లాలూ ర్యాలీపై ఐటీ శాఖ నోటీసులు
లాలూ ర్యాలీపై ఐటీ శాఖ నోటీసులు
Published Fri, Sep 1 2017 2:25 PM | Last Updated on Thu, Sep 27 2018 4:22 PM
సాక్షి, పట్నా: బీజేపీ భగావో.. దేశ్ బచావో ర్యాలీ ద్వారా బీజేపీ వ్యతిరేక కూటమిలను ఏకతాటికి తెచ్చే యత్నం చేశారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. లక్షల మంది సభకు హాజరై కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను చూపారని లాలూ గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఆ ర్యాలీనే ఆయన్నుఇప్పుడు చిక్కుల్లో పడేసింది.
భారీగా నిర్వహించిన ఈ ర్యాలీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలంటూ ఆదాయపు పన్నుల శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. నిర్వహణ ఖర్చులను పూర్తిగా ఓ నివేదికతో తమకు సమర్పించాలంటూ కోరింది. పట్నాలోని గాంధీ మైదాన్‌లో మహాఘట్భంధన్ ర్యాలీని లాలూ నిర్వహించగా, జనసందోహంతో కూడిన ఫోటోను ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోటో మార్ఫింగ్ అంటూ బీజేపీసహా పలువురు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.
ఇదిలా ఉంటే బినామీ ఆస్తుల కేసులో ఐటీ శాఖ రబ్రీదేవి, ఆమె తనయుడు తేజస్వి యాదవ్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. వారిద్దరి స్టేట్‌మెంట్లు నమోదు చేశాక సమన్లు కూడా జారీచేసింది.
Advertisement