
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి, ఆమె భర్త శైలేశ్ కుమార్‌పై శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ‘ఈ కేసు విచారణను ప్రారంభిద్దామా? లేక మీరు ఫిర్యాదులు, చార్జిషీట్‌లు దాఖలు చేస్తూనే ఉంటారా? మీది ఉన్నతస్థాయి విచారణ సంస్థ. ఇలా ప్రవర్తించటం మీకు తగదు. ఇది తప్పుల తడకగా ఉన్న ఫిర్యాదు’ అని ఈడీ తీరుపై ఢిల్లీ హైకోర్టు జడ్జి మండిపడ్డారు.