Income Tax Department
-
పెట్టుబడిదారులకు ప్రోత్సాహం చట్టాలలో కీలక మార్పులు
-
వేతన జీవులకు బిగ్ రిలీఫ్ .. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
Income Tax Slabs : సామాన్యుడిపై పన్నుల భారం తగ్గించండి
-
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు..
ఆదాయపన్ను శాఖ (Income tax) ప్రతిఒక్కరినీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. అన్ని లావాదేవీలపైనా నిఘా ఉంచుతుంది. ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల వినియోగం పెరిగింది. అన్ని రకాల చెల్లింపులకూ క్రెడిట్ కార్డులే (Credit cards) వినియోగిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను నోటీసు రాకుండా నివారించాలనుకుంటే పొరపాటున కూడా చేయని లావాదేవీలు కొన్ని ఉన్నాయి.క్రెడిట్ కార్డులతో చేసే కొన్ని లావాదేవీలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి రావచ్చు. మీకు నోటీసు పంపవచ్చు. ఇవి అలాంటి లావాదేవీలైతే, సీఏలు కూడా మిమ్మల్ని రక్షించలేరు. అందుకే ఈ సమాచారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. ఎటాంటి లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయో ఇక్కడ తెలుసుకోండి.ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే దాని డేటా ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది.క్రెడిట్ కార్డ్‌పై సంవత్సరానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా ఉంచుతుంది. రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు వంటి పెద్ద లావాదేవీలు శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు.ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా బాండ్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు.రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాని సమాచారం ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది.బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే నోటీసు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.నగదు రూపంలో జరిగే వ్యాపార లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచుతుంది. రూ.50,000 కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీల సమాచారం కోసం డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడగవచ్చు. -
‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వాణిజ్య సంఘాలు కోరాయి. అలాగే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలకు ప్రేరణనివ్వాలని, ఇంధనం(Fuel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్(Budget 2025) ముందస్తు సమావేశంలో భాగంగా ఈమేరకు ప్రతిపాదనలు చేశాయి.ఈ కార్యక్రమంలో వాణిజ్య మండళ్ల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దీపమ్ కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి మీడియాతో మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు.‘భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు చైనా ద్వారా దిగుమతి అవుతుండడం చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించి సమస్యలు, ఇతర అంశాలు ఆహార భద్రత, ద్రవ్యోల్బణం(Inflation)పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దిశగా మేము పలు సూచనలు చేశాం. అధిక ఉపాధికి అవకాశం ఉన్న వ్రస్తాలు, పాదరక్షలు, పర్యాటకం, ఫర్నీచర్ తదితర రంగాలకు ప్రేరణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంఎస్ఎంఈ(MSME)లకు సంబంధించి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాల్యూ చైన్‌తో భారత్‌ను అనుసంధానించాలని కోరాం. పెట్రోల్‌పై కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఖర్చు పెట్టే ఆదాయాన్ని పెంచొచ్చని సూచించాం’ అని పురి వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలుచైనా దిగుమతులతో ఇబ్బందులు..చైనా సొంత ఆర్థిక వ్యవస్థ నిదానించడంతో చౌకగా ఉత్పత్తులను భారత్‌లోకి పంపిస్తోందంటూ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు తాము తెలియజేశామని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ తెలిపారు. ఆదాయపన్ను తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో ఆదాయం మిగులుతుందని, వినియోగాన్ని పెంచుతుందని సూచించినట్టు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ వెల్లడించారు. జీఎస్టీని సులభంగా మార్చాలని కూడా కోరినట్టు తెలిపారు. సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలకు కావాల్సిన వాటిపై (రుణాల లభ్యత, టీడీఎస్ సులభతరం) దృష్టి పెట్టాలని కోరినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ పేర్కొన్నారు. -
అజిత్ పవార్ కు భారీ ఊరట..
-
పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!
నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నా ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ‘అదేంటి నెలకు రూ.6 లక్షల చొప్పున వార్షిక ఆదాయం రూ.72 లక్షలు అవుతుంది కదా. 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లోకి వస్తున్నా పన్ను చెల్లించకపోవడం ఏంటి’ అనుకుంటున్నారా? నెలకు అంతలా సంపాదిస్తుంది ప్రముఖ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగో లేదా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఆఫీసరో అనుకుంటే పొరపడినట్లే. ఈ సంపాదన ఓ దోసె బండి నిర్వాహకుడిది. అవునండి. వీధి వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నవారు తాము సంపాదిస్తున్న డబ్బుపై ట్యాక్స్ చెల్లించడం లేదు. ఈమేరకు ఇటీవల నవీన్ కొప్పరం అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదికాస్తా విభిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘మా ఇంటి పక్కన దోసె బండి నిర్వాహకుడు రోజు రూ.20,000 సంపాదిస్తాడు. నెలకు రూ.6 లక్షలు ఆదాయం ఉంటుంది. అందులో సగం వరకు ఖర్చులు తీసేసినా రూ.3 లక్షలు-రూ.3.5 లక్షలు సంపాదన. దానిపై తాను ఎలాంటి ట్యాక్స్ చెల్లించడు. అదే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నెలకు రూ.60,000 సంపాదిస్తే అందులో 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి’ అని నవీన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంలో ఆదాయ వ్యత్యాసాలు, పన్ను హేతబద్ధీకరణ వంటి అంశాలపై కామెంట్లు వస్తున్నాయి.A street food dosa vendor near my home makes 20k on an average daily, totalling up to 6 lakhs a month.exclude all the expenses, he earns 3-3.5 lakhs a month.doesn’t pay single rupee in income tax.but a salaried employee earning 60k a month ends up paying 10% of his earning.— Naveen Kopparam (@naveenkopparam) November 26, 2024ఇదీ చదవండి: తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న అనధికారిక రంగాన్ని మరింత క్రమబద్ధీకరించి అందుకు అనుగుణంగా పన్నుల పరిధిని పెంచాలని కొందరు నెటిజన్లు తెలియజేస్తున్నారు. దీనికోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చసాగాలని చెబుతున్నారు. కొందరు వైద్యులు, న్యాయవాదులు, చిన్న వ్యాపార యజమానులు.. వంటి ఇతర స్వయం ఉపాధి పొందేవారి సంపాదన పన్ను రహితంగా ఉండడంపట్ల ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ‘డాక్టర్లు, లాయర్లు, టీ దుకాణాదారులు, గ్యారేజీ నిర్వహకులు, వాణిజ్య ప్రాంతాల్లోని ఇతర వ్యాపారుల సంగతేంటి? చాలామంది ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా విదేశీ సెలవులకు వెళుతున్నారు. ఇళ్లు కొంటున్నారు. ఏటా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది?’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. -
అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?
మనలో చాలా మందికి బ్యాంకులలో సేవింగ్ ఖాతాలు ఉంటాయి. వివిధ అవసరాల నిమిత్తం వీటిలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో లెక్కకు మించి క్యాష్ ఉంచుకునేందుకు వీలు లేదు. ఇందు కోసం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పరిమితి ఉంది.బ్యాంకు, ఇతర పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితి అనేది ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించకుండా ఒక వ్యక్తి నిర్దిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయగల గరిష్ట నగదు మొత్తాన్ని సూచిస్తుంది. నగదు లావాదేవీల ప్రవాహాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం కోసం ఆదాయపు పన్ను నిబంధనల మేరకు ఈ పరిమితిని సెట్ చేశారు.రూ.10 లక్షలు మించితే..భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ముఖ్యమైన నగదు డిపాజిట్లతో సహా నగదు లావాదేవీలకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడానికి ఆర్థిక సంస్థలు బాధ్యత వహిస్తాయని గుర్తించడం అవసరం.ఇదీ చదవండి: మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?ఇక నగదు ఉపసంహరణల విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ. 1 కోటికి మించితే 5% టీడీఎస్ వర్తిస్తుంది. -
ట్యాక్స్ ప్లానింగ్.. సరిగమపదని..
‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోండి. ’ఎగవేత’ భూతం ’కబంధ’ హస్తాల నుంచి బైటపడ్డాం. ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ మీద దృష్టి సారించి, ప్లానింగ్ రాగాల్లో స,రి,గ,మ,ప,ద,ని తెలుసుకుందాం. గత దశాబ్దంగా మనం వింటున్న పదం.. జనాలు నలుగురు మెచ్చిన పదం ’మేనేజ్మెంట్’.. కేవలం కంపెనీలు, కార్పొరేట్లు, వ్యాపారం, వాణిజ్య రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ’మేనేజ్మెంట్’ కంపల్సరీ. సంస్థలతో బాటు వ్యక్తులకు, మనందరికీ వర్తించేది ’మేనేజ్మెంట్’. ట్యాక్స్‌ని మేనేజ్ చేయాలి. ట్యాక్స్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన ప్రాథమిక అంశం, కీలకాంశం ’ట్యాక్స్ ప్లానింగ్’. ఇది క్రియాశీలక చర్య .. చర్చ!ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాచట్టరీత్యా, రాచమార్గంలో పన్నుభారాన్ని తగ్గించే మార్గం. అవసరం అయినంత, అర్హత ఉన్నంత .. అన్ని ప్రయోజనాలు, తగ్గింపులు, మినహాయింపులు పొంది, ఆదాయాన్ని తగ్గించుకోవడం లేదా పెద్ద శ్లాబు నుంచి తక్కువ/చిన్న శ్లాబుకి తెచ్చుకోవడం, 30 శాతం నుంచి 20 శాతానికి, 20 శాతం నుంచి 10 శాతానికి, ఇంకా 10 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించుకోవడం.ట్యాక్స్ ప్లానింగ్ మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలికం.. అంటే ఆ సంవత్సరానికి పన్ను తగ్గించుకోవడం. దీర్ఘకాలికం.. అంటే భవిష్యత్‌లో పన్నుని తగ్గించుకోవడం. మూడోది, విరాళాల ద్వారా తగ్గించుకోవడం.పన్ను తగ్గించుకోవడం: స్వల్పకాలికంగా గానీ దీర్ఘకాలికంగా గానీ పన్నులను తగ్గించుకోవడం.పోస్ట్‌పోన్ చేసుకోవడం: ఈ విధంగా ఎప్పుడు చేసుకోవచ్చంటే.. బడ్జెట్‌కు ముందు.. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మార్చి 31 లోపల లేదా ఏప్రిల్ 1 తర్వాత.. స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఇలా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.పన్ను భారాన్ని విభజించుట: ఒకే మనిషి మీద ఎక్కువ ట్యాక్స్ పడే పరిస్థితుల్లో ఆదాయాన్ని చట్టప్రకారం అగ్రిమెంట్ల ద్వారా ఆదాయాన్ని విభజించడం. ఉదాహరణకు ఆలుమగలు వారి పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్లను మార్చి వడ్డీ సర్దుబాటు చేసుకోవచ్చు.తప్పించుకోవడం: సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం తప్పించుకోవడాన్ని చట్టరీత్యా కూడా చేయొచ్చు. చట్టంలోని లొసుగుల్లోని అంశాలకు లోబడి పన్ను తప్పించుకోవచ్చు. ఉదాహరణకు భార్యా, భర్త ఇద్దరికీ పన్నుభారం వర్తిస్తుంది. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ స్కూల్ ఫీజులు కడుతున్నారు. అలాంటప్పుడు ఇద్దరి స్కూల్ ఫీజును ఒకరి కేసులో, మిగతా పిల్లల ఫీజును మరొక కేసులో క్లెయిం చేయొచ్చు. ఒకరకంగా కాకుండా మరో విధంగా కట్టడాన్ని ఇంగ్లీషులో disguise taxation అని అంటారు. మారువేషం కాదు. మరో వేషంలాంటిది. అంటే, చేసే వ్యాపారం భాగస్వామ్యం లేదా కంపెనీలాగా చేస్తే 30 శాతం పన్ను పడుతుంది. అలా కాకుండా సొంత వ్యాపారంగా చేస్తే శ్లాబుల వారీగా 10 శాతం, 20 శాతం, 30 శాతం చొప్పున కట్టొచ్చు. బేసిక్ లిమిట్ కూడా వర్తిస్తుంది.సంపూర్తిగా ఆలోచించాలి: పాటల ట్యూనింగ్లాగే ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. గీత రచనను బట్టి స్వర రచన. ఏదైనా ఏడు స్వరాల్లో ఇమడాలి. పూర్తి సమాచారం ఉండాలి. చట్టాన్ని అతిక్రమించకూడదు. పన్ను భారం తగ్గాలి, చట్టప్రకారం జరగాలి.పన్నుకు సంబంధిచిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ-మెయిల్ పంపించగలరు -
ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్‌లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్‌ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విదేశీ ఆస్తి అంటే ఏమిటి?ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్‌లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు. -
రూ.12.11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 15.41 శాతం అధికంగా రూ.12.11 లక్షల కోట్ల నికర పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో రూ.5.10 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను రూపంలో రాగా, రూ.6.62 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ రూపంలో సమకూరింది. ఇక స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు రూ.15.02 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగింది. ఈ కాలంలో రూ.2.92 లక్షల కోట్ల రిఫండ్లను ఆదాయపన్ను శాఖ పూర్తి చేసింది. -
ఐటీ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.. ఎందుకంటే..
ప్రతి రోజూ కాకపోయినా వారానికొకసారైనా ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి. రోజు, తిథి, వారం, నక్షత్రాల్లాగా, వాతావరణం రిపోర్ట్లాగా, బంగారం రేట్లలాగా, షేర్ మార్కెట్ల ధరల్లాగా, చూడక తప్పదు. సైటు తెరవగానే హోమ్‌పేజీలో ఇంపార్టెంట్ విషయాలు ఇరవై ఉంటాయి. వీటిని తెరిస్తే మీకు ఉపయోగపడే సమాచారం కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి.. ఈ–వెరిఫికేషన్ స్టేటస్, పాన్ స్టేటస్, చెల్లించిన పన్ను స్టేటస్, మీ అధికారి ఎవరు, మీ రిఫండ్ స్టేటస్, ఆధార్‌తో అనుసంధానం వివరాలు, నోటీసు వివరాలు.మీకు అవసరమైన విండోని ఓపెన్ చేస్తే అందులో ఉన్న కాలాలు అన్నీ పూరిస్తే, వివరాలు తెలుస్తాయి. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రిఫండ్ ఇంకా రాలేదేంటి అని ప్రశ్నించడం మొదలెడతారు. అలాగే, అసెస్మెంట్ స్టేటస్‌కు సంబంధించి సాధారణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఓటీపీతో మొదలు అన్ని స్టేజీల్లోనూ మీకు సమాచారం అందుతూనే ఉంటుంది. ఆ సమాచార స్రవంతిని ఫాలో అవ్వండి. ఒకరోజు టీవీ, సీరియల్స్‌ని మిస్ అయినా ఫర్వాలేదు. ఈ ట్రాక్‌ని వదలకండి. పోస్టులో మీ ఇంటికి వచ్చి, తలుపు కొట్టి నోటీసులు ఇచ్చే రోజులు కావివి. అంతా ఆన్లైన్. అంతే కాకుండా నోటీసులు కూడా పంపుతున్నారు. ఈ మెయిల్స్‌ని ట్రాక్ చేయండి. అప్పుడప్పుడు నోటీసులు, సమాచారాలు ఈమెయిల్ బాక్సులో స్పామ్‌లోకి వెళ్లిపోతాయి. అలా పోయినా మనకు నోటీసు ఇచ్చినట్లుగానే భావిస్తారు డిపార్ట్మెంట్ వారు. ఫోన్లో మెసేజీ వచ్చిన వెంటనే మెయిల్ రాకపోవచ్చు. పది, పదిహేను రోజులు ఆగండి.టాక్స్ కాలెండర్ఇవన్నీ కాకుండా ‘టాక్స్ కాలెండర్’ కనిపిస్తుంది. అందులో ప్రతి తేదీని క్లిక్ చేస్తూ పోతే, ఆ రోజు మీరేం చేయాలో తెలుస్తుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 15 అనుకోండి.. ఈ తేదీలోపల మీరు ఏయే ఫారాలు వెయ్యాలో, మీ ఎన్నో వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో చెబుతుంది. మీకు ఏ విషయంలో వారి సహాయం కావాలో, ఆ సలహా, సహాయం అందిస్తారు. మార్గదర్శకాలను కూడా చెబుతారు. ఫైలింగ్, టీడీఎస్, ట్యాక్స్, పాన్, టాన్, వార్షిక సమాచార నివేదికకి సంబంధించిన తప్పొప్పులు.. ఇలాంటి వాటి గురించి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఇవన్నీ ఫ్రీ కాల్స్! మీరు దాఖలు చేసే ప్రతి ఫారం 1,2,3,4,5,6,7.. ఇలాంటి వాటికి సంబంధించి ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. మీరు నేరుగా సంప్రదించవచ్చు. సంప్రదించే ముందు మీ వివరాలు, అంటే పాన్, పేరు, పుట్టిన తేదీ, పన్నుకి సంబంధించిన వివరాలు ఉండాలి. అప్పటికప్పుడే మీకు సమాచారం దొరుకుతుంది. అలాగే మీ మెయిల్స్‌కి రెస్పాన్స్ వస్తుంది.ఇంకొక మంచి అవకాశం ఏమిటంటే, మీరు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఐటీ రిఫండ్ విషయం ఉంటుంది. అవసరం అనిపిస్తే ఫిర్యాదులు చేయండి. మీ ఫిర్యాదుని నమోదు చేసుకుంటారు. ఎక్నాలెడ్జ్ చేస్తారు. దానికో నంబర్ కేటాయిస్తారు. ఆ ఫిర్యాదుల స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. వెంటనే దర్శించి, అన్నీ తెలుసుకోండి. మీ పాన్ నంబరు, పాస్వర్డ్ మీ దగ్గరుండాలి. ఈ సైట్ స్నేహపూర్వకమైనది. చాలా సులభతరమైనది. మీకు అన్నీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ఉచితం. త్వరగా పని పూర్తవుతుంది. రెస్పాన్స్ బాగుంటుంది. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ సైట్ డైనమిక్ అండోయ్!! పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ నోటీసులు
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్నారు. టీడీఎస్ క్లెయిమ్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్‌లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో డిమాండ్ చేసిన మొత్తాలు రూ.50,000 నుంచి రూ.1,45,000 వరకు ఉన్నాయి. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ, ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు.ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా అప్డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్‌ను మ్యాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టమ్‌లో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు.ఇదీ చదవండి: కలవరపెడుతున్న డెల్ ప్రకటనటీడీఎస్ రికార్డుల్లోని వ్యత్యాసాల కారణంగా చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీఫండ్లు ఆలస్యం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రాథమిక అంచనా ఆందోళన కలిగించింది. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్‌లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ నోటీసులు ఉన్నప్పటికీ, పన్ను అధికారుల ద్వారా రీప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈ-మెయిల్స్‌లో తెలియజేసింది. -
ట్యాక్స్ రీఫండ్.. పన్ను చెల్లింపుదారులూ జాగ్రత్త!
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.మోసపూరిత కాల్స్, పాప్-అప్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ సోషల్ మీడియా ద్వారా సూచించింది. ఒకవేళ అలాంటి సందేశం వచ్చినట్లయితే, అది ఐటీ శాఖ నుంచి వచ్చినదేనా అని అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.“క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే ఈమెయిల్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు లేదా వెబ్సైట్లను సందర్శించవద్దు. పన్ను చెల్లింపుదారులను అందించిన ఈమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే వారిని ఆదాయపు పన్ను శాఖ సంప్రదించవచ్చు” అని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది.pic.twitter.com/d5oVz6aiPW— Income Tax Mumbai (@IncomeTaxMum) August 15, 2024 -
ఐటీఆర్ ప్రాసెసింగ్.. ఐటీ శాఖ అప్డేట్
2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITRs) ప్రాసెసింగ్‌పై ఆదాయపు పన్ను శాఖ అప్డేట్ విడుదల చేసింది. జూలై 31 నాటికి 6.21 కోట్ల ఐటీఆర్‌లు ఈ-వెరిఫై అయ్యాయి. వీటిలో 5.81 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా వైరిఫై చేశారు.ఐటీ శాఖ ప్రకటన ప్రకారం.. ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలైన ఐటీఆర్‌లలో ఇప్పటికే 2.69 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేశారు. ఇవి మొత్తం దాఖలు చేసిన రిటర్న్స్‌లో 43.34 శాతం అని ఐటీ శాఖ పేర్కొంది.జూలై 31 గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 7.5 శాతం పెరిగాయి. ఈసారి గణనీయమైన సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విధానంలో 5.27 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. పాత పన్ను విధానంలో 2.01 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. 58.57 లక్షల మొదటిసారి ఫైలర్లు ఉన్నారు. -
సమీపిస్తున్న గడువు.. ఐటీ శాఖ బిగ్ అప్డేట్!
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరి రోజు. పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. గడువు సమీపిస్తుండడంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో రిటర్న్స్ దాఖలయ్యాయి.ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. గతేడాదిలో దాఖలైన ఐటీ రిటర్న్స్‌తో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది.గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్న్స్ పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామంది. కాగా గతేడాది మొత్తం 8.61 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. -
ఐటీఆర్ గడువు పొడిగింపు? ఐటీ శాఖ క్లారిటీ
ఐటీఆర్ రిటర్న్స్ గడువుకు సంబంధించి చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ వార్త ఫేక్ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. “ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీ పొడిగింపునకు సంబంధించి సందేశ్ న్యూస్ పేరుతో న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్సైట్/పోర్టల్ నుంచి వచ్చే అప్డేట్లను మాత్రమే అనుసరించాలని పన్ను చెల్లింపుదారులకు సూచిస్తున్నాం’’ అని వివరించింది.అదే విధంగా ఆదాయపు పన్ను రీఫండ్లకు సంబంధించి చేస్తున్న స్కామ్ గురించి కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. “తమ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి, ఒక కొత్త రకమైన స్కామ్ ఆందోళనలు లేవనెత్తింది. ట్యాక్స్ రీఫండ్ పేరుతో స్కామర్లు ఎస్ఎంఎస్లు, మెయిల్ పంపుతూ ట్యాక్స్ పేయర్స్ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును హరించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అప్రమత్తం చేసింది.కాగా 22 జూలై వరకు 4 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో దాఖలు చేసిన రిటర్న్‌లతో పోలిస్తే 8% ఎక్కువ. జూలై 16న రోజువారీ దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్య 15 లక్షలు దాటింది. గడువు తేదీ సమీపిస్తుండటంతో రోజువారీ ఫైలింగ్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. -
తప్పుడు క్లెయిమ్‌లతో చిక్కులు తప్పవు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు క్లెయిమ్‌లు నమోదు చేసి ఆదాయపన్ను మినహాయింపులు పొందాలంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవని ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్–5 అడిషనల్ కమిషనర్ పి.సుమిత హెచ్చరించారు. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లింపు, మినహాయింపు మార్గాలు, జత చేయాల్సిన ధ్రువపత్రాలు, అవకతవకలకు పాల్పడితే విధించే జరిమానాలు తదితర అంశాలపై ఆదాయ పు పన్ను శాఖ అధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని లారస్ ల్యాబ్స్ కార్యాలయంలో అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. సంస్థ ఉద్యోగులకు అడిషనల్ కమిషనర్ సుమిత, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్.రామకృష్ణ శాస్త్రి పలు అంశాలను వివ రించారు. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో గతే డాది నుంచి ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు సుమిత తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమ అడ్రస్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలను ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా/ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా అడ్రస్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ మారితే విధిగా అప్డేట్ చేయాలని సూచించారు. పన్ను ఎగవేసేందుకు ఆదాయ వివరాలు దాచిపెట్టినా.. సబ్ రిజి్రస్టార్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, కెడ్రిట్/డెబిట్ కార్డులు, వాహనాలు కొనుగోలు ఇలా అన్ని రకాలుగా ఐటీ అధికారులకు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు. ఏవైనా తేడాలు ఉంటే పదేళ్ల తర్వాత కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పన్ను చెల్లింపుదారులు సాధారణంగా చేస్తున్న పొరపాట్లు తదితర అంశాలపై ఎన్.రామకృష్ణ శాస్త్రి సూచనలు చేశారు. ఐటీ శాఖ నుంచి వచ్చే నోటీసులకు విధిగా స్పందించాలని, సకాలంలో స్పందించకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆధార్ కార్డును పాన్ నంబర్‌తో లింక్ చేయకపోతే అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని, అర్హతలేని రిటర్న్‌లు క్లెయిమ్ చేయొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ సర్కిల్–5 అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాస్, లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సీహెచ్ సీతా రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాసుల పంట.. భారీగా పన్ను వసూళ్లు
దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 11 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.54 శాతం వృద్ధి చెంది రూ. 5.74 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ పన్ను వసూళ్లు రూ.4.80 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.74 లక్షల కోట్లలో (జూలై 11 నాటికి) కార్పొరేషన్ పన్ను (CIT) రూ. 2.1 లక్షల కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత), వ్యక్తిగత ఆదాయపు పన్ను (PIT) రూ. 3.46 లక్షల కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) రూ. 16,634 కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత) ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వివరించింది.కాగా ప్రభుత్వం 2024-25లో జూలై 11 వరకు రూ. 70,902 కోట్ల ప్రత్యక్ష పన్ను రీఫండ్లను జారీ చేసింది. 2023-24లో జారీ చేసిన రూ. 43,105 కోట్లతో పోలిస్తే ఇది 64.49 శాతం పెరిగింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) రూ. 21.99 లక్షల కోట్ల వసూళ్లను అంచనా వేసింది.ఒక నిర్దిష్ట సంవత్సరానికి ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన పన్ను వసూళ్లు ముఖ్యమైనవి . కేంద్రం మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక లోటు 5.2 శాతం లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల ప్రాతిపదికన, రీఫండ్లను సర్దుబాటు చేయడానికి ముందు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూలై 11 నాటికి రూ. 6.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23.24 శాతం వృద్ధి. -
ఐటీ రిటర్న్.. చలో ఆన్లైన్!
ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. జూలై 31 తుది గడువు. చివరి రోజు వరకు ఆగకుండా ముందుగా రిటర్నులు దాఖలు చేయడం సూచనీయం. చాలా మందికి రిటర్నుల విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వేరొకరి సాయం తీసుకుంటుంటారు. కానీ, ఎవరికివారే ఆదాయపన్ను శాఖ ఈ–ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులను ఎల్రక్టానిక్ రూపంలో సమరి్పంచొచ్చు. ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను యూజర్లకు అనుకూలంగా మార్చేందుకు ఆదాయపన్ను శాఖ ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ, ఐటీఆర్ దాఖలు ప్రక్రియ అర్థం కాని వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి ఉన్నమెరుగైన ప్రత్యామ్నాయ మార్గం.. మధ్యవర్తిత్వ సంస్థల సాయం తీసుకోవడం. వీటి ద్వారా చాలా సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఈ విషయంలో ఇవి మెరుగైన సేవలను అందిస్తున్నాయి. వీటి గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.ఈఆర్ఐలుఈ–రిటర్న్ ఇంటర్మీడియరీలు (ఈఆర్ఐలు) ఎలక్గ్రానిక్ రూపంలో పన్ను రిటర్నులు వేసేవారికి కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఇవి అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. సాఫ్ట్వేర్ ఆధారితంగా నడిచే ప్లాట్‌ఫామ్‌లు. వీటి ద్వారా ఎవరైనా రిటర్నులు సమరి్పంచొచ్చు. పన్ను చెల్లింపుదారుల తరఫున పన్ను రిటర్నుల దాఖలుకు ఐటీ శాఖ నుంచి వీటికి అనుమతి ఉంది. క్లియర్‌ట్యాక్స్, క్వికో, ట్యాక్స్‌బడ్డీ, మైఐటీ రిటర్న్, ఈజెడ్‌ట్యాక్స్, ట్యాక్స్2విన్ ఇవన్నీ ఈఆర్ఐలే. రిటర్నుల ఆటోఫిల్, రివ్యూ, ఈ–ఫైల్.. ఇలా మూడంచెల్లోనే రిటర్నులను సమరి్పంచొచ్చు. పన్ను రిటర్నులు వేయడం ఇంత సులువా? అనేలా ఇవి సేవలు అందిస్తున్నాయి.సౌకర్యం..ఇవి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు కావడంతో పన్ను చెల్లింపుదారులు తమ ఇంటి నుంచే ఖాళీ సమయంలో సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. వీటి యూజర్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకునేందుకు సులభంగా, సమకాలీనంగా ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో ఈ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. మొబైల్ యాప్‌ల నుంచి రిటర్నులు వేసే సౌకర్యాన్ని సైతం అందిస్తున్నాయి. క్వికో అయితే యూపీఐ ద్వారా పన్ను చెల్లించే సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్, ఫామ్ 16 పత్రాల కాపీలను దగ్గర ఉంచుకుంటే, రిటర్నులు వేగంగా సమరి్పంచొచ్చు. ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై మూలధన లాభాలు ఉన్న వారూ ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రిటర్నులు సులభంగానే దాఖలు చేసుకోవచ్చు. ప్రముఖ స్టాక్ బ్రోకర్లతో వీటికి ఒప్పందం ఉంది. కనుక పన్ను చెల్లింపుదారుల సమ్మతితో వారికి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వివరాలను బ్రోకర్ల సర్వర్ల నుంచి సెకన్ల వ్యవధిలో తీసుకుని రిటర్నుల పత్రంలో నమోదు చేస్తాయి. కనుక వీటిని విడిగా నమోదు చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అందుకే తమ స్టాక్ బ్రోకర్‌తో టైఅప్ ఉన్న ఈఆర్ఐని ఎంపిక చేసుకోవాలి. లేదంటే విడిగా ప్రతీ పెట్టుబడికి సంబంధించిన కొనుగోలు తేదీ, ధర, విక్రయం తేదీ, ధర తదితర వివరాలు నమోదు చేయాల్సి వస్తుంది.అన్ని విధాలా సహకారం పన్ను అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు ఇవి సిద్ధంగా ఉంటాయి. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది అనుకూలం? వ్యక్తి ఆదాయ వనరుల ఆధారంగా దాఖలు చేయాల్సిన ఐటీఆర్ పత్రాన్ని ఈఆర్ఐ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది. కేవలం వేతనమే కాదు, ఈక్విటీలు, ఎఫ్‌అండ్‌వో ఆదాయం, విదేశీ ఆస్తుల ద్వారా ఆదాయం ఇలా భిన్న రూపాల్లో ఆదాయ వనరులు ఉన్న వారికి ఐటీఆర్ పత్రం ఎంపికను ఇవి సులభతరం చేస్తాయి. రిటర్నులు దాఖలు చేయడమే కాదు, ఈ వెరిఫికేషన్‌ను కూడా అక్కడే పూర్తి చేయవచ్చు. ట్యాక్స్‌బడ్డీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిటర్నులు వేసినట్టయితే.. ఒకవేళ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడం, నోటీసుకు ఇవ్వాల్సిన సమాధానం విషయంలోనూ సహకారం లభిస్తుంది. ఈఆర్ఐ ప్లాట్‌ఫామ్‌లపై రిటర్నుల దాఖలుకు సంబంధించి రెండు స్కీమ్‌లు ఉంటాయి. ఒకటి సొంతంగా దాఖలు చేసుకోవడం. రెండోది నిపుణుల సహకారంతో దాఖలు చేసుకోవడం. కొంత చార్జీ చెల్లించి పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారాన్ని రిటర్నుల విషయంలో తీసుకోవచ్చు. వర్చువల్‌గా నిపుణులతో సమావేశమై సందేహాలు తీర్చుకోవచ్చు. అడ్వాన్స్డ్ ట్యాక్స్ విషయంలోనూ ఈ ప్లాట్‌ఫామ్‌లు సాయం అందిస్తున్నాయి.. అంతేకాదు ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందడానికి వీలుగా పెట్టుబడుల విషయంలోనూ సలహాలు తీసుకోవచ్చు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఎన్పీఎస్, ఈఎల్ఎస్ఎస్, పన్ను ఆదా డిపాజిట్లలో పెట్టుబడులపై సహకారం లభిస్తుంది. సేవలకు చార్జీలు... ఈ ప్లాట్‌ఫామ్‌లు రిటర్నుల దాఖలుకు కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. నిపుణుల సహకారం లేకుండా సొంతంగా రిటర్నుల ఫైలింగ్‌కు చార్జీ రూ.200 నుంచి రూ.1,600 వరకు ఉంది. ఆదాయస్థాయికి అనుగుణంగా ఈ చార్జీ మారుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు పన్ను చెల్లింపుదారులు సొంతంగా రిటర్నులు దాఖలు చేసుకుంటే ఎలాంటి చార్జీ తీసుకోవడం లేదు. నిపుణుల సాయం తీసుకుని, రిటర్నులు వేయాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఆర్ఐ సంస్థలకు యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ సేవలను ఎలా వినియోగించుకోవచ్చన్నదానిపై వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. వ్యక్తిగత ఆరి్థక అంశాలపై సమాచారం అందించే వీడియోలు సైతం అక్కడ లభిస్తాయి. డేటా భద్రత సంగతి?ఈఆర్ఐలు అన్నీ కూడా పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సున్నితమైన వ్యక్తిగత డేటాను పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. కనుక ఆయా ప్లాట్‌ఫామ్‌ల భద్రత ఎంతన్నది ముందే విచారించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని మరొకరితో పంచుకోవడం లేదా విక్రయించడం చేయబోమని ఈ వేదికలు హామీ ఇస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు టెక్నాలజీ, భద్రత కోసం తగినంత ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటి విషయంలో రాజీకి అవకాశం లేదు.రిటర్నులు ఎవరు వేయాలి? వార్షిక ఆదాయం రూ.2,50,000 వరకు ఉన్న వారు పన్ను పరిధిలోకి రారు. పాత పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు ఆదాయ పరిమితి రూ.2,50,000. అదే కొత్త పన్ను విధానంలో అయితే వార్షికాదాయం రూ.3,00,000 మించని వారు పన్ను రిటర్నులు దాఖలు చేయనవసరం లేదు. ఇంతకు మించి ఆదాయం కలిగిన ప్రతి ఒక్కరూ రిటర్నులు విధిగా దాఖలు చేయాల్సిందే. అయితే పన్ను చెల్లించే ఆదాయం లేకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో రిటర్నులు దాఖలు చేయాలని చట్టంలోని సెక్షన్ 139 స్పష్టం చేస్తోంది.ఏ సందర్భాల్లో రిటర్నులు వేయాలి..? (సెక్షన్ 139)→ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు (షేర్లు) కలిగి ఉన్న వారు రిటర్నులు దాఖలు చేసి, అందులో ఆ వివరాలు పేర్కొనాలి. విదేశీ కంపెనీల్లోని వాటాల ద్వారా వచ్చే డివిడెండ్ వివరాలను సైతం వెల్లడించాలి. విదేశీ కంపెనీల బాండ్లు, విదేశాల్లో ఇల్లు, ఆ ఇంటి నుంచి అద్దె ఆదాయం వస్తున్న ప్రతి ఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాలని సెక్షన్ 139(1) చెబుతోంది. భారత్‌కు వెలుపల ఏ దేశంలో అయినా అకౌంట్‌కు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు కూడా రిటర్నులు వేయాలి. తన పేరు మీద ఇన్వెస్ట్ చేసినా లేదా తల్లిదండ్రుల పేరు మీద విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా సరే.. రిటర్నుల దాఖలు తప్పదు. → ఒక వ్యక్తి తాను, తన జీవిత భాగస్వామి, లేదా ఇతరుల (తల్లిదండ్రులు తదితర) విదేశీ పర్యటనల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలు, అంతకుమించి ఖర్చు చేసినట్టయితే రిటర్నులు వేయాల్సి ఉంటుంది. → ఒక ఆరి్థక సంవత్సరంలో విద్యుత్ బిల్లుల మొత్తం రూ.లక్ష దాటినా సరే రిటర్నుల దాఖలు తప్పనిసరి. → మూలధన లాభాలపై పన్ను మినహాయింపు కోరుకునే వారు రిటర్నులు దాఖలు చేయాలి. → మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూళ్లు (టీసీఎస్) ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.25,000, అంతకుమించి ఉంటే రిటర్నులు వేయాలని ఆదాయపన్ను శాఖ 2022 ఏప్రిల్ నాటి నోఫికేషన్ స్పష్టం చేస్తోంది. ఇదే నోటిఫికేషన్ ప్రకారం.. ఒక ఆరి్థక సంవత్సరంలో బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో రూ.50లక్షలు అంతకుమించి డిపాజిట్ చేసిన సందర్భాల్లో, వ్యాపార టర్నోవర్ లేదా వ్యాపారం నుంచి రావాల్సిన మొత్తం రూ.60లక్షలు మించి ఉన్నా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. → స్వయం ఉపాధిలోని వారు కరెంట్ ఖాతా కలిగి, అందులో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.కోటి డిపాజిట్ చేసిన సందర్భంలోనూ రిటర్నులు వేయాలి. → వడ్డీ ఆదాయం, డివిడెండ్లపై టీడీఎస్ అమలు చేస్తుంటారు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు, ఇలా టీడీఎస్ రూపంలో మినహాయించినది తిరిగి పొందాలంటే (రిఫండ్), ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువులోపు రిటర్నులు వేయకపోతే?జూలై 31 తర్వాత రిటర్నులు దాఖలు చేసే వారు సెక్షన్ 234ఎఫ్ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న వారికి రూ.1,000, రూ.5 లక్షలు మించి ఆదాయం ఉంటే రూ.5,000 పెనాల్టీ కింద చెల్లించాలి. -
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి వాటిని ఎంచుకోవడంలో ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈతరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి ఆదాయాలు ఉన్నవారు ఏయే ఫారాలు ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.సరైన ఫారం ఎంపికఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే పన్నుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీటీటీ) మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో పన్నుదారులు వారి ఆదాయమార్గాలకు అనుగుణంగా ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. కొత్త పన్ను శ్లాబును ఎంచుకున్నవారి వేతనం రూ.7.5లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఉండి, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ, వ్యవసాయ రాబడి రూ.5000 కంటే తక్కువ..వంటి తదితర మార్గాల్లో అదనంగా ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు.ఐటీఆర్-2వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన పన్నుదారులు దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు ఎంచుకోవాలి.ఎలాంటి వ్యాపార ఆదాయం ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్ 3వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్-4వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒక ఇల్లు మాత్రమే ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు. కానీ మీ మొత్తం ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ 8 శాతానికి మించి ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం రూ.5000లోపు ఉండాలి. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లించకూడదు.ఇదీ చదవండి: పన్నుదారులు తెలుసుకోవాల్సినవి..ఐటీఆర్-5ఒకరికంటే ఎక్కువమంది కలిసి ఏదైనా వ్యాపారంసాగిస్తే ఈ ఫారం దాఖలు చేయవచ్చు.ఎలాంటి వేతన ఆదాయం ఉండకూడదు.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉండవచ్చు.వ్యాపార ఆదాయం ఉండాలి.ఇతరమార్గాల ద్వారా ఆదాయం ఉండవచ్చు.కంపెనీలు దాఖలు చేసే ఫారం ఐటీఆర్-6. ఐటీఆర్ 7 ఫారాన్ని ట్రస్టులు అవి చెల్లించిన ఆదాయాన్ని రిటర్ను చేసుకోవడానికి దాఖలు చేస్తాయి. -
ఎల్&టీ కంపెనీకి ఐటీ శాఖ భారీ జరిమానా
లార్సెన్ & టూబ్రో లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.4.68 కోట్లకు పైగా జరిమానా విధించింది. 2021 ఏప్రిల్ 1న కంపెనీలో విలీనమైన ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పన్ను ప్రొసీడింగ్స్‌కు సంబంధించి రూ.4,68,91,352 జరిమానా విధించినట్లు ఎల్ & టీ తాజా ఫైలింగ్‌లో తెలిపింది.2020-21 అసెస్మెంట్ ఇయర్‌కి సంబంధించి కంపెనీ ఆదాయపు పన్ను మదింపు, రిటర్న్ చేసిన ఆదాయంలో సర్దుబాటు వ్యత్యాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, ఈ జరిమానాతో తాము ఏకీభవించనందున ఈ ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేస్తామని, ఉన్నత వేదికపై సానుకూల ఫలితాన్ని ఆశిస్తున్నామని తెలిపింది.ఎల్& టీ అనేది 27 బిలియన్ డాలర్ల భారతీయ మల్టీ నేషనల్ కంపెనీ. 2022 మార్చి 31 నాటికి ఎల్&టీ గ్రూప్‌లో 93 అనుబంధ సంస్థలు, 5 అసోసియేట్ కంపెనీలు, 27 జాయింట్ వెంచర్లు, 35 ఉమ్మడి కార్యకలాపాలు ఉన్నాయి. ఇవి ప్రాథమిక, భారీ ఇంజనీరింగ్, నిర్మాణం, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాయి. -
Lok Sabha Election 2024: 1100 కోట్లు సీజ్ చేసిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024 షెడ్యూల్లో భాగంగా రేపు చివరి దశలో పోలింగ్ జరుగనుంది. నిన్నటితో ప్రచారానిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐటీ సోదాల్లో రూ.1100 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బంగారం కూడా సీజ్ అయ్యింది.వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ. 1100 కోట్ల నగదును సీజ్ చేశారు. మే 30వ తేదీ వరకు ఆదాయపన్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కూడా చేసింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ నగదు విలువ దాదాపు 182 శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల వేళ 390 కోట్ల నగదును సీజ్ చేశారు.ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, తనిఖీలను పెంచేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుతున్న డబ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లకు పైగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఏకంగా రూ.150 కోట్ల వరకు నగదును సీజ్ చేశారు. ఇక, తెలంగాణ, ఒడిషా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024 -
నాసిక్‌లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
-
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్‌లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్‌ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. -
ఆ డబ్బులు మావే ఇచ్చేయండి
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పచ్చ పత్రికాధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ డ్రామాలకు తెరలేపింది. ఆ నగదుతోపాటు చెక్కులు కూడా తమవేనని చెబుతున్న మార్గదర్శి ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపమంటే చూపడం లేదు. దీంతో ఈ సొమ్ము మార్గదర్శిది కాదని.. టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తరలిస్తున్న నగదని అంతా చెబుతున్నారు. ఇప్పటికే ఈ నగదుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా ఈ వ్యవహారం ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. ఆధారాలు చూపించి నగదును తీసుకునే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా జిల్లా ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులకు ఆధారాలు చూపాల్సిందే.. ఎఫ్ఐఆర్ నమోదుతో మార్గదర్శి పేరుతో జరిగిన మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశం ఐటీ శాఖ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పట్టుబడిన ప్రతి పైసాకు లెక్కలతో సహా ఆధారాల్ని పోలీసులతో పాటు ఐటీ అధికారులకు మార్గదర్శి సమర్పించాల్సి ఉంటుంది. కానీ.. ఆ సొమ్ము మార్గదర్శిది కాదని.. అందుకే ఐదు రోజులు గడుస్తున్నా లెక్కా పత్రాలు చూపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఖర్చులకు తమకు అనుకూలమైన పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు అందించేందుకు మార్గదర్శి పేరుతో పక్కా ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి ఇస్తున్నారో అధికారులు దర్యాప్తు చేసి రామోజీరావు నడిపిస్తున్న మనీలాండరింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆధారాల్లేకుండా అధికారుల చుట్టూ.. ఈ నెల 2న విశాఖ ద్వారకానగర్ ప్రాంతంలో రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. వీటిని ఇద్దరు మార్గదర్శి సిబ్బంది స్కూటీపై సూట్‌కేసులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, చెక్కులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. నగదు తరలింపుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం తమ పరిధిలో లేదని రెండు రోజుల క్రితం మార్గదర్శి సిబ్బందికి ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. కలెక్టరేట్లోని ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది ప్రదక్షిణలు చేస్తూ.. నగదు, చెక్కులు ఇప్పించాలంటూ హడావుడి చేస్తున్నారు. తమ పరిధిలో లేదని చెబుతున్నా వదలకపోవడంతో ‘ఆధారాలు చూపించండి.. పోలీసులు, ఐటీ సిబ్బందికి ఇస్తాం’ అని ఎన్నికల యంత్రాంగం చెప్పడంతో.. తామేమీ ఆధారాలు తీసుకురాలేదని అక్కడి నుంచి మార్గదర్శి సిబ్బంది పలాయనం చిత్తగించారు. అయితే శనివారం సాయంత్రం మళ్లీ ఎన్నికల అధికారుల వద్దకు వచ్చి నగదు కోసం ఒత్తిడి తెచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తుండటంతో మార్గదర్శి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
పాన్‌కార్డ్ జాగ్రత్త.. ఈ విద్యార్థికి జరిగిందే మీకూ జరగొచ్చు!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థికి ఆదాయపన్ను శాఖ నుంచి రూ.46 కోట్లకు ట్యాక్స్ నోటీసు వచ్చింది. మామూలు విద్యార్థికి అన్ని కోట్ల పన్ను నోటీసు రావడమేంటి అనుకుంటున్నారా? అతని పాన్ కార్డ్‌ను కొందరు దుర్వినియోగం చేశారు. దీంతో ఆ విద్యార్థికి ఐటీ నోటీసు వచ్చింది. తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా అనే కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో తన పాన్‌కార్డ్ నెంబర్‌తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు వాపోయాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. -
Income Tax Department: సీపీఐ, సీపీఎంలకు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను నోటీసుల పరంపరం కొనసాగుతోంది. రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి ఐటీ డిపార్టుమెంట్ నోటీసు జారీ చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత కొన్నేళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు ఫెనాలీ్టలు, వడ్డీ కింద రూ.11 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసు ఇచి్చనట్లు తెలిపాయి. ఈ నోటీసులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి సీపీఐ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అలాగే సీసీఎంకు కూడా ఐటీ నోటీసులు అందాయి. 2016–17లో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటూ ఐటీ విభాగం తాజాగా సీపీఎంకు నోటీసులు ఇచి్చంది. అప్పట్లో ఐటీ రిటర్నుల్లో బ్యాంకు ఖాతాను నిర్ధారించనందుకు రూ.15.59 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
Income Tax Department: రూ.1,823 కోట్లు చెల్లించండి
న్యూఢిల్లీ: రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను విభాగం నుంచి తాజాగా తమ పార్టీకి నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, అజయ్ మాకెన్ చెప్పారు. ఐటీ చట్టాలను అధికార బీజేపీ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ ఉల్లంఘలనకు గాను బీజేపీ నుంచి రూ.4,617.58 కోట్లు వసూలు చేయాలని ఐటీ అధికారులను డిమాండ్ చేశారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని, లోక్‌సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు తమకు విరాళాలు ఇచి్చనవారి పేర్లు, చిరునామాలను ఫామ్ 24ఏలో పొందుపర్చి, ఎన్నికల సంఘానికి సమరి్పంచాల్సి ఉంటుందని అజయ్ మాకెన్ చెప్పారు. బీజేపీ మాత్రం ఇలాంటి వివరాలను ఏనాడూ సక్రమంగా సమరి్పంచలేదని విమర్శించారు. ఐటీ విభాగం బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆక్షేపించారు. కేవలం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని నోటీసులు ఇస్తోందని అన్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం అని తేలి్చచెప్పారు. పాత ఐటీ రిటర్నులను మళ్లీ తెరవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది రాహుల్ గ్యారంటీ ఐటీ డిపార్టుమెంట్ ఇచి్చన తాజా నోటీసులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తూ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య వలువలు ఊడదీస్తున్నవారికి ప్రభుత్వం మారిన తర్వాత తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తాము తీసుకొనే చర్యలు ఎలా ఉంటాయంటే.. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా భయపడేలా ఉంటాయని, ఇది రాహుల్ గ్యారంటీ అని తేలి్చచెప్పారు. -
కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. ఈసారి భారీ ఐటీ నోటీసులు
ఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ.. కాంగ్రెస్ పార్టీకి పన్ను నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన మరుసటిరోజే.. ఆదాయ పన్ను శాఖ రూ.1700 కోట్ల బకాయి పన్ను రికవరీ చేయాలని నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వెల్లడించారు. 2017-18 నుంచి 2020-21 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీని కలిపి పన్ను రికవరీ చేయాలని నోటీసులో పేర్కొంది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్న శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్‌తో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది. రీఅసెస్మెంట్ ప్రక్రియ చేపట్టేందుకు తగిన అధికారాలు ఐటీ శాఖ దగ్గర ఉన్నాయని.. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇక.. 2014-15, 2015-16, 20216-17 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి..రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 22న కోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే. ఈ రీఅసెస్మెంట్కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది. చదవండి: ముఖ్తార్ అన్సారీపై విష ప్రయోగం?, జైల్లో ఆహారంలో 40 రోజులుగా.. -
ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తమ అకౌంట్లను ఆదాయపు పన్నుశాఖ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కాగా లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చర్యలను ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ సవాల్ చేసింది. 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా ఐటీ అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌లు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈ కేసులో టాక్స్ అథారిటీ ఎలాంటి చట్టబద్దమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని.. పార్టీ ఎగ్గొ ఆదాయం రూ. 520 కోట్ల కంటే ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ రిట్ పిటిషన్లను కొట్టివేస్తున్నామని తెలిపింది. అయితే తొలుత ఈ పిటిషన్లపై మార్చి 20న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసి నేడు తీర్పు వెల్లడించింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్న రూ. 105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. చదవండి: అందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు: శరద్ పవార్ కాగా అంతకుముందు ఐటీ శాఖ సీజ్ చేసిన రూ.105 కోట్లను రిలీజ్ చేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. 2018-19 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.102 కోట్ల బకాయి పన్నును రికవరీ చేయాలని ఐటీ శాఖ కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్టే విధించాలని హస్తం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నోటీసుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ.. స్టే కోరుతూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇక తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అబద్దంగా మారిందని ఆరోపిన్నారు. ఎన్నికల్లో పోరాడకుంటా తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాటి చర్యలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ న్యాయస్థానంలోనూ కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. -
కారణాలు చెప్పే అరెస్టు చేశాం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో తనిఖీలు ప్రశాంతంగా సాగాయని, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రకటించారు. శుక్రవారం కవిత నివాసంలో తనిఖీలు ముగిశాక పంచనామా నివేదికను విడుదల చేశారు. ఆ వివరాలు ‘‘పంచ్‌లు (వీరి సమక్షంలో అధికారులు విచారణ చేస్తారు) బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ ఏద్దుల వివేకానందకుమార్రెడ్డి ఎదుట వివరాలు సేకరించాం. ఈడీ అదనపు డైరెక్టర్ కపిల్‌రాజ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించాం. మొదట తనిఖీల అధికారిక పత్రంపై కవిత సంతకాన్ని తేదీతో సహా తీసుకున్నాం. తర్వాత అదే పత్రంపై మేం కూడా తేదీతో సహా సంతకం చేశాం. మధ్యాహ్నం 1.45 గంటలకు తనిఖీలు ప్రారంభించాం. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)–2002లోని సెక్షన్ 17 ప్రకారం కవిత వాంగ్మూలాన్ని నమోదు చేశాం. సెక్షన్ 19 ప్రకారం సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్టు చేశాం. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నామో కారణాలను ఆమెకు వివరించాం. పలు రికార్డులు/ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు 5 ఫోన్ల సీజ్ చేశాం. సాయంత్రం 4.15 గంటలకు అధికారి మమత నారా వెళ్లడంతో మరో అధికారి వరలక్ష్మి వచ్చి పాల్గొన్నారు. సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో కవిత సోదరుడు, మరికొందరు వ్యక్తులు, న్యాయవాదులు చట్టవిరుద్ధంగా తనిఖీల ప్రాంతంలోకి వచ్చారు. వారెవరో మాకు వివరాలు చెప్పలేదు. విచారణకు ఆటంకం కలిగించారు. సాయంత్రం 6.45 గంటలకు తనిఖీలు ముగించాం. ప్రశాంతంగా, ఇంట్లోని ఏ వస్తువులకూ ఎలాంటి నష్టం కలగకుండా కొనసాగించాం. ప్రారంభంలో తనిఖీలను కవిత సున్నితంగా తిరస్కరించారు’’అని పంచనామాలో ఈడీ అధికారులు వివరించారు. ఈ తనిఖీల్లో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్‌తోపాటు డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ, అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్‌గోయల్, అధికారులు విక్రాంత్‌కుమార్, కార్తీక్ మెహ్రా, హిమాన్షు చౌదరి, మమతా నారా, బ్రజేష్ చౌరాసియా పాల్గొన్నట్టు తెలిపారు. -
కలకలం.. ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని గంటల్లో వెలువడనుండగా, భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీమద్యం కుంభకోణంలో నిందితురాలుగా పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం కవితను అరెస్టు చేసిన ఈడీ, రాత్రి ఢిల్లీకి తరలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సమయంలో కవిత అరెస్టు జరగడం సర్వత్రా ఉత్కంఠను రేపింది. లిక్కర్ స్కామ్ సుమారు ఏడాదిన్నరగా నడుస్తుండగా, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయడం.. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రజాక్షేత్రంలో రాజకీయంగా, కోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆ పార్టీ ప్రకటించినా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కవిత అరెస్టు అంశం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. వంద రోజుల్లోనే కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే శ్వేతపత్రాలు, విచారణలు, కేసుల పేరిట కాంగ్రెస్ ముప్పేట దాడి చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ ఒత్తిడి పెంచుతోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ను రాజకీయంగా బలహీన పరచ డం లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించే వ్యూహంపై పార్టీలోనూ, బయటా ఆసక్తి నెలకొంది. తొలుత సీబీఐ..తర్వాత ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో సాక్షిగా పేర్కొంటూ 2022 డిసెంబర్ 3న కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 6న సీబీఐ బృందం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను విచారించింది. ఇదే కేసులో సమాంతర విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 జనవరి నుంచి పలుమార్లు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్నందున రాలేనంటూ కవిత పలుమార్లు సమాధానం ఇచ్చారు. చివరకు 2023 మార్చి 9న ఈడీ నోటీసులకు స్పందనగా అదే నెల11, 20 తేదీల్లో విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఫోన్లు, సిమ్ కార్డులను అప్పగించారు. ఆ తర్వాత ఈడీ మరోమారు నోటీసు జారీ చేయగా, మహిళలను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసు తాజాగా ఈ నెల 19కి వాయిదా పడింది. ఏడాదిన్నరగా వేడి కవిత వ్యవహారంపై ఏడాదిన్నరగా బీజేపీ, బీఆర్ఎస్ నడుమ విమర్శల యుద్ధం జరుగుతోంది. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత ‘అరెస్టు’అంశంపై బీజేపీ పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లోగా కవితను అరెస్టు చేయిస్తామంటూ బీజేపీ ముఖ్య నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. మరోవైపు ఇప్పటివరకు కవితను అరెస్టు చేయకపోవడం బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వచి్చంది. రాజకీయ, న్యాయ పోరాటం దిశగా బీఆర్ఎస్ అడుగులు రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా క్రియాశీలంగా పనిచేసిన కల్వకుంట్ల కవిత, 2014 లోక్‌సభ ఎన్నికల వేదికగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి గెలుపొందిన కవిత 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో 2020, 2022లో నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల లేదా ఆర్మూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించినా అలా జరగలేదు. తాజాగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మరోమారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్తిగా పోటీ చేయాలని భావించారు. అయితే రెండు నెలల క్రితమే టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. కాగా కవిత అరెస్టు అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఎదురుదాడి వ్యూహానికి పదును పెడుతోంది. కవిత అరెస్టును రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు న్యాయ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తోంది. -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ సహా అక్కడున్నవారి సెల్ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్‌కుమార్‌కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ అభివాదం చేసి.. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్‌కుమార్ కారులో వస్తానని చెప్పారు. ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్‌గా శంషాబాద్‌కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. నేడు కోర్టు ఎదుట హాజరు కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం మధ్యాహ్నం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ.. సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022 శరత్‌చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022 వినయ్‌బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022 అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022 విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022 అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022 గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023 గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024 నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. -
అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తమ పారీ్టకి సంబంధించిన రూ.210 కోట్ల నిధులను స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. కిందటి సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ సమరి్పంచిన ఐటీ రిటర్నుల్లో లోపాలు ఉన్నాయంటూ ఐటీ శాఖ ఆ పారీ్టకి రూ.210 కోట్ల జరిమానా విధించించిన సంగతి తెలిసిందే. ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ కాంగ్రెస్ ఖాతాలున్న బ్యాంకులను ఐటీ శాఖ ఆదేశించింది. వేర్వేరు బ్యాంకుల్లోని తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండా రూ.65 కోట్లను ఐటీ శాఖ విత్‌డ్రా చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. రూ.205 కోట్లను స్తంభింపజేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాలపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్‌ను కొట్టివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం తీర్పు వెలువరించింది. -
కాంగ్రెస్ అకౌంట్ నుంచి రూ. 65 కోట్లు రికవరీ చేసిన ఐటీ
న్యూఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 65 కోట్ల బకాయిలను ఆదాయ పన్ను శాఖ రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ మొత్తం రూ. 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతానికి రూ. 65 కోట్లు రికవరీ చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నిధులను ఐటీ శాఖ రికవరీ చేసింది. రూ. 65 కోట్ల రికవరీకి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. ఐటీ శాఖ రికవరీ చర్యలపై ఫిర్యాదు చేసింది. బెంచ్ ముందుకు విచారణ ఫలితం కోసం వేచిచూడకుండానే బ్యాంకుల వద్ద కాంగ్రెస్ ఖాతాల్లో ఉన్న డబ్బులో కొంత మొత్తాన్ని ఐటీ శాఖ బకాయిల కింద రికవరీ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన స్టే దరఖాస్తు వ్యవహారం తేలేవరకూ ఆదాయ పన్ను శాఖ చర్యలను నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహరంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని ట్రిబ్యునల్ ఆదేశించింది. చదవండి: పెళ్లి తర్వాత మహిళా ఉద్యోగి తొలగింపు.. కేంద్రానికి సుప్రీం షాక్ -
Income Tax Department: కాంగ్రెస్ ఖాతాల స్తంభన
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్‌డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు. అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్ అన్నారు. భయపడకండి మోదీ జీ: రాహుల్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్ ప్రజాశక్తికి కాంగ్రెస్ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవాచేశారు. -
కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన కేంద్రం
-
భారీగా సవరణ రిటర్నులు
న్యూఢిల్లీ: సవరణ రిటర్నులు ఆదాయపన్ను శాఖకు అదనపు పన్ను ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లలో 56 లక్షల మేర సవరించిన ఐటీ రిటర్నులు దాఖలు కాగా, వీటి ద్వారా రూ.4,600 కోట్ల పన్ను ఆదాయం సమకూరినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్ నితిన్ గుప్తా ప్రకటించారు. తమ సేవలను మెరుగుపరుచుకుంటూ, వివాద రహిత వాతావరణం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఒకసారి దాఖలు చేసిన ఐటీఆర్‌లకు సంబంధించి సవరణలు చేసుకునే అవకాశాన్ని 2022–23 బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత నుంచి రెండు సంవత్సరాల వరకు ఇలా సవరణలు దాఖలు చేసుకునే వెసులుబాటు వచి్చంది. రూ.కోటికి పైగా పన్నుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారానికి వీలుగా కర్ణాటకలోని మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు గుప్తా వెల్లడించారు. 2014–15 నాటికి రూ.25వేల వరకు పెండింగ్‌లో ఉన్న పన్ను డిమాండ్లను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర బడ్జెట్లో మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. ఇలాంటి 1.1 కోట్ల పన్ను డిమాండ్ల ఉపసంహరణతో కేంద్రం రూ.2,500–3,600 కోట్లను కోల్పోనుంది. కానీ, ఈ వెసులుబాటు 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పస్తుందని నితిన్ గుప్తా తెలిపారు. ఏటా పన్నుల ఆదాయం రూ.19.5 లక్షల కోట్లతో పోలిస్తే ఇది స్వల్ప మొత్తమేనన్నారు. -
2024–25 ఐటీఆర్‌ల నోటిఫై
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలు.. ఐటీఆర్ 2, 3, 5ను నోటిఫై చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీబీడీటీ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు సులభంగా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా రిటర్నుల పత్రాల్లో మార్పులు చేశారు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. -
వారికి ఐటీ శాఖ ఫైనల్ వార్నింగ్!
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ అప్రమత్తం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గత జూలై 31 లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారు డిసెంబర్ 31 లోపు ఫైల్ చేయాలని ఆఖరిసారిగా సూచించింది. ఆలస్యమైన లేదా సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2023 డిసెంబర్ 31 వరకు ఐటీ శాఖ అవకాశం కల్పించింది. ఇంక రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ చేసింది. ఐటీఆర్ దాఖలు చేయనివారు వెంటనే ఫైల్ చేయాలని ఆఖరిసారిగా సూచించింది. అవసరమైన సమాచారం కోసం వెబ్సైట్ లింక్‌ను అందించింది. ఎవరు చేయాలి? ఎవరెవరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ జమ చేయడం, విదేశాలకు వెళ్లేందుకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడం, విద్యుత్ బిల్లుల కోసం 1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు కచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా? ఎవరైనా నిర్దిష్ట సమయంలోగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడంలో విఫలమైతే, వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(4) ప్రకారం ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే ఇందు కోసం ప్రత్యేక ఫారం ఉండదు. పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట అసెస్మెంట్ సంవత్సరానికి నోటిఫై చేసిన ఫారాలనే తప్పనిసరిగా ఉపయోగించాలి. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమౌతుంది? ఆలస్యమైన ఐటీఆర్ కూడా ఫైల్ చేయకపోవడం ప్రతికూల పరిణామాలకు దారి తీయవచ్చు. సెక్షన్ 234A కింద వడ్డీ విధించడం, సెక్షన్ 234F కింద రుసుము, 10A, 10B సెక్షన్ల కింద మినహాయింపులకు అనర్హత వంటి ఎదురుకావచ్చు. దీంతోపాటు చాప్టర్ 6-A పార్ట్ సి కింద తగ్గింపులు అందుబాటులో ఉండవు. సెక్షన్ 234F కింద రూ.5,000 (చిన్న పన్ను చెల్లింపుదారులకైతే రూ.1,000) జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపులకు సెక్షన్ 234A కింద నెలకు 1 శాతం చొప్పున జరిమానా వడ్డీ వర్తిస్తుంది. ఇక దాఖలు చేసిన ఐటీఆర్‌లు 30 రోజులలోపు వెరిఫై కావడం కూడా చాలా కీలకం. వెరిఫై కాని ఐటీఆర్ ఆదాయపు పన్ను శాఖ పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారు వెంటనే ఫైల్ చేయాలని సూచిస్తున్నాం. Kind Attention Taxpayers! Here's your last and final call to file your ITR for A.Y. 2023-24 by 31st December, 2023. Hurry!#FileNow. For more information, please visit https://t.co/uv6KQUbXGv pic.twitter.com/DxMV5Xzu0e — Income Tax India (@IncomeTaxIndia) December 29, 2023 -
ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా?
Income tax department: మీరు ట్యాక్స్ పేయరా..? ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకేదైనా సమాచారం వచ్చిందా..? వస్తే అది నోటీసా లేక సమాచారమా? ఐటీ శాఖ ఏం చెప్పింది? పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR)లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీల నుంచి అందిన సమాచారం మధ్య అసమతుల్యతపై ఆదాయపు పన్ను శాఖ కొంతమంది ట్యాక్స్ పేయర్స్‌కు సమాచారం పంపింది. రిపోర్టింగ్ ఎంటిటీలు అంటే ఐటీ శాఖ సమాచారం తీసుకునే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్టాక్ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్లతో సహా పలు ఏజెన్సీలు. "ఇది పన్ను చెల్లింపుదారులందరికీ పంపిన నోటీసు కాదు. ఐటీఆర్‌లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీ నుంచి అందిన సమాచారం మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉన్న సందర్భాల్లో మాత్రమే పంపిన సలహా" అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. 2024-25 ఐటీఆర్ ఫారాలు విడుదల ఐటీ శాఖ కంప్లయన్స్ పోర్టల్‌లో తమ అభిప్రాయాన్ని అందించడానికి, అవసరమైతే ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్‌లను సవరించడం లేదా ఇప్పటివరకు దాఖలు చేయకపోతే రిటర్న్స్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించడమే ఈ సమాచారం లక్ష్యమని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. ఇది అందినవారు ప్రాధాన్యతగా తీసుకుని ప్రతిస్పందించాలని అభ్యర్థించింది. Some references have come to the notice of the Income Tax Department regarding recent communication sent to taxpayers pertaining to transaction(s) made by them. Taxpayers may pl note that such communication is to facilitate the taxpayers & make them aware of the information… — Income Tax India (@IncomeTaxIndia) December 26, 2023 -
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. 2024-25 ఐటీఆర్ ఫారాలు విడుదల
ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫారాలు - 1, 4 లను విడుదల చేసింది. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న హిందూ అవిభక్త కుటుంబాలు, వ్యక్తులు, సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆర్జించిన ఆదాయానికి రిటర్న్‌లను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫారాలను సాధారణంగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రకటిస్తారు. అయితే, ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్లోనే ఐటీఆర్ ఫారాలను ప్రకటించారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ముందస్తుగా ఐటీఆర్ దాఖలు చేయడానికి వీలు కలిగింది. ఏ ఫారం ఎవరికి? ఐటీఆర్ ఫారం-1 (సహజ్), ఐటీఆర్ ఫారం-4 (సుగమ్) అనేవి పెద్ద సంఖ్యలో ఉండే చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించిన సరళీకృత ఫారాలు. వీటిలో జీతాలు, ఇళ్లు, వడ్డీలు, వ్యయసాయం తదితర మార్గాల ద్వారా రూ. 50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులకు ఫారం-1 వర్తిస్తుంది. ఇక వ్యాపారం, వృత్తి మార్గాల ద్వారా రూ. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఆర్జించేవారు ఫారం-4 ద్వారా రిటర్న్స్ దాఖలు చేస్తారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు డిసెంబర్ 17వ తేదీ నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగి రూ.13,70,388 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) వాటా రూ.6.95 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వాటా రూ.6.73 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సమాచారం ప్రకారం, 2023–24 బడ్జెట్ లక్ష్యాల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 75 శాతానికి చేరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.63 లక్షల కోట్లు. 2023–24లో ఈ లక్ష్యాన్ని రూ.18.23 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించుకుంది. రిఫండ్స్ రూ.2.25 లక్షల కోట్లు.. కాగా, డిసెంబర్ 17 వరకూ రిఫండ్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు. వీటిని కూడా కలుపుకుంటే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.7.90 లక్షల కోట్లు, ఎస్‌టీటీసహా వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.03 లక్షల కోట్లు. వేర్వేరుగా వసూళ్లను పరిశీలిస్తే... అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.25 లక్షల కోట్లు, టీడీఎస్ రూ.7.71 లక్షల కోట్లు, సెల్ప్–అసెస్మెంట్ ట్యాక్స్ రూ.1.49 లక్షల కోట్లు. రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ రూ. 36,651 కోట్లు. ఇతర హెడ్స్ కింద వసూళ్ల మ్తొతం రూ.14,455 కోట్లు. లక్ష్యాల సాధనపై భరోసా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు. ఈ స్థాయి పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 17 వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 21 శాతం పెరిగాయి. పరోక్ష పన్ను దాదాపు 5 శాతం అధికంగా నమోదయ్యాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. -
వారి దగ్గర మీ సమగ్ర సమాచారం.. వెంటనే రంగంలోకి దిగండి..
ఏదైనా కారణం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను 2023 జూలై 31లోగా వేయలేకపోతే, కాస్త ఆలస్యంగానైనా దాఖలు చేసేందుకు 2023 డిసెంబర్ 31 ఆఖరు తేదీగా ఉంటుంది. ఇప్పటికే వేసి ఉంటే సరేసరి. లేకపోతే, వెంటనే రంగంలోకి దిగండి. మీ అంతట మీరే రిటర్ను వేయాలి. గడువు తేదీ లోపల వేయలేకపోతే కొంత పెనాల్టీతో గడువు ఇచ్చారు. అది కూడా ఈ నెలాఖరు లోపే వేయాలి! ఈ మధ్య కొంత మందికి మెసేజీలు పంపుతున్నారు డిపార్టుమెంటు వారు. ‘‘మా దగ్గరున్న సమాచారం ప్రకారం మీరు 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయాలి. కానీ మీరు దాఖలు చేయలేదు. దయచేసి వెంటనే దాఖలు చేయండి’’ అనేది వాటి సారాంశం (చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో). అలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా వెంటనే జవాబు ఇవ్వండి. కాంప్లయెన్స్ పోర్టల్‌లోకి లాగ్ ఇన్ అవ్వండి. ఈ–ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి. ఆ తర్వాత ‘‘పెండింగ్‌లో ఉన్న పనులు’’ దగ్గరికి వెళ్లండి. అలా వెడితే, రిటర్నులు వేయని వారికి సంబంధించిన ‘Non & Filers’ అని టైప్ చేయండి. ఇప్పుడు జవాబు ఇవ్వండి. అయితే, ఒకటి గుర్తు పెట్టుకోండి. డిపార్టుమెంటు వారి దగ్గర మీకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా మెసేజీలు పంపుతున్నారు. సాధారణంగానైతే ఇలా పంపనవసరం లేదు. ఇది కేవలం మేల్కొనమని చెప్పడానికే. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపో వచ్చు. మీకు ఆదాయమే లేకపోవచ్చు. కానీ మీ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంటులో ఏవో పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగి ఉండవచ్చు. వ్యవహా రం జరిగినంత మాత్రాన ఆదాయం ఏర్పడ కపోవచ్చు. కానీ ఇలా జరిగిన పెద్ద లావా దేవీలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వివరణ అడగడానికి, మీరు ఇవ్వడానికి ఇదొక అవకాశం. ఈ మెసేజీ వచ్చిన వెంటనే మీ మీ అకౌంట్లను నిశితంగా పరిశీలించండి. ఖర్చులు (డెబిట్లు), జమలు (క్రెడిట్లు) విశ్లేషించండి. మీరే మీ ’ట్యాక్సబుల్ ఇన్‌కం’లో నుంచి బదిలీ చేసి ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటూ, ఇటూ బదిలీ చేసి ఉంటారు. ఎన్ఎస్సీలు, ఎఫ్డీలు, జీవిత బీమా, గ్రాట్యుటీ ఇలా పన్నుకి గురి అయ్యే వసూళ్లు జమ అయి ఉండొచ్చు. వివరణ సిద్ధం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పంపి ఉండవచ్చు. వారి తరఫున మీరు ఖర్చు పెట్టి ఉంటారు. రుజువులున్న వ్యవహారాలకు వివరణ ఇవ్వొచ్చు. స్నేహంలోనూ, బంధుత్వంలోనూ, మొహమాటంతో మీ అకౌంటులో వ్యవహారాలు ఎవరైనా జరిపి ఉన్నా వివరణ ఇచ్చే బాధ్యత మీ తలపైనే పడుతుంది. ఉదాహరణకు మావగారు పొలం అమ్మగా వచ్చిన నగదు; మీరే మీకు వచ్చిన బ్లాక్ అమౌంటుని జమ చేసి ఉండటం; మీ బావగారు తన కూతురి పెళ్లికని మీ అకౌంటులో వేసి ఉండొచ్చు. ఎవరికో సహాయం చేయబోయి, మీ అకౌంటులో వ్యవహారాలు జరిపి ఉండొచ్చు. ఇలా జరిగిన వాటిని అధికారుల సంతృప్తి మేరకు వివరించగలిగితే ఓకే. లేదంటే వెంటనే విశ్లేషించండి. వృత్తి నిపుణులను సంప్రదించండి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ పౌరుడిగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. -
లెక్కకు రాని కట్టలు ఎన్నో!
రికార్డులు తిరగరాసిన ఉదంతమిది. అయితే అది వన్నె తెచ్చే రికార్డు కాకపోవడమే విషయం. యాభై మంది బ్యాంక్ అధికారులు, 40 కౌంటింగ్ మిషన్లు, ఆరు రోజుల పాటు అలుపెరగని సోదా, దొరికిన 350 కోట్లకు పైగా నగదు... దేశంలో ఇంతవరకూ ఏ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లోనూ కనివిని ఎరుగని కళ్ళు తిరిగే లెక్కలివి. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ కుటుంబ డిస్టిలరీ సంస్థపై రాంచీ సహా వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు వారం రోజులుగా వార్తల్లో ముఖ్యాంశమవడానికి ఇదే కారణం. లెక్కింపు మిషన్లు కూడా మొరాయించేలా, గుట్టలు గుట్టలుగా సంచులకొద్దీ డబ్బు ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన సంస్థల్లో దొరకడం సామాన్య ప్రజానీకాన్ని ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. మునుపెన్నడూ లేనంతగా ఒకేసారి ఇంత డబ్బు ఐటీ సోదాల్లో దొరకడం సహజంగానే అధికార పక్షానికి అందివచ్చిన అస్త్రమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టడంలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు. సాక్షాత్తూ ప్రధాని, పార్లమెంట్ సాక్షిగా హోమ్ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోని ప్రసిద్ధ ‘మనీ హైస్ట్’ సిరీస్ తరహాలో కాంగ్రెస్ అవినీతి దోపిడీ సాగుతోందని ప్రధాని వీడియో మీమ్‌లు పెట్టడం కొసమెరుపు. వెరసి, కాంగ్రెస్‌ది కక్కలేని మింగలేని పరిస్థితి. అయిదుగురు సోదరుల సాహూ కుటుంబమంతా తర తరాలుగా పార్టీ విధేయులూ, వివిధ సమయాల్లో చట్టసభ సభ్యులూ కావడంతో ఆ పార్టీ తప్పించు కోలేని దుఃస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ నడిగడ్డ మీద మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలై, అందులోనూ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి డీలా పడ్డ కాంగ్రెస్‌ను ఇది ఇరుకున పడేసింది. ఈ పరిస్థితుల్లో లెక్కలేని ఈ ధనరాశుల మచ్చ తనపై పడకుండేలా ఆ పార్టీ శతవిధాల యత్నిస్తోంది. బాహాటంగా సాహూను ఏమీ అనకున్నా, ఈ సోదా నగదుపై వివరణ కోరిందన్నది వార్త. సోదాల్లో దొరికిన నగదులో అధిక మొత్తం బౌద్ డిస్టిలరీస్ గ్రూపులో బయటపడ్డదే. అయితే, సాహూ కుటుంబం తరతరాలుగా సారాయి వ్యాపారంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా సాగే ఇలాంటి వ్యాపారంలో నగదు చెల్లింపులే ఎక్కువన్నదీ బహిరంగ సత్యమే. పైగా, కుటుంబసంస్థలో కాంగ్రెస్ ఎంపీ సాహూ కనీసం డైరెక్టరైనా కాదు. సాహూ కుటుంబ సంస్థ అయినంత మాత్రాన ఆ డబ్బు సాహూది ఎలా అవుతుంది? అంతకు మించి ఆ డబ్బంతా కాంగ్రెస్దెలా అయిపోతుంది? ఇదీ హస్తం పార్టీ సమర్థకుల వాదన. సాంకేతికంగా అది నిజమే! అయితే, ఇందిరా గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ వెంట నడిచి, ఒకటికి రెండు మూడు సార్లు ఎంపీలైన సాహూ సోదరుడు, సాహూ... తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు తమ వ్యాపార రాబడిని ఆసరాగా చేసుకొని ఉంటారనేది ఊహకందని విషయమేమీ కాదు. అది సాక్ష్యాధారాలతో సంబంధం లేని సామాన్య ఇంగితం. ఆరోపణలు, వివరణల మాటెలా ఉన్నా తాజా సాహూ వ్యవహారం మరింత లోతైన వ్యవహారాన్ని సూచిస్తోంది. సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న పెద్దమనుషుల వద్ద లెక్కాజమా లేకుండా పోగుపడుతున్న ధనరాశుల చిట్టాలో ఇది లవలేశమేనన్న స్పృహ కలిగిస్తోంది. దాదాపు నూటికి 42 మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బీద రాష్ట్రంలో, నూటికి 48 మంది ప్రజానీకం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న రాష్ట్రంలో ఒక మద్యం డిస్టిలరీ సంస్థ వద్ద ఇంత ధనం దొరకడం సమకాలీన సమాజంలోని విరోధాభాస. సామాన్యులు తమ ప్రతి పైసా ఆదాయానికీ, ఖర్చుకూ లెక్కలు పూచీపడుతుంటే, బడా బాబుల వద్ద లెక్కకందని డబ్బుల కట్టలు మూలుగుతుండడం బయటపడ్డ ప్రతిసారీ దిగ్భ్రాంతి కలిగిస్తూనే ఉంది. పెద్ద నోట్ల రద్దు లాంటి ఆలోచనలు పదేపదే నిష్ఫలమైన తీరునూ కళ్ళ ముందుంచుతోంది. నిజానికి రాజకీయాలకూ, వ్యాపారానికీ మధ్య బంధం కొత్తేమీ కాదు. విజయ్ మాల్యా, అదానీ, అంబానీ అంటూ పేర్లు మారవచ్చేమో కానీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకూలురితో అధికార పీఠం బంధాలు పెనవేసుకోవడం దశాబ్దాలుగా దేశంలో చూస్తున్నదే. వందల రెట్లలో ఎదుగుతున్న వ్యాపార లెక్కల పైనే కాదు... పీఎం కేర్ ఫండ్స్ మొదలు పార్టీలకు అందుతున్న విరా ళాలు, ఎలక్టోరల్ బాండ్స్పైనా రచ్చ రేగుతున్నది అందుకే. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పన్ను లెక్కల్లో చూపని అక్రమ ధనం స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాతా దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉండడం విషాదం. ప్రతి 10–15 ఏళ్ళకోసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ప్రకటిస్తున్నా నల్ల డబ్బు చీడ తొలగలేదు. చివరకివి ఆర్థికవ్యవస్థనే తలకిందులుచేసే స్థాయికి పెరిగిపోవడం దిగ్భ్రాంతికరం. డిజిటల్ చెల్లింపులు ప్రాచుర్యంలో పెట్టామని జబ్బలు చరుచుకొంటే చాలదు. ఆ పరిధిలోకి రాని ఇలాంటి నగదు గుట్టలను అరికట్టే ప్రణాళికలు చేపట్టాలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం కొన్ని దేశాల్లో చేసినట్టే... నిర్ణీత పరిమితి దాటి ఎవరైనా అనధికారికంగా నగదు కలిగివుంటే తక్షణ శిక్షార్హ నేరంగా పరిగణించేలా చట్టం తేవాలి. అధికార పార్టీ నేతలపైనా ఆరోపణలు వినిపిస్తున్న వేళ, తరతమ భేదాలు లేని చర్యలు అవసరం. పైగా, వచ్చే ఎన్నికల్లో అవినీతి అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఉరకాలని భావిస్తున్న అధికార పార్టీ నుంచి మరింత జవాబుదారీతనం ఆశిస్తాం. ప్రతిపక్షానికి సైతం తామే కాదు... తమ ఎంపీలూ పులు కడిగిన ముత్యాలేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవేమీ లేకుండా, సామాన్యులకు చిరకాలం గుర్తుండే ఈ నగదు కట్టల దృశ్యాలు వట్టి వైరల్ వీడియోలుగా, శుష్క ఆరోపణలుగా మిగిలిపోతేనే కష్టం. -
ఒడిశాలో ఐటీ దాడులు..156 సంచుల్లో డబ్బు
భువనేశ్వర్/రాంచీ: ఒడిశాకు చెందిన డిస్టిలరీ గ్రూప్‌పై ఆదాయ పన్ను శాఖ అధికారులు కొనసాగిస్తున్న సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో కట్టల కొద్దీ అక్రమ నగదు బయటపడుతోంది. గురువారం బొలంగీర్‌లోని బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో జరిపిన తనిఖీల్లో రూ.200 కోట్ల నగదు బయటపడింది. శుక్రవారం బొలంగీర్ జిల్లా సుదపడలో జరిపిన సోదాల్లో నిండా కరెన్సీ నోట్లున్న 156 సంచులను గుర్తించారు. వీటిలో ఏడు బ్యాగుల్లో నగదును లెక్కించగా రూ.20 కోట్లుగా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో, ఇప్పటి వరకు లభ్యమైన డబ్బు రూ.220 కోట్లకు చేరుకుందన్నారు. లిక్కర్ కంపెనీతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న జార్ఖండ్ ఎంపీ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని పీటీఐ తెలిపింది. రాంచీలోని ఆయన కార్యాలయం సిబ్బంది కూడా ఎంపీ అందుబాటులో లేరని చెబుతున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా డిస్టిలరీ గ్రూప్ సంస్థలకు చెందిన సంబల్పూర్, బొలంగీర్, తితిలాగఢ్, సుందర్‌గఢ్, రూర్కెలా, భువనేశ్వర్లలో తనిఖీలు సాగిస్తున్నారు. -
ఆదాయపన్ను రిఫండ్లు వేగవంతం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి పన్నుకు సంబంధించిన రిఫండ్లు గడిచిన ఐదేళ్లలో వేగవంతమయ్యాయి. పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన బకాయిలను ఆదాయపన్ను శాఖ నుంచి వేగంగా పొందుతున్నారు. రిఫండ్ కోసం వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గినట్టు సీఐఐ నిర్వహించిన సర్వేలో 89 శాతం మంది వ్యక్తులు, 88 శాతం సంస్థలు చెప్పడం గమనార్హం. ఈ సర్వే వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఐఐ సమరి్పంచింది. తమ అంచనా పన్ను బాధ్యతకు మించి టీడీఎస్ చెల్లించలేదని 75.5 శాతం మంది వ్యక్తులు, 22.4 శాతం సంస్థలు ఈ సర్వేలో చెప్పాయి. రిఫండ్ ఏ దశలో ఉందన్న విషయం తెలుసుకోవడం సులభంగా మారినట్టు 84 శాతం మంది వ్యక్తులు, 77 శాతం సంస్థలు తెలిపాయి. ఆదాయపన్ను రిఫండ్ క్లెయిమ్ సౌకర్యవంతంగా ఉన్నట్టు 87 శాతం మంది వ్యక్తులు, 89 శాతం సంస్థలు చెప్పాయి. పన్ను ప్రక్రియ ఆటోమేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న ఎన్నో చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తెలిపారు. ‘‘గడిచిన ఐదేళ్లలో ఆదాయపన్ను రిఫండ్లను పొందే విషయంలో వ్యక్తులు, సంస్థలు వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గడం ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న విరామం లేని ఎన్నో చర్యలు ఈ ప్రక్రియను మరింత సులభంగా, సమర్థవంతంగా మార్చేశాయి’’అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. -
మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
-
ఐటీ గుబులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత నెల రోజులుగా ఆదాయపన్నుశాఖ అధికారుల వరుస సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల పోటీలో హోరాహోరీగా పోరాడుతున్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో ఐటీ గుబులు ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల్లో తమకు ఆర్థిక ‘సర్దుబాట్లు’ చేసే బంధువులు, సన్నిహితులపైనా ఆదాయపన్నుశాఖలోని ఐటీ ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టడం నాయకులను కలవరపెడుతోంది. అధికా రులు పక్కా సమాచారంతో క్షేత్ర స్థాయిలో సోదాలు చేస్తు న్నారు. రానున్న రోజుల్లో ఎప్పుడు..ఎవరిపైన సోదాలు జరుగుతాయోనన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఇటీవల ఐటీ చేపట్టిన ప్రధాన తనిఖీలు ఇలా... ♦ అక్టోబర్ 5న ఫైనాన్స్, చిట్‌ఫండ్, ఈకామర్స్ వ్యాపారుల ఆర్ధికలావాదేవీలలో అవకతవకలపై ఆదాయపన్నుశాఖ వంద బృందాలతో ఏక కాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని సుమారు 24 ప్రాంతాల్లో ఆక స్మిక సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడులకు చెందిన ఐటీ అధికారులు సైతం ఈ సోదాల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్పల్లి హిందు ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లు, వీరి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బంధువులు, స్నేహితుల వ్యాపారాల లక్ష్యంగానే నాటి సోదాలు జరిగినట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ♦ నవంబర్ 2న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వీరి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఆర్థికలావాదేవీలపై ఐటీ నిఘా పెట్టింది. ఇద్దరికీ చెందిన కంపెనీలు, సంస్థలకు చెందిన వివరాలు సేకరించింది. ఈ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బు సమీకరించారనే సమాచారంతో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్టు ప్రచారం జరిగింది. అదే రోజు బాలాపూర్ లడ్డును వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ♦ నవంబర్ 2న కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న గిరిధర్ రెడ్డికి చెందిన కోకాపేట హిడెన్ గార్డెన్ లోని నివాసంలో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ♦ ఈనెల 9, 10 తేదీల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని పొంగు లేటి నివాసంతో పాటు నందగిరిహిల్స్ వంశీరామ్‌జ్యోతి హిల్ రిడ్జ్‌లోని ఫ్లాట్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని రాఘవ ప్రైడ్, బేగంపేటలోని ఆఫీసుల్లో దాడులు చేశారు. అదే సమయంలో ఖమ్మంలోని ఆయన నివాసంలోనూ సోదాలు కొనసాగాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లిన రోజే ఐటీ సోదాలు జరగడం కొంత కలకలం సృష్టించింది. ♦ ఈనెల 13న నుంచి వరుసగా రెండు రోజులపాటు నగరంలోని ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధులు ప్రదీప్‌రెడ్డి, కె నరేంద్రరెడ్డి ఇళ్లల్లో ఐటీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లోని మొత్తం13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో ఎలాంటి లెక్కల్లో లేని రూ.7.50 కోట్లు సీజ్ చేసినట్లు సమాచారం. ఐటీ సోదాలు జరిగిన ఫార్మా వ్యాపారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులని ప్రచారం జరిగింది. ఆ కోణంలోనే ఐటీ దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ♦ తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్ల వారుజాము వరకు అజీజ్ నగర్‌లోని శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్ కేటీ మహి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొన సాగాయి. ఆయనకి సంబంధించిన ఫుట్ బాల్ అకా డమీ, క్రికెట్ అకాడమీ కార్యాలయాల్లో సైతం ఐటీ అధి కారుల తనిఖీలు కొనసాగాయి. ఓఆర్ఆర్ అప్పా కూడలి వద్ద శనివారం సాయంత్రం పోలీసులు తనిఖీల్లో ఆరు కారులలో తరలిస్తున్న సరైన పత్రాలు లేని రూ.7.50 కోట్ల నగదును పోలీసులకు పట్టుబడడం, ఈ సొమ్మును ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కోసం తరలిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్ కే టీ మహి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం తెల్లవారు జాము వరకు సోదాలు చేసిన అధికారులకు రూ.12 లక్షల నగదు, విలువైన పత్రాలు లభించాయి. నోటీసులు జారీ శ్రీనిధి గ్రూప్ చైర్మన్ ఇంట్లో నుంచి నగదు పట్టుబడిన కేసు లో పోలీసులు 10 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సమీప బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రధాన పార్టీ నేత కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన నగదును పోలీసులు సోమవారం కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. -
ఐటీ దాడులపై స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు
-
ఆదాయపన్ను రిటర్నుల్లో గణనీయ పెరుగుదల
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య ఎనిమిదేళ్ల కాలంలో 90 శాతం పెరిగిందని, 2021–22 అసెస్మెంట్ సంవత్సరంలో (2020–21 ఆర్థిక సంవత్సరానికి) 6.37 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. వ్యక్తులు జారీ చేసే రిటర్నులు 2013– 14 అసెస్మెంట్ సంవత్సరానికి 3.36 కోట్లుగా ఉంటే, అది 2021–22 నాటికి 6.37 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. 2023–24 అసెస్మెంట్ సంవత్సరం (2022–23 ఆర్థిక సంవత్సరం)లోనూ 7.41 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు తెలిపింది. ఇందులో మొదటిసారి ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారు 53 లక్షల మంది ఉన్నట్టు పేర్కొంది. ముఖ్యంగా రూ.5–10 లక్షల ఆదాయం వర్గం వారి రిటర్నులు.. 2013–14 అసెస్మెంట్ సంవత్సరం నుంచి 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి 295 శాతం పెరిగాయి. రూ.10–25 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి రిటర్నులు 291 శాతం పెరిగాయి. ఈ వివరాలను ఆదాయపన్ను శాఖ అత్యున్నత నిర్ణయ విభాగం సీబీడీటీ ప్రకటించింది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగి రిటర్నులు వేసే వారి సంఖ్య 2.62 కోట్ల నుంచి 3.47 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం పరంగా టాప్ 1 శాతం పరిధిలోని పన్ను రిటర్నులు వేసే వారు 15.9 శాతం నుంచి 14.6 శాతానికి తగ్గారు. దిగువ నుంచి 25 శాతం ఆదాయం కలిగిన వారి రిటర్నులు 8.3 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగాయి. ఇక మధ్యస్థ ఆదాయం కలిగిన 74 శాతం గ్రూప్ పరిధిలోని పన్ను చెల్లింపుదారుల రిటర్నులు 75.8 శాతం నుంచి 77 శాతానికి పెరిగాయి. మధ్య తరగతి వాసుల రిటర్నులు ప్రధానంగా పెరిగినట్టు తెలుస్తోంది. -
జప్తు చేసింది రూ.1.7 కోట్లే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కలిపి మొత్తం రూ.59.93 కోట్ల నగదు, 156 కిలోల బంగారం, 454 కిలోల వెండిని స్వాధీనం చేసుకోగా... అందులో రూ.1.76 కోట్లు మాత్రమే లెక్కలు లేని నగదుగా తేల్చి జప్తు చేశామని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రాంత డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంజయ్ బహదూర్ వెల్లడించారు. ఇప్పటికే రూ.10.99 కోట్ల నగదును సంబంధిత యజమానులకు అప్పగించామని, మిగిలిన నగదు విషయంలో దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. బుధవారం ఆయన ఆయకార్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800–425– 1785తో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్‌లైన్ నంబర్ 040–234262201/ 23426202 లేదా వాట్సాప్/టెలిగ్రామ్ నంబర్ 7013711399ను సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్థుల అఫిడవిట్ల పరిశీలన నామినేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన ఆస్తులు, అప్పుల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సహకారంతో తనిఖీ చేస్తామని డీజీ సంజయ్ బహదూర్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా అభ్యర్థుల ఖర్చులపై ఈసీకి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ‘రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సహకారంతో బ్యాంకు ఖాతాల నుంచి రూ.10లక్షలకు పైగా నగదు ఉపసంహరణలను పరిశీలిస్తాం. వీసా కోసం ఎవరైనా బంధువుల ఖాతాల నుంచి తమ ఖాతాకి నగదు బదిలీ చేసుకుంటే వారికి మినహాయింపు ఇస్తున్నాం. వ్యాపారంలో ఎవరికైనా అసాధారణ రీతిలో భారీగా ఆదాయం పెరిగినట్టు చూపినా మూలాలను పరిశీలిస్తాం. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే విత్‌డ్రా చేసినా పరిశీలన జరుపుతాం. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇతర చిన్న విమానాశ్రయాల్లో విమానాల తనిఖీల బాధ్యత జిల్లా కలెక్టర్లదే’అని ఆయన చెప్పారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) అనే యాప్ ద్వారా స్వా«దీనం చేసుకున్న నగదుకు సంబంధించిన లెక్కలను పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. -
ఐటీ దాడులు: 22 బాక్సుల్లో రూ.42 కోట్లు
బనశంకరి(బెంగళూరు): బెంగళూరులో ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా సొత్తు బయటపడింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ అశ్వత్తమ్మ, ఆమె భర్త ఆర్.అంబికాపతి, కూతురు, వారి బంధువుకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అంబికాపతి ఇంట్లో మంచం కింద దాచిన 22 పెట్టెల్లో రూ.42 కోట్ల రూ.500 నోట్ల కట్టలు బయటపడినట్లు ఐటీ శాఖ తెలిపింది. త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి బెంగళూరు మీదుగా భారీగా డబ్బును హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరులోని అశ్వత్తమ్మ కుటుంబీకులకు చెందినలో ఆర్టీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో గురువారం రాత్రి వరకు జరిపిన సోదాల్లో రూ.42 కోట్ల లభ్యమైనట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ్ శ్రీనివాసమూర్తికి అశ్వత్తమ స్వయానా సోదరి. అశ్వత్తమ భర్త ఆర్.అంబికాపతి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈయనే గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి పనికీ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ దర్యాప్తు జరపాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలే బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు ఎన్నికల అస్త్రంగా మారాయి. మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలుకాగా , కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ ఆరోపణలు.. తెలంగాణ ట్యాక్స్ పేరుతో బిల్డర్లు, బంగారం వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.1,500 కోట్లను కాంగ్రెస్ పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు పంపుతోందని తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ ఇటీవల ఆరోపించింది. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ డబ్బును భారీగా వెదజల్లుతోంది. టిక్కెట్లు సైతం అమ్ముకుంటోంది’అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కోట్ల రూపాయలను పంపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సైతం ఆరోపణలు చేశారు. -
లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు
-
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు.. పట్టుబడ్డ రూ. 2 కోట్ల 47 లక్షలు..
సాక్షి నెట్ వర్క్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో సరిగ్గా లెక్క చూపని, సరైన పత్రాల్లేని రూ. 2,47,30,500 నగదు, కేజీ 600 గ్రాముల బంగారం పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆయా నగదును, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆగాపల్లి వద్ద మంచాల మండలం లోయపల్లికి చెందిన కె.శ్రీనివాస్ కారులో రూ.20 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన సీహెచ్ రాజశేఖర్‌రెడ్డి కారులో రూ.2లక్షలు పట్టుబడ్డాయి. చిక్కడపల్లి: నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్ తన కియా కారులో కేజీ బంగారం తీసుకువెళ్తుండగా గాం«దీనగర్ స్టేషన్ పరిధిలో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన ఆ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే అందజేస్తామని లేకపోతే ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. హిమాయత్‌నగర్ వై జంక్షన్లో దోమలగూడ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో వెంకటరమణ అనే ద్విచక్రవాహనదారుడు నుంచి రూ.1,75,000 స్వాదీనం చేసుకున్నారు. చైతన్యపురి: బైక్‌లపై వెళ్తున్న దిల్సుఖ్నగర్ వీవీనగర్‌కు చెందిన బిరాదార్ సిద్ధేశ్వర్, సరూర్‌నగర్ ఇంద్రహిల్స్‌కు చెందిన బి.శంకర్‌రెడ్డి నుంచి రూ.60 లక్షల నగదును చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చెక్‌పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్నారు. చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరులో బ్యాంక్ ఉద్యోగి చీర్యాల సాయికుమార్ కారులో రూ. 45 లక్షలు ఉండటంతో ఆ డబ్బును సీజ్ చేశారు. అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలెం వద్ద ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావుకు చెందిన కారులో రూ.7లక్షల 30వేలు లభ్యమయ్యాయి. రామగిరి: నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కుంచాల సుధాకర్ కారులో పోలీసులు రూ.8 లక్షల 50 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.18,39,500, అంతారం స్టేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7.40 లక్షలు , కొత్తూరు బైపాస్ (వై జంక్షన్)వద్ద రూ.8.85 లక్షల నగదు, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో రూ. 5.11 లక్షల నగదును పోలీసులుస్వాదీనం చేసుకున్నారు. చైతన్యపురి: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేట చౌరస్తాలో గోషామహల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్ జహంగీర్ నుంచి రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయనగర్‌కాలనీ: గోల్కొండ టోలిచౌకీలోని అప్సర్ కాలనీకి చెందిన మహ్మద్ అశ్వాక్ ద్విచక్రవాహనంలో రూ.6 లక్షలు ఉన్నట్లు ఆసిఫ్‌నగర్ పోలీసులు గుర్తించారు. జియాగూడ: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పురానాపూల్ చౌరస్తాలో నార్సింగికు చెందిన ఆనంద్ నుంచి సుమారు 30 లక్షల విలువచేసే 600 గ్రాముల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు కారులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. -
లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ
భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు చైనాకు చెందిన పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో (Lenovo) ఫ్యాక్టరీ, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని లెనోవా ఫ్యాక్టరీ, బెంగళూరులోని ఆఫీసులోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. సోదాల్లో భాగంగా ఐటీ శాఖ అధికారులు లెనోవో ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను సైతం తనిఖీ చేసినట్లు తెలిసింది. సోదాల సమయంలోనూ, ముగిసిన తరువాత అధికారులు లెనోవా సీనియర్ మేనేజ్మెంట్ను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. (అమెరికా నుంచి ఐఫోన్ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..) అంతకుముందు రోజు, తమిళనాడు రాష్ట్రంలోని లెనోవో కాంట్రాక్ట్ తయారీదారు ఫ్లెక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలలోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని రాయిటర్స్ నివేదించింది. కంపెనీ, దాని అనుబంధ సంస్థలపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాగా దీనిపై లెనోవా స్పందిస్తూ ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొంది. “బాధ్యతగల కార్పొరేట్ పౌరులుగా మేము వ్యాపారం చేసే ప్రతి అధికార పరిధిలో వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలు, రిపోర్టింగ్ అవసరాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటాం. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం” అని లెనోవా ప్రతినిధి తెలిపారు. లెనోవో కంపెనీ భారత దేశంలో 17 శాతం మార్కెట్ వాటాతో 2022-23లో 1.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. -
స్టార్టప్‌లకు 5 వేల్యుయేషన్ విధానాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్ ట్యాక్స్ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్‌లిస్టెడ్ స్టార్టప్‌లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) వేల్యుయేషన్‌ను సముచిత మార్కెట్ విలువ (ఎఫ్‌ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్ విధానాలను ఉపయోగించవచ్చు. ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్స్టోన్ అనాలిసిస్ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో), ఎన్ఏవీ (అసెట్ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్‌లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్ ఇండియా, నాంగియా అండ్ కో తదితర సంస్థలు తెలిపాయి. -
ట్యాక్స్ ఆడిట్ చేయించారా? లేదా? లేదంటే..!
టాక్స్ ఆడిట్ అంటే? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొందరికి ఆడిట్ వర్తిస్తుంది. అలా చేయించే ఆడిట్నే ట్యాక్స్ ఆడిట్ అంటారు. ఎవరికి వర్తిస్తుంది? ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం మీ టర్నోవరు/బిజినెస్ వసూళ్లు/బ్యాంకులో రశీదులు అక్షరాలా ఒక కోటి రూపాయలు దాటితే కంపల్సరీగా ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులకు ఈ పరిమితి రూ. 1 కోటి. వృత్తి నిపుణులకు అయితే రూ. 50,00,000 పరిమితిగా ఉంటుంది. ఎవరు చేస్తారు? ఈ ఆడిట్‌ని డిపార్టుమెంట్ వారు చేయరు. చట్టప్రకారం మనమే.. అంటే అస్సెస్సీలే తమ టర్నోవరు రూ. 1 కోటి దాటితే ప్రాక్టీసులో ఉన్న సీఏ చేత చేయించాలి. ఈ ఆడిట్‌ను మనంతట మనమే స్వయంగా చేయించాలి. అంటే వాలంటరీగా చేయాలి. అలా చేయించినందుకు సీఏకి ఫీజు మనమే ఇవ్వాలి. సకాలంలో చేయించకపోయినా, చేసి ఆడిటర్ రిపోర్ట్‌ను సమరి్పంచకపోయినా, చాలా పెద్ద మొత్తంలో పెనాల్టీలు వేస్తారు. ఆడిట్ వెనుక లక్ష్యం ఏమిటంటే.. ♦ సరైన, తగిన విధంగా, కరెక్టుగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ను నిర్వహించేలా చూడటం. ♦ అలా నిర్వహించిన అకౌంటు మొదలైన వాటిని సీఏ సర్టిఫై చేయాలి లేదా ధృవీకరించాలి. ♦ ఆడిటింగ్ చేస్తున్నప్పుడు దొరికిన తప్పులు, దొర్లిన తప్పొప్పులు, తేడాలు, మిస్ అయిన అంశాలు, తప్పుడు సమాచారాలు, డబుల్ అకౌంటింగ్, ఆదాయంలో హెచ్చుతగ్గులు, ఖర్చుల్లో హెచ్చుతగ్గులు, వ్యక్తిగత ఖర్చులు, సమంజసం కాని ఖర్చులు, సంబంధం లేని ఖర్చులు, కేవలం ఆ సంవత్సరానికి సంబంధించినవే రాశారా లేదా వేరే సంవత్సరానివి రాశారా, ఆ వ్యాపారానివేనా లేక వేరే వ్యాపారానికి సంబంధించినవా, ఆ వ్యక్తి ఖర్చేనా లేక వేరే వ్యక్తికి సంబంధించినదా? క్యాపిటల్ ఖర్చెంత, రెవెన్యూ ఖర్చెంత? ఒకదానికొకటి సర్దుబాటు చేయలేదు కదా? స్థిరాస్తి కొని మామూలు ఖర్చుగా రాశారా? ఇలా వందలాది ప్రశ్నలకు జవాబులు ఈ రిపోర్టులో రాయాలి. ♦ అంతే కాకుండా అస్సెస్సీ కేవలం చట్టప్రకారం తనకు అర్హత ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రయోజనాల తగ్గింపులు, మినహాయింపులు మాత్రమే పొందారా లేక అదనంగా ఏదైనా లబ్ధి పొందారా? ♦ అంతే కాకుండా, ఇతర చట్టాల ప్రకారం, అంటే ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ, కంపెనీ లా మొదలైన వాటి ప్రకారం చెల్లింపులు, అవి సక్రమమేనా, సకాలంలో చెల్లించారా .. ఇలా ఎన్నో విషయాలు బయపడతాయి. మీకు నిబంధనలు వర్తించే పక్షంలో ట్యాక్స్ ఆడిట్ తప్పక చేయించండి. అదే మీకు శ్రీరామరక్ష. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి ( ట్యాక్సేషన్ నిపుణులు) -కె.వి.ఎన్ లావణ్య( ట్యాక్సేషన్ నిపుణులు ) -
Income Tax: బకాయిలుంటే ట్యాక్స్ రీఫండ్‌లో కటింగ్!
ఆదాయపు పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income Tax Department) సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ (Tax refund) తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ప్రాసెసింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసేందుకు, రీఫండ్ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. (New Rules: అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..) పన్ను బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెండింగ్‌లో ఉన్న బకాయిలను సర్దుబాటు చేసి ట్యాక్స్ రీఫండ్లను సకాలంలో జారీ చేయడానికి సహకరించాలని కోరింది. బకాయిల సర్దుబాటుపై తమ సమ్మతిని తెలియజేయడానికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 245(1) ట్యాక్స్ పేయర్లకు అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. బకాయిల సర్దుబాటుపై తమ అంగీకరిస్తున్నారో.. లేదో అని తెలియజేయాల్సి ఉంటుంది. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) 2023-24 అసెస్మెంట్ ఇయర్ కోసం 7.09 కోట్ల రిటర్న్‌లు దాఖలుకాగా 6.96 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ వెరిఫై చేసింది. ఇక ఇప్పటివరకు వీటిలో 2.75 కోట్ల రిటర్న్స్‌కు ట్యాక్స్ రీఫండ్‌ను చెల్లించగా 6.46 కోట్ల రిటర్న్‌లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. -
డివిడెండ్ పంపిణీ పన్ను కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసిందిగా ఆదాయపన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) తాజాగా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియాకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కాగ్నిజెంట్ చేసిన అపీల్‌ను ఐటీఏటీ చెన్నై బెంచ్ కొట్టివేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు అనుమతిమేరకు చేపట్టిన రూ. 19,080 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ పథకంలో భాగంగా కాగ్నిజెంట్ డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉంటుంది. 2017–18 అసెస్మెంట్ ఏడాదిలో కంపెనీ యూఎస్, మారిషస్‌లోని తమ వాటాదారుల నుంచి 94,00,534 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 20,297 చొప్పున వీటిని సొంతం చేసుకుంది. కంపెనీ దాఖలు చేసిన రిటర్నులను పరిశీలించిన తదుపరి ఐటీ శాఖ రూ. 4,853 కోట్లకుపైగా డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉన్నట్లు డిమాండ్ చేసింది. ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం మూలధన వినియోగం కారణంగా పన్ను చెల్లించవలసి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై కాగ్నిజెంట్ అపీల్‌కు వెళ్లింది. -
కదిలిన అవినీతి పునాది!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధానిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి రూ.వందల కోట్ల ముడుపులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ఎలా కాజేశారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేసింది. డొల్ల కంపెనీల ద్వారా తరలించిన రూ.118.98 కోట్లను లెక్క చూపని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ ఐటీ శాఖ చంద్రబాబుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. 46 పేజీల ఆ సుదీర్ఘ లేఖలో నగదును ఏ విధంగా తరలించారు? బ్యాంకు ఖాతాల లావాదేవీలు, మెసేజ్‌లు, ఎక్సెల్ షీట్లు, కోడ్ భాషలో రాసుకున్న సంకేతాలను విశదీకరిస్తూ అన్ని సాక్ష్యాధారాలతో మరీ నోటీసులిచ్చింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అత్యధిక కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ను చంద్రబాబు స్వయంగా పరిచయం చేశారు. పీఎస్ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు అన్ని వివరాలను తనకు చేరవేస్తుంటారని, అతడి ద్వారా తాను సూచనలు చేస్తుంటానని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ముడుపులపై మనోజ్ వాసుదేవ్ పార్థసానికి దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబుకు ముడుపులు ఏ రూపంలో, ఎలా ఇవ్వాలో ఆయన పీఏ శ్రీనివాస్ చెప్పేవారని, లేదంటే తమ బిల్లులు పాస్ కాకుండా పెండింగ్‌లో పెట్టేవారని పార్థసాని వాంగ్మూలంలో వెల్లడించాడు. చంద్రబాబుకు రూ.వందల కోట్లను ముడుపులుగా చెల్లించినట్లు మనోజ్ పార్థసాని తన వాంగ్మూలంలో ఐటీ శాఖకు తెలియచేశాడు. వితండ వాదనతో మళ్లీ నోటీసులు.. మనోజ్ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ అదే ఏడాది నవంబరు 1, 5వ తేదీల్లో అతడిని విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2020లో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. దీంతో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు వితండ వాదన చేయడంతో ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ ఆయనకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్ పార్థసాని ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా జత చేయటంతో చంద్రబాబు ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు వెల్లడైంది. అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబుకు ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నందున దీన్ని అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. పేదల ఇళ్లలోనూ.. తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన చంద్రబాబు పేదల ఇళ్లను సైతం వదల్లేదు. రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ దోపిడీకి వేసిన పథకం ఐటీ నోటీసుల్లో బయటపడింది. ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదలకు ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని సూచించినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. లోకేశ్‌కూ అవినీతి సొమ్ము ముడుపులు పిండుకోవడంలో ‘చినబాబు’ కూడా చేతివాటం చూపారు. ఈమేరకు చంద్రబాబుకు జారీ చేసిన సుదీర్ఘ నోటీసుల్లో నారా లోకేశ్ పేరును కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రస్తావించింది. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేష్ అక్రమ నగదు తరలింపులో కీలకపాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది. ‘మీ కుమారుడు నారా లోకేశ్ సన్నిహితులు నగదు తీసుకున్నారనేందుకు పక్కా ఆధారాలున్నాయి. వీటిపై మీరు ఏం సమాధానం చెబుతారు?’ అని ప్రశ్నిస్తూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్ మెసేజ్‌లను స్క్రీన్షాట్ల రూపంలో జత చేసి మరీ నోటీసులను జారీ చేసింది. విశాఖకు చెందిన ఆర్వీఆర్ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘు రేలా ఆయన సన్నిహితుల ద్వారా కూడా భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో స్పష్టం చేసింది. ఈ చాటింగ్‌లన్నీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో సోదాలు జరిపినప్పుడు స్వా«దీనం చేసుకున్న శ్యాంసంగ్ ఫోన్ నుంచి సేకరించినవి కావడం గమనార్హం. వీటిని శ్రీనివాస్ ధృవీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజే‹Ùకు రూ.4.5 కోట్లను నగదు రూపంలో ఎలా చేరవేశారో ఐటీ శాఖ పూర్తి సాక్ష్యాధారాలతో నోటీసుల్లో వివరించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారు. 2019 మే 22న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ డబ్బుల పంపిణీ గురించి ప్రస్తావించగా కిలారు రాజేష్‌కు రూ.4.5 కోట్లను టీడీపీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని పేర్కొన్నాడు. అంకిత్ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు సన్నిహితుడైన శ్రీకాంత్ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో ‘‘అయితే ఓకే..’’ అంటూ చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ బదులిచ్చాడు. ఈమేరకు నగదు తరలింపులకు సంబంధించి శ్రీకాంత్ ఫోన్ నుంచి జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఐటీ అధికారులు జత చేశారు. వాంగ్మూలం నమోదు సమయంలో ఈ సంభాషణలను మనోజ్ వాసుదేవ్‌కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీశాఖ పేర్కొంది. డేటా చౌర్యం ఐటీ గ్రిడ్ కేసులో కూడా కిలారు రాజేష్ కీలక పాత్రధారిగా వ్యవహరించిన విషయం విదితమే. -
తనను అరెస్టు చేస్తారని చంద్రబాబు భయపడుతున్నాడు: మంత్రి మేరుగు నాగార్జున
-
చంద్రబాబు ఐటీ స్కాం కేసులో కీలక పరిణామం
-
చంద్రబాబుకు మ్యూజిక్ స్టార్ట్.. దిమ్మతిరిగే షాక్..
-
చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం!
-
ఎక్కడి దొంగలు.. అక్కడే!
సాక్షి, అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు తన ఖాతాల్లోకి నేరుగా రప్పించుకున్న రూ.118 కోట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చినట్లు జాతీయ ఇంగ్లిష్ డైలీ ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రచురించి దాదాపు వారం దాటింది. నాటి నుంచీ ఈ నోటీసులతో పాటు బాబు హయాంలో కాంట్రాక్టు సంస్థల నుంచి ముడుపులు ఎలా అందుకున్నారో, ఖజానాను ఎలా కొల్లగొట్టారో వివరాలతో సహా వివిధ పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఊరూరూ వెళుతున్న బాబుగానీ... పాదయాత్రంటూ తిరుగుతున్న ఆయన తనయుడు లోకేశ్ గానీ.. షూటింగ్ గ్యాప్ తీసుకున్న పవన్ గానీ ఎవ్వరూ దీనిపై మాట్లాడటం లేదు. ఇక అందరిపైనా ఉన్నవీ లేనివీ రాసే ‘ఈనాడు’, దాని తోకపత్రిక, తోక చానెళ్లు... ఏవీ ఈ అంశాన్నే ప్రస్తావించటం లేదు. ఆఖరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చిన పురంధేశ్వరి కూడా దీన్నో సాధారణ అంశంగా తేల్చేశారు తప్ప బాబు అవినీతికి నిదర్శనంగా చూడటం లేదు. ఏమయింది వీళ్లకి? ఇక చంద్రబాబు విషయానికొస్తే అటు ఐటీ విభాగానికేమో.. ‘నాకు నోటీసులిచ్చే అధికారం మీకెక్కడిది?’ ‘నాకు సాక్ష్యాధారాలు చూపించండి’ ‘ఫలానా సంవత్సరానికి ఇది వర్తించదు’ అనే డొంకతిరుగుడు జవాబులిస్తున్నారు. ఇటు ప్రజల ముందేమో... ‘నాపై కుట్ర చేస్తున్నారు’ ‘నన్ను అరెస్టు చేస్తారేమో’ ‘నన్ను ఏ క్షణాన్నైనా అరెస్టు చేయొచ్చు’ అని నానా నంగనాచి కబుర్లు చెబుతున్నారు. అంతే తప్ప... ఆ నోటీసులు ఎందుకొచ్చాయి? తాను నిజంగా అవినీతి చేశాడా... లేదా? ఆ 118 కోట్లూ నిజంగా ముట్టాయా? కాంట్రాక్టు సంస్థలను బెదిరించటం అబద్ధమా? మనోజ్ పార్థసానితో తనకు సంబంధాలున్నాయా... లేవా? దుబాయ్‌లో డబ్బులు తీసుకున్నాడా.. లేదా? అనే ఏ విషయమూ చెప్పటం లేదు. పైపెచ్చు ఐటీ శాఖకే సమాధానాలిస్తారంటూ ఆయన తరఫున కొందరు బీరాలు పోవటమూ మొదలయ్యింది. కేంద్రం ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఆదాయపు పన్ను శాఖ... రిటర్నుల్లో చూపించని మొత్తం ఎవరి లావాదేవీల్లోనైనా కనిపించినపుడు నోటీసులివ్వటం మామూలే. కాకపోతే చంద్రబాబుది రిటర్నుల్లో చూపించని మొత్తం మాత్రమే కాదు. అది అక్రమంగా ఆర్జించిన అవినీతి సొమ్ము. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని కట్టబెట్టి.. లంచాల రూపంలో తన ఖాతాలోకి నేరుగా రప్పించుకున్న అక్రమార్జన. పైపెచ్చు ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ!!. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు. మరి ప్రజలకు జవాబుదారీయే కదా? బయట అన్ని సభల్లో మాట్లాడుతున్న చంద్రబాబుకు... తనపై వచ్చిన నోటీసులపై స్పందించాల్సిన ఆవశ్యకత లేదా? ఇలాంటి రాజకీయం ఎక్కడైనా ఉంటుందా? దొంగలంతా కలిసి... ఎక్కడి వారక్కడే గప్‌చుప్... అన్న తరహాలో నోరు మూసుకున్నంత మాత్రాన విషయం అందరికీ తెలియకుండా ఉంటుందా? జబాబు చెప్పాల్సిన బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోగలరా? ఇదీ అసలు కథ... అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా సాగించిన అవినీతి బండారం బట్టబయలవుతున్న కొద్దీ బాబులో ఆందోళన రెట్టింపు అవుతోంది. ఇన్నాళ్లూ ప్రతి వ్యవస్థలో తన మనుషుల్ని పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా ‘నిప్పు’లా చెలామణి అయిన బాబుకు... రోజులన్నీ ఒకేలా ఉండవని ఇప్పుడు అర్థమవుతోంది. రూ.8వేల కోట్ల కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్లతో సాగించిన అవినీతిని ఐటీ శాఖ నిగ్గు తేల్చింది. నోటీసులిచ్చింది. ఆధారాలూ చూపించింది. తప్పించుకునేందుకు బాబు వేసిన ఎత్తుల్ని తిప్పికొట్టింది. దీంతో బాబుకు దారులు మూసుకుపోయాయి. మరోవైపు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో చంద్రబాబు అవినీతిని సీఐడీకి చెందిన సిట్ బృందం ఆధారాలతో సహా వెలికి తీసింది. ఆ రెండు వ్యవహారాల్లోనూ షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్ల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనం హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకే చేరిందన్నది బట్టబయలైంది. ఈ స్కిల్ స్కామ్‌లో హవాలా దందా నిగ్గు తేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దిగింది. అదే కుతంత్రం...మళ్లీ మళ్లీ పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన చంద్రబాబు... తన అవినీతి బాగోతం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మళ్లీ పాత దారే ఎంచుకున్నారు. తనను రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చంటూ వ్యాఖ్యానించారు. దానిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు స్పందించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పరోక్షంగా ఆదేశించారు. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలన్నది బాబు పన్నాగం. తాను ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ చంద్రబాబు అనుసరించే దిగజారుడు రాజకీయ ఎత్తుగడ ఇదే. 2015లో హైదరాబాద్‌లో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినపుడూ ఇదే చేశారు. తెలంగాణ పోలీసులు తనను అరెస్టు చేస్తారేమో అని చెబుతూ రాత్రికి రాత్రి హైదరాబాద్ విడిచిపెట్టి అమరావతి వచ్చేశారు. పైపెచ్చు రాష్ట్రం నుంచే పరిపాలన చేసేందుకే వచ్చేశానని చెప్పుకొచ్చారు. పైగా తనపై కేసు పెట్టడాన్ని ఆంధ్రపై తెలంగాణ ప్రభుత్వం చేసిన దాడిగా వక్రీకరించారు. అంతేతప్ప తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలించేందుకు కోట్ల రూపాయలు లంచంగా ఇస్తూ పట్టుబడ్డానన్న వాస్తవాన్ని మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడూ అదే సూత్రం అమలు చేస్తున్నారు. ఇటీవల అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పర్యటనల్లో పోలీసులపై దాడులకు పాల్పడేలా టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రేరేపించారు. తాజాగా భీమవరంలోనూ అదే రీతిలో ఘర్షణలు సృష్టించారు. ఇపుడు తనను అరెస్టు చేస్తారని వ్యాఖ్యానిస్తూ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. ఇదీ చంద్రబాబు అవినీతి నెట్వర్క్ అటు అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాలు, టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఇటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రెండింట్లోనూ చంద్రబాబు ఒకే అవినీతి నెట్‌వర్క్‌ను ఉపయోగించారు. రెండుచోట్లా తానే సూత్రధారిగా ఉంటూ... నిధులను చేర్చడంలో పాత్రధారులుగా యోగేశ్ గుప్తా, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌లను పెట్టారు. అదెలాగంటే... ► జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా దాని సహ భాగస్వామిగా డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి దింపి ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేశారు చంద్రబాబు. రూ.3,300 కోట్ల మేర కాగితాలపై ప్రాజెక్టును చూపించి డిజైన్ టెక్ సంస్థ తన వాటా 90 శాతంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 శాతం కింద జీఎస్టీతో సహా రూ.371 కోట్లు విడుదల చేశారు. అందులో సాఫ్ట్వేర్ కొనుగోలుకు రూ.56 కోట్లు చెల్లించి... మిగిలిన రూ.315కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి తమ ఖాతాల్లోకి తరలించేసుకున్నారు. దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు నికంగా రూ.241 కోట్లు చేరాయని సిట్ నిర్ధారించింది. అక్రమ నిధుల ఎలా తరలించారంటే... ► రాష్ట్ర ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐకి రూ.2.71కోట్లు అంటే మొత్తం మీద రూ.241కోట్లు తరలించారు. ► పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌లలో ఉన్న వివిధ షెల్ కంపెనీలతో పాటు దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56కోట్లు పోలారీస్: రూ.2.2కోట్లు కెడెన్స్ పార్టనర్స్: రూ.12కోట్లు ► మొత్తం రూ. 140.53కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసి యోగేశ్ గుప్తా మనోజ్ వాసేదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదును చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో అందించారు. అంటే ఆ రూ.140.53కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఇక మిగిలిన రూ.100.47కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులు మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అక్కడ నుంచి చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► అంటే ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. -
దొంగతనం చేసి దబాయింపా?
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగతనం చేసి దబాయిస్తున్నట్లుగా ఉందని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి బండారం బయటపడటంతో ఆయనకు భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోందని, అడ్డంగా దొరికిపోయినట్లు ఆయనకే అర్థమవుతోందని చెప్పారు. అందుకే గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను రేపో ఎల్లుండో అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు సానుభూతి కోసం నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిప్పు కాదని.. తప్పులకు మానవ రూపమని, తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి అని మండిపడ్డారు. బాబు చట్టానికి అతీతుడు కాదన్నారు. నోటీసులకు స్పందించకుండా, విచారణకు సహకరించకుంటే ఐటీ శాఖ అరెస్టు కూడా చేయవచ్చన్నారు. ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్ హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, ఈ వ్యవహారంపై ఇన్నాళ్లూ ఈడీ జోక్యం చేసుకోకపోవడంపై సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. అప్పట్లోనే కుంభకోణాన్ని ఎండగట్టాం.. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని చదరపు అడుగుకు రూ.పది వేల చొప్పున షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో అత్యాధునిక సదుపాయాలు, ఫర్నిచర్‌తో సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేలు మాత్రమే బిల్డర్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూమిలో తాత్కాలిక నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలకు మించి వ్యయం కాదు. ఇందులో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అప్పట్లోనే మేం అభ్యంతరం తెలిపాం. కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు అదనంగా రూ.7–8 వేలు దోచిపెట్టిన చంద్రబాబు అందులో 60 నుంచి 70 శాతం వరకూ కమీషన్ తీసుకున్నారు. పేదల నోళ్లు కొట్టి.. టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.వెయ్యికి మించి వ్యయం కాదు. కానీ ఆ పనులను రూ.2,200 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. పేదల కష్టార్జితాన్ని చదరపు అడుగుకు అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన చంద్రబాబు వారి నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని, ఇది పాపమని అప్పట్లోనే మేం చెప్పాం. ఐటీ నోటీసులతో అది రుజువైంది. షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, విక్కీజైన్, కిలారు రాజేష్ ద్వారా చంద్రబాబు, ఆయన పీఎస్ శ్రీనివాస్, లోకేష్ వసూలు చేసిన విధానాన్ని ఆధారాలతోసహా ఐటీ శాఖ బహిర్గతం చేసింది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతిలో అడ్డంగా దొరికిపోయిన సమయంలోనూ తనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చునని, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా నిలబడి రక్షించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐటీ శాఖ నోటీసులతో ఇప్పుడూ అలాగే కోరడం విడ్డూరం. కుంభకోణాల దారులన్నీ బాబు వైపే.. అమరావతి భూకుంభకోణం, ఫైబర్‌నెట్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ల్లో సీఐడీ దర్యాప్తుతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైంది. ఐటీ నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులనే ఆ కుంభకోణాల్లో నిందితులుగా సీఐడీ గతంలోనే తేల్చింది. 1995–2004 మధ్య ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో విచారణను ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారు. రాజకీయంగా కక్ష సాధించాలనుకుంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెట్టించేవారు. చంద్రబాబు కుంభకోణాలన్నీ ఆధారాలతోసహా ఇప్పుడు బయటపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం ఆయన తరం కాదు. ఖజానాను లూటీ చేయడం సాధారణమా? చంద్రబాబుకు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులు సాధారణమైనవని, వాటిపై తాను స్పందించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొనడం విడ్డూరం. ప్రభుత్వ ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ముడుపులు తీసుకున్నందుకే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ఆమెకు తెలియదా? లేదంటే మరిదిని రక్షించుకోవడానికి అలా మాట్లాడారా? చీటికిమాటికీ ట్వీట్లతో రెచ్చిపోయే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడంలో ఆంతర్యమేంటి? ఎల్లో మీడియా ఐటీ నోటీసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి శతవిధాలా ప్రయతి్నస్తోంది. శాంతి భద్రతల సమస్య సృష్టించే కుట్ర.. చంద్రబాబు శాంతి భద్రతల సమస్య సృష్టించి లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారు. పుంగనూరులో పోలీసులపైకి టీడీపీ గూండాలను ఉసిగొల్పారు. అదే కుట్రను లోకేశ్ భీమవరంలో అమలు చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్ని స్తే చూస్తూ ఊరుకోం. -
ఐటీ ఎటాక్‌తో వణికిపోతున్న చంద్రబాబుకు..
-
దర్యాప్తు చేపడితే..బాబు, చినబాబు జైలుకే!
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులపై దర్యాప్తు సంస్థలు విచారణకు స్వీకరించి నేరం రుజువైతే బాబుతో పాటు ఆయన తనయుడు చిన్నబాబు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రముఖ న్యాయవాది, కార్పొరేట్ న్యాయ నిపుణుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఐటీ నోటీసులపై ఈడీ సుమోటోగా దర్యాప్తు చేపట్టవచ్చన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా, ఆర్బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయొచ్చని వెల్లడించారు. పూర్తి ఆధారాలు, సాక్ష్యాలను ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందని.. ఇవి నిజమేనని తేలితే చంద్రబాబు, లోకేశ్ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌ను, అందులోని అవినీతిని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. డొల్ల కంపెనీల ద్వారా రూ.వందల కోట్లు స్వాహా చేసినట్లు, బాబుకు ఎవరి ద్వారా, ఏ కంపెనీ ద్వారా ఎంతెంత అందింది.. తదితర వివరాలను ఆధారాలతో సహా ఐటీ శాఖ వెల్లడించింది. దీనిపై వెంకటరామిరెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. తప్పించుకునే యత్నమెందుకు? ఓ రాజకీయ పారీ్టకి అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా చంద్రబాబు ఐటీ శాఖ నోటీసులకు బాధ్యతగా వివరణ ఇవ్వాలి. నేరమేమీ చేయనప్పుడు ఐటీ శాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే యత్నం ఎందుకో చెప్పాలి. వారడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా.. అసలు తనకు నోటీసులిచ్చే అధికారమే లేదని బాబు పలుమార్లు లేఖ రాయడం చూస్తుంటే నేరం చేసినట్లు భావించాల్సి వస్తోంది. సెక్షన్–127 ప్రకారం నోటీసులిచ్చే అధికారం ఉందని ఐటీ అధికారులు స్పష్టంచేశారు. నేరుగానైనా కావొచ్చు.. తన అనుచరుల ద్వారానైనా కావొచ్చు.. రూ.118.98 కోట్లు బాబుకే అందాయని ఐటీ వివరాలతో సహా కుండబద్దలు కొట్టింది. 2023, ఆగస్టు 4న చంద్రబాబుకు ఐటీ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులో అదే నెల 11న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలన్నారు. దీనిని నేరుగా బాబు నివాసమైన ప్లాట్ నంబర్ 1310, రోడ్ నంబర్ 65, జూబ్లీహిల్స్ ఇంటికి పంపారు. ఆయన వద్ద సరైన వివరణ ఉండి ఆ రోజున హాజరై చెప్పి ఉంటే.. ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదికాదు. కనీసం ఎప్పుడు హాజరై వివరణ ఇస్తారో కూడా చెప్పడంలేదని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొనడం చూస్తుంటే అందులోని అంశాలు పూర్తి వాస్తవమేనని స్పష్టమవుతోంది. బోగస్ కంపెనీలు సృష్టించి.. మనోజ్ వాసుదేవ్ పార్థసాని, ఐదు కంపెనీల వాళ్లు ఇచ్చిన మెటీరియల్ పేపర్లు, బాబు పీఏ శ్రీనివాస్‌ను పరిచయం చేసిన ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లు ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. ఆ ముగ్గురు భారత్, దుబాయ్, ఇతర చోట్ల నుంచి నగదు తెచ్చి ఎవరెవరికి ఇచ్చారో కూడా ఉంది. తాము కాంట్రాక్టులు తీసుకుని.. ఎన్నికల నిధుల కోసం ఖర్చుపెట్టేందుకు టీడీపీకి ఇచ్చినట్లు స్టేట్మెంట్లో వెల్లడించారు. నోటీసుల్లో కూడా నగదంతా షాపూర్జీ పల్లోంజీ నుంచి చంద్రబాబుకే అందినట్లు ఉంది. షలక, అన్నై (ఎక్సెల్ ఫ్రమ్ వినయ్ నంగాలియా) నుంచి రూ.33,76,18,207, ఎవరెట్ అండ్ నయోలిన్ (షీట్ ఫ్రమ్ విక్కీ మొబైల్) నుంచి రూ.50,43,00,000, పోర్ ట్రేడింగ్ నుంచి రూ.9,42,00,000, హార్డ్రిటన్ షీట్ (లక్స్టోన్ అండ్ కో) నుంచి రూ.10,23,00,000, దుబాయ్ నుంచి రూ.15,13,95,000లు చంద్రబాబుకు అందాయని.. ఇందులో రూ.118.98 కోట్లను మాత్రం ఆదాయంలో చూపలేదని కంపెనీల వారీగా వివరాలు వెల్లడించింది. షాపూర్జీ పల్లోంజీ నుంచి నగదును తీసుకునేందుకు ప్రైవేట్ డొల్ల కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు సృష్టించారు. బోగస్ కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు, బోగస్ నామినేషన్లు అంటూ.. ‘బోగస్’ అనే పదాన్ని ఐటీ శాఖ తన నోటీసుల్లో స్పష్టంగా పలుమార్లు పేర్కొంది. సెక్షన్ 132(4), 5(బీ) కింద మనోజ్ స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆయన కూడా అదంతా వాస్తవమేనని సంతకం పెట్టారు. స్టేట్మెంట్లు ఇచ్చిన వారు చంద్రబాబు, అతని పీఎస్ పేరుతో పాటు లోకేశ్ పేరును వెల్లడించారు. విక్కీ అనే వ్యక్తి ద్వారా లావాదేవీలన్నీ జరిగినట్లు, నేరుగా చంద్రబాబు కూడా కొన్ని చెప్పినట్లు ఐటీ తన నోటీసుల్లో పేర్కొంది. అరెస్టు చేసి.. దర్యాప్తు చేపట్టవచ్చు.. ఇప్పటికే ఐటీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినా చంద్రబాబు నుంచి సరైన సమాధానం రాలేదు. ఒకవేళ సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందని పక్షంలో పెద్దఎత్తున జరిమానాలు విధించవచ్చు. 25 శాతం అదనపు పన్నుతో పాటు వడ్డీ కూడా విధించవచ్చు. నేరం జరిగినట్లు తేలితే.. రూ.118.98 కోట్లకు 300 శాతం అంటే రూ.356.94 కోట్లు వసూలుచేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు.. అరెస్టుచేసే అధికారం కూడా ఉంటుంది. దుబాయ్ నుంచి కూడా నగదు అందడం.. పలు కంపెనీల నుంచి డబ్బు స్వీకరించడం.. క్విడ్ ప్రో కోతో పాటు మనీలాండరింగ్ కిందికి వస్తుంది. దీంతో ఈడీ కూడా సుమోటోగా దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈడీనే కాదు.. పీఎంఎల్ఏ, ఫెమా, ఆర్బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయవచ్చు. అంతేకాక.. సీబీసీఐడీ కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. 2019 తర్వాతవే ఆ రూ.118.98 కోట్లు.. ఇక 2019 తర్వాత వచ్చినవే ఆ రూ.118.98 కోట్లు అయితే.. మరి 2014 నుంచి ఎన్ని డొల్ల కంపెనీలు నెలకొల్పారు.. ఎన్ని వేల కోట్లు ప్రజా ధనం కొల్లగొట్టారు.. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే కానీ ఈ కుంభకోణం వివరాలన్నీ బహిర్గతం కావు. ఇదంతా ప్రజల డబ్బు. దీనిపై ప్రజలెవరైనా కోర్టు ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు కోరవచ్చు. -
చంద్రబాబుకు ఎంపీ విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్.. మైండ్ బ్లాంక్!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందలకోట్లు కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. ఇది కూడా పెద్ద స్కామేనా అని అంటరాని ఎద్దేవా చేశారు. కాగా, చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’ అని ఎదురు దాడికి దిగుతాడు. వేచి చూడండి!’ అని కామెంట్స్ చేశారు. అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ...ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి! — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 అలాగే, ‘అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ.. ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్‌ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ తేలికవుతుంది. ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్ ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 దీన్ని తీసుకొచ్చా.. దాన్ని కనిపెట్టా, అది నేనే-ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ వర్గాన్ని సృష్టించి మీ వాళ్లను ఉద్దరించడం కాదు. దీన్ని తీసుకొచ్చా...దాన్ని కనిపెట్టా, అది నేనే - ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశపడతారు. చంద్రబాబు అండ్ కంపెనీకి మాత్రం అధికారం ఉంటే యధేచ్ఛగా దోచుకోవడమే తెలుసు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలి. బాబుగారి ఆలోచన దీని చుట్టే తిరుగుతుంది. అంటూ కౌంటరిచ్చారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ -
చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఐటీ స్కాంపై ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మూలాలు ఒకే చోట ఉన్నాయన్న దానిపై విచారణకు సన్నద్ధమైంది. రెండు స్కాంలో ఒకే వ్యక్తులు ఉండటంపై విచారణకు సిద్ధమైంది. ఐటీ స్కాంలో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేశ్ పార్ధసాని, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాకు ఏపీ సీఐడీ నోటీసులుజారీ చేసింది. వీరిద్దరిని సీఐడీ అధికారులు విచారించనున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి.. కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ వ్యహహారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీశాఖ విచారణ జరుపుతోంది. స్కిల్ స్కామ్‌లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది. రెండు స్కాంలో భారీగా డబ్బు అందుకున్నట్లు చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై అభియోగాలు మోపింది. రెండు స్కాంల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. దీంతో ఈ స్కాంలో ఉన్నవారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించింది. దుబాయిలోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్లుగా అభియోగాలు ఉండటంతో దీనిపై కూడా దృష్టి పెట్టనుంది. త్వరలో దుబాయికి విచారణ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’ -
దొరికిపోయిన బాబు
-
ఐటీకి 4 లేఖలు రాసి.. చంద్రబాబు అడ్డంగా ఇరుక్కున్నాడు
-
చిట్టాలో చినబాబు!
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో తాత్కాలిక భవన నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు పిండుకోవడంలో ‘చినబాబు’ కూడా చేతివాటం చూపిన విషయం ఐటీ నోటీసులతో వెలుగులోకి వచ్చింది. ఈమేరకు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో నారాలోకేశ్ పేరును కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రస్తావించింది. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేశ్ అక్రమ నగదు తరలింపులో కీలకపాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది. ‘మీ కుమారుడు నారా లోకేష్ సన్నిహితులు నగదు తీసుకున్నారనేందుకు పక్కా అధారాలివీ.. వీటిపై మీరు ఏం సమాధానం చెబుతారు?’ అంటూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్ మెసేజ్‌లను స్క్రీన్షాట్ల రూపంలో అందించి మరీ నోటీసులను జారీ చేసింది. విశాఖకు చెందిన ఆర్వీఆర్ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘు రేలా ఆయన సన్నిహితుల ద్వారా కూడా భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో స్పష్టం చేసింది. ఈ చాటింగ్‌లన్నీ మీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో సోదాలు జరిపినప్పుడు స్వాధీనం చేసుకున్న శ్యాంసంగ్ ఫోన్ నుంచి సేకరించినవని, వీటిని శ్రీనివాస్ కూడా ధృవీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. కిలారుకు రూ.4.5 కోట్లు.. అయితే ఓకే! లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్‌కు రూ.4.5 కోట్లను నగదు రూపంలో ఎలా చేరవేశారో ఐటీ శాఖ పూర్తి సాక్ష్యాధారాలతో నోటీసుల్లో వివరించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారు. 2019 మే 22న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ డబ్బుల పంపిణీ గురించి అడగ్గా కిలారు రాజేష్‌కు రూ.4.5 కోట్లను పార్టీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని పేర్కొన్నాడు. అంకిత్ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు సన్నిహితుడైన శ్రీకాంత్ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో ‘‘అయితే ఓకే..’’ అంటూ చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బదులిచ్చాడు. ఈమేరకు నగదు తరలింపులకు సంబంధించి శ్రీకాంత్ ఫోన్ నుంచి జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఐటీ అధికారులు జత చేశారు. వాంగ్మూలం నమోదు సమయంలో ఈ సంభాషణలను మనోజ్ వాసుదేవ్‌కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీశాఖ పేర్కొంది. డేటా చౌర్యం ఐటీ గ్రిడ్ కేసులో కూడా కిలారు రాజేష్ కీలక పాత్రధారిగా వ్యవహరించిన విషయం విదితమే. రఘు ద్వారా రూ.20.18 కోట్లు తరలింపు.. విశాఖకు చెందిన రఘు రేలా ఆర్వీఆర్ పేరుతో రియల్ ఎస్టేట్‌తో పాటు 18కిపైగా కంపెనీలను ఏర్పాటు చేసి వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. షాపూర్జీ పల్లోంజీ నుంచి అక్రమంగా నగదు తరలింపులో రఘు రేలా కీలకప్రాత పోషించినట్లు గుర్తించిన ఐటీ అధికారులు ఆర్వీఆర్ గ్రూపులో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల ఆధారంగా మనోజ్ వాసుదేవన్‌ను విచారించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రఘు రేలా ద్వారా మొత్తం రూ.20.18 కోట్లను తరలించినట్లు మనోజ్ పార్ధసాని అంగీకరించాడు. ఈ నగదు తరలింపులో రఘుకు సన్నిహితులైన కృష్ణ, నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని, అయితే వారి గురించి తనకు ఎటువంటి వివరాలు తెలియవని పేర్కొన్నాడు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌కు ఈ మొత్తాన్ని తరలించారని, ఇందుకు ఎక్సెల్ షీట్ స్పష్టమైన ఆధారమని ఐటీ శాఖ వెల్లడించింది. ఆ బంధం ఎంత బలమైనదంటే.. నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. టీడీపీ ఘోరంగా ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన పీఏ శ్రీనివాస్‌కు మనోజ్ వాసుదేవ్ ఒక మెసేజ్ పంపారు. తన జీవితంలో ఇటువంటి దారుణమైన రాజీనామా లేఖను చూడలేదని అందులో పేర్కొన్నారు. వీరి మధ్య బంధం ఎంత బలంగా ఉందనేందుకు ఆ మెసేజ్ నిదర్శనమని ఐటీ శాఖ తన నోటీసులో పేర్కొంది. నిర్మాణ రంగ సంస్థల నుంచి నగదును అక్రమంగా తరలించారనేందుకు ఇవి తిరుగులేని సాక్ష్యాలని, నగదు తరలింపులో మీ తనయుడు లోకేశ్ సన్నిహితులు కీలక పాత్ర పోషించారనేందుకు ఇవన్నీ నిదర్శనమని చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొంది. -
పేదల ఇళ్లు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేదల ఇళ్ల నిర్మాణాన్ని సైతం వదల్లేదు! రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి వేసిన పథకం ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో డొల్ల కంపెనీల పేరుతో రూ.వందల కోట్లు స్వాహా చేసి పక్కా ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదల ఇంటి నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, అంతేకాకుండా పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని కోరినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. నగదు బదిలీలో ఆ ముగ్గురు.. కోడ్ భాషలో సబ్ కాంట్రాక్టుల ముసుగులో డొల్ల కంపెనీలు హయగ్రీవా, అన్నై, షలఖ కంపెనీల ద్వారా అక్రమంగా నగదును చంద్రబాబు నాయుడుకు తరలించడంలో వినయ్ నంగాలియా, విక్కీ జైన్, అంకిత్ బలదూత కీలకపాత్ర పోషించినట్లు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు ఐటీశాఖ నోటీసుల్లో పేర్కొంది. వీరంతా బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌కు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్‌లో దినార్ల రూపంలో చెల్లించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించాడు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నగదు బదిలీకి కోడ్ భాషలో హెచ్‌వైడీ అని అందులో ఉంది. విజయవాడకు విజయ్ అని, విశాఖపట్నంకు విష్ అని, బెంగళూరుకు బాంగ్ అని కోడ్ భాషల్లో నమోదు చేసుకున్న వివరాలను, ఎక్సెల్ షీటును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డగోలు వాదన ఆపి జవాబు చెప్పు!! చంద్రబాబు అసంబద్ధ వాదనలను కట్టిపెట్టి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది! సబ్ కాంట్రాక్టుల ముసుగులో దొంగ ఇన్వాయిస్లు సృష్టించి నగదును అక్రమంగా తరలించినట్లు తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలున్నాయని, చట్ట ప్రకారం విచారించే అధికారం తమకు ఉన్నందున లెక్కల్లో చూపని రూ.118 కోట్లకు సమాధానం చెప్పాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ తన రాజగురువు రామోజీ తరహాలో ఏదో ఒక అభ్యంతరాన్ని తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తు ముందుకు కదలకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు అసలు విచారణ పరిధి లేదని ఒకసారి, జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ అధికారి ఈ కేసును సెంట్రల్ ఆఫీసుకు బదిలీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని మరోసారి, అసలు ఐటీ దాడుల్లో సీజ్ చేసిన వివరాలను తనకు తెలియచేయలేదని, అందులో తన పేరు ఎక్కడా లేదంటూ.. ఇలా వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు అడుగు ముందుకు పడకుండా కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి లేఖల మీద లేఖలు రాస్తూ నాలుగుసార్లు దర్యాప్తును అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రతిసారి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చుతూ సహనంగా సమాధానాలిస్తోంది. ముందుగా రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ పూర్తి సాక్ష్యాధారాలతో మరోసారి సెక్షన్ 153 సీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులతో పాటు మనోజ్ వాసుదేవ్ పార్థసాని (ఎంవీపీ), చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌లపై ఐటీ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎక్సెల్ షీట్లు, వాట్సాప్ మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్, బ్యాంకు లావాదేవీల వివరాలతో పాటు వారు విచారణ సందర్భంగా ఆ నగదును చంద్రబాబుకు ఏ విధంగా చేర్చారో వెల్లడిస్తూ వివరాలను పొందుపరిచింది. తప్పించుకుని తిరుగుతూ.. చంద్రబాబు స్క్రూటినీ కేసును హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్–4 ప్రిన్సిపల్ కమిషనర్ గతేడాది సెక్షన్ 127 కింద హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్–2(4)కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి సెక్షన్ 153 సీ, 143(2)/142(1) కింద విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2022 అక్టోబర్ 10, అక్టోబర్ 27, ఈ ఏడాది జనవరి 31, జూన్ 20న చంద్రబాబు నాలుగు లేఖలు రాశారు. అసలు సెంట్రల్ సర్కిల్ కార్యాలయానికి సెక్షన్ 153 సీ కింద తనకు నోటీసులిచ్చే అధికారం లేదని వాదించగా దీన్ని తోసిపుచ్చింది. జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్ సెక్షన్ 127 కింద ఈ కేసును తమకు బదిలీ చేయడంతో చట్ట ప్రకారం తక్షణం దర్యాప్తు మొదలు పెట్టినట్లు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు వెంటనే సెక్షన్ 127 కింద కేసు బదిలీ కాకుండానే సెంట్రల్ సర్కిల్ ఆఫీసు తనకు నోటీసులు ఇచ్చిదంటూ వాదించగా దానికి కూడా స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇచ్చింది. దర్యాప్తులో సీజ్ చేసిన వివరాలను తనకు పూర్తిగా తెలియచేయలేదని ఒకసారి పేర్కొనగా అందులో తన పేరు ఎక్కడా లేదు కాబట్టి తనకు నోటీసులు వర్తించవంటూ మరోసారి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఐటీ శాఖ స్పందిస్తూ మనోజ్ వాసుదేవ్ పార్థసాని వద్ద సోదాల్లో సీజ్ చేసిన వస్తువుల వివరాలన్నీ మీకు (చంద్రబాబుకు) తెలియచేశామని, ముఖ్యమంత్రి హోదాలో కేటాయించిన కాంట్రాక్టుల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ఎటువంటి పనులు చేయకుండానే నగదు చంద్రబాబుకు చేరినట్లు బలమైన ఆధారాలను సేకరించడంతో మీ అభ్యంతరాలను కొట్టి వేస్తున్నామని, పూర్తి వివరాలను మరోసారి అందచేస్తున్నామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తునకు సహకరించాల్సిందేనంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. 46 పేజీల సుదీర్ఘ నోటీసులో మొత్తం ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్లు బ్యాంకు లావాదేవీలు, కోడ్ భాషలను క్రోడీకరించి రుజువులతో మరీ వెల్లడించింది.