Patna rally
-
లాలూ ర్యాలీపై ఐటీ శాఖ నోటీసులు
-
లాలూ ర్యాలీపై ఐటీ శాఖ నోటీసులు
సాక్షి, పట్నా: బీజేపీ భగావో.. దేశ్ బచావో ర్యాలీ ద్వారా బీజేపీ వ్యతిరేక కూటమిలను ఏకతాటికి తెచ్చే యత్నం చేశారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. లక్షల మంది సభకు హాజరై కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను చూపారని లాలూ గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఆ ర్యాలీనే ఆయన్నుఇప్పుడు చిక్కుల్లో పడేసింది. భారీగా నిర్వహించిన ఈ ర్యాలీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలంటూ ఆదాయపు పన్నుల శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. నిర్వహణ ఖర్చులను పూర్తిగా ఓ నివేదికతో తమకు సమర్పించాలంటూ కోరింది. పట్నాలోని గాంధీ మైదాన్‌లో మహాఘట్భంధన్ ర్యాలీని లాలూ నిర్వహించగా, జనసందోహంతో కూడిన ఫోటోను ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోటో మార్ఫింగ్ అంటూ బీజేపీసహా పలువురు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. ఇదిలా ఉంటే బినామీ ఆస్తుల కేసులో ఐటీ శాఖ రబ్రీదేవి, ఆమె తనయుడు తేజస్వి యాదవ్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. వారిద్దరి స్టేట్మెంట్లు నమోదు చేశాక సమన్లు కూడా జారీచేసింది. -
పట్నాలో ఆర్జేడీ భారీ సభ
సాక్షి, పట్నా: 'దేశ బచావో-బీజేపీ భాగవో' పేరిట రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆదివారం పట్నాలోని గాంధీ మైదానంలో భారీ సభను నిర్వహిస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సభలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు పాల్గొంటున్నారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ సభకు గైర్హాజరు అవుతుండటం విపక్షాల్లో ఐక్యతపై అనుమానాలకు తావిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన బిహార్ మహాకూటమి నుంచి తప్పుకొని.. తిరిగి బీజేపీతో చేతులు కలిపి నితీశ్‌కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సభ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సభలో జేడీయూ అసమ్మతి నేతలు శరద్ యాదవ్, అలీ అన్వర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జేడీయూ ఎంపీలైన ఈ ఇద్దరు అసమ్మతి నేతలు లాలూతోపాటు వేదిక పంచుకోనున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డీ రాజా, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు సభలో పాల్గొనున్నారు. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. -
ఆ సీఎం.. వెన్నుపోటు పొడిచారు!
బిహార్ గడ్డమీద.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పేరు ప్రస్తావించకుండానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా పట్నాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె నిప్పులు కురిపించారు. వెన్నుపోటు పొడిచేవాళ్ల గురించి తాను ఎక్కువ మాట్లాడబోనన్నారు. పెద్దనోట్ల రద్దును బిహార్ సీఎం నితీష్ కుమార్ సమర్థిస్తున్న విషయం తెలిసిందే. దాంతోపాటు బినామీ ఆస్తులపై కూడా కొరడా ఝళిపించాలని ఆయన గట్టిగా అడుగుతున్నారు. ఈ విషయాన్నే ఆమె పరోక్షంగా ప్రస్తావిస్తూ అంతకుముందు తమతో కలిసి అన్ని విషయాల్లో కేంద్రప్రభుత్వంపై పోరాడిన సీఎం.. ఇప్పుడు ఇలా చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిహారీ వలస కార్మికులకు పనులు లేక అల్లాడుతున్నారని, తిండి కోసం దేశమంతా తిరుగుతున్నారని, అలాంటి సమయంలో వాళ్లకు నాయకులు మద్దతుగా నిలవాలని అన్నారు. బిహార్ పర్యటనకు వచ్చిన తనుకు స్వాగతం పలికేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక సీనియర్ మంత్రిని కూడా పంపలేపదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గతవారం ఆమె లక్నోలో పెద్దనోట్ల రద్దుపై ర్యాలీ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. తన మంత్రులతో కలిసి మమత ర్యాలీలో పాల్గొన్నారు. కానీ బిహార్‌లో మాత్రం ఆమెకు నితీష్ స్వాగతం లభించకపోవడంతో.. రాష్ట్ర అతిథిగా వచ్చినా కూడా సీఎంను కలవలేదు. దానికి బదులు ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆర్జేడీ నాయకుడు లాలుప్రసాద్ ఇంటికి మాత్రం వెళ్లి, అక్కడ ఆయన భార్య రబ్రీదేవిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. బిహార్ మంత్రివర్గంలో ఉన్న లాలు కొడుకులిద్దరు ఆమెను కలవలేదు, ర్యాలీలో పాల్గొనలేదు. పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడు మాత్రం ర్యాలీలో పాల్గొన్నారు. -
ఉగ్రవాదులు అమిత్‌షాను టార్గెట్ చేశారా..!
పాట్నా: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై బాంబు దాడులు చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. పాట్నాలో పోలీసులు రెండు లైవ్ బాంబులను గుర్తించారు. గత ఏడాది ఏప్రిల్ 14న అక్కడ అమిత్ షా ర్యాలీని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా అదే రోజు, ఆ సమయానికే పేల్చేలా వాటిని అమర్చారని నిఘా అధికార వర్గాల సమాచారం. అయితే, అవి ఆ రోజు పేలలేదు. ఇటీవల ముగ్గురు తీవ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా పాట్నాలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడాలని ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. అందుకోసం బాంబులు కూడా అమర్చామని చెప్పడంతో వారి సమాచారం మేరకు గాలింపులు చేపట్టగా తాజా బాంబులు బయటపడ్డాయి. 2013 గాంధీ మైదాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం సందర్భంగా ఎలాంటి బాంబులను పేల్చాలని తీవ్రవాదులు నిర్ణయించుకున్నారో తిరిగి అలాంటి పేలుడు పదార్థాలే తాజాగా గుర్తించిన బాంబుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
నాడు సుభాష్ చంద్రబోస్, జేపీ, జిన్నా.. నేడు మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో పాల్గొన్న హూంకార్ ర్యాలీ వేదిక గాంధీ మైదాన్‌కు చారిత్రక నేపథ్యముంది. ఇదే వేదికపై గతంలో పలు ముఖ్యమైన ర్యాలీలు నిర్వహించారు. స్వాతంత్రోద్యమ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నోరాజకీయ మార్పులకు వేదికగా నిలిచింది. సుభాష్ చంద్రబోస్, మహ్మద్ అలీ జిన్నా, జయప్రకాశ్ నారాయణ్ వంటి మహానీయులు ఇదే వేదికపై నుంచి ప్రసంగించారు. తాజాగా గాంధీ మైదాన్‌లో లక్షలాది మంది పాల్గొన్న ర్యాలీలో మోడీ ఉద్వేగ ప్రసంగంతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సభ ఆరంభానికి కొన్ని గంటల ముందు బాంబు పేలుళ్లు జరిగినా ర్యాలీ దిగ్విజయంగా ముగిసింది. రాజకీయంగా తనను తీవ్రంగా వ్యతిరేకించే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోటలో మోడీ తొలి బహిరంగ సభ విజయవంతమైంది. -
మోడీ పాట్నా ర్యాలీకి ముఖం చాటేయనున్న అద్వానీ
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ... ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈనెల 27వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించే ర్యాలీకి పెద్దాయన అద్వానీ హాజరు కావట్లేదు. ఈ విషయాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ మీడియాకు తెలిపారు. అయితే, ర్యాలీకి అద్వానీ హాజరు కాకపోవడాన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా వంద వరకు ర్యాలీలు నిర్వహించాలని పార్టీ తలపెట్టిందని, వాటన్నింటికీ పార్టీ అగ్రనేతలందరూ హాజరు కావడం సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు. ఇప్పటికే భోపాల్‌లో జరిగిన ర్యాలీలో అద్వానీ పాల్గొన్నారని, మరిన్ని ర్యాలీలలో కూడా పాల్గొంటారని తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌తో తనకున్న సత్సంబంధాల దృష్ట్యానే అద్వానీ ఈ ర్యాలీలో పాల్గొనడంలేదన్న ఆరోపణలను అనంతకుమార్ ఖండించారు. కాగా, ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే బీజేపీ శ్రేణుల కోసంఆ పార్టీ పది రైళ్లు, పలు బస్సులను ఇప్పటికే అద్దెకు తీసుకుంది.