Misa Bharathi
-
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో పోరు ఆసక్తికరంగా మారింది. బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించిన చర్చలు సోషల్ మీడియాలో విరివిగా సాగుతున్నాయి. వీరికి ఈ పేర్లను లాలూ యాదవ్ ఎందుకు పెట్టారని పలువురు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు.అది.. 1976.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నాటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) అని పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ లాలూ తన తొలి కుమార్తెకు ‘మీసా భారతి’ అని పేరు పెట్టారు.ఇక రోహణి ఆచార్యకు ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయానికొస్తే.. లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి 1979లో మరోసారి తల్లి అయ్యారు. ఆమెకు డెలివరీకి ముందు తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలియగానే అప్పట్లో లాలూ యాదవ్ భయపడ్డారట. పట్నాకు చెందిన నాటి ప్రముఖ మహిళా వైద్యురాలు కమలా ఆచార్య.. లాలూ భార్య రబ్రీ దేవికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.అయితే ఆమె ఆపరేషన్‌కు అయిన ఖర్చును లాలూ నుంచి తీసుకునేందుకు నిరాకరించాట. లాలూ యాదవ్‌కు రెండో కుమార్తె పుట్టిన సమయంలో రోహిణి నక్షత్రం ఉందట. దీంతో లాలూ తన కుమార్తెకు రోహిణి ఆచార్య అని పేరు పెట్టారు. అంటే కుమార్తె పేరుకు వైద్యురాలి పేరును జత చేశారన్నమాట. ప్రస్తుతం మిసా భారతి పాటలీపుత్ర నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. రోహిణి ఆచార్య బీహార్‌లోని సారణ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్‌పై పోటీ చేస్తున్నారు. -
లోక్‌సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
పాట్నా: భారతదేశంలో నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలు తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి 'మిసా భారతి' సోమవారం లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.'మిసా భారతి' లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన సమయంలో.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీహార్‌కు ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. కానీ ప్రజలకు చేసినేమీ లేదు. మోదీ దేశం కోసం ఏదైనా చేసి ఉంటే.. ఇప్పుడు రోడ్‌షో నిర్వహించాల్సిన అవసరం లేదని మిసా భారతి అన్నారు. మోదీ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో జాబితా చేసి చెప్పాలని ఆమె కోరారు.మిసా భారతి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్‌పై పోటీ చేయనున్నారు. ఇక్కడ జూన్ 1న ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మిసా భారతి 2014, 2019 ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో పాటలీపుత్ర నియోజకవర్గంలో ఓటమి చవి చూసారు. 2014కు ముందు రామ్ కృపాల్ యాదవ్.. లాలూ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. -
లోక్‌సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు?
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఇద్దరిని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధమయింది. ఆర్జేడీ టిక్కెట్‌పై మిసా భారతిని పాటలీపుత్ర నుంచి, రోహిణీ ఆచార్యను సరన్ నుంచి బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. పాటలీపుత్ర నియోజకవర్గంలో ఆర్జేడీ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు ఇప్పటికే రిత్లాల్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పట్నాలోని మాజీ సీఎం రబ్డీదేవి నివాసానికి పలు పర్యాయాలు వచ్చినట్లు కూడా మీడియా అంటోంది. దీంతో, పాటలీపుత్ర నుంచి ఇద్దరిలో ఎవరిని పోటీకి నిలపాలనే విషయంలో కొంత సందిగ్ధం కొనసాగుతున్నట్లు సమాచారం. -
Land For Job Scam: ఛార్జిషీట్లో రబ్రి దేవి, మిసా భారతి పేర్లు
ఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె ఎంపీ కుమార్తె మిసా భారతీతో సహా తదితరుల పేర్లను చార్జిషీట్లో పేర్కొంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అమిత్ కత్యాల్, మరికొందరు వ్యక్తులు, కంపెనీల పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈరోజు తన మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎమ్‌ఎల్‌ఎ) కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. జనవరి 16న విచారణకు కోర్టు జాబితా చేసిందని సమాచారం. ఈ కేసులో కత్యాల్‌ను గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న కాలానికి సంబంధించినది ఈ కుంభకోణం. 2004 నుండి 2009 వరకు, భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో అనేక మంది గ్రూప్ "డి" స్థానాల్లో అక్రమంగా నియమించబడ్డారు. బదులుగా ఆ అభ్యర్థులు తమ భూమిని అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్? -
Land-for-job case: లాలూ కుటుంబానికి ఊరట
న్యూఢిల్లీ: భూమికి ఉద్యోగం కుంభకోణంలో నిందితులుగా ఉన్న నాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా భారతి తదితరులకు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఇటీవల మూత్రపిండమార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న లాలూ బుధవారం ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుల ప్రాంగణానికి చేరుకుని జడ్జి ఎదుట హాజరయ్యారు. ఇతర నిందితులూ వెంట వచ్చారు. లాలూ, రబ్రీ దేవి, మీసా భారతి తదితరులకు ప్రతి ఒక్కరికీ చెరో రూ.50,000 విలువైన వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో పూచీకత్తు సమర్పించాలని సూచిస్తూ అందరికీ బెయిల్ మంజూరుచేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ ఉత్తర్వులు జారీచేశారు. బెయిల్ కోసం నిందితులు గతంలో పెట్టుకున్న అభ్యర్థనలను కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తోసిపుచ్చలేదు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 29వ తేదీకి వాయిదావేసింది. భారతీయ రైల్వే నియామకాల్లో పేర్కొన్న నిబంధనావళిని తొక్కిపెట్టి తమకు తక్కువ ధరకు భూములు దక్కేలా చేసిన ఉద్యోగార్థులకు వేర్వేరు జోన్లలో తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇప్పించారని లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదుచేసి సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెల్సిందే. -
‘ఆయన చేతులు నరికేయాలనిపించింది’
పాట్నా : కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి. పాట్నాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మీసా భారతి రామ్ కృపాల్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని మేము చాలా గౌరవించే వాళ్లం. కానీ 2014లో అతను మా పార్టీని వీడి.. సుశీల్ కుమార్ మోదీతో చేతులు కలిపినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆయన చేతులను నరికేయాలనిపించిందం’టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మీసా భారతి. అయితే ఆర్జేడీకి విధేయుడిగా పేరు పొందిన రామ్ కృపాల్‌కు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొంది ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. -
మిసా భారతి, ఆమె భర్తకు ఊరట
పటియాలా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతికి, ఆమె భర్త శైలేశ్ కుమార్‌కు పటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో వీరిద్దరికీ పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం 2 లక్షల రూపాయలను ష్యూరిటీ కింద సమర్పించాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు అనుమతి లేకుండా.. దేశం విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీచేసింది. వీరిద్దరిపై ఈడీ డిసెంబర్లో ఛార్జ్‌షీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఛార్జ్‌షీటు నమోదు మేరకు నేడు కోర్టుకు హాజరు కావాలని వీరిద్దరినీ కోర్టు ఆదేశించింది. మిస్ మిశాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ పేరుపై భారతీ, ఆమె భర్త ఢిల్లీలో ఓ ఫామ్ హౌస్ కొనుగోలు చేశారు. 2008-09లో షెల్ కంపెనీల ద్వారా ఆర్జించిన అక్రమ సంపద రూ.1.2 కోట్లతో ఈ కొనుగోలు చేపట్టారు. పలు షెల్ కంపెనీలు భాగమై ఉన్న రూ.8000 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణలో ఈ ఫామ్ హౌస్ కొనుగోలు కూడా ఒకటి. ఫామ్ హౌస్ కొనుగోలపై మిశాను ప్రశ్నిస్తే.. మిశాలి ప్యాకర్స్ కంపెనీతో తనకేమీ సంబంధం లేదని, దాన్ని తన భర్త, సందీప్ శర్మ అనే ఛార్టెడ్ అకౌంటెండ్ కలిసి నిర్వహించే వారని తెలిపింది. శైలేష్ కూడా తాను ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను రోజువారీ సమీక్షించలేదని, ఛార్టెడ్ అకౌంటెంట్ శర్మనే అన్నీ చూసుకునే వారని చెప్పారు. అయితే ఆ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నందుకు మీరే బాధ్యత వహించాలని ఈడీ చెప్పింది. మిసా భారతి, శైలేష్ కుమార్, జైన్ బ్రదర్స్ రూ.1.20 కోట్ల మనీలాండరింగ్‌లో ప్రధాన వ్యక్తులని ఈడీ కోర్టుకు తెలిపింది. -
మీసా భారతిపై ఈడీ రెండో చార్జిషీటు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి, ఆమె భర్త శైలేశ్ కుమార్‌పై శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ‘ఈ కేసు విచారణను ప్రారంభిద్దామా? లేక మీరు ఫిర్యాదులు, చార్జిషీట్లు దాఖలు చేస్తూనే ఉంటారా? మీది ఉన్నతస్థాయి విచారణ సంస్థ. ఇలా ప్రవర్తించటం మీకు తగదు. ఇది తప్పుల తడకగా ఉన్న ఫిర్యాదు’ అని ఈడీ తీరుపై ఢిల్లీ హైకోర్టు జడ్జి మండిపడ్డారు. -
లాలూ కుమార్తెపై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేశ్ కుమార్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక కోర్డు జడ్జి ఎన్కే మల్హోత్రా ఎదుట ఈడీ న్యాయవాది నితేశ్ రాణా శనివారం చార్జిషీటు దాఖలు చేశారు. మీసా, శైలేశ్‌లపై నమోదైన మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే ఢిల్లీలోని వారి ఫామ్ హౌస్‌ను అటాచ్ చేసింది. ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద దక్షిణ ఢిల్లీలోని ఫామ్ హౌస్‌ను అటాచ్ చేశాం. ఆ ఫామ్ హౌస్ మీసా, శైలేశ్‌లకు చెందినది. మిషైల్ ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద నమోదైంది. 2008–09లో మనీ ల్యాండరింగ్‌లో భాగంగా రూ.1.2 కోట్లతో దాన్ని కొనుగోలు చేశారు’ అని ఈడీ పేర్కొంది. మీసా భారతి, శైలేశ్ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా కూడా పని చేశారని ఆరోపించింది. -
లాలూ కూతురి ఫామ్ హౌజ్.. ఈడీ అటాచ్
సాక్షి, న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఆయన కూతురు మిసా భారతి ఓ ఇంటిని మంగళవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ అటాచ్ చేసేసింది. ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో మిసా పేరిట ఉన్న పామ్ హౌజ్ ను ఈడీ జప్తు చేసింది. బినామీ ఆస్తుల వ్యవహారం ఆరోపణలు వెలుగుచూడటంతో లాలూ మరియు ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూలై 11న ఈడీ అధికారులు మిసా భారతిని 8 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె భర్త శైలేష్ కుమార్ ను కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ఈడీ.. మిసా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని పలుమార్లు కోరింది కూడా. ఇక 8000 వేల కోట్ల స్కాంగా భావిస్తున్న ఈ కేసులో మిసా ఛార్టెడ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్ ను పేరును ఛార్జీషీట్ లో చేర్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ జూలై 8న సీబీఐ సంస్థ కూడా ఢిల్లీలోని ఆమె నివాసాల్లో సోదాలు నిర్వహించి విచారణ చేపట్టింది. ఓవైపు సీబీఐ, మరోవైపు ఆదాయ పన్నుల శాఖ, ఇంకోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టోరేట్... ఇలా దర్యాప్తు సంస్థలన్నీ ఒక్కసారిగా లాలూ కుటుంబానికి విచారణ పేరిట ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.