‘ఆయన చేతులు నరికేయాలనిపించింది’ | Misa Bharti Said Felt Like Cutting Ram Kripal Yadav Hand | Sakshi
Sakshi News home page

మీసా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు

Published Sat, Jan 19 2019 7:36 PM | Last Updated on Sat, Jan 19 2019 8:03 PM

Misa Bharti Said Felt Like Cutting Ram Kripal Yadav Hand - Sakshi

పాట్నా : కేం‍ద్ర మంత్రి రామ్‌ కృపాల్‌ యాదవ్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి. పాట్నాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మీసా భారతి రామ్‌ కృపాల్‌ యాదవ్‌ గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని మేము చాలా గౌరవించే వాళ్లం. కానీ 2014లో అతను మా పార్టీని వీడి.. సుశీల్‌ కుమార్‌ మోదీతో చేతులు కలిపినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆయన చేతులను నరికేయాలనిపించిందం’టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మీసా భారతి. అయితే ఆర్జేడీకి విధేయుడిగా పేరు పొందిన రామ్‌ కృపాల్‌కు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. దాంతో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొంది ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement