Lalu prasad son
-
‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో ఈడీ విచారణకు లాలూ
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(RJD chief Lalu Yadav) మరోమారు చిక్కుల్లో పడ్డారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన తన కుమార్తె మిసా భారతితో కలిసి బుధవారం పట్నా(బీహార్)లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.మరోవైపు లాలూ యాదవ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ ఈడీ కార్యాలయం వెలుపల ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసును లాలూ గతంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు. 2024 నుండి 2009 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో లాలూ పలువురికి ఉద్యోగాలు ఇప్పించి, అందుకు ప్రతిగా వారి భూములను తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav)లు మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.దాదాపు 14 నెలల తర్వాత ఈ కేసులో లాలూ యాదవ్ విచారణకు ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ 2024, జనవరి 20 న లాలూ యాదవ్ వాంగ్మూలాన్ని నమోదు చేయగా, గత ఏడాది జనవరి 30న తేజస్వి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. అప్పుడు కూడా ఆర్జేడీ నేతలు ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మరోవైపు దర్యాప్తులో తమ కుటుంబం పూర్తిగా ఈడీకి సహకరిస్తోందని లాలూ కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి తెలిపారు.‘ల్యాండ్ ఫర జాబ్’ కేసును ఈడీతోపాటు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ 2022 మే 18న ఈ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఈడీ గత ఏడాది చార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ కేసులో లాలూ, రబ్రీ, వారి ఇద్దరు కుమార్తెలు సహా మొత్తం 11 మంది నిందితులుగా ఉండగా, సీబీఐ మొత్తం 78 మందిని నిందితులుగా చేర్చింది. రెండు కేసుల్లో లాలూ కుటుంబానికి కోర్టు నుండి బెయిల్ లభించింది.ఇది కూడా చదవండి: Sunita Williams: నాటి సెల్ఫీని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా -
తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు ఇవే...
-
లాలూ కొడుకుపై కోటి నజరానా
పట్న : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పై బీజేపీ నేత ఒకరు నజరానా ప్రకటించారు. తేజ్ చెంప పగలకొట్టిన వారికి కోటి రూపాయలు ఇస్తానని అనిల్ సాహ్ని శుక్రవారం ఓ ప్రకటన జారీచేశారు. తేజ్ ఈ మధ్య బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ(బీజేపీ) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆయన అక్రమాలను బయటపెడతానని.. ప్రజల ముందే చెంప పగలకొడతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో పట్నా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ అయిన సాహ్ని ఈ కొత్త ఆఫర్ ప్రకటించాడు. ‘‘మోదీపై దాడి చేస్తానని తేజ్ చెప్పాడు.. అంతకంటే ముందే ఎవరైతే తేజ్‌పైనే దాడి చేస్తారో వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాం’’ అని ప్రకటించాడు. అంతేకాదు తేజ్ చేత క్షమాపణలు చెప్పేదాకా లాలూ ఇంటి ముందు ధర్నా చేపడతామని హెచ్చరించాడు. సాహ్ని వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయన ప్రకటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటికే వివరణ కోరామని... అది సహేతుకంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమని పేర్కొంది. లాలూ తన కొడుకులను అదుపులో పెట్టుకోవాలని సూచించింది కూడా. కాగా, ఔరంగాబాద్‌లో తేజ్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ... డిసెంబర్ 3న జరగబోయే సుశీల్ కొడుకు ఉత్కర్ష్ పెళ్లి ఆహ్వానం తనకు అందిందని.. ఒకవేళ తాను అక్కడికి వెళ్తే మాత్రం రచ్చ చేయటం ఖాయమని హెచ్చరికలు చేశాడు. -
జర్నలిస్టులతో మంత్రిగారి పేచీ
తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి లాలు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎవరితో ఎలా ఉండాలో మాత్రం ఇంకా నేర్చుకోలేకపోయాడు. దాంతో ఎప్పుడూ కొడుకు బదులు తాను వెళ్లే లాలు.. ఈసారి కూడా ముందుకు రాక తప్పలేదు. విషయం ఏమిటంటే, తేజ్ ప్రతాప్ యాదవ్ జర్నలిస్టులతో పేచీ పెట్టుకున్నాడు. కేసు పెడతానంటూ బెదిరించడంతో వాళ్లంతా బయటకు వెళ్లిపోతామన్నారు. చివరకు లాలు రంగప్రవేశం చేసి, జర్నలిస్టులను బుజ్జగించాల్సి వచ్చింది. ఆర్జేడీ 20వ వార్షికోత్సవం సందర్భంగా పట్నాలో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. దానికి లాలు తన కొడుకులిద్దరూ.. ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లతో వెళ్లారు. వేదిక మీద ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ జర్నలిస్టు వద్ద ఉన్న కెమెరా తీసుకుని సరదాగా ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. మరో జర్నలిస్టు ఈ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. దాంతో మంత్రిగారికి కోపం వచ్చింది. వెంటనే ఫోన్లోంచి ఆ వీడియో తీసేయాలని చెప్పాడు. కానీ అందుకు ఆ జర్నలిస్టు నిరాకరించడంతో పరువునష్టం దావా వేస్తానని బెదిరించాడు. దాంతో మీడియా వాళ్లకు కోపం వచ్చి, మొత్తం కార్యక్రమాన్ని అంతా కలిసి బహిష్కరిస్తామన్నారు. విషయం శ్రుతి మించుతోందని గమనించిన లాలు.. వెంటనే రంగప్రవేశం చేసి జర్నలిస్టులను బుజ్జగించారు.