావాలని సీబీఐ కోరడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 7లోగా తుది నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజాగా కోర్టు ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది.ఉద్యోగాలే లేవు.. అయినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వేమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జోనల్ రైల్వేలలో ఉద్యోగాలపై అధికారిక నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ పాట్నా, ముంబై, జబల్పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో లాలూ ప్రసాద్ యాదవ్ నియమించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, సహచరుల పేరుతో భూములను తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటే?ఒక వ్యక్తికు సంబంధించిన ఏదైనా కేసును దర్యాప్తు సంస్థలు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం.. సదరు వ్యక్తి నేరం చేశారని నిర్ధారిస్తూ అభియోగాలు మోపుతూ కోర్టు దాఖలు చేసే దానిని కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటారు. -
లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. బీహార్‌లో మరో వారసత్వ పోరుకు తెరలేచింది. బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన.. లాలూ ప్రసాద్ యాదవ్.. ఇప్పుడు తన కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపారు. వారే మిసా భారతి.. రోహిణి ఆచార్య. అసలు మిసా అంటే ఏమిటి..? రోహిణికి లాలూ ఆ పేరు ఎందుకు పెట్టారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వీరి పేర్ల వెనుక ఉన్న అర్థం ఏంటి..? అసలు లాలు యాదవ్ ఆ పేరు పెట్టడం వెనుక ఏమైనా స్టోరీ ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేసేస్తున్నారు.మిసా భారతి1976 దేశంలో ఎమర్జెన్సీ విధించిన నాటి రోజులు. అప్పటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడే ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే.. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని 'మిసా' అని పిలుస్తారు. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తన మొదటి కుమార్తెకు లాలూ ప్రసాద్ యాదవ్ 'మిసా భారతి' అని పేరు పెట్టారురోహణి ఆచార్యఇక.. తన రెండో కూతురు రోహణి ఆచార్యకు ఒక వైద్యురాలి పేరు వచ్చేలా పెట్టారు లాలూ ప్రసాద్ యాదవ్. 1979లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి మరోసారి తల్లి అయ్యారు. అయితే.. ఆమెకు డెలివరీకి ముందు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రబ్రీదేవీకి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలిసి భయపడిన లాలూ యాదవ్‌కు డాక్టర్ కమలా ఆచార్య ధైర్యం చెప్పారు. ఆ తరువాత రబ్దీదేవికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.ఆపరేషన్ పూర్తయిన తరువాత.. ఆపరేషన్‌కు అయిన ఖర్చును కూడా లాలూ యాదవ్ నుంచి తీసుకునేందుకు డాక్టర్ కమలా ఆచార్య ఒప్పుకోలేదు. అంతే కాకుండా రెండో కుమార్తె పుట్టిన నక్షత్రం రోహిణి కావడంతో.. డాక్టర్ పేరు, రోహిణి నక్షత్రం వచ్చేలా 'రోహిణి ఆచార్య' అని పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మిసా భారతి పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తుండగా.. రోహిణి ఆచార్య బీహార్‌లోని సారణ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్‌పై పోటీ చేస్తున్నారు.2013లో వరకు లాలూ ప్రసాద్ యాదవ్ సారణ్ సేట్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి తన చిన్న కూతురు రోహిణి ఆచార్యను బరిలోకి దించారు. ఇక్కడ మే 20న పోలింగ్ జరగనుండగా.. పాటలీపుత్రలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. పాటలిపుత్ర నుంచి పోటీ చేస్తున్న మిసా భారతి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే.. లాలూ కూతుళ్లు ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి. -
అరెస్ట్ వారెంట్ జారీ, త్వరలో జైలుకి మాజీ సీఎం ‘లాలూ’?
పాట్నా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన మరోసారి జైలు శిక్షను అనుభవించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్వాలియర్‌లోని కోర్టులో కొనసాగుతున్న అక్రమ ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసు నిందితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయుధ చట్టం కింద 30 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి గ్వాలియర్ ప్రత్యేక కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నారు. 30 ఏళ్ల నాటి కేసు 1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. నిందితుల్లో లాలూ ఒకరు మొత్తం 22 మంది నిందితుల్లో 14 మంది పరారీలో ఉండగా, ఆరుగురు విచారణలో ఉండగా, ఇద్దరు చనిపోయారు. ఈ కేసులో అభియోగాలు మోపబడి పరారీలో ఉన్న 14 మందిలో ఒకరే లాలూ ప్రసాద్ యాదవ్. తాజాగా, గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అక్రమ ఆయుధాల కేసుపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
పట్టు వదలని పప్పూ యాదవ్.. లాలూకు రిక్వెస్ట్!
పాట్నా: కాంగ్రెస్‌లో తన జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్.. పూర్నియా లోక్‌సభ సీటుపై పట్టు వదిలేలా కనిపించడం లేదు. నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్న ఆయన వైఖరి బిహార్‌లో మహాకూటమిపై ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ ) , కాంగ్రెస్, వామపక్షాలతో సహా బిహార్‌లో విపక్షాల కూటమి మహాఘట్బంధన్ ఏర్పడింది. ఈ కూటమి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పూర్నియాతో సహా రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో 26 స్థానాలను తమ అతిపెద్ద మిత్రపక్షమైన ఆర్జేడీకి కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, సీపీఐ (ఎంఎల్) 3 స్థానాల్లో, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన పప్పు యాదవ్ తాజగా ఏప్రిల్ 4న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. పూర్ణియాకు సంబంధించి తన నిర్ణయాన్ని పునరాలోచించి ఆ సీటును కాంగ్రెస్‌కు ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ను పప్పు యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్‌లో పేర్కొన్నారు. -
ఆ మాజీ సీఎం చెప్పారనే.. 60 ఏళ్ల వయసులో పెళ్లి!
‘‘లాలూజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. ఆ భార్యాభర్తలు మనస్పూర్తిగా ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు.. అది చాలూ..’’ అంటూ సంతోషంగా మీడియా ముందు మాట్లాడారు 60 ఏళ్ల అశోక్ మహతో. ఈ వయసులో పెళ్లా.. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి దిగ్గజ నేత ఆశీర్వాదం ఎందుకు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అందుకేనట! నవాదా జిల్లాకు చెందిన అశోక్ మహతో.. మాజీ గ్యాంగ్‌స్టర్. సంచలన కేసుల్లో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరాడు. అందుకోసం ముంగేర్ స్థానం ఎంచుకున్నాడు. ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, జేడీయూ నేత లాలన్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఎలాగూ.. ఆర్జేడీ మద్దతు ఉంది. టికెట్ దక్కే అవకాశం లేకపోలేదు. కానీ.. అన్నేళ్లు జైలు శిక్ష అనుభవించి రావడం, కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో చట్టపరంగా సాధ్యం కావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ఇక్కడే లాలూ తన మార్క్ రాజకీయం చూపించారు. ‘వివాహం చేసుకుని నీ భార్యను పోటీ చేయించు’ అని లాలూ సలహా ఇచ్చారు. అంతే.. ఢిల్లీకి చెందిన కుమారి అనిత(46) అనే మహిళను మంగళవారం రాత్రి పాట్నా శివారులో ఉన్న ఓ గుడిలో కుటుంబ సభ్యులు, తన మద్దతుదారుల మధ్య పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆ నవవధువు, వరుడు లాలూ ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం జంట లాలూ-రబ్రీదేవీల ఆశీర్వాదం తీసుకున్నారు. బయటకు వచ్చిన ఆయన వాహనాన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. ఆర్జేడీ టికెట్ ఇస్తుందా? లాలూ హామీ ఇచ్చారా? మీ భార్యను ఎన్నికల బరిలో దింపబోతున్నారా?.. హడావిడిగా వివాహం చేసుకోవడానికి కారణాలేంటి?.. ఇలా ప్రశ్నలతో ఆ పెళ్లి కొడుకును ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే అశోక్ మాత్రం తెలివిగా ‘ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తాం’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ब्याह रचाने के बाद नई नवेली दुल्हन के साथ लालू का आशीर्वाद लेने पहुंचे कुख्यात अशोक महतो, टिकट के लिए 62 की उम्र में खरमास में रचाई है शादी#ASHOKMAHTO #BiharPolitics #Bihar #BiharNews pic.twitter.com/VqrEn1zeSb — FirstBiharJharkhand (@firstbiharnews) March 20, 2024 VIDEO Credits: FirstBiharJharkhand షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతోపాటు నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా అశోక్ మహతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ఇక.. 1997లో దాణా కుంభకోణంలో లాలూ రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు తన భార్య రబ్రీదేవిని బీహార్‌కు ముఖ్యమంత్రిని చేసింది తెలిసిందే. -
లాలూతో పప్పు యాదవ్ భేటీ.. మాధేపురా సీటుకు వినతి!
బీహార్‌కు చెందిన మాజీ ఎంపీ పప్పు యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లను కలుసుకున్నారు. ఆయన రాష్ట్రీయ జనతాదళ్ టిక్కెట్‌పై మాధేపురా నుండి పోటీచేయాలనే అభిలాషను వారి ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. పప్పు యాదవ్ 2014లో ఆర్జేడీ టిక్కెట్‌పై మాధేపురా నుంచి గెలుపొందారు. అందుకే ఈసారి కూడా పప్పు యాదవ్‌ను ఆర్జేడీ మాధేపురా అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయి. కాగా సింగపూర్‌లో ఉంటున్న లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యకు సారణ్ సీటు ఇచ్చే విషయమై పార్టీ పరిశీలిస్తోందని వినికిడి. లాలూ గతంలో సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్‌ల ‘మహాకూటమి’ సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌తో పొత్తు పెట్టుకుని ఎన్డీఏకు గట్టి సవాల్ విసిరింది. అయితే రెండు నెలల క్రితం నితీష్ కుమార్ హఠాత్తుగా ఎన్డీఏలోకి రావడంతో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరగనున్నాయి. -
తండ్రికి కిడ్నీదానం.. రాజకీయాల్లోకి మాజీ సీఎం కూతురు?
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె 'రోహిణి ఆచార్య' రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని సరన్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. యాదవ్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరుగాంచిన బీహార్ శాసన మండలి సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత శ్రీమతి ఆచార్య రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని చెబుతున్నారు. డాక్టర్ రోహిణి ఆచార్య తన తండ్రి పట్ల చూపించే ప్రేమ, భక్తి, అంకితభావానికి దాదాపు అందరికి తెలుసు. సరన్ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలు అందరూ ఆమెను సరన్‌కు పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల ప్రారంభంలో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఆర్జేడీ ర్యాలీలో ఆచార్య కూడా పాల్గొన్నారు. సరన్ లోక్‌సభ స్థానం ప్రస్తుతం బీజేపీకి చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఉంది. దీనికి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. రోహిణి ఆచార్య ఎవరు? రోహిణి ఆచార్య వృత్తి రీత్యా ఎంబీబీఎస్ డాక్టర్. ఈమె 2002లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సమేష్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఇతడు లాలూ యాదవ్ స్నేహితుడైన.. రాయ్ రణవిజయ్ సింగ్ కుమారుడు. గత రెండు దశాబ్దాలుగా, శ్రీమతి ఆచార్య, ఆమె భర్త విదేశాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీమతి ఆచార్య.. 2022లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి కిడ్నీ దానం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఆచార్య చేసిన పనికి ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశంసించాయి. అంతకుముందు 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహించారు. కానీ అది జరగలేదు. -
Bihar: ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
పాట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్య అనుచరుడు, ఇసుక మైనింగ్ వ్యాపారి సుభాష్‌యాదవ్‌ను ఈడీ శనివారం(మార్చ్ 9) రాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో శనివారం తెల్లవారుజాము నుంచే సుభాష్‌యాదవ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాలు ముగిసిన తర్వాత సుభాష్‌యాదవ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో రూ.2.30కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇసుక అక్రమ మైనింగ్, అమ్మకాల ద్వారా రూ.161 కోట్లు ఆర్జించినట్లు సుభాష్‌యాదవ్‌కు చెందిన కంపెనీపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అరెస్టు చేసింది. కాగా, 2019లోక్‌సభ ఎన్నికల్లో సుభాష్ యాదవ్ ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో మార్చి 3న జరిగిన మహాబంధన్ జనవిశ్వాస్ మహా ర్యాలీలో సుభాష్ యాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చరచర్చనీయాంశమయ్యాయి. ఇదీ చదవండి.. యూపీలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బిహార్‌లో ఈడీ దాడుల కలకలం
పాట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల కలకలం రేగింది. మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ సన్నిహితుడు, ఇసుక మైనింగ్ కింగ్ సుభాష్‌యాయాదవ్ ఇళ్లు, ఆఫీసులపై శనివారం ఉదయం ఈడీ సోదాలు ప్రారంభించింది. రాజధాని పాట్నా శివార్లతో పాటు దానాపూర్‌లోని పన్నెండు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో సుభాష్ యాదవ్ ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో ఈ మార్చి 3న జరిగిన మహాబంధన్ జనవిశ్వాస మహా ర్యాలీలో సుభాష్ యాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చర్చనీయాంశమయ్యాయి. ఇదీ చదవండి.. నేడు బీజేపీలోకి కాంగ్రెస్ దిగ్గజ నేత -
లాలూ కుటుంబంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. లాలూ, ఆయన కుటుంబాన్ని "బిహార్‌లో అతిపెద్ద నేరస్థులు"గా అభివర్ణించారు. దశాబ్దానికి పైగా పాలనలో రాష్ట్రంలో జంగిల్ రాజ్‌కు నాంది పలికారని ఆరోపించారు. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి దుష్పరిపాలన కారణంగా బీహార్ యువకులు పెద్ద సంఖ్యలో వలస వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రారంభించిందన్నారు. కుటుంబ రాజకీయాలపై విమర్శలకు బదులుగా తనకు కుటుంబం లేదంటూ లాలూ ప్రసాద్ చేసిన వాఖ్యలపై ప్రధాని స్పందిస్తూ.. "జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, బాబాసాహెబ్ అంబేద్కర్, కర్పూరీ ఠాకూర్ వంటి వ్యక్తులు జీవించి ఉంటే కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించనందుకు వారిపైనా విమర్శలు చేసేవారన్నారు. "నాపై వారు చేసే ప్రధాన విమర్శ ఏంటంటే నాకు కుటుంబం లేదు. దేశం మొత్తం నా కుటుంబమే. నేడు దేశమంతా తమను తాము మోదీ కుటుంబంగానే చూస్తోంది" అని ప్రధాని మోదీ అన్నారు. లాలూకు వ్యాఖ్యలకు నిరసనగా, మోదీకి సంఘీభావంగా బీజేపీ నాయకులు, మద్దతుదారులు తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లకు "మోదీ కా పరివార్" అంటూ ట్యాగ్లు జోడించుకున్నారు. ఇక డీఎంకే నాయకుడు ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలను మోదీ ప్రస్తావిస్తూ, "పశ్చిమ చంపారన్ వాల్మీకి మహర్షి భూమి. అక్కడ సీతాదేవి ఆశ్రయం పొందింది. లవకుశులకు జన్మనిచ్చింది. రాముడిని అవమానిస్తున్న ఇండియా కూటమి నాయకుల తీరును ఇక్కడి ప్రజలు క్షమించరు. మన సంస్కృతి, సంప్రదాయాలపై ఇలాంటి దాడులను ఎవరు ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు" అన్నారు. -
నీకు కుటుంబం ఫస్ట్.. నాకు దేశం ఫస్ట్..లాలూ కు మోడీ స్ట్రాంగ్ కౌంటర్
-
పరివార్.. ప్రధానిపై లాలూ విమర్శలతో రాజకీయ రగడ
న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ నేత లాలూప్రసాద్ విమర్శలు పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. దేశవ్యాప్తంగా మంటలు రాజేశా యి. మోదీకి కుటుంబమూ లేదు, సంతానమూ లేరంటూ ఆదివారం పట్నా జన్సందేశ్ ర్యాలీలో లాలూ ఎద్దేవా చేశారు. ఆయనసలు హిందువే కాదంటూ ఆక్షేపించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన విపక్ష నేతల సమక్షంలో లాలూ చేసిన ఈ వ్యాఖ్యలకు మోదీ సోమవారం గట్టిగా కౌంటరిచ్చారు. దేశం కోసమే జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. భారతదేశం, 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని పునరుద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా వెంటనే అందిపుచ్చుకున్నారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మొదలుకుని రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జి.కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితర కేంద్ర మంత్రులు, నేతలంతా ఈ మేరకు ప్రకటనలు చేశారు. మోదీపై లాలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. విపక్షాలపై పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ప్రధానికి బాసటగా నిలిచారు. అంతేగాక సోషల్ మీడియా అకౌంట్లలో తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అంటూ జోడించుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కూడా ఇదే బాటపట్టి ‘మోదీ కా పరివార్’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చివరికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా తన ఎక్స్ ప్రొఫైల్‌కు ‘మోదీ కా పరివార్’ అని చేర్చుకున్నట్టు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి! విపక్షాలు మరోసారి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి చేజేతులా పదునైన నినాదమే అందించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిల్లర వ్యాఖ్యలు: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు విపక్షాలకు కొత్తేమీ కాదంటూ బీజేపీ ఆగ్రహం వెలిబుచి్చంది. ‘‘17 ఏళ్లుగా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా బాధాకరం’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. విపక్షాల రాజకీయ దురహంకారానికి దేశ ప్రజలు తగిన విధంగా బదులు చెబుతారన్నారు. ‘‘మొత్తం దేశాన్నే తన కుటుంబంగా మార్చుకున్నారు మోదీ. అందుకే ఎంత పని చేసినా ఆయనకు అలుపే రాదు. గత పదేళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు’’ అని చెప్పారు. మోదీకి సంతానం లేదన్న లాలు వ్యాఖ్యలను కూడా సుధాన్షు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘హిందూ మతం గురించి లాలుకేం తెలుసు? అసలు విపక్ష ఇండియా కూటమిలో ఒక్కరు కూడా హిందువు లేదు! సనాతన ధర్మంలో భక్తికే పెద్దపీట తప్ప కుమారునికి కాదు. భారత్‌లో గురుశిష్య సంప్రదాయముంది తప్ప తండ్రీ కొడుకుల సంప్రదాయం లేదు. రామ భక్తుడైన హనుమంతునికే ఊరూరా గుళ్లున్నాయి. రాముని కుమారులు లవకుశులకు ఎక్కడైనా ఆలయముందా?’’ అని ప్రశ్నించారు. ‘‘మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మోదీ లక్ష్యమైతే ఎలాగైనా అధికారం సాధించి 2047 దాకా కూడా దాన్ని తమ కుటుంబాల గుప్పెట్లోనే ఉంచుకోవడం విపక్షాల లక్ష్యం’’ అంటూ దుయ్యబట్టారు. వీలైనంత భారీగా అవినీతికి పాల్పడి, తద్వారా తాము, తమ కుటుంబాలు మాత్రమే తరతరాలకు సరిపడా సంపద పోగేసుకోవాలన్నది విపక్షాల ఉద్దేశమని ఆరోపించారు. నేరగాళ్లే మోదీ పరివారం: కాంగ్రెస్ ఇండియా కూటమి నానాటికీ బలోపేతమవుతుండటం చూసి అధికార బీజేపీలో అక్కసు పెరిగిపోతోందని కాంగ్రెస్ ఆరోపించింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘మోదీ కా పరివార్’ పేరిట కొత్త డ్రామాకు తెర తీసిందని మండిపడింది. ‘‘రైతులను కార్లతో తొక్కించి చంపిన నేరగాడి తండ్రయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్ వంటి బీజేపీ నేతలే నిజమైన మోదీ కుటుంబం. అదే ‘మోదీ కా అస్లీ పరివార్’’ అంటూ ఎద్దేవా చేసింది. ‘‘మణిపూర్ హింసాకాండకు బలైన మహిళలకు మోదీ కుటుంబంలో చోటేది? ఢిల్లీ శివార్లలో నిరసన గళమెత్తుతున్న రైతులను తన కుటుంబంగా చెప్పుకోగలరా? ఉపాధి లేక నిత్యం ఆత్మహత్యల బాట పడుతున్న నిరుద్యోగ యువతను తన కుటుంబమని చెప్పుకోరేం? బీజేపీ సర్కారు కేవలం క్రూరమైన నేరగాళ్లు, మోదీ సన్నిహిత పెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేస్తోంది’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ‘‘రైతుల హత్య, మహిళలపై అత్యాచారాలు... ఇదే నిజమైన మోదీ కుటుంబం’’ అంటూ కాంగ్రెస్ నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్, అజయ్ మిశ్రా తదితరులు తమ సోషల్ హ్యాండిల్స్‌కు ‘మోదీ కా పరివార్’ అని జోడించుకోవడాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సంఘ్ పరివార్ కాస్తా చివరికి మోదీ పరివార్‌గా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. 2019లో ‘మై భీ చౌకీదార్’ సాక్షి, న్యూఢిల్లీ: మోదీపై విపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది తొలిసారి కాదు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీపై ‘మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి)’ అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మత అల్లర్లకు కారకుడనే అర్థంలో ఆమె చేసిన విమర్శలు వివాదానికి దారి తీశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాగా నష్టం చేశాయి. అనంతరం 2018లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ) అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. తాను దేశానికి చౌకీదార్‌లా ఉంటానన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ఎక్కుపెట్టిన ఆ విమర్శలూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నింటికీ తీవ్రంగా చేటు చేశాయి. ఆ వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుని ఘనవిజయం సాధించింది. మోదీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో ‘నరేంద్ర మోదీ చౌకీదార్’ అని చేర్చుకున్నారు. బీజేపీ నేతలు కూడా ‘మై భీ చౌకీదార్’ అని ప్రొఫైల్స్‌లో చేర్చుకున్నారు. ‘‘నువ్వేమీ మరీ అంత పెద్దవాడివి కాదు. మాట్లాడితే కుటుంబ రాజకీయాలంటూ మాపై పదేపదే దాడికి దిగుతున్నావ్! కుటుంబాల గురించి నీకెందుకు? నీకు సంతానం ఎందుకు లేదో చెప్పు. కుటుంబమే లేదు నీకు. అయోధ్యలో రామాలయం కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటావు. కానీ నువ్వసలు హిందువువే కాదు. అమ్మ మరణిస్తే ప్రతి హిందువూ శిరోముండనం చేయించుకుంటాడు. నువ్వు మాత్రం చేయించుకోలేదు. కారణమేంటో చెప్పు! దేశమంతటా విద్వేష వ్యాప్తి చేస్తున్నావ్!’’ – పట్నా ర్యాలీలో మోదీపై లాలూ విమర్శలు ‘‘ఇండియా కూటమిలోని విపక్ష నేతలంతా అవినీతి, వారసత్వ, సంతుస్టీకరణ రాజకీయాల్లో పీకల్లోతున కూరుకుపోయారు. పార్టీ ఏదైనా ఝూట్–లూట్ (అబద్ధాలు, దోపిడీ) అన్నదే వాళ్లందరి నైజం. దీనిపై ప్రశి్నస్తే నాకు కుటుంబమే లేదంటూ ఆక్షేపిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. నా భారతదేశమే నా కుటుంబం. ఒక సేవకునిలా ప్రజా క్షేమానికే నా జీవితాన్ని అంకితం చేశా. దేశసేవ చేయాలనే కలను నిజం చేసుకోవడానికి చిన్న వయసులోనే ఇల్లు వీడా. నా జీవితమంతా తెరిచిన పుస్తకం. ప్రతి భారతీయునికీ ఆ విషయం తెలుసు’’ – ఆదిలాబాద్ సభలో మోదీ -
Modi ka parivaar: ట్రెండింగ్‌లోకి ‘మోదీ పరివార్’
ఆదిలాబాద్/తెలంగాణ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబమే లేదన్న లాలూ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే.. లాలూ వ్యాఖ్యలపై ఇవాళ తెలంగాణ ఆదిలాబాద్ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘నా జీవితం తెరిచిన పుస్తకం.. నా జీవితం దేశం కోసం అంకితం. వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తే నన్ను దూషిస్తున్నారు. దేశ ప్రజలే నా బంధువులు’ అని మోదీ అన్నారు. ఎవరూ లేనివారికి మోదీనే కుటుంబమన్న ప్రధాని మోదీ.. ‘నేనే మోదీ కుటంబం’(మై హూ మోదీ పరివార్) Modi ka parivaar అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో బీజేపీ అగ్రనేతలు సోషల్‌మీడియా ఖాతాల్లో తమ బయో మార్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ‘మోదీ పరివార్’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెటిజన్లు ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ‘ జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మోదీ అసలు హిందువే కాదని.. ఆయన తన తల్లి మరణించిన సమయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం శిరోముండనం తెలిపారు. అలాగే.. ఎక్కువ సంతానం ఉన్నవాళ్లను సైతం మోదీ తరచూ విమర్శిస్తుంటారని లాలూ ఆరోపించారు. -
ఈడీ ఎదుటకు లాలూ
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిషా భారతి, ఆయన కుమార్తె కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. పెద్ద సంఖ్యలో ఆర్జేడీ కార్యకర్తలు కూడా ఈడీ కార్యాలయం వెలుపల గుమిగూడారు. కార్యాలయం బయట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనవరి 19న లాలూ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. పాట్నాలోని లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి నివాసానికి ఈడీ నోటీసును అందజేసింది. జనవరి 29, 30 తేదీల్లో తమ ఎదుట హాజరు కావాలని కోరింది. ఈడీ చర్యను ఆర్జేడీ నాయకత్వం విమర్శించింది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. 'ఇది కొత్త విషయం కాదు.. తమతో సహకరించని పార్టీలకు కేంద్రం ఈడీ సమన్లను పంపిస్తుంది. ఎక్కడికి వెళ్లైనా ఈడీకి సహకరించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం' అని మిసా భారతి తెలిపారు. 'ఇది ఈడీ సమన్ కాదు, బీజేపీ సమన్.. ఇది 2024 వరకు కొనసాగుతుంది. అప్పటి వరకు దయచేసి దీనిని ఈడీ సమన్లు అని పిలవకండి.. మేమెందుకు భయపడాలి?' అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఆరోపించారు. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
బిహార్‌లో ఆసక్తికరంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
పట్నా: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలిగి బీజేపీలో చేరి.. మళ్లీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి బిహార్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల్లో జరగుతున్న చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు నితీష కుమార్ పార్టీ జేడీ(యూ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మందితో జేడీయూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో 13 మందిని లాగేందుకు ఆర్జేడీ అధినేత లాలూ సైతం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పట్నాలో అందుబాటులో ఉండాలని లాలూ ఆదేశించారు. నితీష్ కుమార్ మహా కూటమిని మారే సమయంలో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం రాత్రి 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ చర్చలు జరపనున్నారు. అయితే ఈ రాత్రికి నితీష్ సీఎంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో రేపు(ఆదివారం) మరోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలో పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు బిహార్ వెళ్లనున్నారు. ఆదివారం పట్నాలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారు సమావేశం కానున్నారు. చదవండి: ‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’ -
బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో నితీష్ మళ్లీ సీఎం?
పాట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. జనవరి 28న బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ను నితీష్ నేడు కలిశారు. జేడీయూ, బీజేపీలు తమ ఎమ్మెల్యేలందర్ని ఇప్పటికే పాట్నాకు పిలిపించాయి. బీజేపీ నేత సుషీల్ కుమార్ మోదీ ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారని సమాచారం. జేడీయూ,ఆర్జేడీ విభేదాలతో ఆర్జేడీ నేత లాలూ యాదవ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పరిచే ప్రయత్నంలో పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగేందుకు 122 సీట్ల మార్కును చేరుకునేందుకు లాలూ యాదవ్ పావులు కదుపుతున్నారు. మహాకూటమి నుంచి నితీష్ కుమార్ ఉపసంహరించుకున్న సందర్భంలో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఆర్జేడీకి ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతుంది. దీంతో జితన్‌రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ మాంఝీని మాహా కూటమిలో చేర్చే ప్రయత్నం చేశారు లాలూ. ఇందుకు సంతోష్ మాంఝీకి లోక్‌సభ స్థానాలతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ ఇచ్చారని సమాచారం. ఇందుకు నో చెప్పినట్లు మాంఝీ వెల్లడించారు. బిహార్‌లో కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీల సహా స్థానిక పార్టీలతో ఏర్పడిన మహాకూటమికి జేడీయూ నేత నితీష్ కుమార్‌కు స్వస్తి పలకనున్నారని రెండు రోజులుగా రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో భగవంత్ మాన్ తర్వాత కీలక నేత నితీష్ తప్పుకోనున్నారు. మాహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి మళ్లీ సీఎంగా పదవి చేపట్టనున్నారని సమాచారం. ఈ అనుమానాలను నిజం చేస్తూ అటు.. రాహుల్ చేపట్టే న్యాయ్ యాత్రకు కూడా బిహార్‌లో హాజరుకాబోమని నితీష్ వర్గాలు తెలిపాయి. కర్పూరీ ఠాకూర్‌కి కేంద్రం భారత రత్న ప్రకటించిన అనంతరం జేడీయూ, ఆర్జేడీ మధ్య ఇటీవల విభేదాలు తారాస్థాయికి చేరాయి. బిహార్‌లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. ఇదీ చదవండి: Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు! -
నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్
పాట్నా: బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వంశపారంపర్య రాజకీయాలపై సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గాను కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ప్రభుత్వ చర్యను స్వాగతించిన నితీష్ కుమార్.. కర్పూరి ఠాకూర్ తన కుటుంబ సభ్యులను పార్టీలో ఎన్నడూ తీసుకురాలేదని చెప్పారు. దివంగత నేత చూపిన బాటలోనే తమ పార్టీ పయనించిందని నితీష్ కుమార్ అన్నారు. జేడీయూ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. బీహార్‌లోని మహాకూటమి (మహాగత్బంధన్) ప్రభుత్వంలో జేడీయూకి మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీని ఉద్దేశించి పరోక్షంగా నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆర్జేడీ నేత లాలూ కుమార్తె ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నితీష్ కుమార్ పేరును ప్రస్తావించనప్పటికీ.. అర్హత లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏం ప్రయోజనం? ఒకరి ఉద్దేశ్యంలో మోసం ఉన్నప్పుడు ఆ పద్ధతిని ఎవరు ప్రశ్నించగలరు? అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. ఇదీ చదవండి: అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ -
ED: లాలూ, తేజస్వీలకు మళ్లీ ఈడీ నోటీసులు
పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి, మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. భూములు రాయించుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని తండ్రీ కొడుకులపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఈడీ లాలూ, తేజస్వీలను విచారించనుంది. విచారణ కోసం పాట్నాలోని తమ కార్యాలయానికి రావాలని సమన్లలో ఈడీ తెలిపింది. జనవరి 29న లాలూ ప్రసాద్‌యాదవ్, 30న తేజస్వీ యాదవ్ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. ఇదే కేసులో వీరిద్దరికి గత డిసెంబర్లో సమన్లు జారీ చేసినా విచారణకు వారు దూరంగా ఉన్నారు. యూపీఏ వన్ ప్రభుత్వంలో లాలూ కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారనేది ఈడీ అభియోగం. ఇదీచదవండి.. జెండాల గౌరవం కాపాడండి -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ విలీనం!
జనతాదళ్ యునైటెడ్ జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీలు త్వరలో విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ)అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపిణీపై పట్టబడుతున్నారన్న మీడియా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పలు వ్యక్తిగత సమీకరణాలు పంచుకున్నా. ఆయన కూడా చాలా విషయాలు నాకు చెప్పారు. అయితే వాటిని మీడియా ముందు ప్రజలకు వెల్లడించడం సరికాదు. కానీ, మీకు నేను ఒకటి చెప్పగలను. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయి. అప్పడు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు’ అని అన్నారు. అయితే గురవారం పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఇడియా కూటమి సమావేశం అనంతరం లలూ ప్రసాద్ ఇరువురు ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పట్నాకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం ఉన్న తన కుమారు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసే సమయం ఆసన్నమైందని లాలూప్రసాద్.. తనతో చెప్పాడని కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు. కేంద్ర మంత్రి ‘విలీనం’ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని ఉంటుంది. ఆయన్ను ఎవరు గుర్తించరు కావును అసాధారణ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’ అని మండిపడ్డారు. చదవండి: Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ -
Land For Jobs Case: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు ఈడీ నోటీసులు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తేజస్వీ డిసెంబర్ 22న, లాలూ డిసెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో 17 మంది నిందితులపై సీబీఐ జూలైలో రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లు ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. అక్టోబర్‌లో వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూ, అతని కుటుంబ సభ్యులపై ఇది రెండవ ఛార్జిషీట్. అంతేగాక తేజస్వి యాదవ్‌ను నిందితుడిగా పేర్కొన్న కేసులో మొదటి ఛార్జిషీట్. ఇక 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా తనకు అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. క్విడ్ ప్రోకో కింద ఆ అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబాం తక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేసినట్లు అభియోగాలు మోపాయి. ఈ క్రమంలో సీబీఐ గత ఏడాది మేలో లాలూ, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూ, భార్య రబ్రీ దేవి, అతని కుమారుడు తేజస్వి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్, లబ్ధిదారులతో సహా 17 మంది వ్యక్తుల పేర్లను నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా బెయిల్ మంజూరైన రెండు నెలల తర్వాత లాలూ, తేజస్వికి తాజాగా ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ హత్యకు కుట్ర.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘లాలూ’ కుటుంబం
సాక్షి, తిరుమల: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంటటేశర్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దంపతులు కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. आज सवेरे आंध्र प्रदेश के तिरुमाला पर्वत स्थित उत्कृष्ट शिल्प कौशल के अद्भुत उदाहरण एवं भक्ति, विश्वास और श्रद्धा के प्रतीक भगवान श्री तिरुपति बालाजी मंदिर में सपरिवार पूजा-अर्चना व दिव्य दर्शन कर सकारात्मक ऊर्जा एवं आशीर्वाद प्राप्त किया तथा गर्भगृह में विराजमान भगवान वेंकटेश्वर… pic.twitter.com/dtJhGlxe4s — Tejashwi Yadav (@yadavtejashwi) December 9, 2023 ఈ సందర్భంగా.. ‘అద్భుతమైన శిల్పకళ, భక్తి, విశ్వాసాలకు ప్రతీక అయిన తిరుపతి బాలాజీ ఆలయంలో నా కుటుంబంతో కలిసి పూజలు చేసి, దైవ దర్శనం చేసుకోన్నాం. వెంకటేశ్వర స్వామి నుంచి సానుకూల శక్తిని, ఆశీర్వాదాలను పొందాను’ అని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల సంతోషం, శాంతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం తాను ప్రత్యేకంగా ప్రార్థించానని తెలిపారు. ఈ రోజు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
లాలూ హుషారే చిక్కుల్లో పడేయనుందా?
ఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(75) హుషారుగా ఉండడం.. ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. గడ్డి కుంభకోణం కేసుల్లో ఒకదాంట్లో అనారోగ్య కారణం చూపించి బెయిల్‌పై బయట ఉన్న ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ, సుప్రీం కోర్టును కోరింది. ఇందుకు ఆయన హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలను చూపించింది కూడా!. దాణా స్కాంలోని కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింది. లాలూ తరపు సీనియర్ కపిల్ సిబాల్ వాదిస్తూ.. బెయిల్ రద్దు చేయాలనే సీబీఐ అభ్యర్థనను తిరస్కరించాలని బెంచ్‌ను కోరారు. ఈమధ్యే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. 42 నెలలపాటు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో గడిపిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే.. సీబీఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. ‘‘లాలూకు బెయిల్ మంజూరు విషయంలో జార్ఖండ్ హైకోర్టు న్యాయపరిధికి తగ్గటుగా వ్యవహరించలేదని.. తప్పిదం చేసిందని వాదించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలు ప్రముఖంగా వైరల్ అయిన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘దాణా స్కాం దొరండ ట్రెజరీ కేసులో లాలూకు ఐదేళ్ల శిక్షపడింది. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్ తర్వాత ఆయన బ్యాడ్మింటన్ ఆడుతూ ఆరోగ్యంగా కనిపించారు. అలాగే.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలనే హైకోర్టు ఆదేశం తప్పని నిరూపించేందుకు సీబీఐ సిద్ధం. ఆయన మూడున్నరేళ్ల శిక్షను ఏకకాలంలో అనుభవించలేదు. అయితే హైకోర్టు ఆయన శిక్షను ఏకకాలంలోనే అనుభవించారని పొరపడి బెయిల్ మంజూరు చేసింది’’ అని అదనపు సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో.. అక్టోబర్ 17వ తేదీకి విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. 1992 నుంచి 1995 మధ్య కాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆర్థిక, పశుసంవర్థకశాఖ పోర్ట్‌ఫోలియోలను తన వద్దే ఉంచుకున్నారు. ఆ సమయంలోనే 950 కోట్ల రూపాయల దాణా కుంభకోణం జరిగిందని.. ఫేక్, ఫోర్జ్డ్ బిల్లులతో ఖజానా నుంచి సొమ్ము తీశారనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించి ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో దొరండా ట్రెజరీ కేసుకు సంబంధించి 2022 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన అనారోగ్య కారణాలు చూపించడంతో జార్ఖండ్ హైకోర్టు లాలూకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే.. బెయిల్‌పై బయట ఉన్న లాలూ.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కొడుకు తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని క్యాప్షన్ కూడా ఉంచారు. -
ప్రతిపక్ష నేతల సీరియస్ మీటింగ్.. అంతలో రాహుల్ పెళ్లి చేసుకోవా అనేసరికి..
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ సమావేశమయ్యాయి. కాంగ్రెస్‌తో సహా దాదాపు 15కు పైగా పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ సర్కార్‌ను గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు ఎన్నికలు, మరోవైపు జాతీయ అంశాలపై సీరియస్‌గా చర్చ జరగుతున్న సమయంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమావేశంలో ఒక్క సారిగా నవ్వులు, జోకులు విరబూశాయి. పెళ్లి చేసుకో రాహుల్ ప్రతిపక్ష సమావేశంలో జాతీయ అంశాలతో పాటు మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకరైన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చలోకి తీసుకువచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్. సమావేశంలో ఆయన రాహుల్ పెళ్లి అంశంపై తన దైనశైలిలో రెచ్చిపోయారు. ఆయన దీనిపై మాట్లాడుతూ.. ‘రాహుల్ జీ.. పెళ్లి చేసుకో.. మేము నీ పెళ్లి ఊరేగింపుకు వస్తాం” అని సలహా ఇచ్చారు. ఈ మాటలతో రాహుల్ గాంధీ సహా అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. అంత వరకు సీరియస్‌గా ఉన్న వాతావరణం కాస్త లాలూ వ్యాఖ్యలతో ఒక్కసారిగా మారిపోయింది. ఈ అంశంపై లాలూ కొనసాగిస్తూ.. ‘ఇంకా సమయం మించిపోలేదు, మీరు పెళ్లి చేసుకోండి. మీ అమ్మ (సోనియాగాంధీ) నాకు చెప్పేవారు.. ఈ విషయంలో నువ్వు ఆమె మాట వినడం లేదని’ ఆయన అన్నారు. వీటికి రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు. ‘ఇప్పుడు మీరు పెళ్లి గురించి చెప్పారు కదా ఇక అది జరుగుతుందని’ రాహుల్ అన్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహాల్ గాంధీ తన పెళ్లి ప్రస్తావన రాగా ఈ విధంగా స్పందించారు. తన తల్లి సోనియా గాంధీ, అమ్మమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న లక్షణాలు కలిగిన అమ్మాయి తనకు భాగస్వామిగా కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ.. -
తెలియక ఇంతకాలం నేనే వంట చేశాను.. ఇక కిచెన్‌లోకి నడవండి!
తెలియక ఇంతకాలం నేనే వంట చేశాను..ఇక ఇవి తీసుకుని కిచెన్‌లోకి నడవండి! -
'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి'
పాట్నా: జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు చేసిన ముడు రోజలు తర్వాత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ స్కాం ద్వారా పొందిన రూ.600 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు ఈడీ చేసిన ప్రకటన పచ్చి అబద్దమన్నారు. ఈడీ అధికారులు తన ఢిల్లీ నివాసంలో అరగంటలోనే సోదాలు పూర్తి చేశారని తేజస్వీ చెప్పారు. ఈ సమయంలో తన సోదరీమణులు ధరించి ఉన్న నగలను తీసి పక్కకు పెట్టమని చెప్పారని, వాటినే ఫోటోలు తీసి సీజ్ చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2017లో కూడా తమ పార్టీ రూ.8,000కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిందని చెప్పి దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. ముందు వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీలా తమది ఫేక్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాదని తేజస్వీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా క్రోనాలజీ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. తమది నిజమైన సోషలిస్టు కుటుంబం అని పేర్కొన్నారు. బిహార్‌లో బీజేపీని అధికారానికి దూరం చేసినందుకే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసునని తేజస్వీ అన్నారు. కమలం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈడీ సోదాల్లో ఏం సీజ్ చేశారో అధికారికంగా ప్రకటన విడదల చేయాలని, లేదంటే తానే నిజాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేయాలని బహుశా అమిత్‌షానే డైరెక్షన్ ఇచ్చి ఉంటారని తేజస్వీ ఆరోపించారు. ప్రతిసారి ఇలానే చేస్తే వర్కవుట్ కాదని.. వాళ్లు స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? -
రూ.150 కోట్ల ఇల్లు.. రూ.4 లక్షలకే కొన్నారు: ఈడీ
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణానికి సంబంధించి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటంబసభ్యుల నివాసాల్లో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో అక్రమ నగదు, ఆభరణాలను భారీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. లాలూ కుటుంబసభ్యుల నివాసాల్లో రూ.కోటి నగదు, విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారు కడ్డీలు, ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు లభించినట్లు వెల్లడించారు. అలాగే ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తేజస్వీ యాదవ్ బంగళా విలువ ప్రస్తుతం రూ.150 కోట్లని, దీన్ని గతంలో రూ.4లక్షలకే కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు అంతస్తుల భవనం ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై రిజిస్టర్ అయి ఉందని, కానీ తేజస్వీ యాదవ్ దిన్ని నివాసంగా ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు జాబ్ ఫర్ స్కాం ద్వారా వచ్చిన నగదు లేదా రాబడిని ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన రత్నాలు, ఆభరణాల సంస్థలు అక్రమంగా సంపాదించిన డబ్బును వినియోగించినట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన రాబడి విలువ ప్రస్తుతం రూ.600కోట్లు అని ఈడీ అధికారులు చెప్పారు. వీటిలో రూ.350కోట్లు స్థిరాస్థులు కాగా.. బినామీల ద్వారా రూ.250 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని వివరించారు. చదవండి: రబ్రీ..లాలూ అయిపోయారు.. ఇప్పుడు తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు -
మా నాన్నకు ఏమన్నా అయితే.. ఎవ్వరినీ వదలను: లాలూ కూతురు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నిస్తున్నసమయంలో ఆయన కుతూరు రోహిణి ఆచార్య కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తన తండ్రికి ఏమైనా అయితే ఎవ్వరినీ వదలనని హెచ్చరించారు. తన తండ్రిని తరచూ వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్నంతా గుర్తుపెట్టుకుంటామని, టైం వచ్చినప్పుడు వాళ్ల పనిచెబుతామని వ్యాఖ్యానించారు. ఒకవేళ లాలూకు ఏదైనా జరిగితే ఢిల్లీ పీఠాన్ని కదిలించే శక్తి తమకు ఉందని రోహిణి ట్వీట్ చేశారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని పరీక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. पापा को लगातार परेशान किया जा रहा है। अगर उन्हें कुछ हुआ तो मैं किसी को नहीं छोड़ूंगी। पापा को तंग कर रहे हैं यह ठीक बात नहीं है। यह सब याद रखा जाएगा। समय बलवान होता है, उसमें बड़ी ताकत होती है। यह याद रखना होगा। — Rohini Acharya (@RohiniAcharya2) March 7, 2023 రోహిణి ఆచార్య.. లాలూ యాజవ్ రెండో కుమార్తె. తన తండ్రి కిడ్నీలు చెడిపోతే ఈమె ఒక కిడ్నీని దానం చేసి ఆయనపై ప్రేమను చాటుకున్నారు. సింగపూర్‌లో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఫిబ్రవరి 11న భారత్‌కు తిరిగివచ్చిన లాలూ తన పెద్ద కుమార్తె, ఎంపీ మిసా భారతి ఢిల్లీ నివాసంలో ఉంటున్నారు. అయితే ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కుంభకోణానికి సంబంధించి లాలూను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం మిసా భారతీ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వేధిస్తున్నారని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ -
లాలూను ప్రశ్నించనున్న సీబీఐ
ఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను నేడు సీబీఐ ప్రశ్నించనుంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ ఇదివరకే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. సోమవారం ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నంతా పాట్నాలో ఆర్జేడీ వర్గాలు ధర్నాకు దిగగా.. ఇవాళ ఆ ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి. 2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్మెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఐఆర్సీటీసీలో గ్రూప్ డీ సంబంధిత పోస్టులను దొడ్డిదోవన కొందరికి కట్టబెట్టినట్లు తేల్చింది. ఆ సమయంలో రైల్వే మంత్రిగా లాలూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగానూ.. కొంతమంది అభ్యర్థుల నుంచి కారుచౌక ధరకే భూములు పొందారన్న అభియోగాలు లాలూ కుటుంబ సభ్యులపైనా నమోదు అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కిందటి ఏడాది మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసి.. అక్టోబర్ నెలలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది. ఈ మేరకు సోమవారం రబ్రీ దేవిని సుమారు ఐదు గంటలపాటు ప్రశ్నించి, ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు సీబీఐ అధికారులు. ఆ సమయంలో బయట ఆర్జేడీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఇక ఈ స్కాంకు సంబంధించి గతంలో లాలూకు ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. గత కొంతకాలంగా లాలూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది నెలల క్రితం సింగపూర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. -
rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఇవాళ ఒక్కసారిగా అలజడి రేగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీ దేవి ఇంటికి వెళ్లింది. సోమవారం పాట్నాలోని ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తనయులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.అయితే.. ఈ కుంభకోణానికి సంబంధించి కేవలం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకే వెళ్లినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేగానీ తనిఖీలు, సోదాలు నిర్వహించేందుకు కాదని స్పష్టత ఇచ్చాయి. మరోవైపు ముందు తీసుకున్న అపాయింట్మెంట్ ప్రకారమే అధికారులు ఇంటికి వచ్చారని రబ్రీ దేవి అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజకీయ ఉద్దేశ్యాలతో దర్యాప్తు సంస్థలను తప్పుడు దోవలో కేంద్రం ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ.. ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఈ లేఖలో రబ్రీ దేవి తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం సంతకం చేశారు. అంతేకాదు.. దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్న నేతల్లో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. సీబీఐ ప్రకారం.. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం లాలూ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. 2004-09 మధ్య రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా లాలూ కుటుంబం కారుచౌక ధరలను చెల్లించి భూముల్ని కొనుగోలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 2022లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. ఆపై ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది. అంతేకాదు గతంలో లాలూకు ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. ఇక బీజేపీ దర్యాప్తు సంస్థల బూచీతో బయటపెట్టాలని యత్నిస్తోందని, లాలూ కుటుంబం అలాంటి వాటికి బెదరదని, గత 30 ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు తాము ఎదుర్కొంటున్నామని రబ్రీ దేవి తాజాగా ఓ ప్రకటన చేశారు కూడా. -
పార్టీ నాయకుడిపై లాలు యాదవ్ కొడుకు ఫైర్.. సమావేశం మధ్యలోనే...
న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలు యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తరుచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఢిల్లీల జరిగిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడి) సమావేశానికి హజరయ్యారు. ఐతే ఆ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రజాక్‌ని దుర్భాషలాడుతూ...సమావేశం మధ్యలోంచే బయటకు వచ్చేశారు. ఈ విషయమై తేజ్ ప్రతాప్‌ని మీడియా ప్రశ్నించగా...ఆయన సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు నిరాకరించారు. తాను బలహీనమైన వ్యక్తిని అని, చాలా ఒత్తిడిలో ఉన్నానని అన్నారు. అదీగాక రెండు రోజుల క్రితమే తన మేనల్లుడు చనిపోయాడని అయినప్పటికీ సమావేశానికి వచ్చానంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. తాను సమావేశం షెడ్యూల్ గురించి అడిగితో కార్యదర్శి శ్యామ్ రజాక్ తన సోదరిని, వ్యక్తిగత సహాయకుడి దుర్భాషలాడరని, ఆడియో రికార్డు కూడా ఉందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇలానే ఇటీవల తన తండ్రి కోసం మధురలో పూజలు చేసే విషయమై వచ్చి నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కి మీడియాలో నిలిచారు. (చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన) -
సోనియాతో నితీశ్, లాలూ కీలక భేటీ..
సాక్షి,న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐక్యంగా వెళ్లాలని నితీశ్, లాలూ సోనియాను కోరినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లాలూ యాదవ్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత 2024 ఎన్నికలపై చర్చిస్తానని సోనియా హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీని ఈసారి గద్దెదించాలని, అందుకే నితీశ్‌తో కలిసి సోనియాను కలిసినట్లు పేర్కొన్నారు. దేశ పురోగతి కోసం విపక్షాలన్ని ఐక్యంగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని నితీశ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ విషయం మాట్లాడదామని సోనియా చెప్పారని వెల్లడించారు. గత నెలలో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్. ఆ తర్వాత ఆయన సోనియాతో భేటీ కావడం ఇదే తొలిసారి. చదవండి: రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా! -
6 ఏళ్ల తర్వాత నితీశ్, లాలూతో సోనియా భేటీ!
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్. సుమారు ఆరేళ్ల తర్వాత నితీశ్, లాలూతో సోనియా గాంధీ సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) వ్యవస్థపాకులు దివంగత నేత చౌదరీ దేవి లాల్ జయంతి సందర్భంగా ఫతేబాద్‌లో నిర్వహించే ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఇరువురు నేతలు. గత మంగళవారమే.. సోనియాతో భేటీపై వివరాలు వెల్లడించారు లాలూ ప్రసాద్ యాదవ్. ‘ప్రతిఒక్కరు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించాలి. నేను ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలవనున్నాను. పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీతోనూ భేటీ అవుతాను.’ అని తెలిపారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ఇదీ చదవండి: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ప్రైవేటు క్లినిక్ -
బావ అధికారిక సమావేశంలో బావమరిది హాజరు...వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం
పాట్న: మరోసారి వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. బిహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ అధికారిక సమావేశంలో లాలు ప్రసాద్ అల్లుడు హాజరవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలో మంత్రి తేజ్ ప్రతాప్ సంబంధించిన శాఖపరమైన సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆర్జేడీ పై అధికార పార్టీ బీజేపీ విమర్శల దాడి చేసింది. వాస్తవానికి తేజ్ ప్రతాప్ ఆగస్టు 16న మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజున ఆయనకు కేటాయించిన పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల శాఖ బాధ్యతలు చేపట్టారు. ఐతే ఆగస్టు 17న అరణ్య భవన్లో అటవీ వాతావరణ మార్పుల శాఖ సమీక్ష సమావేశానికి తేజ్ ప్రతాప్ అధ్యక్షత వహించారు. అప్పుడు జరిగిన అధికారుల సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు శైలేష్ కుమార్ కూడా వచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 18న బిహార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో కూడా తేజ్ ప్రతాప్ మరోసారి సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కూడా శైలేష్ రావడమే కాకుండా ఆయనతోపాటు కలిసి కూర్చోవడంతో పెద్ద దూమారం రేగింది. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టింది. "తేజ్ ప్రతాప్‌ని ఎవ్వరూ తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మంత్రులందరిలోనూ ఆర్జేడీ కోటా కుమారుడు శైలేష్ యాదవ్ అత్యంత తెలివైనవాడు అతని ఆశీస్సులు తేజ్ ప్రతాప్‌కు ఉంటే ఉత్తమ మంత్రిగా ఎదుగుతాడు." అని ఎద్దేవా చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి శైలేష్‌ని ఉద్దేశించి విమర్శిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు!) -
జాబ్ ఫర్ ల్యాండ్ కేసు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన భోళా యాదవ్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. జాబ్ ఫర్ ల్యాండ్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా పట్నా, దర్భంగాలోని మొత్తం నాలుగు ప్రదేశాల్లో సీబీఐ ముమ్ముర తనిఖీలు నిర్వహించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు(2004-09) రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందిన కొందరు లాలూకు, ఆయన కుటుంబసభ్యులకు భూమిని తక్కువ ధరకే విక్రయించడం లేదా గిఫ్ట్‌గా ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ ఏడాది మేలో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమార్తెలు మిషా భారతి, హేమా యాదవ్‌లతో పాటు 12మందిపై అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసం సహా బిహార్, ఢిల్లీలో మొత్తం 17 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహించింది. 2021 నుంచి దీనిపై దర్యాప్తు చేస్తోంది. అయితే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే లాలూపై దాడులు చేస్తున్నారని ఆర్జేడీ విమర్శిస్తోంది. ఒకప్పుడు రైల్వే శాఖకు వేల కోట్లు లాభాలు తెచ్చిపెట్టి దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లాలూను.. ఇప్పుడు దేశాన్ని అమ్మేస్తున్న ఓ గ్రూప్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని లాలూ కుమార్తె రోహిణి యావద్ తీవ్ర ఆరోపణలు చేశారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
Lalu Prasad Yadav: నిలకడగానే లాలూ ఆరోగ్యం!
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(74) ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ మేరకు ఆయన తనయుడు తేజస్వి యాదవ్ బుధవారం మీడియాకు తెలిపారు. బుధవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన ఎయిర్ ఆంబులెన్స్‌లో తరలించడంతో ఆయన పరిస్థితి విషమించిందంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటిని తేజస్వి యాదవ్ ఖండించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, లాలూ ఆరోగ్యంపై ఆరా తీశారు. తేజస్వీ యాదవ్‌కు ఫోన్ చేసి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని తనయుడు తేజస్వి యాదవ్ ప్రకటించారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యల కోసం ఢిల్లీకి షిఫ్ట్ చేసినట్లు వెల్లడించాడాయన. లాలూ సోమవారం వేకువజామున ఇంట్లో మెట్లపై నుంచి కాలుజారి పడిపోయారు. ఆయన కుడి భుజానికి ఫ్రాక్చర్ అయింది. పాట్నాలోని పరాస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. భార్య రబ్రీదేవితో పాటు లాలూ ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, సూర్యప్రతాప్ యాదవ్ ఆయనతో పాటే ఉన్నారు. కుడి భుజం గాయంతో పాటు లాలూ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తూ రెండు నెలల క్రితమే బెయిల్‌పై విడుదల అయ్యారు. అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలనుకునే సమయంలో అనుకోకుండా ప్రమాదానికి గురై కాలుజారిపడ్డారు. Bihar | His condition is stable. Everyone knows about his kidney & heart issues for which treatment was going on in Delhi. Those doctors have his medical history& that's the reason we are taking him there: RJD leader & Lalu Prasad Yadav's son Tejashwi Yadav outside the hospital pic.twitter.com/R9Hiys9PRO — ANI (@ANI) July 6, 2022 -
లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని షాక్
బీహార్ మాజీ సీఎం, ఆర్జేజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి ఊహించని షాక్ తగిలింది. లాలూ ప్రసాద్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నసమయంలో(2004-2009) మధ్య జరిగిన రైల్వే శాఖకు చెందిన పోస్టుల నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ తాజాగా అభియోగాలు మోపింది. దీంతో, రంగంలోకి దిగిన సీబీఐ శుక్రవారం.. ఒకేసారి లాలూ ప్రసాద్ ఇంటితో పాటుగా రాష్ట్రీయ జనతాదళ్‌కు సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోంది. ఇక, ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు కూడా పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తూ.. వారిని నిందితులుగా పేర్కొంది. ఇక, ఈ పోస్టులకు సంబంధించిన కేసులో రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ, అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. రూ. 139 కోట్లు డోరాండా ట్రెజరీ కుంభకోణం కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇటీవలే లాలూకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతోపాటుగా 60 లక్షల జరిమానా కూడా విధించింది. రైల్వే జాబ్స్ నియామకాల కేసుపై ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ మాట్లాడుతూ.. ప్రజల్లో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లకు పెరుగుతున్న పాపులారీ కారణంగానే ప్రభుత్వం కక్షగట్టి వారిపై ఇలా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు -
దాణ స్కాం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
బిహార్: జార్ఖండ్‌లోని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌తోసహా మొత్తం 110 మంది నిందితులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత... సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 1996లో వెలుగులోకి వచ్చిన ఈ దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్ యాదవ్‌ని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారణ చేస్తూ తీర్పును వెలువరించింది. మంగళవారం సీబీఐ కోర్టు.. దాణ కుంభకోణంకి సంబంధించిన ఐదో కేసులో.. డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసిననట్లు నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు మొత్తం దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు కేసుల్లో దోషిగా తేలిన లాలూ యాదవ్ మంగళవారం ఉదయం న్యాయమూర్తి సికె శశి తీర్పును చదివేటప్పుడు కోర్టు హాలులో ఉన్నారు. ఈ కేసులో మరో 98 మంది నిందితులు భౌతికంగా హాజరు కావాల్సి ఉండగా 24 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన వారిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్ సహా 35 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో లాలూ యాదవ్‌తోపాటు మరో 39 మంది దోషులకు ఫిబ్రవరి 21న శిక్ష ఖరారు కానుంది. అయితే లాలు కి సంబంధించిన అన్ని కేసులు పశువుల మేత కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులను స్వాహా చేసినవే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆయన మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. -
Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్ వివాహం
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం గురువారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు రాజ్శ్రీతో దక్షిణ ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగింది. వివాహ వేడుకకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అతని భార్య డింపుల్, రాజ్యసభ ఎంపీ మీసా భారతి, ఇతర రాజకీయ నాయకులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి తేజస్వీ, రాజ్శ్రీల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కాగా, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు కుటుంబానికి సన్నిహితులు, బంధువులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) -
వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!
Lalu Prasad can inaugurate 6 ton lantern: ఈ రాజకీయ నాయకులు వినూత్నంగా చేసే కొన్ని పనులు భలే ఫేమస్ అవుతాయి. పైగా తమ అభిమాన నాయకుడే ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో వారి పార్టీ శ్రేణులు కొన్నింటిని భలే విన్నూతన రీతిలో వస్తువులు లేదా భవనాలను తయారుచేయడం లేదా కట్టించడం వంటి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో తమ అభిమాన నాయకుడు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఒక భారీ లాంతరు ఏర్పాటు చేశారు. (చదవండి: 2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ) అసలు విషయంలోకెళ్లితే....పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో వారి పార్టీ చిహ్నం అయిన 6 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఒక భారీ లాంతరును ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో లాంతరును ఆవిష్కరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంగణంలోకి ప్రవేశంపై నిషేధం కూడా విధించారు. అయితే ఈ లాంతర్ని తేజస్వి యాదవ్ అనే వ్యక్తి చొరవతోనే ఈ లాంతరును నిర్మించినట్లు ఆర్జేడీ కార్యకర్తలు చెబుతున్నారు. బంకా జిల్లా ట్రెజరీకి సంబంధించిన డబ్బు కుంభకోణం సంబంధించిన కేసు కోసం లాలు ప్రసాద్ యాదవ్ సీబీఐ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరై నిమిత్తం పాట్నా వస్తున్నారు. అందువల్ల ఆ సమయంలోనే ఈ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆవిష్కరణతో పాటు పార్టీ అధినేత పాట్నా పర్యటన తర్వాత కుల గణన అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. (చదవండి: ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా) -
Lalu Prasad Yadav: లంచం కేసులో లాలూకి క్లీన్ చీట్?
సాక్షి, న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ గ్రూప్ లంచం కేసులో మాజీమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినట్టు సమాచారం. లాలూ ప్రసాద్ యాదవ్‌కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీబీఐ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో ఇప్పటికే మూడున్నరేళ్లు లాలూ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చినా... ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ తమ విచారణ కొనసాగించనుంది. రైల్వే ప్రాజెక్ట్లులో ... యూపీఏ 2 ప్రభుత్వ హయంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ముంబై, ఢిల్లీలలో రైల్వే ప్రాజెక్టులు దక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ లాలూకి లంచం ఇచ్చిందనేది ప్రధాన ఆరోపణ. డీఎల్ఎఫ్కి లబ్ధి చేకూర్చినందుకు 2007లో దక్షిణ ఢిల్లీలో రూ. 30 కోట్లు విలువ చేసే స్థలాన్ని లాలుకి కట్టబెట్టారని, ఆ తర్వాత 2011లో లాలూ కుటుంబ సభ్యులకు నామమాత్రపు ధరకే విలువైన షేర్లు అందించారనే ఆరోపణలు వచ్చాయి. మూడేళ్ల విచారణ లంచం తీసుకుని డీఎల్ఎఫ్ సంస్థకు అనుకూలంగా లాలూ తన పవర్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై 2018 జనవరిలో కేసు నమోదు చేసింది సీబీఐ, ఆర్థిక నేరాల విభాగం. కేసు నమోదైన కొత్తలో పూర్వపు స్టాంపు పేపర్లు ఫోర్జరీ చేశారని, లాలూ కుటుంబ సభ్యులు ఆయాచితంగా లబ్ధి పొందారని... ఇలా అనేక ఆధారాలు ఆయనకి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్నాయంటూ బెయిల్‌కి నిరాకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు విచారించిన తర్వాత ఆరోపణలకు తగ్గట్టు సరైన ఆధారాలు సంపాదించలేక పోయింది సీబీఐ. దీంతో లాలూకి క్లీన్‌చీట్ ఇచ్చింది. డీఎల్ఎఫ్ లంచం కేసులో 2008 జనవరి నుంచి 2021 ఏప్రిల్ వరకు లాలూ జైలులోనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్ రావడంతో లాలూ బయటకు వచ్చారు. -
లాలూను వేధిస్తున్న కరోనా టెన్షన్
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహర్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కరోనా భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చికిత్స అందించిన వైద్యుడే లాలూ ప్రసాద్‌కు కూడా చికిత్స చేయడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇదే హాస్పిటల్లో లాలూ కూడా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత మూడు వారాలుగా లాలూకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేష్‌ప్రసాద్ కరోనా బాధితుడికి కూడా వైద్యం చేశారు. దీంతో కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఉమేష్‌ప్రసాద్‌తో పాటు, అతని బృందంలోని అందరినీ క్వారంటైన్‌కు పంపుతున్నట్లు రిమ్స్ ప్రకటించింది. అంతేకాకుండా వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, లాలూ ప్రసాద్‌కి కూడా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే లాలూను పెరోల్ పై విడుదల చేసే ప్రతిపాదనను జార్ఖండ్ అడ్వకేట్ జనరల్‌కు సీఎం హేమంత్ సోరెన్ పంపించారు. కాగా 7 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష ఉన్న ఖైదీలను మాత్రమే పెరోల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. (లాలూ ప్రసాద్‌కు అనారోగ్యం) -
‘బిహార్‌కి రెండో లాలూని నేనే’
పట్నా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆఖరిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుల మధ్య విభేదాలు ఒక్కోటిగా బయట పడుతున్నాయి. గత కొద్ది కాలంగా లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెహానాబాద్‌లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా చంద్ర ప్రకాశ్‌ను బరిలో దింపాడు. అతని తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ‘లాలూ ప్రసాద్ యాదవ్ చాలా శక్తివంతుడు. ఆయన రోజుకు 10 - 12 కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. కానీ ఇప్పటి నాయకులు రోజుకు 2, 3 కార్యక్రమాల్లో పాల్గొనగానే అస్వస్థతకు గురవుతున్నారం’టూ పరోక్షంగా సోదరుడు తేజస్విని విమర్శించారు. అనారోగ్య కారణాల దృష్ట్యా కొద్ది రోజులుగా తేజస్వి యాదవ్ పలు ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని తేజ్ ప్రతాప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘లాలూ ప్రసాద్ యాదవే మాకు ఆదర్శం.. ఆయన నాకు గురువు కూడా. ఆయన రక్తాన్ని పంచుకుపుట్టిన నేనే బిహార్‌కు మరో లాలూని’ అని పేర్కొన్నారు. అంతేకాక ప్రస్తుతం పార్టీ రోజు వారీ కార్యక్రమాలు చూస్తున్న వ్యక్తి.. అనర్హులకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. తన అభ్యర్థి చంద్ర ప్రకాశ్ భారీ మెజార్టీతో గెలుస్తాడని తేజ్ ప్రతాప్ ధీమా వ్యక్తం చేశాడు. వివాహ బంధంలో వచ్చిన విబేధాల కారణంగా కొద్ది నెలలుగా తేజ్ ప్రతాప్ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
‘బాబాయ్ నాకు ఇళ్లు కావాలి’
పట్నా : విడాకులు కావాలంటూ రచ్చకెక్కిన బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. ఆ తరువాత వేరు కుంపటి పెడతానంటూ మరోసారి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తేజ్ ప్రతాప్‌కు ఇంటిని వెతికి పెట్టడంలో ‘చాచా’ నితీష్ కుమార్ సాయం చేసారంట. అది కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పర్మిషన్తో. విడాకుల విషయంలో కుటుంబ సభ్యులతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో వేరే ఇంటికి మారాలనుకున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఆ ప్రయత్నాల్లో భాగంగా తనకు కొత్త ఇంటిని కేటాయించాలంటూ భవన నిర్మణాల శాఖ మంత్రికి లేఖ రాశాడు తేజ్ ప్రతాప్. కానీ వారు సరిగా స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఫోన్ చేశారు. ‘బాబాయి నాకు ఇళ్లు దొరకడం లేదు సాయం చేయండం’టూ కోరారని సమాచారం. దాంతో నితీష్ కుమార్ ఈ విషయం గురించి లాలూ ప్రసాద్‌కు తెలియజేశారు. భార్యభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగాలంటే.. కొన్నాళ్ల పాటు ఇద్దరూ వేరుగా ఉంటే మంచిదని భావించిన లాలూ.. అందుకు ఒప్పుకున్నారని సమాచారం. లాలూ కూడా ఒప్పుకోవడంతో గతంలో తాను నివసించిన 7 ఎం స్ట్రాండ్ రోడ్‌లోని ఇంటిని తేజ్ ప్రతాప్ కోసం కేటాయించారు నితీష్ కుమార్. ప్రభుత్వం ది 10, సర్క్యూలర్ రోడ్డులోని ఇంటిని మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీదేవికి కేటాయించారు. ప్రస్తుతం లాలూ కుటుంబం ఇక్కడే ఉంటున్నారు. బీజేపీతో పొత్తు కంటే ముందు నితీష్ కుమార్ మహాకుటమిలో భాగంగా ఆర్జేడీ పార్టీతో పొత్తు పెట్టుకుని బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ కొన్ని రోజుల తరువాత మహాకూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. . -
‘మా సోదరుల మధ్య విబేధాలున్నది నిజమే’
పాట్నా : చేతికి ఉన్న ఐదు వేళ్లు మాదిరిగానే.. కుటుంబంలోని వారంతా కూడా ఒకేలా ఉండరు. అందరి ఇళ్లలో మాదిరే తమ ఇంట్లో కూడా సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయన్నారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి. పాట్నాలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మిసా ఈ సందర్భంగా తమ సోదరుల గురించి మాట్లాడారు. ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విబేధాలు ఉన్నట్లే తమ సోదరుల మధ్య కూడా చిన్న చిన్న పొరపొచ్చలున్నాయన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వ సాధరణమని తెలిపారు. కానీ ఆ విబేధాలు అన్ని ఇంటికే పరిమితమని.. పార్టీ కోసం మాత్రం అందరూ కలసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అన్నదమ్ములిద్దరు గొడవపడటం వల్ల కార్యకర్తల మీద కూడా ఆ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పార్టీలోని ప్రతి ఒక్కరు అందరిని కలుపుకుపోతూ పార్టీకోసం పని చేయాలని మిసా భారతి కోరారు. ప్రస్తుతం లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్విల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాలూ తన కుమారులిద్దరిని గొడవలు మాని.. కలిసిమేలసి ఉండలాని, పార్టీకి కోసం పని చేయాలని సూచించినట్లు సమాచారం. -
సైకిల్‌పై తేజ్ ప్రతాప్, ఐశ్వర్యరాయ్.. వైరల్
పట్నా : ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి ఈ నెల 12న పట్నాలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్‌తో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ నవదంపతులు కలిసి దిగిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఐశ్వర్యను ముందు కుర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతున్న ఫొటోను తేజ్ ప్రతాప్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. అలాగే పెళ్లిలో లాలు కుటుంబ సభ్యులు కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు బయటికి వచ్చాయి. పెళ్లి తర్వాత నూతన దంపతులను తేజ్ ప్రతాప్ యాదవ్ తల్లి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబరీ దేవి గుడికి కూడా తీసుకువెళ్లారు. ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ పెళ్లి ఫోటోలను, వీడియోలను బిహార మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. పెళ్లికి వచ్చి వధువరులను ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పెళ్లికి లక్షల్లో జనాలు వస్తారని ముందే అంచనా వేసి గాంధీ మైదానం లాంటి ప్రదేశంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయినా ఏమైన అసౌకర్యం కలిగి ఉంటే క్షమించమంటూ కూడా పోస్ట్ చేశారు. -
ఇక నితీష్ కుమార్ పని అయిపోయింది..
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ నవమి రోజున బిహార్ లోని కొన్ని ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో జరిగిన ఘర్షణలకు ముఖ్యమంత్రే కారణమని, ఇక నితీష్ కుమార్ పని అయిపోయిందని ఆయన అన్నారు. గడ్డి స్కాం కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న లాలూ ప్రసాద్‌ను అనారోగ్యం కారణంగా పోలీసులు బుధవారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రి బయట లాలూ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంటలు పెట్టి మత ఘర్షణలను ప్రేరేపించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పని ఇక అయిపోయిందని విమర్శించారు. ఇది ఇలా ఉండగా శ్రీరామ నవమి పర్వదినం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లాలో ఎక్కువగా ఘర్షణలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ-జేడీయూ కూటమి విఫలమైందని, బీజేపీ నాయకులు మత ఘర్షణలను ప్రోత్సాహిస్తూన్నారంటూ బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. -
దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బిహార్ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడే క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్, తన కొడుకు తేజస్వి యాదవ్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున్న కోర్టు వచ్చారు. రెండు దశాబ్దాల అనంతరం ఈ కేసుపై నేడు సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే బిహార్ మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులు ప్రకటించగా.. లాలూతో సహా 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టులోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో ఓ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడగా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. ఇప్పటికే అనర్హత వేటు ఎదుర్కొంటున్న లాలూకు ఈ తీర్పు మరింత ప్రతికూలంగా మారింది. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేసినట్లు బిహార్ మాజీ సీఎంలు లాలూ, జగన్నాథ మిశ్రాలతో సహా 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
లాలూపై సీబీఐ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో భాగమైన రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు అక్రమాల కేసులో నిందితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం ఏకంగా ఏడు గంటలపాటు విచారించింది. గురువారం కూతురు మీసా భారతితో కలసి లాలూ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. భారతిని లాబీలో వేచి ఉండమని చెప్పి లాలూను అధికారులు సుదీర్ఘంగా విచారించారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా 2006నాటి రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు ఒప్పందంలో లొసుగులు, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ యజమానులతో సత్సంబంధాలు, లావాదేవీలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. లాలూ కొడుకు తేజస్విని సీబీఐ అధికారులు శుక్రవారం ప్రశ్నించనున్నారు. -
రబ్రీ, తేజస్వి యాదవ్‌లను ప్రశ్నించిన ఐటీ
న్యూఢిల్లీః ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవినీతి కేసులపై సీబీఐ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా తాజాగా ఆదాయపన్ను శాఖ ఆయనను టార్గెట్ చేసింది. బినామీ ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలపై ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌ను మంగళవారం ఐటీ అధికారులు గంటన్నరపైగా విచారించారు. ఈ సందర్భంగా వీరిని పలు అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. పాట్నాలో రబ్రీ, తేజస్వీలను ఐటీ అధికారుల బృందం ప్రశ్నించింది. జూన్ 22న ఇదే కేసులో లాలూ కుమార్తె మిసా భారతిని ఐటీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. -
లాలూ ర్యాలీలో మమత, అఖిలేష్, శరద్ యాదవ్
పాట్నాః బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతను చాటేందుకు ఆదివారం ఆర్జేడీ చీఫ్ నిర్వహించిన మెగా ర్యాలీకి బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీయూ రెబెల్ నేత శరద్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. లాలూ ర్యాలీకి హాజరైతే కఠిన చర్యలు తప్పవని బీహార్ సీఎం నితీష్ నేతృత్వంలోని జేడీయూ హెచ్చరికలను లెక్కచేయకుండా శరద్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. జేడీయూ నుంచి సస్పెండ్అయిన రాజ్యసభ ఎంపీ అలీ అన్వర్‌తో కలిసి ఆయనర్యాలీకి హాజరయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పతనానికి ఈ ర్యాలీ నాందిపలుకుతుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పేర్కొన్నారు. రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి సీపీ జోషీ హాజరయ్యారు. వామపక్షాల నుంచి సురవరం సుధాకర్ రెడ్డి, డీ రాజా, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్, ఎన్సీపీ నేత, ఎంపీ తారిఖ్ అన్వర్లు ర్యాలీలో పాల్గొన్నారు. -
‘మత’ కోటా కోరింది నితీశ్, లాలూనే: మోదీ
కతిహార్/మధుబని: ఇప్పటికే తీవ్రస్థాయిలో రగులుకున్న రిజర్వేషన్ల తేనెతుట్టెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కదిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ 2005లో డిమాండ్ చేశారన్నారు. అసలు ఆ సమయంలో ఒకరి ముఖం మరొకరు చూసుకోనంతగా బద్ధశత్రువులుగా ఉన్న వారిద్దరూ... మత ప్రాతిపాదికన రిజర్వేషన్లపై మాత్రం ఏకమయ్యారని విమర్శించారు. ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్, మధుబనిల్లో నిర్వహించిన ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. అంబేడ్కర్, నెహ్రూ, వల్లభాయ్‌పటేల్ వంటి గొప్పవారు వ్యతిరేకించిన ‘మత రిజర్వేషన్లను’.. అమలు చేయాలని నితీశ్, లాలూ వంటివారు కోరారని.. ఇప్పుడేమో తమకు మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని మార్చేందుకు అధికారం లేదని అన్నారు. -
'ఉరితీసే తలారి నరేంద్ర మోడీ'
పాట్నా: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోద్రా అల్లర్లకు కారణమైన మోడీని చూస్తే కసాయి కూడా సిగ్గుతో తలదించుకుంటాడని నిన్న వ్యాఖ్యానించిన లాలూ ఈ రోజు మోడీ ఉరితీసే తలారి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. పాట్నా విమానాశ్రయంలో లాలూ ఈరోజు విలేకరులతో మాట్లాడారు. ‘‘మోడీ ఓ తలారి. ఆయన ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఇది మాత్రం మారదు’’ అని అన్నారు. లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వన్ లాంటి వారు మోడీ వెంట వెళ్లడం తనకు బాధకలిగించిందన్నారు. ఒక ముస్లింను బీహార్‌కు ముఖ్యమంత్రిని చేస్తానన్న పాశ్వన్ తలారి మోడీతో వెళ్లారని చెప్పారు. -
మూడు ముక్కలాట
బీహార్‌లో త్రిముఖ పోరు అభివృద్ధిపై నితీశ్, మోడీపై బీజేపీ, ‘చే’యూతపై లాలూ ఆశలు ఎలక్షన్ డెస్క్: నిరంతర రాజకీయ చైతన్యానికి ఎంతగా పేరు పొందిందో, అరాచకానికీ అంతే పేరు పొందిన రాష్ట్రం బీహార్. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జయప్రకాశ్ నారాయణ్ బీహారీలే. బీహార్‌లో నేటి తరానికి చెందిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్, జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జాతీయ రాజకీయాల్లోనూ తమ ప్రభావం చూపుతున్నారు. వెనుకబడిన ‘బీమారు’ (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లో ఒకటైన బీహార్, 2005లో నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రగతిమార్గం పట్టింది. నితీశ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ రాష్ట్రంలోని 40 సీట్లకు గాను 20 గెలుచుకోగలిగింది. 2004 నాటి ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్నది ఆరు సీట్లే. అయితే, ప్రస్తుతం పరిస్థితి మారింది. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో నితీశ్ ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్నారు. మోడీ ప్రచారం బీహార్‌పైనా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి నితీశ్‌కు వ్యతిరేకంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ‘జబ్ తక్ సమోసా మే రహేగా ఆలూ... తబ్ తక్ బీహార్ మే రహేగా లాలూ’ అంటూ సగర్వంగా ప్రకటించుకున్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పునర్వైభవాన్ని సాధించేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. దాణా కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఆయన పరువు మంటగలిసింది. అయితే, కాంగ్రెస్‌తో చేతులు కలిపి ‘లౌకిక’ నినాదంతో మోడీపై విమర్శలు గుప్పిస్తూ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్జేడీతో పొత్తు తమకూ లాభసాటిగానే ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వం కూడా భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో నితీశ్ సీపీఐతో పొత్తు పెట్టుకోగా, పాశ్వాన్ ఎన్డీఏ గూటికి చేరారు. ఇప్పటికే 13 స్థానాలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, బీహార్‌లో బీజేపీనే ఎక్కువగా లాభపడేలా కనిపిస్తోంది. నితీశ్ సర్కారుపై 63శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జేడీయూకి ఓటేయబోమని చెబుతున్నారు. మోడీ ప్రభావంతో ఆ ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ ఆశలు పెట్టుకుంటోంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయనే అంచనాతో కూడా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌కు మరో ప్రత్యేకత ఉంది. దేశమంతా ఓటింగు తీరు ఒకలా ఉంటే, బీహార్‌లో మాత్రం మరోలా ఉంటుం ది. 1989 నుంచి దేశవ్యాప్తంగా మద్దతు లభించిన పార్టీకి బీహార్‌లో చుక్కెదురవుతూ వచ్చింది. ఈసారి ఆ తీరు మారి, బీహార్‌లోనూ తమకే అత్యధిక స్థానాలు లభిస్తాయని బీజేపీ ఆశిస్తోంది. బీహార్ అనగానే ఇదివరకు ఠక్కున గుర్తొచ్చే పేరు లాలూప్రసాద్ యాదవ్. కానీ ఇప్పుడు ఆయన చరిష్మా కనుమరుగవుతోంది. ఒకవైపు దాణా స్కామ్‌లో దోషిగా తేలి జైలుకెళ్లడం.. మరోవైపు అభివృద్ధి ఎజెండాతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూసుకెళ్తుండటం.. లాలూని, ఆయన పార్టీ ఆర్జేడీని కలవరపరుస్తున్నాయి. బీహార్ అంటే ఇప్పుడు గుర్తొచ్చే పేరు నితీశ్ కుమార్. 2005లో సీఎంగా పగ్గాలు స్వీకరించి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వ పాఠశాలల పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏకు దూరమైనా సొంత ఇమేజ్‌తో ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాననే విశ్వాసంతో ఉన్నారు. హజీపూర్ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 7 సార్లు గెలుపొందిన రామ్ విలాస్ పాశ్వాన్.. 2009లో మాత్రం ఓడిపోయారు. 2000లో జేడీయూ నుంచి విడిపోయి ఎల్జేపీ స్థాపించారు. 2004లో 4 సీట్లలో గెలుపొందిన ఈ పార్టీ.. 2009లో ఒక్క స్థానంలోనూ గెలవలేదు. ఈసారి హజీపూర్ నుంచి పాశ్వాన్, జమూయ్ నుంచి ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ బరిలో ఉన్నారు. పార్టీల బలాబలాలు జేడీ(యూ) బలాలు: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తిత్వం, ఆయన పాలనలో సాధించిన అభివృద్ధి. కుర్మి, కోయెరీ, ఈబీసీ, మహాదళితుల ఓట్లు సవాళ్లు: ఈబీసీల ఓట్లు బీజేపీకి పడకుండా చూసుకోవడం. మోడీ ప్రభావాన్ని తగ్గించడం. ముస్లింల ఓట్లు సాధించడం. బీజేపీ బలాలు: హిందూ ఓట్లు(మోడీ సభ సందర్భంగా పాట్నాలో బాంబు పేలుళ్ల అనంతరం హిందువులు భారీగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తల నేపథ్యంలో). ఠమోడీ ప్రభావం. బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలిక. కొత్తగా ఎల్జేపీతో పొత్తు సవాళ్లు: యువ ఓట్ల సమీకరణ. ఈబీసీలను బీజేపీ వైపుకు ఆకర్షించడం కాంగ్రెస్ బలం: ఆర్జేడీతో కలిసి పోటీ చేయడం సవాలు: బలంగా లేని పార్టీ కేడర్ ఆర్జేడీ బలాలు: కాంగ్రెస్‌తో పొత్తు. ఠలాలూను అన్యాయంగా బలి చేశారన్న బలహీన వర్గాల్లోని నమ్మకం. సవాలు: లాలూ అవినీతి నేపథ్యం -
రబ్రీకి ఇంటిపోరు... లాలూకు ‘పుత్రిక వాత్సల్య’ తిప్పలు!
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు పుత్రిక వాత్సల్యంతో, ఆయనభార్య రబ్రీదేవికి ఇంటిపోరుతో కొత్త కష్టాలొచ్చాయి. సరాన్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలోకి దిగనున్న రబ్రీదేవికి వ్యతిరేకంగా తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె సొంత సోదరుడు అనిరుధ్ ప్రసాద్ అలియాస్ సాధూయాదవ్ మంగళవారం ప్రకటించారు. 1990 నుంచి 2005 వరకు ఆర్జేడీ పాలనలో లాలూ బావమరిదిగా చక్రంతిప్పిన సాధూ వివాదాస్పద నేతగా నిలిచారు. తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో లాలూతోనే గొడవ పెట్టుకొని పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బెట్టియాలో లాలూపై పోటీ చేసి భంగపడ్డారు. నేరస్థుడికి కీలక పదవి: పుత్రికపై వాత్సల్యం లాలూను చివరకు ఓ నేరస్థుడిని కాళ్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. లాలూ పుత్రిక మీసా భారతి పాటలీపుత్ర నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. అక్కడ జేడీయూ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రంజన్ ప్రసాద్ యాదవ్, రామ్‌క్రిపాల్ యాదవ్ (బీజేపీ) బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు యాదవులే.అదే వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ రిత్లాల్ యాదవ్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ నేత సత్యనారాయణ్ సిన్హా హత్య కేసులో ముద్దాయిగా ప్రస్తుతం పాట్నా జైలులో ఉన్న అతనికి సాధారణ ఎన్నికలలో పోటీ చేసేందుకు దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలా పాటలీపుత్ర నియోజకవర్గంలో యాదవుల ఓట్లన్నీ చీలిపోతే తన కుమార్తెకు కష్టాలు తప్పవని గ్రహించిన లాలూ అప్రమత్తమయ్యారు. గత సోమవారం రాత్రి రిత్లాల్ స్వగ్రామానికి వెళ్లి అతని తండ్రి రామసిశా రాయ్‌తో మంతనాలు జరిపారు. రిత్లాల్ పోటీ నుంచి విరమించేలా, అలాగే మీసా భారతికి మద్దతు తెలిపేలా ఒప్పించారు. ఇందుకు ప్రతిఫలంగా రిత్లాల్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రకటన జారీ చేశారు. అంతేకాదు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రిత్లాల్ తండ్రికి ఆర్జేడీ తరఫున టికెటు ఇచ్చేందుకు లాలూ ఒప్పందం కుదుర్చుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఎలక్షన్ వాచ్
వారణాసే మోడీకి రాజకీయ సమాధి: లాలూ పాట్నా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వారణాసిలో పోటీకి నిలుపుతూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ తీవ్రంగా ఆక్షేపించారు. మోడీ రాజకీయ జీవితానికి వారణాసే సమాధి అవుతుందని వ్యాఖ్యానించారు. లాలూ ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘అసలు వారణాసి గురించి మీరేం అనుకుంటున్నారు? అది పూర్తిగా లౌకిక ప్రాంతం. మోడీ అక్కడ ఓడిపోవడం ఖాయం. ఆయనకు వారణాసే రాజకీయ సమాధి అవుతుంది’ అని జోస్యం చెప్పారు. అసలు మోడీ తన సొంత రాష్ట్రాన్ని వదిలి, వేరే రాష్ట్రంలో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీట్లు లేవని ఎద్దేవా చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నేతలకు సీట్లు దొరకడంలేదు. అందుకే సీటు వెతుక్కునే క్రమంలో వారు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. మోడీ కూడా వారిలో ఒకరు. సురక్షిత నియోజకవర్గాన్ని వెతుక్కునేందుకు గుజరాత్ నుంచి పారిపోయి వచ్చారు’’ అని లాలూ ఎద్దేవా చేశారు. ‘బాలల హక్కులపై మేనిఫెస్టోల్లో చెప్పండి’ న్యూఢిల్లీ: తమ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో బాలల హక్కుల పరిరక్షణపై ఒక అధ్యాయాన్ని చేర్చాలని అన్ని రాజకీయ పార్టీలను బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) కోరింది. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఎం తదితర పార్టీలకు ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ కుశల్ సింగ్ లేఖ రాశారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం పథకాలు, ఆచరణ సంస్థలు ఉన్నా వాటిని సమర్థవంతంగా పనిచేయించడంలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. నిర్బంధ ఉచిత విద్య, లైంగిక దాడుల నుంచి రక్షణ, బాల కార్మికులు, బాల్య వివాహాలు, వలస కార్మికుల పిల్లలకు రక్షణ, శిశు, భ్రూణ హత్యలు తదితర అంశాలపై తీసుకునే చర్యలపై మేనిఫెస్టోల్లో పేర్కొనాలని ఆమె లేఖలో కోరారు. మహిళలకు జాతీయపార్టీల ప్రాధాన్యం! సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ ప్రతిపక్షనాయకురాలు సుష్మాస్వరాజ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ 15వ లోక్‌సభలో కీలక బాధ్యతలు నిర్వహించి తమ శక్తియక్తులను చాటుకున్నారు. రాజకీయాల్లో మహిళల రాణిం పు, ప్రాధాన్యం పెరుగుతున్నందున ఈసారి కూడా వారికి పెద్దసంఖ్యలో సీట్లు ఇచ్చేం దుకు ప్రధాన పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు సైతం మహిళా సభ్యులను చట్టసభలకు పంపేందుకు ముందుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే మొత్తం 556 మంది మహిళా అభ్యర్థులు లోక్‌సభ బరి లో నిలిచారు. వీరిలో 134 మందిని జాతీయ పార్టీలు, 27 మందిని రాష్ట్రీయ పార్టీలు, 188 మందిని గుర్తింపు పొందిన పార్టీలు పోటికి నిలిపాయి. మరో 207 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తమ్మీద పదిహేనో లోక్‌సభ ఎన్నికల్లో 556 మంది మహిళలు పోటీపడగా.. 61 మంది గెలిచారు. ఎన్నికల తర్వాతే ‘మూడు’కు యత్నించాల్సింది! తృతీయ కూటమి ఏర్పాటుపై ఏబీ బర్ధన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నించి ఉండాల్సిందని సీపీఐ అభిప్రాయపడింది. ఎన్నికలకు ముందే ఈ కూటమి ఏర్పాటుకు యత్నించడం వామపక్షాలు చేసిన తప్పిదమని సీపీఐ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ వ్యాఖ్యానించారు. సీఎన్ఎన్-ఐబీఎన్‌లో కరణ్ థాపర్ నిర్వహించే డెవిల్స్ అడ్వొకేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రాంతీయ పార్టీలు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాయన్నారు. మూడో కూటమిలో ఎక్కువగా ఉండేది ప్రాంతీయ పార్టీలేనని, అందువల్ల ఎన్నికలకు ముందే వాటితో సీట్ల సర్దుబాటు అంశంపై మాట్లాడకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. ‘‘ఎన్నికలకు ముందే తృతీయ కూటమి ఏర్పాటు చేయడానికి మేం ప్రయత్నించకుండా ఉండాల్సింది. ఎందుకంటే చాలా ప్రాంతీయ పార్టీలు తమ సీట్ల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచుకోవడానికి కృషి చేస్తాయి. ఏ సీటును కూడా వదులుకోవడానికి అంగీకరించవు’’ అని వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వైఖరితో తీవ్ర నిరాశ చెందానని బర్ధన్ తెలిపారు. సీపీఐకి ఆ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క సీటు ఇస్తాననడం ఆవేదన కలిగించిందన్నారు. మావోయిస్టు పోస్టర్ల కలకలం కోరాపుట్: ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోస్టర్లు మరోసారి కలకలం రేపాయి. ఏప్రిల్ 10న జరగనున్న పోలింగ్‌లో ఓటు వేయరాదని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో కోరాపుట్ జిల్లాలోని మజ్హిగూడ, దస్మంత్పూర్ పంచాయతీల్లో పోస్టర్లు వెలిశాయి. దీంతో స్థానిక నేతల్లో ఆందోళన నెలకొంది. అన్ని పార్టీలూ పేదలకు వ్యతిరేకమైనవేనని ఆ పోస్టర్లలో మావోయిస్టులు ఆరోపించారు. ప్రచారం కోసం వచ్చే నేతలను గ్రామాల్లోకి అడుగుపెట్టనీయవద్దని స్థానికులను హెచ్చరించారు. కాగా, తాము కొన్ని పోస్టర్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి వెనుక స్థానికంగా మావోయిస్టు మద్దతుదారుల హస్తం ఉందని భావిస్తున్నట్లు కోరాపుట్ ఎస్పీ అవినాష్‌కుమార్ తెలిపారు. మాధేపురా బరిలో శరద్ యాదవ్ న్యూఢిల్లీ: బీహార్‌లోని లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను జనతాదళ్ (యునెటైడ్) ఆదివారం విడుదల చేసింది. 32 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. దీనిలో పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్, సినీ దర్శకుడు ప్రకాశ్ ఝా, పారిశ్రామికవేత్త అనిల్ కుమార్ శర్మ తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి. శరద్ యాదవ్ మాధేపురా నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ప్రకాశ్ ఝా పశ్చిమ చంపారన్ నుంచి, అనిల్‌కుమార్ శర్మ జెహానాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. శరద్‌కు పోటీగా ఆర్జేడీకి చెందిన పప్పూ యాదవ్ బరిలో దిగనున్నారు. ‘చాయ్ పే చర్చా’పై ఈసీ కేసు నమోదు న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి మరింత ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఆపార్టీ నిర్వహిస్తున్న ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆపార్టీ నేతలపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ ఖెరి జిల్లాలో ఈ నెల 8న నిర్వహించిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రజలకు ఉచితంగా టీలు పంచారని యూపీ ఎన్నికల ప్రధానాధికారి ఉమేష్ సిన్హా వెల్లడించారు. -
చేతులు కలిపిన ఆర్జేడీ-కాంగ్రెస్
గయ: బీహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ పొత్తుపై అనిశ్చితికి తెరపడింది. రెండు పార్టీలు రాజీ ధోరణిలో కలసి సాగాలని నిర్ణయానికొచ్చాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం గయలో జరిగిన బహిరంగ సభలో వెల్లడించారు. చర్చలు ముగిశాయని, పొత్తు విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామన్నారు. అలాగే, రెండు రోజుల్లో తమ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఆర్జేడీ వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌కు 12 లోక్‌సభ స్థానాలు, ఎన్సీపీకి ఒక స్థానం ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో మిగిలిన స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. ఇంతకుముందు కాంగ్రెస్‌కు 11 స్థానాలే ఇస్తామని లాలూ బీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. 2009లో లాలూ కాంగ్రెస్‌కు కేవలం 3 స్థానాలే ఇవ్వజూపడంతో పొత్తు సాకారం కాలేదు. ఆ దెబ్బకు లాలూ కూడా చేదు ఫలితాలు చవి చూడడంతో అలాంటి పొరపాటుకు మళ్లీ తావివ్వరాదని ఈసారి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరించినట్లు కనిపిస్తోంది. లాలూని నోరారా ప్రశంసించిన కాంగ్రెస్ లాలూ ప్రసాద్ తమకు సంపూర్ణ మద్దతునిచ్చే మిత్రుడిగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. పార్లమెంటు లోపల, వెలుపల తమకు పూర్తి మద్దతునిచ్చారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్‌జా ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ఇరు పార్టీల మధ్య వివాదం లేదని స్పష్టం చేశారు. -
లాలూ ఆర్జేడీలో చీలిక
13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు జేడీ(యూ) సర్కారుకు జైకొడుతూ స్పీకర్‌కు లేఖ కొద్దిసేపటికే సొంతగూటికి ఆరుగురు ఎమ్మెల్యేలు పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీలిపోరుుంది. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జనతాదళ్ (యూ) నేతృత్వంలోని నితీశ్‌కుమార్ ప్రభుత్వానికి జై కొట్టారు. మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురితో పాటు వీరంతా సోమవారం ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి నివాసంలో సమావేశమయ్యూరు. ఆర్జేడీని వీడి నితీశ్ సర్కారుకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలియజేస్తూ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరికి ఓ లేఖ రాశారు. స్పీకర్‌కు లేఖ రాసిన విషయూన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ ధ్రువీకరించారు. అరుుతే అత్యంత నాటకీయంగా వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత కొద్దిసేపటికే తాము వేరుకుంపటి వర్గంలో లేమని స్పష్టం చేశారు. సామ్రాట్ చౌదరి, జావెద్ ఇక్బాల్ అన్సారీతో పాటు రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్, దుర్గాప్రసాద్ సింగ్, లలిత్ యూదవ్, అనిరుధ్ కుమార్, జితేంద్ర రాయ్, అక్తర్-ఉల్-ఇస్లాం సాహీన్, అక్తర్-ఉల్-ఇమాన్, అబ్దుల్ గఫూర్, ఫయూజ్, రామ్ లఖన్ రామ్ రమణ్, చంద్రశేఖర్‌ల సంతకాలతో కూడిన లేఖ అసెంబ్లీకి చేరింది. దీంతో మధ్యంతర ఏర్పాటు కింద వారు ప్రత్యేక బృందంగా కూర్చునేందుకు అనుమతి ఇచ్చినట్లు అసెంబ్లీ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. అరుుతే కొద్దిసేపటికే ఆర్జేడీ శాసనసభాపక్ష నేత అబ్దుల్ బారి సిద్దిఖీతో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు మీడియూతో మాట్లాడారు. ఆర్జేడీ నుంచి బయటికొచ్చి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసి తామెలాంటి లేఖపైనా సంతకాలు చేయలేదని వారు విలేకరులకు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సావధాన తీర్మానం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఆ సంతకాలు తీసుకున్నట్టు అబ్దుల్ గఫూర్ పేర్కొన్నారు. లలిత్‌యూదవ్, ఫయూజ్ అహ్మద్, దుర్గాప్రసాద్ సింగ్, చంద్రశేఖర్, ఇస్లాం సాహీన్‌లు ఆర్జేడీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో చీలిక వార్తలను విన్నానని, ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నానని లాలూ ఢిల్లీలో విలేకరులకు చెప్పారు. బీజేపీతో పొత్తుకు ఎల్జేపీ సై! న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కారణంగా గతంలో ఎన్డీఏకి దూరమైన లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) ఇప్పుడు మళ్లీ బీజేపీతో ఎన్నికల పొత్తుకు ఆసక్తిగా ఉందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కోర్టులు క్లీన్చిట్ ఇచ్చిన తర్వాత ఇక సమస్యల్లేవని ఆయన సోమవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అయితే సీట్ల కేటాయిం పులో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఊగిసలాట ప్రదర్శించడంతో అసంతృప్తితో ఉన్న ఎల్జేపీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోందని సమాచారం. -
ఇకపై లాలూ ట్వీట్లు
పాట్నా: ‘‘ఈ ఐటీ, వైటీతో ఏమవుతుంది’’ అని చెప్పే ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌లో కూడా మార్పు వచ్చింది. ఎప్పుడూ సాధారణ దేశవాళీ యాసతో, కట్టుతో కనిపించే లాలూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించే సామాజిక అనుసంధాన వెబ్సైట్ల ఆవశ్యకత గుర్తించారు. ఆయన ట్విట్టర్లో మంగళవారం ఖాతా తెరిచారు. ట్విట్టర్.కామ్/లాలూప్రసాద్ఆర్జేడీలో ఆయన్ను అనుసరించవచ్చు. ‘‘మార్పు మాత్రమే స్థిరమైనది. మార్పుతోనే మనం కూడా మారతాం. ట్విట్టర్లో ఖాతా తెరిచాను’’ అని తొలి సందేశంలో లాలూ పేర్కొన్నారు. మనందరి లక్ష్యమైన మంచి భవిష్యత్ కోసం సమష్టిగా కృషి చేద్దామని మరో ట్వీట్ చేశారు. తొలి రోజు ఆయన్ను 68 మంది నెటిజన్లు అనుసరించారు. -
లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత
ఢిల్లీ:బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయన్ను ఆర్జేడీ నేతలు నగరంలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన లాలూ..రాబోవు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో నే తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై మండిపడ్డారు. మోడీ ఎప్పటికీ ప్రధాని మంత్రి కాలేరని యాదవ్ జోస్యం చెప్పారు. బిర్సాముండా జైలు నుంచి గత సోమవారం మధ్యాహ్నం లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. -
మతతత్వ శక్తులను తరిమికొడతా.. లాలూ హెచ్చరిక
మతతత్వ శక్తులను తరిమికొడతానని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. దాణా కుంభకోణం కేసులో రెండున్నర నెలల కిందట జైలు పాలైన ఆయన, సోమవారం బెయిలుపై విడుదలయ్యారు. రాంచీలోని బిర్సాముండా జైలు నుంచి బయటకు వస్తూనే మతతత్వ శక్తులపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో అధికారం కోసం నరేంద్ర మోడీ, బీజేపీ, ఆరెస్సెస్‌లు కంటున్న కలలను సాకారం కానివ్వబోమని అన్నారు. జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ, ‘మతతత్వ శక్తులు ఢిల్లీపై పట్టు బిగించాలని కోరుకుంటున్నాయి. నేను బయటకు వచ్చాను. వాటిని తరిమికొడతాను. లౌకిక శక్తుల బలోపేతానికి దేశమంతటా పర్యటిస్తాను’ అని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ‘నరేంద్ర మోడీ కానీ, మరే మోడీ అయినా కానీ... ఇప్పుడు నేను బయటకు వచ్చా... నేను రెడీ’ అని వ్యాఖ్యానించారు. ‘జబ్ తక్ రహేగా ఆలూ...’: జైలు నుంచి విడుదలైన తర్వాత తామార్లోని దేవరీ ఆలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘నేను జైలుకు వెళ్లినపుడు నా పని అయిపోయిందని కొందరు అనుకున్నారు. కానీ వాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. జబ్ తక్ రహేగా ఆలూ.. తబ్ తక్ రహేగా లాలూ (బంగాళదుంపలు ఉన్నంత వరకు లాలూ ఉంటాడు)’ అని వ్యాఖ్యానించారు. -
నరేంద్ర మోడీని ఢీ కొడతా: లాలూ
రాంచీ: మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీలను ఏకం చేయనున్నట్టు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. మతతత్వ పార్టీలను అధికారంలోకి రాకుండా చేయడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. 'నరేంద్ర మోడీ లేదా మరో మోడీ అయినా ఎదుర్కొవడానికి నేను సిద్ధం' అన్నారు. లౌకిక పార్టీలను ఏకం చేసేందుకు దేశమంతా పర్యటిస్తానని చెప్పారు. లోక్‌పాల్ బిల్లును అడ్డుకునేందుకు అన్నా హజారే లాంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకే పరిమితమైందని, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేకపోతోందని ఎద్దేవా చేశారు. బిర్సాముండా జైలు నుంచి బెయిల్‌పై ఆయన సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు
న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో చత్పూజను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చత్పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని మహిళల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు బీహార్ మాజీ ముఖ్యమంత్రి - లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవీ పాట్నాలో చత్పూజ నిర్వహించారు. సొంత నివాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పశువుల దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్‌యాదవ్ జైలుపాలు కాగా.. అతని ఫ్లెక్సీలను పూజా ప్రాంతంలో ప్రదర్శించారు. -
లాలూ, జగదీశ్‌పై అనర్హత వేటు
న్యూఢిల్లీ: అనుకున్నట్లే అయింది. దాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న ఎంపీలు లాలూ ప్రసాద్ యాదవ్, జగదీశ్ శర్మ లోక్‌సభ సభ్యత్వాల్ని కోల్పోయారు. వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ లోక్‌సభ ప్రధా న కార్యదర్శి బాల్ శేఖర్ ప్రకటన జారీ చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూపై మొత్తం పదకొండేళ్లు, జగదీశ్‌పై మొత్తం పదేళ్లు అనర్హత వేటు పడింది. ఐదేళ్లు శిక్ష పడ్డ లాలూ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్లు, నాలుగేళ్ల శిక్ష పడ్డ జగదీశ్ శిక్ష అనంతరం మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల నియమావళి ప్రకారం నిషేధం విధించారు. ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి కూడా పంపారు. 65 ఏళ్ల లాలూ బీహార్‌లోని శరణ్ నియోజకవర్గం నుంచి 63 ఏళ్ల జగదీశ్ శర్మ జహానాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యా రు. కాగా, కళంకిత ప్రజాప్రతినిధుల అనర్హతపై ఈ ఏడాది జూలై 10న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విష యం తెలిసిందే. ఆ తీర్పును అనుసరించి పార్లమెంట్ సభ్యులపై వేటు పడడం ఇది రెండోసారి కాగా, లోక్‌సభ సభ్యులపై మొదటిసారి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్‌పై ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం సోమవారం అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు సెప్టెంబర్ 19న దోషిగా తీర్పిస్తూ ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. అప్పటి నుంచీ ఆయనపై నిషేధం అమల్లోకి వస్తుందని రాజ్యసభ సెక్రెటేరియట్ తన నిషేధ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే శిక్ష ఖరారైనా వెంటనే నిషే ధం పడకుండా ఉండేలా ఒక ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దానిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించడం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దానిని ఒక నాన్సెన్స్గా అభివర్ణించడంతో ఆ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండానే వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్ వాహనవతి కూడా ఎంపీ సీట్లు ఖాళీ అయ్యాయని ప్రకటిస్తూ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ మధ్యనే లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెప్పారు. -
ప్రజల దృష్టిలో లాలూ ఓ హీరో: రబ్రీదేవి
'ప్రజల దృష్టిలో రాష్టీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ హీరో' అని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి రబ్రీ దేవి వ్యాఖ్యానించారు. లోకసభ సభ్యుడిగా అనర్హతతోపాటు, మరో పదకొండు ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా లాలూపై వేటు పడిన నేపథ్యంలో రబ్రీ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల, ప్రజల దృష్టిలో లాలూ ప్రసాద్ యాదవ్ ఓ హీరో అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాజకీయ కుట్రకు తన భర్త బలైపోయాడు అని అన్నారు. పశుగ్రాస కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల పాటు, మరో ఎంపీ జగదీష్ శర్మలకు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ, శర్మలు రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.