పాట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల కలకలం రేగింది. మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ సన్నిహితుడు, ఇసుక మైనింగ్ కింగ్ సుభాష్‌యాయాదవ్ ఇళ్లు, ఆఫీసులపై శనివారం ఉదయం ఈడీ సోదాలు ప్రారంభించింది.
రాజధాని పాట్నా శివార్లతో పాటు దానాపూర్‌లోని పన్నెండు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో సుభాష్ యాదవ్ ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో ఈ మార్చి 3న జరిగిన మహాబంధన్ జనవిశ్వాస మహా ర్యాలీలో సుభాష్ యాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం.
కాగా, రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చర్చనీయాంశమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment