
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(RJD chief Lalu Yadav) మరోమారు చిక్కుల్లో పడ్డారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన తన కుమార్తె మిసా భారతితో కలిసి బుధవారం పట్నా(బీహార్)లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
మరోవైపు లాలూ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ ఈడీ కార్యాలయం వెలుపల ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసును లాలూ గతంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు. 2024 నుండి 2009 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో లాలూ పలువురికి ఉద్యోగాలు ఇప్పించి, అందుకు ప్రతిగా వారి భూములను తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav)లు మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.
దాదాపు 14 నెలల తర్వాత ఈ కేసులో లాలూ యాదవ్ విచారణకు ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ 2024, జనవరి 20 న లాలూ యాదవ్ వాంగ్మూలాన్ని నమోదు చేయగా, గత ఏడాది జనవరి 30న తేజస్వి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. అప్పుడు కూడా ఆర్జేడీ నేతలు ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మరోవైపు దర్యాప్తులో తమ కుటుంబం పూర్తిగా ఈడీకి సహకరిస్తోందని లాలూ కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి తెలిపారు.
‘ల్యాండ్ ఫర జాబ్’ కేసును ఈడీతోపాటు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ 2022 మే 18న ఈ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఈడీ గత ఏడాది చార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ కేసులో లాలూ, రబ్రీ, వారి ఇద్దరు కుమార్తెలు సహా మొత్తం 11 మంది నిందితులుగా ఉండగా, సీబీఐ మొత్తం 78 మందిని నిందితులుగా చేర్చింది. రెండు కేసుల్లో లాలూ కుటుంబానికి కోర్టు నుండి బెయిల్ లభించింది.
ఇది కూడా చదవండి: Sunita Williams: నాటి సెల్ఫీని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment