ఆదిలాబాద్/తెలంగాణ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబమే లేదన్న లాలూ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే.. లాలూ వ్యాఖ్యలపై ఇవాళ తెలంగాణ ఆదిలాబాద్ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా ప్రస్తావించారు.
‘నా జీవితం తెరిచిన పుస్తకం.. నా జీవితం దేశం కోసం అంకితం. వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తే నన్ను దూషిస్తున్నారు. దేశ ప్రజలే నా బంధువులు’ అని మోదీ అన్నారు. ఎవరూ లేనివారికి మోదీనే కుటుంబమన్న ప్రధాని మోదీ.. ‘నేనే మోదీ కుటంబం’(మై హూ మోదీ పరివార్) Modi ka parivaar అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో బీజేపీ అగ్రనేతలు సోషల్‌మీడియా ఖాతాల్లో తమ బయో మార్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ‘మోదీ పరివార్’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెటిజన్లు ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆదివారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ‘ జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మోదీ అసలు హిందువే కాదని.. ఆయన తన తల్లి మరణించిన సమయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం శిరోముండనం తెలిపారు. అలాగే.. ఎక్కువ సంతానం ఉన్నవాళ్లను సైతం మోదీ తరచూ విమర్శిస్తుంటారని లాలూ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment