పాట్నాలో మరో రెండు బాంబులు వెలికితీత!
పాట్నాలో మరో రెండు బాంబులు వెలికితీత!
Published Tue, Oct 29 2013 5:12 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
పాట్నాలోని గాంధీ మైదానంలో మరో రెండు బాంబులను మంగళవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. సంఘటనా స్థలాన్ని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సందర్శించి.. పేలుడు ప్రదేశాన్ని పరిశీలించారు. గోస్వామి సంఘటనా స్థలానికి వెళ్లడానికి రెండు గంటల ముందు రెండు బాంబులను పోలీసులు కనుగొన్నారు. తొలి బాంబును గాంధీ మైదానానికి 50 మీటర్ల దూరంలోని ఎస్కే మోమోరియల్ హాల్ వద్ద, రెండవ బాంబును గాంధీ మైదానంలోనే పోలీసులు నిర్వీర్యం చేశారు.
గాంధీ మైదానంలో ఇంకొన్ని బాంబులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎలాంటి వస్తువులైనా.. అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇప్పటి వరకు పోలీసులు మొత్తం ఆరు బాంబులు గాంధీ మైదానం వద్ద కనుగొన్నారు.
ఆదివారం గాంధీ మైదానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ హుంకార్ ర్యాలీని నిర్వహించిన సమయంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్న మహమ్మద్ ఇంతియాజ్ అన్సారీని పాట్నాలోని జుడిషియల్ కస్టడీకి తరలించగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement