Aadhaar Pan Link: గత కొన్ని రోజులుగా ఆధార్-పాన్ లింకింగ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 2023 జూన్ 30 లింకింగ్ చివరి గడువు అంటూ పలుమార్లు సంబంధిత శాఖలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆధార్ & పాన్ లింకింగ్ గడువు ముగిసింది. అయినప్పటికీ ఆదాయపన్ను శాఖ వినియోగదారుల నుంచి ప్రశ్నలను స్వీకరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు.
ఎన్ఆర్ఐ అందించిన పిర్యాదు మేరకు ఆదాయ పన్ను శాఖ స్పందిస్తూ.. గతంలో వెల్లడించిన విధంగానే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయకుండా పోతే.. పాన్ పనిచేసే అవకాశం లేదని, ఈ కారణంగా తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ అయ్యాయా? లేదా? అనే దానిపైన ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.
(ఇదీ చూడండి: జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?)
నిబంధనల ప్రకారం.. ఎవరైతే ఎన్ఆర్ఐ లేదా ప్రవాస భారతీయులు ఉంటారో వారు ముందుగా వారి స్టేటస్ ఆదాయ పన్ను శాఖకు తెలియజేసినట్లయితే వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కావున వారికి ఎటువంటి సమస్య ఉండదని ఆదాయపన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.
Dear @secureyoursites,
— Income Tax India (@IncomeTaxIndia) July 10, 2023
It may be noted that non-linking of PAN with Aadhaar makes a PAN inoperative and not inactive, consequences of which have already been specified vide Press Release in https://t.co/N1IRieLOfr
The NRIs who had intimated their NRI status to the Department are…
అంతే కాకుండా ఇప్పటి వరకు ఎవరైనా ప్రవాస భారతీయులు తమ ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా.. పాన్ కార్డు పని చేయలేదని నిర్దారించుకుంటారో, అలాంటి వారు ఆన్‌లైన్ ద్వారా జ్యూరిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)ని సంప్రదించవలసిందిగా వెల్లడించింది. ఇందులో భాగంగా వారి పాస్‌పోర్ట్ కాఫీ వంటివి వారికి అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. ఆలా కాకుంటే పాన్ కాఫీ, సంబంధిత డాక్యుమెంట్స్ adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.in అనే ఇమెయిల్‌కి కూడా పంపవచ్చని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment