Samvidhan
-
కూలదోయబోయి కూలబడ్డారు
పట్నా: వరుసగా రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచామన్న విజయగర్వంతో రాజ్యాంగాన్నే కూలదోసే సాహసంచేసి, మూడోసారి మెజార్టీ తగ్గడంతో మళ్లీ రాజ్యాంగం వద్ద ప్రధాని మోదీ ప్రణమిల్లారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం పట్నాలోని చరిత్రాత్మక సదాఖత్ ఆశ్రమం వద్ద గాందీజీ విగ్రహం వద్ద నివాళులర్పించాక పార్టీ కార్యకర్తలతో ‘కార్యకర్తా సమ్మేళన్’తర్వాత ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని ప్రసంగించారు. ‘‘మూడో సా రి కూడా మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి ఉంటే ఈ రాజ్యాంగాన్ని కూలదోసేవారు. కానీ విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో ఆయన కల లు కలగానే మిగిలిపోయాయి. 400పార్ నినాదాన్ని ఓటర్లు దారుణంగా తిరస్కరించడంతో మెజారిటీ తగ్గిపోయి మోదీ మళ్లీ రాజ్యాంగం వద్ద సాగిలపడ్డారు’’అని రాహుల్ అన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా గొల్లున నవ్వారు. 543 సీట్లున్న లోక్‌సభలో 400కుపైగా సీట్లొస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఎన్డీఏ కూటమి భారీ విజయశాతాన్ని తగ్గించేసిన సంగతి తెల్సిందే. ‘‘బుద్ధుడు, అంబేడ్కర్, నారాయణ గురు, మహాత్మా ఫూలేవంటి ఎందరో ప్రముఖుల ప్రగతిశీల భావనల నుంచే రాజ్యాంగం ఆవిర్భవించింది’’అని రాహుల్ అన్నారు. -
ఎస్పీ ఆఫీసు ఎదుట రాజ్యాంగ స్తూపం
లక్నో: లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రధాన కార్యాలయం ఎదుట రాజ్యాంగ స్తూపం(సంవిధాన్ మాన్స్తంభ్) ఏర్పాటైంది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్పీ నేతల సమక్షంలో ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒక స్తూపంపై రాజ్యాంగ ప్రతిని ఉంచడం ద్వారా రాజ్యాంగ స్తూపాన్ని ఆవిష్కరించారు. ‘ఒకప్పటి కొల్హాపూర్ మహారాజు చత్రపతి సాహూ తన సంస్థానంలో మహాత్మా జ్యోతిబా ఫూలే కలలుగన్న రిజర్వేషన్ల అమలును సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అందుకే జూలై 26వ తేదీన రాజ్యాంగ స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు అనంతరం అఖిలేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
వేదికపై చోటు దక్కని ఆర్ఎల్డీ
న్యూఢిల్లీ: పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లో శుక్రవారం ఎన్డీఏ భేటీ సందర్భంగా రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరిని వేదికపైకి ఆహా్వనించకుండా ఎంపీల మధ్య కూర్చోబెట్టి బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు ఆరోపించాయి. ‘‘ ఒక్క సీటు సాధించిన పారీ్టలకూ వేదికపై బీజేపీ చోటిచి్చంది. ఇద్దరు ఎంపీలున్న ఆర్ఎల్డీని పట్టించుకోలేదు. ఆత్మాభిమానముంటే వెంటనే ఎన్డీఏను వీడండి. మిమ్మల్ని అవమానిస్తే సహించకండి’ అని జయంత్‌కు ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ హితవు పలికారు. కుర్చీలను బట్టి గౌరవం మారదని, అదేమంత పెద్ద విషయం కాదని ఆర్ఎల్డీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బదులిచ్చారు. -
మళ్లీ బుల్లితెరకు బెనెగల్
ముంబై: అత్యంత పేరుగాంచిన ‘భారత్ ఏక్ ఖోజ్’ షో రూపకర్త, ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ‘సంవిధాన్’తో మరోసారి బుల్లితెరకు వస్తున్నాడు. పది భాగాలుగా ప్రదర్శితమవనున్న ఈ ధారావాహిక భారత రాజ్యాంగ రూపకల్పన చుట్టూ తిరగనుంది. ఇందుకోసం 78 ఏళ్ల ఈ దర్శకుడు నగరంలోని ఫిలింసిటీలోనే ఉండిపోయాడు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కోసం 1946-1949 మధ్యకాలంలో జరిగిన చర్చలను ఈ ధారావాహికల్లో ప్రసారం చేయనున్నారు. రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులపాటు భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనపై అప్పట్లో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా శ్యాం మాట్లాడుతూ ‘సంవిధాన్’ను వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. దేశానికి ప్రజాస్వామ్యం దిశగా నడిపించడం కోసం ఎవరెవరు ఏవిధంగా కృషి చేశారనేది ఇందులో వివరిస్తాం’ అని అన్నాడు. ఇదొక ఇతిహాస గాధ. మన జాతి పుట్టుకపైన కథ. ఈ ధారావాహికకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాం. చరిత్ర ఎంతమాత్రం దెబ్బతినకుండా ఉండేవిధంగా చూసుకున్నాం. అందరికీ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకుసాగాం. ఇది కచ్చితంగా విజ్ఞానాత్మకమవుతుంది’ అని అన్నారు. ఈ ధారావాహికలకు అతుల్ తివారీ సహమాటల రచయితగా వ్యవహరించారని తెలిపారు. పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ పాత్రకు సంబంధించిన సంభాషణల రూపకల్పనలో అతుల్ నిమగ్నమయ్యారన్నాడు. ఇక సచిన్ ఖేదార్...భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ గురించి రాస్తున్నారన్నాడు. భారత రాజ్యాంగానికి ఎనలేని ప్రాధాన్యముందన్నాడు. అయితే దానికి ముంబైతోగల అనుబంధం గురించి తెలిసింది స్వల్పమేనన్నాడు. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనకు సంబంధించి కొలాబాలోని వే ఇన్సైడ్ కేఫ్‌లో ఎంతో సమయం గడిపారని ఆయన వివరించాడు.