సుశీల్‌ కుమార్‌ మోదీ కన్నుమూత | Ex Bihar Deputy CM Sushil Kumar Modi passed away | Sakshi
Sakshi News home page

సుశీల్‌ కుమార్‌ మోదీ కన్నుమూత

Published Tue, May 14 2024 6:50 AM | Last Updated on Tue, May 14 2024 12:17 PM

Ex Bihar Deputy CM Sushil Kumar Modi passed away

పట్నా: బిహార్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ(72) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

రాజ్యసభ ఎంపీగాను, 2004 ఎన్నికల్లో భాగల్పూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2005లో ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికై, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుశీల్‌కుమార్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధాని మోదీ సంతాపం..
సుశీల్‌ కుమార్‌ మోదీ మరణంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘పార్టీలో విలువైన సహచారుడు, నా స్నేహితుడు సుశీల్‌  మోదీ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. బిహార్‌లో బీజేపీ ఎదుగుదల, విజయానికి సుశీల్‌  కుమార్ ఘనత వహించారు’ అని ప్రధాని మోదీ  ‘ఎక్స్‌’ వేదికగా సంతాపం తెలియజేశారు.

బిహార్‌ రాజకీయాల్లో గొప్ప మార్గదార్శకుడు: అమిత్‌ షా
‘రాజకీయాల్లో గొప్ప మార్గదర్శకుడని బిహార్‌ కోల్పోయింది. ఆయన రాజకీయాలు పేదలు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం అంకితం చేశారు. ఆయన మరణంతో బీహార్ రాజకీయాల్లో నెలకొన్న శూన్యతను పూరించలేము’ అని అమిత్ షా ‘ఎక్స్‌’లో సంతాపం  తెలియజేశారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుశీల్ కుమార్ మోదీ మృతికి సంతాపం తెలిపారు. ‘గత 51-52 సంవత్సరాలుగా.. పట్నా యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కాలం నుంచి సుశీల్ కుమార్‌ మోదీ నా స్నేహితుడు. ఆయన మృతి బాధాకరం’అని సంతాపం తెలిపారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement