నాడు సుభాష్ చంద్రబోస్, జేపీ, జిన్నా.. నేడు మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో పాల్గొన్న హూంకార్ ర్యాలీ వేదిక గాంధీ మైదాన్కు చారిత్రక నేపథ్యముంది. ఇదే వేదికపై గతంలో పలు ముఖ్యమైన ర్యాలీలు నిర్వహించారు. స్వాతంత్రోద్యమ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నోరాజకీయ మార్పులకు వేదికగా నిలిచింది. సుభాష్ చంద్రబోస్, మహ్మద్ అలీ జిన్నా, జయప్రకాశ్ నారాయణ్ వంటి మహానీయులు ఇదే వేదికపై నుంచి ప్రసంగించారు.
తాజాగా గాంధీ మైదాన్లో లక్షలాది మంది పాల్గొన్న ర్యాలీలో మోడీ ఉద్వేగ ప్రసంగంతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సభ ఆరంభానికి కొన్ని గంటల ముందు బాంబు పేలుళ్లు జరిగినా ర్యాలీ దిగ్విజయంగా ముగిసింది. రాజకీయంగా తనను తీవ్రంగా వ్యతిరేకించే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోటలో మోడీ తొలి బహిరంగ సభ విజయవంతమైంది.