sushil kumar modi
-
బిహార్ మాజీ ముఖ్యమంత్రికి వచ్చిన కేన్సర్ ఎలాంటిదంటే?
బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సోమవారం (మే 13) మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆరు నెలల క్రితమేకేన్సర్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. గొంతు కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ సీఎం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. అతనుఈ కేన్సర్ లక్షణాలు ఏమిటో? నివారణ మార్గాలేమిటో? ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ అభిషేక్ శంకర్ తెలియజేశారు.బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ గొంతు కేన్సర్‌కి గురవడంతో.. ఈ వ్యాధి క్రమంగా అతని ఊపిరితిత్తులకు చేరుకుంది. దీంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో గొంతు కేన్సర్ లక్షణాలు, కారణాలు తెలుసుకుందాం.ఇవి.. గొంతు కేన్సర్ లక్షణాలు..– ఒక వ్యక్తికి తరచుగా దగ్గు సమస్య ఉన్నా, ఆహారం మింగడంలో ఎలాంటి ఇబ్బంది కొనసాగినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి– ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే గొంతు కేన్సర్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.– దీనినే 'అన్నవాహిక' కేన్సర్ అని కూడా పిలుస్తారు. లక్షణాలు– కేన్సర్ కారణంగా.. గొంతునొప్పితో బాధపడుతున్న వ్యక్తి వాయిస్ ముద్దగా మారుతుంది.– ఆహారం తినేటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతోపాటుగా వాపు కూడా సంభవిస్తుంది.– బాధితుడు గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు.. చెవి నొప్పి కూడా రావచ్చు.– దగ్గుతున్నప్పుడు శ్లేష్మంతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది.– అలాగే బరువులో మార్పులు కూడా కనిపిస్తాయి. గొంతు కేన్సర్‌కు కారణమేమిటి?– ఒక వ్యక్తి నిరంతరం ధూమపానం చేయడంతో గొంతు కేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది.– పొగాకు సేవించే వారిలోనూ ఈ వ్యాధి సోకే ప్రభావం ఉంది.– అలాగే ధూమపానంతోపాటు , మద్యం సేవించే వారికి కూడా గొంతు కేన్సర్ వస్తుంది.– ఈ వ్యాధి విటమిన్ ఎ లోపం వల్ల కూడా రావచ్చు.మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?– కేన్సర్ ప్రమాదకరమైన ఒక ప్రాణాంతక వ్యాధి.– శరీరంలోని ఏదైనా భాగంలో కేన్సర్ సోకితే వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. అశ్రద్ధ వహిస్తే క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది.– గొంతు కేన్సర్ ఆహార నాళ ద్వారాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.– గొంతులో అకస్మాత్తుగా భారం, వాయిస్‌లో మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డా. అభిషేక్ శంకర్ తెలిపారు.ఇవి చదవండి: ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి -
సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత
పట్నా: బిహార్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజ్యసభ ఎంపీగాను, 2004 ఎన్నికల్లో భాగల్పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2005లో ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికై, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుశీల్‌కుమార్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రధాని మోదీ సంతాపం..సుశీల్ కుమార్ మోదీ మరణంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘పార్టీలో విలువైన సహచారుడు, నా స్నేహితుడు సుశీల్ మోదీ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. బిహార్‌లో బీజేపీ ఎదుగుదల, విజయానికి సుశీల్ కుమార్ ఘనత వహించారు’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలియజేశారు.पार्टी में अपने मूल्यवान सहयोगी और दशकों से मेरे मित्र रहे सुशील मोदी जी के असामयिक निधन से अत्यंत दुख हुआ है। बिहार में भाजपा के उत्थान और उसकी सफलताओं के पीछे उनका अमूल्य योगदान रहा है। आपातकाल का पुरजोर विरोध करते हुए, उन्होंने छात्र राजनीति से अपनी एक अलग पहचान बनाई थी। वे… pic.twitter.com/160Bfbt72n— Narendra Modi (@narendramodi) May 13, 2024బిహార్ రాజకీయాల్లో గొప్ప మార్గదార్శకుడు: అమిత్ షా‘రాజకీయాల్లో గొప్ప మార్గదర్శకుడని బిహార్ కోల్పోయింది. ఆయన రాజకీయాలు పేదలు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం అంకితం చేశారు. ఆయన మరణంతో బీహార్ రాజకీయాల్లో నెలకొన్న శూన్యతను పూరించలేము’ అని అమిత్ షా ‘ఎక్స్’లో సంతాపం తెలియజేశారు.हमारे वरिष्ठ नेता सुशील कुमार मोदी जी के निधन की सूचना से आहत हूँ। आज बिहार ने राजनीति के एक महान पुरोधा को हमेशा के लिए खो दिया। ABVP से भाजपा तक सुशील जी ने संगठन व सरकार में कई महत्त्वपूर्ण पदों को सुशोभित किया। उनकी राजनीति गरीबों व पिछड़ों के हितों के लिए समर्पित रही। उनके…— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 13, 2024ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుశీల్ కుమార్ మోదీ మృతికి సంతాపం తెలిపారు. ‘గత 51-52 సంవత్సరాలుగా.. పట్నా యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కాలం నుంచి సుశీల్ కుమార్ మోదీ నా స్నేహితుడు. ఆయన మృతి బాధాకరం’అని సంతాపం తెలిపారు. पटना यूनिवर्सिटी छात्र संघ के समय यानि विगत 51-52 वर्षों से हमारे मित्र भाई सुशील मोदी के निधन का अति दुःखद समाचार प्राप्त हुआ।वे एक जुझारू, समर्पित सामाजिक राजनीतिक व्यक्ति थे। ईश्वर दिवगंत आत्मा को चिरशांति तथा परिजनों को दुख सहने की शक्ति प्रदान करें।— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 13, 2024 -
క్యాన్సర్ బారిన సుశీల్ కుమార్ మోదీ!
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్వయంగా తెలియజేశారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్‌సభ, శాసన మండలి, శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లపాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానూ, ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. నాటి ఎమర్జెన్సీ రోజ్లులో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన వరుసగా 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. తొమ్మిదేళ్ల పాటు శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. లోక్‌సభలో భాగల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ సభ్యుడైన తర్వాత, సభలోని లా అండ్ జస్టిస్ కమిటీకి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. తాను ఆరు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నానని సుశీల్ కుమార్ మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు తన అనారోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాను లోక్‌సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని, అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశానని దానిలో పేర్కొన్నారు. पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा । PM को सब कुछ बता दिया है । देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित | — Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024 -
నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయేలోకి?!
అతిత్వరలో బీహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం నెలకొంటుంది. అదీ అధికార పక్షంలోనే!. నితీశ్ కుమార్ వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల నడుమ నితీశ్ మరో దారి లేక తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి అడుగు పెడతారు!!. మహారాష్ట్రలో అజిత్ పవార్‌తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామం నడుమ.. తర్వాతి వంతు బీహార్దేనంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ప్రభుత్వం కూలిపోయే తరుణంలో గత్యంతరం లేని స్థితిలో నితీశ్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరతారంటూ పలు మీడియా విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిస్థితులూ ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండడంతో.. నితీశ్ వైఖరిపైనా అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విపక్షాలు నిర్వహించదల్చిన భేటీ.. మహారాష్ట్ర ఎన్సీపీ ఎపిసోడ్ కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో బీహార్ గత నాలుగు పర్యటనలో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆశ్చర్యంగా తాజా పర్యటనలో మాత్రం పన్నెత్తి మాట అనలేదు. పైగా అవినీతి పక్షంతో పొత్తు(జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీకి) దేనికి అంటూనే.. దానిని దూరంగా ఉండాలంటూ నితీశ్ సర్కార్‌కు పరోక్ష సూచన చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పాత మిత్ర కూటమికి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2017లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేయగా.. నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తుకు ముందుకు వెళ్లారు. అయితే.. తాజా ఊహాగానాలను పటాపంచల్ చేశారు బీహార్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదంతా మీడియా సృష్టేనని తేల్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీశ్‌ను బీజేపీ దగ్గరకు తీయబోదని స్పష్టం చేశారాయన. ‘‘బీజేపీకి ఆయన(నితీశ్) దూరం జరిగాక అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. ఇకపై బీజేపీ ఎప్పటికీ నితీశ్‌ను అంగీకరించబోదని. అలాంటప్పుడు నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది! అని సుశీల్ మోదీ మీడియాతో స్పష్టం చేశారు. అయితే.. బీజేపీకి చెందిన మరో సీనియర్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే మాత్రం మరో తరహా ప్రకటన ఇచ్చారు. బీహార్లోనే కాదు.. యూపీలోనూ మహారాష్ట్ర పరిణామాలు ఏర్పడొచ్చని చెబుతున్నారాయన. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ జేడీయూలో, ఉత్తర ప్రదేశ్ ఎస్పీలోనూ ఆయా పార్టీ చీఫ్‌ల మీద ఉన్న అసంతృప్తితో కొందరు బయటకు రావడం ఖాయం. ఎస్పీలో జయంత్ చౌద్రి ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు అని సంచలన ప్రకటన చేశారు అథావాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో జేడీయూతోగానీ, నితీశ్ కుమార్‌ను గానీ దగ్గరకు తీయొద్దంటూ ఏకంగా ఓ తీర్మానం పాస్ చేసింది పార్టీ. ఇదిలా ఉంటే.. మహా పరిణామాల నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా పడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ఈ నెలలోనే భేటీ ఉంటుందని విపక్షాల తరపున ఒక ప్రకటన వెలువడింది కూడా. ఇదీ చదవండి: ఎన్పీసీని బలోపేతం చేస్తాం.. పునర్నిర్మిస్తాం! -
త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సూచించారు. దేశంలోని ఏటీఎంలలో రూ.2వేల నోట్లన్నీ ఖాళీ అయ్యాయని సుశీల్ మోదీ పేర్కొన్నారు. త్వరలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పారు. కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ మూడేళ్ల కిందటే నిలిపివేసిందని చెప్పుకొచ్చారు. 2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను బ్యాన్ చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. అయితే రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదని సుశీల్ మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చలామణిలో లేవని వివరించారు. భారత్‌లో రూ.2వేల నోట్లను డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ పెద్ద నోటు నల్ల ధనానికి పర్యాయపదంగా మారిందని చెప్పారు. అందుకే కేంద్రం దశల వారీగా రూ.2వేల నోట్లను రద్దు చేసి, వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. చదవండి: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత -
‘నితీశ్ కుమార్ ఈ జన్మలో ప్రధాని కాలేడు!’
పాట్నా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి.. పాత మిత్రపక్షాలతో బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా దల్ యునైటెడ్‌కు(జేడీయూ) మామూలు ఝలక్‌లు తగలడం లేదు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యే ఈమధ్యే బీజేపీలో చేరిపోగా.. తాజాగా ఊహించని రీతిలో మణిపూర్‌లో పెద్ద షాక్ తగిలింది. ఏకంగా ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తూ.. పార్టీ మారిపోయారు. ఈ క్రమంలో జేడీయూపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ప్రధాని కావాలని నితీశ్ కుమార్ కంటున్న కలలు ఈ జన్మలో నెరవేరవని, ఆర్జేడీతో జేడీయూ సర్వనాశనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లు ఇప్పుడు జేడీయూ నుంచి విముక్తి పొందాయి. త్వరలో లాలూ ప్రసాద్ యాదవ్.. ఉన్న జేడీయూను చీల్చడం ఖాయం. అప్పుడు జేడీయూ ముక్త బీహార్ అవుతుంది. జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ప్రధాని అభ్యర్థిగా ఉండాలని నితీశ్ భావిస్తున్నట్లు ఉన్నాడు. కానీ.. ఆ ప్రయత్నం ఈ జన్మలో నెరవేరదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు సుశీల్ మోదీ. ఇక డబ్బు ఉపయోగించి ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగారన్న జేడీయూ చీఫ్ ఆరోపణలను సుశీల్ మోదీ ఖండించారు. రంజన్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. డబ్బుకు లొంగిపోయేంత బలహీనులా వాళ్ల ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్లకా జేడీయూ టికెట్లు ఇచ్చింది? అని సెటైర్లు వేశారాయన. వాళ్లు మొదటి నుంచి ఎన్డీయేలో కొనసాగాలనుకుంటున్నారు. జేడీయూ ఇప్పుడేమో ఎన్డీయేకు దూరం జరిగింది. కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న జేడీయూ అధిష్ఠానం ఆలోచన వాళ్లకు నచ్చలేదు. అందుకే ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అని సుశీల్ మోదీ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: అదే జరిగితే 2024లో సీన్ వేరేలా ఉంటుంది -
సీఎం కేసీఆర్ పట్నా పర్యటనపై సుశీల్ మోదీ కీలక వ్యాఖ్యలు
-
బిహార్ సీఎం పై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ పై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీగా పదివి చేపట్టక మునుపు తాను బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిస్తున్న సమయంలో జేడీయు నాయకులు తన వద్దకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారని అన్నారు. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లితే మీరు ముఖ్యమంత్రి అవుతారంటూ అదే జేడీయే నాయకులు ఒక పథకంతో తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే నితీష్ కుమార్ తనకు ఆ ఉద్దేశం లేదని కొట్టిపారేశారు. కేవలం తాను బీజేపీ వ్యూహం నుంచి తన పార్టీని రక్షించుకునే నిమిత్తం ఇలా చేశానని చెప్పుకొచ్చారు. పైగా తాను గత నెలన్నర కాలం నుంచి మీడియాకి దూరంగా ఉన్నానని అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ నితీష్ ఈ రోజు బీజేపీ ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. బిహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని చూసి నమ్మి ఓటు వేస్తే ఇలా వెన్నుపోటు పొడిచే రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. తాను ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో ఉన్న కొత్త బిహార్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తానంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లోపే ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. అయినా నితీష్ కుమార్ మహారాష్ట్రలా బిహార్ అవుతుందని భయపడ్డానని చెబుతున్నారు. కానీ బీజేపీ ఏమీ శివసేనను విభజించడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అంతేకాదు లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని ఆర్జేడియూని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఐతే ఈ విషయమే జేడీయూ లేదా ఆర్జేడియూ ఇంకా స్పందించలేదు. (చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి) -
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను తీసుకురావడం ఇప్పట్లో సాధ్యం కాని విషయమని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ తేల్చేశారు. జీఎస్టీ కిందకు వస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుందంటూ.. ఇందుకు ఏ రాష్ట్రం కూడా సుముఖంగా లేదన్నారు. రాష్ట్రాలకు రూ.2లక్షల కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలంటూ ప్రశ్నించారు. జీఎస్టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు మరో 8–10 ఏళ్ల పాటు వేచి చూడాల్సి రావచ్చని పేర్కొన్నారు. ఆర్థిక బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో బుధవారం సుశీల్‌మోదీ మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాలు కలసి ఉమ్మడిగా పెట్రోలియం ఉత్పత్తులపై ఏటా రూ.5 లక్షల కోట్ల మేర పన్నులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట రేటు అయిన 28 శాతమే పన్ను అమలవుతుందని.. ప్రస్తుతం అయితే వాటి విక్రయ ధరలో 60 శాతం వరకు పన్ను అమలవుతున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు చారిత్రక గరిష్టాలకు చేరడంతో ధరలు దిగివచ్చేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తుండడం తెలిసిందే. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా ప్రకటనలు అయితే ఇస్తారు కానీ.. ఈ అంశాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్రస్తావించరంటూ ఆయన విమర్శించారు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో సుశీల్ ఈ విమర్శ చేశారు. బిహార్ మంత్రిగా పనిచేసిన సమయంలో జీఎస్టీ కౌన్సిల్‌కు సుశీల్ ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రాలు ముందుకు వస్తే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ మంగళవారం ప్రకటన చేసిన విషయం గమనార్హం. -
సోషల్ మీడియా రెవెన్యూని మీడియాకి పంచాల్సిందే!
న్యూఢిల్లీ: దేశంలో వార్త సంస్థలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఫేసుబుక్, గూగుల్, యూట్యూబ్ వంటి టెక్ దిగ్గజాలు వార్తలను షేర్ చేస్తున్న మీడియా సంస్థలకు యాడ్ రెవెన్యూలో కొంత మొత్తాన్ని చెల్లించే విధంగా భారతదేశం ఒక చట్టాన్ని రూపొందించాలని బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. “గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్‌లో షేర్ చేస్తున్న వార్తల వల్ల ఆయా టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో యాడ్ రెవెన్యూను ఆర్జిస్తున్నాయి. దీని వల్లే రెవెన్యూ తగ్గి దేశంలోని సాంప్రదాయ మీడియా కష్టాలు ఎదుర్కొంటుంది. అందువల్ల, ఆయా కంపెనీలు తమ యాడ్ రెవెన్యూలో కొంత మొత్తాన్ని సాంప్రదాయ మీడియా సంస్థలకు చెల్లించాల్సిందే” అని ఆయన డిమాండ్ చేశారు. గత నెలలో ప్రపంచంలో మొదటి సారిగా న్యూస్ మీడియా షేర్ చేసే కంటెంట్‌కు తగిన ఆదాయం లభించేలా ఆస్త్రేలియా ప్రభుత్వం తరహా కొత్త చట్టాన్ని రూపొందించింది. ఇప్పుడు అదే మాదిరి ఒక కొత్త చట్టాన్ని రూపొందించి భారత పార్లమెంట్లో పాస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాజ్యసభ చైర్మన్, ఉపాధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవడం విలువైనదని వ్యాఖ్యానించారు. సాంప్రదాయ మీడియా సంస్థలు, పత్రికలు ఇటీవలి కాలంలో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కారణంగా ప్రజలు పేపర్ వేయించుకోవడానికి భయపడడం, ప్రింట్ మీడియాపై ఆసక్తి చూపకపోవడం, యాడ్ రెవెన్యూ తగ్గడం వంటి కారణాలతో సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేక కొన్ని పత్రికలు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సాంప్రదాయ పత్రికలు, వార్తా ప్రసార మాధ్యమాలు టెక్ దిగ్గజాలు నడుపుతున్న ప్లాట్‌ఫామ్‌లలో ఉచితంగా వార్తలను షేర్ చేస్తున్నాయి. ప్రకటనలు మాత్రం ఎక్కువగా టెక్ ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్నందున అవి చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి అన్నారు. సాంప్రదాయ వార్తా మాధ్యమాలు నమ్మదగిన వార్తలను అందించడానికి వ్యాఖ్యాతలు, పాత్రికేయులు, విలేకరులను కోసం భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అన్నారు. అయితే, వాణిజ్య ప్రకటనల ద్వారానే వాటికి ఆదాయం వస్తుంది. కానీ, అటువంటి ఆదాయాన్ని టెక్ కంపెనీలు లాగేస్తున్నాయని ఆయన వాపోయారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తప్పనిసరిగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. చదవండి: స్మార్ట్ వాచ్.. బాయ్‌ఫ్రెండ్‌ను పట్టిచ్చింది! -
డిప్యూటీ సీఎం పదవిపై ఉత్కంఠ
పట్నా : బిహార్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఎన్డీయే కూటమి తరుఫున ముఖ్యమంత్రిగా జేయూడీ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు సైతం ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే బిహార్ డిప్యూటీ సీఎం పదవిపై కొంత ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సుశీల్ మోదీ స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తులను నియమిస్తారని తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తారక్ కిషోర్ ప్రసాద్‌తో పాటు రేణు దేవి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ నితీష్‌తో పాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు స్వీకర్ పదవి సైతం బీజేపీకే దక్కే అవకాశం ఉంది. (35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం) అయితే సుశీల్ మోదీ ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. డిప్యూటీ సీఎం పదవిపై సుశీల్ అంతగా ఆసక్తి చూపడంలేనట్లు తెలుస్తోంది. అయితే నితీష్ కేబినెట్లో కీలకమైన శాఖలన్నీ బీజేపీకే దక్కే అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోనే బలమైన శాఖను కట్టబెడతారనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు మంత్రి పదవుల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. కాగా 74 స్థానాలు బీజేపీ గెలుచుకోగా.. జేడీయూ 44 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 76 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోనుంది. -
క్వారంటైన్ పూర్తి చేశాక కండోమ్ బహుమతి
పట్నా : క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్న వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 17 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ బుధవారం ప్రకటించారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఇలా వినూత్న పద్దతిని ప్రారంభించిందన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది వలస కూలీలు వచ్చారని, 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న కార్మికులకు గర్భనిరోధక మందులు, కండోమ్‌లతో కూడిన కిట్లను ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. దీనికి సంబంధించి ఏప్రిల్ నెలలోనే 2.14 లక్షల కండోమ్‌లు పంపిణీ చేయగా, మే నెలలో 15.39 లక్షల కండోమ్‌లను పంపిణీ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా రాష్ర్టంలోని అన్ని ప్రాథమిక కేంద్రాల్లో కండోమ్ సహా గర్భనిరోధక మందులు అందుబాటులో ఉంచామని, ఎవరికైనా అవసరం ఉంటే ఆయా కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. డోర్ డెలివరీ ద్వారా ఇప్పటికే 11 లక్షల గర్భనిరోధక మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. (పెళ్లి పీటలెక్కనున్న కేరళ సీఎం కుమార్తె) క్వారంటైన్లో ఉన్న వలస కూలీల కోసం బట్టలు, దోమతెరలు లాంటి ఇతర వస్తువులకి కలిపి రాష్ర్ట ప్రభుత్వం ఒక్కొక్కరిపై 5300 రూపాయిలు ఖర్చుచేసిందని సుశీర్ కుమార్ పేర్కొన్నారు. క్వారంటైన్ తర్వాత కూడా అదనంగా వెయ్యి రూపాయల నగదును అందించామని చెప్పారు. బాలికలు, మహిళా విద్యను ప్రోత్సహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా దశాబ్ధ కాలంలోనే బీహార్‌లో సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 3.2 శాతానికి తగ్గిందని మోదీ అన్నారు. (ఊరట : యాక్టివ్ కేసుల కంటే రికవరీలు అధికం ) -
ప్రత్యేక రైళ్లు వేయండి: సుశీల్ మోదీ
పట్నా: దేశంలోని వివిధ ప్రాంతాలను నుంచి తమ పౌరులను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని కేంద్రాన్ని బిహార్ ప్రభుత్వం కోరింది. లాక్డౌన్ కారణంగా తమ రాష్ట్రానికి చెందిన ఎంతో మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుపోయారని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న బిహార్ వలస కార్మికులు, విద్యార్థులను తమ రాష్ట్రానికి తరలించేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన లక్షలాది మంది వలస కార్మికులు, విద్యార్థులను బస్సుల్లో తీసుకురావడం సాధ్యం కాదు. బస్సుల ద్వారా వీరిని తరలించడం ఖర్చుతో కూడుతున్నదే కాకుండా కొన్ని నెలల సమయం పడుతుంది. ఒక్కో ట్రిప్పుకు బస్సులు ఆరు నుంచి రోజులు సమయం తీసుకుంటాయి. కాబట్టి ప్రత్యేక రైళ్లతో భౌతిక దూరం పాటిస్తూ వారిని తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామ’ని సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. వలస కార్మికులు, విద్యార్థులను ఇక్కడికి తరలిస్తే వారిని క్వారెంటైన్ చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ సహాయం కోసం 27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బిహారీలను లాక్డౌన్ నిబంధనలు సడలించే వరకు తీసుకురావడం కుదరదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంతకుముందు ప్రకటించారు. (సైకిల్‌పై భార్యతో కలిసి 230 కి.మీ ప్రయాణం) -
సుశీల్‌కు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్
పట్నా : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. సుశీల్‌ను ఉద్దేశిస్తూ.. కొంతమంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల కృతజ్ఞత చూపలేదని ఆరోపిస్తూ ప్రశాంత్ కిషోర్ శనివారం సుశీల్ కుమార్ పాత వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు. 'నితీష్ కుమార్ పార్టీలో కొంతమందికి ఎటువంటి గుర్తింపు లేకున్నా తనకున్న అధికారంతో వారికి గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారంటూ' సుశీల్ కుమార్ ఇంతకుముందు ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్ ఇస్తూ.. ప్రజలకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో సుశీల్ మోదీని మించినవారు ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. దీంతోపాటు ప్రశాంత్ సుశీల్ మోడీకి చెందిన పాత వీడియోను పోస్ట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ షేర్ చేసిన వీడియోలో సుశీల్ కుమార్ నితీశ్ కుమార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ వీడియోలో సుశీల్ మాట్లాడుతూ' నితీశ్ కుమార్ బీహారీ కాదని,17 సంవత్సరాల స్నేహం పేరుతో నితీశ్ బీజేపీకి ద్రోహం చేశారు. మోసం అనే పదం నితీశ్ డీఎన్ఏలో ఉంది కానీ బీహారీ ప్రజల్లో లేదని' తెలిపారు. అంతకుముందు జేడియూ సీనియర్ నేత పవన్ వర్మ నితీష్ కుమార్‌పై ట్విటర్లో మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. (విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్: సుశీల్ మోదీ) -
విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్..!
పట్నా : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం స్థానాల్లో జేడీయూ పోటీచేస్తుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రశాంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య స్నేహాన్ని దెబ్బతీసేవిధంగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. ప్రశాంత్ వ్యాఖ్యలు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని కూటమి సమర్థించదని అన్నారు. (బీజేపీకి ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం..!) మంగళవారం పట్నాలో సుశీల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో బీజేపీ-జేడీయూ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సీట్ల పంపకాలు గురించి పార్టీ అధినేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు’ అని అన్నారు. కాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో బిహార్ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వం అంచనాలు వేస్తున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార జేడీయూ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
జీఎస్టీలో మార్పులు ఉండకపోవచ్చు: సుశీల్
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం కారణంగా ఇప్పట్లో జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఇంటిగ్రేటెడ్ గూడ్స్, సర్వీస్ ట్యాక్స్(ఐజీఎస్టీ) కన్వీనర్ సుశీల్ కుమార్ మోదీ శనివారం అన్నారు. కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు జీఎస్టీ పెంచడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పుడు, జీఎస్టీ తగ్గించకపోతే.. పెంచడానికి కూడా అవకాశం ఉండదన్నారు. శనివారం ఆయన ‘భారత్: 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పయనం’ అన్న అంశంపై ఎఫ్ఐసీసీఐ 92వ వార్షిక సమావేశంలో మాట్లాడారు. పన్ను రేట్లు పెంచడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదని చెప్పారు. -
'అమిత్‌షా అపరచాణక్యుడిలా వ్యవహరించారు'
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాత్రికి రాత్రే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ స్పందిస్తూ.. భాజపా అధ్యక్షుడు అమిత్‌షాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'భారత రాజకీయాల్లో అపరచాణక్యుడిలా' అమిత్ షా మరోసారి నిరూపించారంటూ ట్టిటర్‌లో పేర్కొన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు వేసిన రాజకీయ ఎత్తుగడ తమకు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్న తరుణంలో శనివారం నాడు అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనుకుంటున్న తరుణంలో ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడానికి అమిత్‌షాయే కారణమంటూ సుశీల్ మోదీ ప్రశంసలు కురిపించారు. -
డిప్యూటీ సీఎం నివాసం జలదిగ్బంధం
న్యూఢిల్లీ: ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 157కు చేరుకుంది. గత వారం రోజుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 111 మంది, బిహార్‌లో 27 మంది చనిపోగా.. గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కలిపి 19 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బిహార్ రాజధాని పట్నాలో కుండపోత వానలతో డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ అధికార నివాసం సోమవారం జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆయనతోపాటు కుటుంబసభ్యులను పోలీసులు రబ్బర్‌బోట్‌లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. పట్నాలోని చాలా ప్రాంతాలు మూడు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. వానల తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం అధికారుల సెలవులు రద్దు చేసింది. బలియా జిల్లా జైలులోకి వరద ప్రవేశించడంతో 900 మంది ఖైదీలను వేరే జైళ్లకు తరలించారు. -
పన్నులు తగ్గించేందుకు కంపెనీల ఎత్తుగడలు
పాట్నా: దేశం ఆర్థిక మందగమనాన్ని ఏమీ ఎదుర్కోవడం లేదన్నారు బీహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ. తయారీ పడిపోతుందని చూపిస్తూ పన్నులు తగ్గించాలంటూ ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చేందుకు అనసరిస్తున్న ఎత్తుగడలుగా దీన్ని అభివర్ణించారు. తన వాదనకు మద్దతుగా బీహార్‌లో పార్లే జీ బిస్కట్ల డిమాండ్ పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. బిహార్ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను సుశీల్‌మోదీయే చూస్తున్నారు. అయినా కంపెనీ బిస్కట్ల డిమాండ్ తగ్గిందని తయారీదారులు చెబుతున్నారంటే... అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చౌకగా లభించే పార్లే జీ వంటి అధిక పన్ను రేటున్న వాటికి బదులు ఖరీదైన ప్యాస్ట్రీని ఎంచుకుంటున్నట్టు ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాంచిలో ఓ వార్తా చానల్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుశీల్‌మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ పరిధిలో అధిక పన్నులు చెల్లించాల్సి రావడం వల్ల ధరలు పెరిగాయని, దీంతో డిమాండ్ భారీగా పడిపోయిందంటూ, ఇలా అయితే ఉద్యోగులను ఎద్ద ఎత్తున తొలగించాల్సి రావచ్చని పార్లే ఇటీవలే ప్రకటన చేసింది. ఆటోమొబైల్స్, ఇతర రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మీడియాలో వస్తున్నదంతా కార్పొరేట్ ప్రపంచం చేస్తున్న లాబీయింగ్‌లో భాగమేనన్నారు మోదీ. ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెంచి పన్ను రేట్లను తగ్గించుకునేందుకునేనని అభివర్ణించారు. చదవండి : టీవీ ధరలు దిగొస్తాయ్! -
నన్ను వేధించే క్రమంలో మరో కేసు : రాహుల్
పట్నా : కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బిహార్‌కు చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయనపై పూల వాన కురిపిస్తూ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. కాగా దొంగలంతా మోదీ అనే ఇంటిపేరునే కలిగి ఎందుకు ఉంటారు అంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బిహార్ ఉపమఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ శనివారం పట్నా కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా..‘నా రాజకీయ ప్రత్యర్థులు ఆరెస్సెస్, బీజేపీ నన్ను వేధించే క్రమంలో ఇది మరొక కేసు. ఈరోజు 2 గంటలకు పట్నా సివిల్ కోర్టులో వ్యక్తిగత విచారణకు హాజరవుతున్నా. సత్యమేవ జయతే’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 542 లోక్‌సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే పార్టీ గెలుపొందింది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానని 49 ఏళ్ల రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో నాలుగు పేజీల లేఖను పోస్ట్ చేశారు. I will appear in person at the Civil Court in Patna today at 2 PM, in yet another case filed against me by my political opponents in the RSS/ BJP to harass & intimidate me. Satyameva Jayate 🙏 — Rahul Gandhi (@RahulGandhi) July 6, 2019 -
రాహుల్‌పై పరువునష్టం కేసు
పట్నా : దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. రాహుల్‌పై బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ పరువు నష్టం దావా వేశారు. పేరులో మోదీ అని ఉన్నవారందరినీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని ఆయనపై బీజేపీ నేత సుశీల్ మోదీ గురువారం పట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ ఎదుట ఫిర్యాదు చేశారు. టీవీ వార్తా ఛానెల్స్‌లో ఈనెల 13న జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారమైందని, ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని పిటిషన్లో సుశీల్ మోదీ పేర్కొన్నారు. తనతో సహా పేరులో మోదీ అని ఉన్న వారందరి ప్రతిష్టను ఆయన వ్యాఖ్యలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు ఈనెల 22న విచారణకు చేపట్టనుంది. కాగా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీల పేర్లను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకు ఉంటోందని రాహుల్ మహారాష్ట్ర ర్యాలీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బంగ్లానా...7 స్టార్ హోటల్‌లా?
సాక్షి, పాట్నా : ఎట్టకేలకు బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రభుత్వ అధికారిక బంగ్లాలోకి మకాం మార్చారు. దేశ్‌రత్న మార్గ్‌లోని ప్రభుత్వ నివాసంలోకి ఆయన నిన్న (మంగళవారం) ప్రవేశించారు. ఈ సందర్భంగా సుశీల్ మోదీ మాట్లాడుతూ...‘ ఈ బంగ్లా చూస్తుంటే సెవన్ స్టార్ హోటల్లో ఉన్నట్లు ఉంది. ఈ బంగ్లాలో ప్రతిదీ ప్రత్యేకమే. ఇందుకోసం కోట్లాది రూపాయిలు దుబారా చేశారు. ప్రధానమంత్రి నివాసంలో కూడా ఇంతటి విలాసవంతమైన ఫర్నిచర్ ఉండదేమో’ అని వ్యాఖ్యానించారు. కాగా 2015లో ఈ బంగ్లాను అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్‌కు నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం కేటాయించింది. అనంతరం ఆ పార్టీ మహా కూటమితో విడిపోవడం, ఆ తర్వాత నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. దీంతో తేజస్వి యాదవ్ ఆ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే తన తల్లి రబ్రీదేవి సీఎంగా పనిచేసిన సమయంలో ఆ భవనాన్ని ఉపయోగించడంతో సెంటిమెంటుగా భావించిన ఆయన ఖాళీ చేయలేదు. మరోవైపు ఆ బంగ్లాను డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి నితీష్ సర్కార్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఆయనకు అక్కడ చుక్కెదురైంది. తక్షణమే బంగ్లాను ఖాళీ చేసి, ప్రతిపక్ష నేతకు కేటాయించిన బంగ్లాలోకి మారాలని సూచించింది. అంతేకాకుండా ఈ అంశంపై పాట్నా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తేజస్వి యాదవ్ సవాల్ చేయడంపై ఆయనకు ఉన్నత ధర్మాసనం రూ.50 జరిమానా కూడా విధించింది. దీంతో ఎట్టకేలకు ఆ బంగ్లాను ఖాళీ చేసిన తేజస్వి యాదవ్ ఆ తర్వాత కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. బీహార్ ప్రభుత్వం ఆ బంగ్లాలోకి దెయ్యాలు వదిలిపెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు. గతంలో వాస్తు పేరుతో తేజస్వి యాదవ్ ఆ భవనం మరమ్మతులకు కోట్లాది రూపాయిలు వెచ్చించారు. -
‘ఆయన చేతులు నరికేయాలనిపించింది’
పాట్నా : కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి. పాట్నాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మీసా భారతి రామ్ కృపాల్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని మేము చాలా గౌరవించే వాళ్లం. కానీ 2014లో అతను మా పార్టీని వీడి.. సుశీల్ కుమార్ మోదీతో చేతులు కలిపినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆయన చేతులను నరికేయాలనిపించిందం’టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మీసా భారతి. అయితే ఆర్జేడీకి విధేయుడిగా పేరు పొందిన రామ్ కృపాల్‌కు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొంది ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. -
శత్రుఘ్న సిన్హాకు మోదీ షాక్
పట్నా : ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీపై పలు సందర్భాల్లో విమర్శలతో విరుచుకుపడుతున్న ఆ పార్టీ నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హాకు బీజేపీ సీనియర్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ షాక్ ఇచ్చారు. బీజేపీతో ఏమైనా ఇబ్బందులుంటే సిన్హా పార్టీ నుంచి వైదొలగాలని, ఆయన బీజేపీ అసంతృప్త నేత యశ్వంత్ సిన్హా ప్రభావానికి లోనయ్యారని విమర్శించారు. బీజేపీపై శత్రుఘ్న సిన్హా మాట్లాడుతున్న విధానం, ఆయన ఉపయోగిస్తున్న భాష తీవ్ర అభ్యంతరకరమని ఆక్షేపించారు. సిన్హాకు బీజేపీతో సమస్యలుంటే పార్టీకి రాజీనామా చేయాలని సుశీల్ మోదీ సూచించారు. ‘అసలు ఆయన పార్టీలో ఎందుకుండాలి..పార్టీని దూషిస్తూ బీజేపీలో ఉన్నాని ఎలా చెబుతా’రని ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న యశ్వంత్, శత్రుఘ్న సిన్హాలు తరచూ బీజేపీ విధానాలపై, ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని కేవలం ముందస్తు ప్రణాళికతో కూడిన ఇంటర్వ్యూలు ఇవ్వడం మినహా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు నేరుగా అడిగే ప్రశ్నలకు బదులివ్వలేరని సిన్హా ఇటీవల ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వన్‌మాన్ షోలా తయారైందని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. -
‘యోగా డే ఓ పబ్లిక్ స్టంట్’
పట్నా : యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ, జేడీ(యూ)ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పట్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు సీఎం నితీశ్ కుమార్ హాజరుకాలేదు. యోగా డే ఒక పబ్లిసిటీ స్టంట్ అని గతంలో వ్యాఖ్యానించిన నితీశ్ కుమార్.. ఈరోజు(జూన్ 21) కూడా ఇంట్లోనే యోగా చేశారు. ఈ విషయమై జేడీ(యూ) రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ మాట్లాడుతూ... ‘ప్రతీ భారతీయుడు యోగా చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ మాటల్ని మేము గౌరవిస్తాం. అయినా జనాల మధ్య ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు. మా పార్టీ కార్యకర్తలంతా రోజూ యోగా చేస్తారు. ఇందులో విశేషమేముంది’ అంటూ వ్యాఖ్యానించారు. వాళ్లను ఆహ్వానించలేదు... పట్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన యోగా డేలో కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, రామ్ కృపాల్ యాదవ్‌తో పాటు నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు బీజేపీ మంత్రులు పాల్గొన్నారని బీజేపీ నేత కృష్ణ కుమార్ రిషి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా జేడీ(యూ) నేతలకు ఆహ్వానాలు పంపలేదని ఆయన మీడియాకు తెలిపారు. జేడీయూ నేతలకు ఆహ్వానాలు పంపకపోవడంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు స్పందిస్తూ.. ‘ఎన్డీయే కూటమిలో అసలేం బాగాలేదంటూ’ వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రతిపక్షం వ్యాఖ్యల్ని ఖండించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యోగా చేయడాన్ని ఇష్టపడతారు. యోగా దినోత్సవాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకుని అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని’ ఆయన హితవు పలికారు.