
లక్నో: లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) ప్రధాన కార్యాలయం ఎదుట రాజ్యాంగ స్తూపం(సంవిధాన్ మాన్‌స్తంభ్) ఏర్పాటైంది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్‌పీ నేతల సమక్షంలో ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒక స్తూపంపై రాజ్యాంగ ప్రతిని ఉంచడం ద్వారా రాజ్యాంగ స్తూపాన్ని ఆవిష్కరించారు.
‘ఒకప్పటి కొల్హాపూర్ మహారాజు చత్రపతి సాహూ తన సంస్థానంలో మహాత్మా జ్యోతిబా ఫూలే కలలుగన్న రిజర్వేషన్ల అమలును సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అందుకే జూలై 26వ తేదీన రాజ్యాంగ స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు అనంతరం అఖిలేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment