‘‘మిస్టర్‌ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’ | KTR Satyameva Jayate Tweet After Revanth Govt Kaleswaram CBI Probe | Sakshi
Sakshi News home page

‘‘మిస్టర్‌ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’

Sep 1 2025 10:50 AM | Updated on Sep 1 2025 12:46 PM

KTR Satyameva Jayate Tweet After Revanth Govt Kaleswaram CBI Probe

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్‌పై సెటైర్లు సంధించారు. 

సత్యమేవ జయతే అం‍టూ కేటీఆర్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్‌(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. మిస్టర్‌ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అయితే.. 

ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్‌లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్‌ తాలుకా స్క్రీన్‌ షాట్‌ను కేటీఆర్‌ తన ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు. 

సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్‌ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement