
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఇద్దరిని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధమయింది. ఆర్‌జేడీ టిక్కెట్‌పై మిసా భారతిని పాటలీపుత్ర నుంచి, రోహిణీ ఆచార్యను సరన్ నుంచి బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి.
పాటలీపుత్ర నియోజకవర్గంలో ఆర్‌జేడీ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు ఇప్పటికే రిత్‌లాల్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పట్నాలోని మాజీ సీఎం రబ్డీదేవి నివాసానికి పలు పర్యాయాలు వచ్చినట్లు కూడా మీడియా అంటోంది. దీంతో, పాటలీపుత్ర నుంచి ఇద్దరిలో ఎవరిని పోటీకి నిలపాలనే విషయంలో కొంత సందిగ్ధం కొనసాగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment