Gandhi Maidan
-
పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించనున్న మోడీ
పాట్నా నగరంలో ఆదివారం చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన వారిని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం పరామర్శించనున్నారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం ఇక్కడ వెల్లడించారు. అందుకోసం శనివారం ఉదయం నరేంద్ర మోడీ పాట్నా చేరుకుంటారని చెప్పారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారని తెలిపారు. అలాగే ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను మోడీ కలుస్తారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో హూంకార్ ర్యాలీ నిర్వహంచారు. ఆ ర్యాలీకి కొన్ని గంటల ముందు పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది. అనంతరం గాంధీ మైదాన్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మరణించారు. 82 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాంబు పేలుళ్లపై ఇప్పటివరకు ఎన్ఐఏ అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. -
పాట్నాలో మరో రెండు బాంబులు వెలికితీత!
పాట్నాలోని గాంధీ మైదానంలో మరో రెండు బాంబులను మంగళవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. సంఘటనా స్థలాన్ని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సందర్శించి.. పేలుడు ప్రదేశాన్ని పరిశీలించారు. గోస్వామి సంఘటనా స్థలానికి వెళ్లడానికి రెండు గంటల ముందు రెండు బాంబులను పోలీసులు కనుగొన్నారు. తొలి బాంబును గాంధీ మైదానానికి 50 మీటర్ల దూరంలోని ఎస్కే మోమోరియల్ హాల్ వద్ద, రెండవ బాంబును గాంధీ మైదానంలోనే పోలీసులు నిర్వీర్యం చేశారు. గాంధీ మైదానంలో ఇంకొన్ని బాంబులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎలాంటి వస్తువులైనా.. అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇప్పటి వరకు పోలీసులు మొత్తం ఆరు బాంబులు గాంధీ మైదానం వద్ద కనుగొన్నారు. ఆదివారం గాంధీ మైదానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ హుంకార్ ర్యాలీని నిర్వహించిన సమయంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్న మహమ్మద్ ఇంతియాజ్ అన్సారీని పాట్నాలోని జుడిషియల్ కస్టడీకి తరలించగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
పాట్నా గాంధీ మైదాన్‌లో మరో బాంబు
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ రోజు ఉదయం మరో బాంబును కనుగొన్నట్లు నగర పోలీసు ఉన్నతాధికారి మను మహారాజ్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. దాంతో బాంబును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు, బాంబు నిర్వీర్య దళం హుటాహుటిన గాంధీ మైదానం చేరుకుని, ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా ఆ సమీపంలోని ప్రజలను నివాసాల నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గాంధీ మైదాన్‌లో పాదచారులు నడుస్తున్న సమయంలో ఆ బాంబును కనుగొని, పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో హూంకార్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 8 మంది మరణించారు. మరో 82 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ వరుస బాంబు పేలుళ్ల వెనక ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నాడు సుభాష్ చంద్రబోస్, జేపీ, జిన్నా.. నేడు మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో పాల్గొన్న హూంకార్ ర్యాలీ వేదిక గాంధీ మైదాన్‌కు చారిత్రక నేపథ్యముంది. ఇదే వేదికపై గతంలో పలు ముఖ్యమైన ర్యాలీలు నిర్వహించారు. స్వాతంత్రోద్యమ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నోరాజకీయ మార్పులకు వేదికగా నిలిచింది. సుభాష్ చంద్రబోస్, మహ్మద్ అలీ జిన్నా, జయప్రకాశ్ నారాయణ్ వంటి మహానీయులు ఇదే వేదికపై నుంచి ప్రసంగించారు. తాజాగా గాంధీ మైదాన్‌లో లక్షలాది మంది పాల్గొన్న ర్యాలీలో మోడీ ఉద్వేగ ప్రసంగంతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సభ ఆరంభానికి కొన్ని గంటల ముందు బాంబు పేలుళ్లు జరిగినా ర్యాలీ దిగ్విజయంగా ముగిసింది. రాజకీయంగా తనను తీవ్రంగా వ్యతిరేకించే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోటలో మోడీ తొలి బహిరంగ సభ విజయవంతమైంది.