మోదీపై రాహుల్ ధ్వజం
పట్నా: వరుసగా రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచామన్న విజయగర్వంతో రాజ్యాంగాన్నే కూలదోసే సాహసంచేసి, మూడోసారి మెజార్టీ తగ్గడంతో మళ్లీ రాజ్యాంగం వద్ద ప్రధాని మోదీ ప్రణమిల్లారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం పట్నాలోని చరిత్రాత్మక సదాఖత్ ఆశ్రమం వద్ద గాందీజీ విగ్రహం వద్ద నివాళులర్పించాక పార్టీ కార్యకర్తలతో ‘కార్యకర్తా సమ్మేళన్’తర్వాత ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని ప్రసంగించారు. ‘‘మూడో సా రి కూడా మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టి ఉంటే ఈ రాజ్యాంగాన్ని కూలదోసేవారు. కానీ విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో ఆయన కల లు కలగానే మిగిలిపోయాయి. 400పార్ నినాదాన్ని ఓటర్లు దారుణంగా తిరస్కరించడంతో మెజారిటీ తగ్గిపోయి మోదీ మళ్లీ రాజ్యాంగం వద్ద సాగిలపడ్డారు’’అని రాహుల్ అన్నారు.
దీంతో అక్కడున్నవాళ్లంతా గొల్లున నవ్వారు. 543 సీట్లున్న లోక్‌సభలో 400కుపైగా సీట్లొస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఎన్‌డీఏ కూటమి భారీ విజయశాతాన్ని తగ్గించేసిన సంగతి తెల్సిందే. ‘‘బుద్ధుడు, అంబేడ్కర్, నారాయణ గురు, మహాత్మా ఫూలేవంటి ఎందరో ప్రముఖుల ప్రగతిశీల భావనల నుంచే రాజ్యాంగం ఆవిర్భవించింది’’అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment