పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించనున్న మోడీ | Narendra Modi to visit Patna blasts victims on November 02: BJP leader | Sakshi
Sakshi News home page

పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించనున్న మోడీ

Published Wed, Oct 30 2013 11:45 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించనున్న మోడీ - Sakshi

పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించనున్న మోడీ

పాట్నా నగరంలో ఆదివారం చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన వారిని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం పరామర్శించనున్నారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం ఇక్కడ వెల్లడించారు. అందుకోసం శనివారం ఉదయం నరేంద్ర మోడీ పాట్నా చేరుకుంటారని చెప్పారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారని తెలిపారు. అలాగే ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను మోడీ కలుస్తారని పేర్కొన్నారు.

 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో హూంకార్ ర్యాలీ నిర్వహంచారు. ఆ ర్యాలీకి కొన్ని గంటల ముందు పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది. అనంతరం గాంధీ మైదాన్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మరణించారు. 82 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాంబు పేలుళ్లపై ఇప్పటివరకు ఎన్ఐఏ అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement