
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై మరోసారి ధ్వజమెతారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఐరన్‌లెగ్ ముఖ్యమంత్రి రేవంత్.. ఢిల్లీ పోయి కాంగ్రెస్‌కు గుండుసున్న తీసుకొచ్చిండని విమర్శించారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని రేవంత్ ప్రారంభించి.. ఢిల్లీలో ముగించాడని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా రేవంత్ దాన్ని కొనసాగిస్తారని కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు.
‘రాహుల్ గాంధీ (Rahul Gandhi)దేశంలో బీజేపీని గెలిపించి వస్తున్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్‌గాంధీనే. కాంగ్రెస్‌ను ఓటేస్తే రైతుబంధుకు చరమగీతం అని కేసీఆర్ ముందే చెప్పారు. ఆయన హెచ్చరించినట్లే జరగింది. తెలంగాణ ప్రజల తిడుతున్నతిట్టు రేవంత్ వింటే తట్టుకోలేడు. ఏడాది లోపే కాంగ్రెస్ పార్టీ దగాకోరు నైజాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు.
పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే మెతుకు ఆనంద్ ఓడిపోయాడు. మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ రేవంత్ రెడ్డి సూచనలతోనే సభ నడిపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదు. ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మైకివ్వడానికి వణికిపోతున్నాడు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుట్ బాల్ ఆడుతున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment