Aadhaar Link
-
ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి. -
పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!పలు ఫిన్‌టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.లింక్ చేయకపోతే ఏమౌతుంది? డిసెంబరు 31 లోపు ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డ్‌లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. -
ఆధార్ - రేషన్ కార్డు లింక్.. మరో అవకాశం
ఆధార్ - రేషన్ కార్డు ఇంకా లింక్ చేసుకోని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వాస్తవానికి వీటిని లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. వీటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో లింక్ పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయవచ్చు. -
ఆధార్ కార్డ్ గడువు మరో వారం రోజులు మాత్రమే..
-
8 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి యూపీఐ, ఆధార్ కీలకం.. ఎలాగో తెలుసా..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) వల్ల 2030 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 8 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో కీలకంగా పనిచేయనున్నాయని నివేదికలు చెబుతున్నాయి. యూపీఐ, డీపీఐల ద్వారానే ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించగలదని నాస్కామ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలియజేస్తుంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్‌తో కలిసి నాస్కామ్ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. డీపీఐలు భారతదేశ జనాభాలో 97 శాతం మందిపై ప్రభావం చూపుతున్నాయి. మెచ్యూర్డ్ డీపీఐల వల్ల 31.8 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరిగింది. ఇది 2022లో భారతదేశ జీడీపీలో 0.9 శాతానికి సమానం. ఇదీ చదవండి: ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే.. డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ విధానంలో ఆధార్‌ను పరిచయం చేయడం ద్వారా దాదాపు 15.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. యూపీఐ వల్ల నగదు లావాదేవీలు, పేపర్ వాడకం తగ్గింది. దాంతో కాలుష్యమూ తగ్గినట్లు నివేదికలో తేలింది. పేపర్వాడకం తగ్గడం వల్ల లాజిస్టిక్స్, రవాణా రంగంలో 2022లో 3.2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. -
ఇప్పటికీ మీరు ఆధార్ ను అప్డేట్ చేసుకోలేదా..?
-
ఆన్‌లైన్‌లోకి.. ప్రజాపాలన దరఖాస్తులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో రోజూ 30 కేంద్రాల ద్వారా అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద సాయం చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ► బస్తీలు, కాలనీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధిలో ఈ నెల 5వ తేదీ నాటికి 50 వేల అభయహస్తం దరఖాస్తులు తీసుకున్నారు. ► జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ నాటికి 3.80 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ► వచి్చన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా 60 మంది డీటీపీ ఆపరేటర్లను నియమించారు. ► వీరికి ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ► ఇప్పుడు ఉన్న డీటీపీ ఆపరేటర్లు సరిపోకపోతే ప్రైవేటు వాళ్లను నియమించాలని ఆదేశాలు అందాయి. ఈ నెల 17వ తేదీ వరకు నమోదు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. ► పలు పథకాలకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అర్హులైన వారిని ఎలా ఎంపిక చేస్తారనే మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. ► వచ్చేనెల నుంచి మహిళలకు రూ. 2,500లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ► అధికారులు అర్జీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే ఈ సర్వే ఎప్పుడు చేస్తారు.. లబ్ధిదారులు ఎప్పుడు ఎంపిక చేస్తారు.. దీనికి ప్రాతిపదిక ఏమిటీ.. ఏయే అర్హతలు చూస్తారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుల్లో దేనిని పరిగణలోనికి తీసుకుంటారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ► దరఖాస్తు చేసుకున్నవారంతా తమకు లబ్ధి చేకూరుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు దరఖాస్తులు 80 శాతం తెల్లరేషన్‌కార్డు కోసమే పెట్టుకోగా, ఆ తర్వాత స్థానం రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం పెట్టుకున్నారు. ► అయితే తెల్ల రేషన్‌కార్డు లేనివారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటే తమకు పథకాలు అందవేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. గడువులోగా నమోదు పూర్తిచేస్తాం ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం డీటీపీలకు జోనల్ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరు ప్రజలు ఇచి్చన దరఖాస్తులను ఎలా నమోదు చేయాలనే విషయంపై అవగాహన పెంచుకుంటారు. దానికి సంబంధించిన పోర్టల్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. శనివారం నుంచే నమోదు ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెలత 17వ తేదీ లోపు పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండగా నిరీ్ణత సమయంలో పూర్తిచేస్తాం. ఇందుకోసం రెండు రోజుల నుంచే పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్న ఆపరేటర్లతో పాటు కొత్తగా వచి్చన వారితో నమోదు ప్రక్రియను ముమ్మరంగా చేపడతాం. – ప్రశాంతి, డీసీ, జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ -
ఆరు గ్యారంటీలకు ఈ నంబర్‌తో లింక్
హైదరాబాద్: ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హత సాధించేందుకు ‘ఆధార్’ తప్పనిసరిగా కావడంతో కొత్తగా నమోదు, అప్డేషన్ కోసం ఉరుకులు పరుగులు ప్రారంభమయ్యాయి. ఆధార్ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభంగా ప్రక్రియ పూర్తి అయ్యేందుకు అప్డేషన్ చేయాల్సిందే. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆధార్ కేంద్రాల ఎదుట భారీ సంఖ్య జనం బారులు తీరుతున్నారు. వివాహం కావడం, ఇంటి పేరు, కేరాఫ్, చిరునామా, ఉద్యోగ, ఉపాధి రీత్యా, నివాసం, మొబైల్ నంబర్ మారడంతో అప్డేషన్ ఆవశ్యకత ఎదురైంది. తాజాగా ఆరు గ్యారంటీల నేపథ్యంలో ఆధార్ నవీకరించుకునేందుకు పోటెత్తుతున్నారు. అన్నింటికీ ఇదే ఆధారం.. అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమవుతోంది. పూరి గుడిసెల్లో నివసించే నిరుపేదల నుంచి విలాసవంతమైన భవంతుల్లో జీవించే సంపన్నుల వరకు తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పకుండా కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే.. ప్రతి పౌరుడికి భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుంది. అది బహుళ ప్రయోజనకారిగా మారి ప్రతిదానికీ ఆధారంతో పాటు అనుసంధానమవుతోంది. ప్రభుత్వ పనులైనా.. ప్రైవేటు పనులు ముందుకు సాగాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ప్రతి కుటుంబానికి నిత్యవసరమైన వంట గ్యాస్, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్లో అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజి్రస్టేషన్లు. ప్రభుత్వ పథకాలైన రేషన్ కార్డు, సామాజిక పింఛ¯న్, స్కాలర్ షిప్‌తో పాటు బ్యాంకింగ్, బీమా తదితర అన్నింటికీ ఆధార్ తప్పనిసరి. పన్నులు తదితర పనులకూ ఆధార్ అవసరమే.. అంచనా జనాభా కంటే.. విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో అంచనా జనాభా కంటే ఆధార్ నమోదు సంఖ్య దాటింది. ఇతర రాష్ట్రాలు నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారితో ఆధార్ నమోదు సంఖ్య ఎగబాకుతోంది. మహా నగరంలో ఏటా జనాభా వృద్ధి రేటు 8 నుంచి 12 శాతానికిపైగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి అంచనా జనాభా ప్రకారం 1.50 కోట్లకు చేరగా.. దానికి మించి ఆధార్ నంబర్లు సంఖ్య జారీ అయినట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మహానగరానికి వలస వస్తున్నవారిలో సుమారు 34 శాతం ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జనాభాకు అనుగుణంగా ఆధార్ నమోదు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా ఆధార్ నమోదు సంఖ్య బాగా ఎగబాకింది. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన..
ఆన్లైన్లో ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఇటీవల మార్చి 14, 2024 వరకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. అయితే యూఐడీఏఐ ఆధార్‌ను ప్రవేశపెట్టి చాలా ఏళ్లు అయింది. దాంతో ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. అందుకు సంబంధించి ‘సాక్షి’లో డిసెంబర్ 13న ‘ఆధార్‌పై ప్రశ్నలా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అందులో పాఠకులు ఆధార్‌కు సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే info@sakshi.com కు పంపించాలని కోరగా చాలా మంది స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు. ‘సాక్షి బిజినెస్’టీమ్ సంబంధిత అధికారులతో మాట్లాడి కొంతమంది పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. ప్రశ్న: ఆధార్ ఎందుకు, ఎలా అప్డేట్ చేసుకోవాలి? అందుకు ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏయే డాక్యుమెంట్లు అవసరం అవతాయి? శైలజ, వరంగల్. జవాబు: నిబంధనల ప్రకారం ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ డేటాబేస్‌లో మీ వివరాలు అప్ టు డేట్ ఉండాలి. దాంతో ఆధార్‌తో లింక్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో మీ తాజా వివరాలు ఉంటే మేలు. మీ ఆధార్‌లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే చేసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన తేదీలోపు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అందుకోసం పాఠశాల టీసీ, పదో తరగతి మెమో, పాన్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్.. వంటి ఫొటో గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి. వీటిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి సంబంధించిన ఫారమ్ నింపి బయోమెట్రిక్, ఐరిస్ గుర్తులతో అప్డేట్ చేస్తారు. ప్రశ్న: బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయా? కార్తిక్, శ్రీకాకుళం. జవాబు: లేదు. మీ బ్యాంక్ సమాచారాన్ని బ్యాంక్ యాజమాన్యం ఎవరితోనూ పంచుకోదు. మీ ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా బ్యాంక్ ఖాతా గురించి సమాచారాన్ని పొందలేరు. అలాగే, యూఐడీఏఐతోపాటు ఏ సంస్థ వద్ద మీ బ్యాంక్ ఖాతా గురించి ఎలాంటి సమాచారం ఉండదు. ఉదాహరణకు, మీరు మీ మొబైల్ నంబర్‌ను బ్యాంక్, పాస్‌పోర్ట్ అధికారులు, ఆదాయపు పన్ను శాఖలు మొదలైన వివిధ అధికారులకు ఇస్తారు. కానీ మీరు ఉపయోగిస్తున్న టెలికాం కంపెనీకి మీ బ్యాంక్ సమాచారం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు వంటి సమాచారం గురించి తెలియదు. అదేవిధంగా మీరు వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు ఆధార్ నంబర్‌ను ఇచ్చినపుడు మీ వివరాలు వారి వద్దే ఉంటాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం, యూఐడీఏఐతో సహా ఏ సంస్థ కూడా యాక్సెస్ చేయలేదు. ప్రశ్న: నా ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్ తెలిసిన ఎవరైనా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా? సులోచన, విజయవాడ. జవాబు: కేవలం మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకోలేరు. డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ సంతకం, డెబిట్ కార్డ్, పిన్, ఓటీపీ అవసరం అవుతాయి. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆధార్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ వేలిముద్ర, ఐరిస్ లేదా ఓటీపీ నంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న: ఆధార్‌ను ఎక్కడైనా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. మరి యూఐడీఏఐ ప్రజలు తమ ఆధార్ నంబర్‌ను సోషల్ మీడియా లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టవద్దని ఎందుకు సూచిస్తోంది? కేతన్, నిజామాబాద్. జవాబు: మీరు పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ చెక్‌లను అవసరమైన చోటే ఉపయోగిస్తారు. అయితే ఈ వివరాలను ఇంటర్నెట్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) మొదలైన సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ఉంచరుకదా. ఆధార్ విషయంలో కూడా ఇదే లాజిక్‌ని ఉపయోగించాలి. మీ వ్యక్తిగత వివరాలు అనవసరంగా పబ్లిక్ డొమైన్లో ఉంచవద్దు. ప్రశ్న: ఆధార్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? శరణ్య, అనంతపురం జిల్లా. జవాబు: ఆధార్‌ను చాలా ప్రభుత్వ పథకాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం. ఉపాధి-మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం. జననీ సురక్ష యోజన, ఆదిమ తెగల సమూహాల అభివృద్ధి, జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. ఆరోగ్య సంరక్షణ – రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఆస్తి లావాదేవీలు, ఓటర్ఐడీ, పాన్‌కార్డ్ మొదలైన ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ కావాల్సి ఉంటుంది. ప్రశ్న: యూఐడీఏఐ అనుసరిస్తున్న డేటా భద్రత చర్యలు ఏమిటి? సుశీల, హైదరాబాద్. జవాబు: ప్రజల నుంచి సేకరించిన డేటాకు భద్రత కల్పించే బాధ్యత యూఐడీఏఐకు ఉంది. యూఐడీఏఐ సమగ్ర భద్రత విధానాన్ని కలిగి ఉంది. పటిష్ఠమైన సెక్యూరిటీ స్టోరేజ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఏదైనా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంచిన ఎల్ఐసీ.. ఎంతంటే.. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఆన్లైన్లో ఆధార్ వివరాల్ని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన సమయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకే ఇచ్చింది. అయితే తాజాగా ఆ గడువును 2024 మార్చి 14 వరకు పొడిగించింది. మరోవైపు, ఆధార్ కార్డ్ తీసుకుని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వినియోగదారులు వారి ఆధార్ కార్డ్‌లోని వివరాల్ని అప్డేట్ చేయాలని కోరిన విషయం తెలిసిందే. తద్వారా, పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. -
ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది!
ఆధార్ తీసుకుని పదేళ్లు దాటితే అప్డేట్ చేయాలని కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు 2023 డిసెంబర్ 14లోపు అప్డేట్ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. త్వరలో గడువు ముగియనుండడంతో ఈ ప్రకటన విడుదల చేసింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన ధ్రువపత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్)లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను నమోదు చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్ తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
దాదాపు 81 కోట్ల భారతీయుల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి
-
స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మీ సర్టిఫికెట్లు అన్నీ ఇకపై,, 'అపార్' కార్డులోనే..
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రయోజనం ఏమిటి? విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించబడి ఉంటుంది. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు. ‘అపార్’ నిర్వహణ ఇలా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నమోదు ప్రక్రియ.. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్‌లో నిల్వ చేయబడుతుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సౌలభ్యం! విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ -
Blue Aadhaar Card: బ్లూ ఆధార్ ఎందుకో తెలుసా? పూర్తి వివరాలు..
దేశంలో ఆధార్ కార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇలా ఎక్కడ పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరైంది. అందుకే దీన్ని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక సమాచారమంతా 12 అంకెల సంఖ్యకు అనుసంధానించి ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ ఆధార్ కార్డును జారీ చేస్తోంది. ఆధార్ కార్డులు సాధారణంగా తెలుపురంగులో ఉండడం గమనించే ఉంటాం. ఇవి వయోజనుల కోసం జారీ చేసే కార్డులు. కానీ, యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్ కార్డుల (బ్లూ ఆధార్)ను జారీ చేస్తోంది. వీటిని బాల ఆధార్ కార్డుగా వ్యవహరిస్తున్నారు. ఇవి 5 ఏళ్లలోపు పిల్లల కోసం జారీ చేస్తారు. వీరికి వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించకుండానే కార్డు అందజేస్తారు. అన్ని వివరాలు వెరిఫై చేసిన తర్వాత 60 రోజులలోపు బ్లూ ఆధార్ కార్డ్ జారీ అవుతుంది. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారం అందులో ఉంటుంది. ఈ కార్డుని తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తారు. బాల ఆధార్ కార్డు కాలపరమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చే వరకే. తర్వాత వేలి ముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్‌కార్డుని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, కార్డు చెల్లదు. 15 ఏళ్లు నిండిన తర్వాత వేలిముద్రలు, కంటిపాప వివరాలతో మరోసారి ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి. నవజాత శిశువుల కోసం తల్లిదండ్రులు బాల్ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పత్రం వంటి డాక్యుమెంట్లు అందజేస్తే సరిపోతుంది. లేదా పిల్లల పాఠశాల ఐడెంటిటీ కార్డుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగాలివీ.. బ్లూ ఆధార్ కార్డును పిల్లలకు గుర్తింపు రుజువుగా వినియోగించవచ్చు. దీని సహాయంతో పిల్లలు అర్హత కలిగిన ప్రభుత్వ సబ్సిడీ పథకాలను పొందవచ్చు. పిల్లలకు మధ్యాహ్న భోజన స్కీమ్ పొందటానికి వీలవుతుంది. నకిలీ విద్యార్థుల వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ వివరాలను వినియోగించుకుంటుంది. అడ్మిషన్ ప్రక్రియ కోసం తల్లిదండ్రులు బ్లూ ఆధార్ కార్డులను అందించాలని అనేక పాఠశాలలు పట్టుబడుతున్నాయి. -
పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్‌తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్‌కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారిపోయాయి. -
దెబ్బకు 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ - ఐటీ శాఖ రిప్లై ఇలా..!
Aadhaar Pan Link: గత కొన్ని రోజులుగా ఆధార్-పాన్ లింకింగ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 2023 జూన్ 30 లింకింగ్ చివరి గడువు అంటూ పలుమార్లు సంబంధిత శాఖలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆధార్ & పాన్ లింకింగ్ గడువు ముగిసింది. అయినప్పటికీ ఆదాయపన్ను శాఖ వినియోగదారుల నుంచి ప్రశ్నలను స్వీకరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు. ఎన్ఆర్ఐ అందించిన పిర్యాదు మేరకు ఆదాయ పన్ను శాఖ స్పందిస్తూ.. గతంలో వెల్లడించిన విధంగానే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయకుండా పోతే.. పాన్ పనిచేసే అవకాశం లేదని, ఈ కారణంగా తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ అయ్యాయా? లేదా? అనే దానిపైన ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. (ఇదీ చూడండి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?) నిబంధనల ప్రకారం.. ఎవరైతే ఎన్ఆర్ఐ లేదా ప్రవాస భారతీయులు ఉంటారో వారు ముందుగా వారి స్టేటస్ ఆదాయ పన్ను శాఖకు తెలియజేసినట్లయితే వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కావున వారికి ఎటువంటి సమస్య ఉండదని ఆదాయపన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. Dear @secureyoursites, It may be noted that non-linking of PAN with Aadhaar makes a PAN inoperative and not inactive, consequences of which have already been specified vide Press Release in https://t.co/N1IRieLOfr The NRIs who had intimated their NRI status to the Department are… — Income Tax India (@IncomeTaxIndia) July 10, 2023 అంతే కాకుండా ఇప్పటి వరకు ఎవరైనా ప్రవాస భారతీయులు తమ ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా.. పాన్ కార్డు పని చేయలేదని నిర్దారించుకుంటారో, అలాంటి వారు ఆన్లైన్ ద్వారా జ్యూరిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)ని సంప్రదించవలసిందిగా వెల్లడించింది. ఇందులో భాగంగా వారి పాస్‌పోర్ట్ కాఫీ వంటివి వారికి అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. ఆలా కాకుంటే పాన్ కాఫీ, సంబంధిత డాక్యుమెంట్స్ adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.in అనే ఇమెయిల్‌కి కూడా పంపవచ్చని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. -
ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన
ఆధార్ కార్డ్-పాన్ లింకింగ్‌కు గడువు నిన్నటి(జూన్ 30)తో ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తరువాత చలాన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో సమాచారాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు మరోసారి గడువు పెంపు ఉంటుందనే ఊహాగానాలకు ఆదాయపు పన్ను శాఖ చెక్ పెట్టింది. ప్యాన్-ఆధార్‌లో లింకింగ్‌లో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రసీదు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఇ-పే ట్యాక్స్ ట్యాబ్‌లో చలాన్ చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇ-పే ట్యాక్స్‌లో ఇబ్బందులున్నాయని కొంతమంది యూజర్లు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడడం 2017 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువును కేంద్రం చాలాసార్లు పొడిగించింది.జూన్ 30వ తేదీ లోపు పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకపోతే, లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు కావడం ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. Kind Attention PAN holders! Instances have come to notice where PAN holders have faced difficulty in downloading the challan after payment of fee for Aadhaar-PAN linking. In this regard, it is to be informed that status of challan payment may be checked in ‘e-pay tax’ tab of… — Income Tax India (@IncomeTaxIndia) June 30, 2023 -
ఈ రోజే లాస్ట్.. ఆధార్ - పాన్ లింక్ చేయలేదా!
PAN-Aadhaar Linking: పాన్ - ఆధార్ లింక్ గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ లింకింగ్ గడువు ఈ రోజు కొన్ని గంటలలో ముగియనుంది. రేపటి నుంచి (జులై 01) ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. గతంలో దీని కోసం అనేక మార్లు గడువు పెంచడం కూడా జరిగింది. మరో సారి పొడిగిస్తుందో.. లేదో ప్రస్తుతానికి తెలియదు. నిజానికి పాన్ - ఆధార్ లింక్ గడువు ఎప్పుడో ముగిసింది. అయితే 2023 మార్చి 31 వరకు రూ. 1000 ఫైన్‌తో అదనపు గడువు కల్పించారు. ఆ కూడా జూన్ 30 వరకు పొడిగించారు. ఆ గడువు కాస్త ఈ రోజుతో ముగియనుంది. ఇంకో సారి పెంచే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నా.. దీనిపైనా ఎటువంటి స్పష్టత లేదు. ఆధార్ - పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది.. ఆధార్ - పాన్ గడువు లోపలు చేయకుండా ఉంటే వారి బ్యాంకింగ్ సర్వీసులు, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం మాత్రమే కాకుండా.. ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు, పెండింగ్ రిటర్నుల ప్రాసెస్ కూడా నిలిచిపోతుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి) ఆధార్ - పాన్ లింక్ అనేది కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. ఇందులో 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు & భారత పౌరులు కాని వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఆధార్ - పాన్ లింక్ అవసరం లేదు. -
ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ఆధార్‌కు లింక్ అయిన ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ధ్రువీకరించే సదుపాయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ వెబ్సైట్, మొబైల్ యాప్ నుంచే వీటి ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. కొంత మంది యూజర్లకు తమ మొబైల్ నంబర్లలో ఏది ఆధార్‌తో సీడ్ అయిందనే విషయమై అవగాహన ఉండడం లేదని యూఐడీఏఐ గుర్తించింది. దీంతో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్ ఓటీపీ వేరొక మొబైల్ నంబర్‌కు వెళుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన సదుపాయంతో ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ సీడ్ అయిందో తెలుసుకోవచ్చు. ఆధార్ అధికారిక వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్‌లో ‘వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్’ను క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయం పొందొచ్చు’’అని యూఐడీఏఐ పేర్కొంది. ఏదైనా మొబైల్ నంబర్ సీడ్ అవ్వకపోతే అదే విషయాన్ని సూచిస్తుందని, దాంతో మొబైల్ నంబర్ అప్డేషన్కు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అప్పటికే మొబైల్ నంబర్ ధ్రువీకరించి ఉంటే, అదే విషయం తెలియజేస్తుందని వెల్లడించింది. ఆధార్ తీసుకునే సమయంలో ఏ నంబర్ ఇచ్చామో గుర్తు లేనివారు, సంబంధిత మొబైల్ నంబర్ చివరి మూడు నంబర్లను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఈ మెయిల్/ మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించొచ్చని సూచించింది. ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు 22 సంస్థలకు అనుమతి కాగా క్లయింట్ల ధ్రువీకరణను ఆధార్ ఆధారితంగా నిర్ధారించుకునేందుకు 22 ఆర్థిక సేవల సంస్థలకు అనుమతి లభించింది. ఈ 22 కంపెనీలు ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రిపోర్టింగ్ ఎంటెటీలుగా (కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించేవి)గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. (ఇదీ చదవండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) ఇవి తమ క్లయింట్ల గుర్తింపు ధ్రువీకరణను ఆధార్ సాయంతో చేపట్టేందుకు అనుమతించినట్టు ప్రకటించింది. ఇలా అనుమతులు పొందిన వాటిల్లో గోద్రేజ్ ఫైనాన్స్, అమెజాన్ పే (ఇండియా), ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపును ఆధార్ సాయంతో ధ్రువీకరించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. -
పాన్ - ఆధార్ లింక్‌లో కొత్త అప్డేట్
పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని, ఈ ప్రక్రియ 2023 జూన్ 30 చివరి నాటికి పూర్తి చేసుకోవాలని గతంలోనే చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పాన్ కార్డు - ఆధార్ లింకింగ్‌లో కొత్త అప్డేట్ వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పాన్ కార్డు లింక్ చేసేందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించి కూడా చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించడానికి ముందు ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్ ఇయర్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవానికి మార్చి 31 చివరి గడువుగా ప్రకటించారు. అయితే ఈ గడువు ప్రస్తుతం పొడిగించారు. కావున అసెస్మెంట్ ఏడాదిని 2023 - 24గా కాకుండా, అసెస్మెంట్ ఇయర్‌ను 2024-25గా ఎంచుకోవాలి. పేమెంట్ చేయడానికి అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఈ మార్పుని డబ్బు చెల్లించడానికి ముందే గమనించాలి. ఆలా కాకుండా దావుబ్బు చెల్లిస్తే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది లింక్ చేసుకుని ఉంటారు. అలాంటి వారు ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయిదో లేదో చూసుకోవడం మంచింది. ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూడవచ్చు: మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పోజీలో క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ కోసం ఆప్షన్ ఎంచుకున్న తరువాత ఈ-పే ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అసెస్మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి ఆ తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4 లేదా 5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి. -
ఆధార్‌తో 90 కోట్ల మొబైల్ నంబర్స్ అనుసంధానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆధార్‌తో ఒక కోటికిపైగా మొబైల్ నంబర్స్ అనుసంధానం అయ్యాయి. జనవరిలో ఈ సంఖ్య 56.7 లక్షలు నమోదైందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానించడం ఈ పెరుగుదలకు కారణం అని వివరించింది. ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్‌తో తమ మొబైల్ నంబర్‌ను అనుసంధానించినట్టు అంచనా. ఆధార్‌ను ప్రామాణికంగా చేసుకుని నమోదైన లావాదేవీలు జనవరిలో 199.62 కోట్లు, ఫిబ్రవరిలో 226.29 కోట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరి వరకు ఇటువంటి లావాదేవీలు 9,255 కోట్లు నమోదు కావడం గమనార్హం. ఈ–కేవైసీ లావాదేవీలు ఫిబ్రవరిలో 26.79 కోట్లు కాగా ఇప్పటి వరకు ఇవి మొత్తం 1,439 కోట్లుగా ఉన్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం!..రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్!
రేషన్ కార్డ్ హోల్డర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే గడువును మార్చి 31 నుంచి జూన్ 30,2023కి పొడిగించింది. ఈ పొడిగింపుపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డీఎఫ్పీడీ) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యవసర వస్తువుల్ని రేషన్ కార్డు ద్వారా సబ్సీడీగా పొందవచ్చు. దీంతో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ ఎలా గుర్తింపు కార్డ్‌గా వినియోగించుకుంటామో.. ఈ రేషన్ కార్డ్‌ను అలాగే ఉపయోగించుకునేందుకు వీలుంది. అయితే దేశంలో నిజమైన రేషన్ కార్డ్ లబ్ధి దారుల్ని గుర్తించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్‌లు ఉంటే వాటిని రద్దు చేయడం, ఎక్కువ ఆదాయం అర్జిస్తూ రేషన్ కార్డు వినియోగిస్తుంటే ఆ రేషన్ కార్డ్‌లను క్యాన్సిల్ చేయనుంది. నిజమైన లబ్ధిదారులకు నిత్యవసర వస్తువుల్ని అందించనుంది. రేషన్ కార్డ్‌కు ఆధార్ లింక్ ఇలా చేయండి ♦ ముందుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ♦ అందులో ఆధార్ కార్డ్ నెంబర్,రేషన్ కార్డ్ నెంబర్ తో పాటు ఫోన్ నెంబర్ వంటి వివరాల్ని నమోదు చేయాలి. ♦ అనంతరం కంటిన్యూ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి ♦ కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది ♦ ఓటీపీ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్‌కు ఆధార్ లింక్ అవుతుంది ఆఫ్‌లైన్‌లో రేషన్ కార్డ్ - ఆధార్ లింక్ ఇలా చేయండి ♦ కుటుంబసభ్యుల ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, రేషన్ కార్డ్ జిరాక్స్‌లు, బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో రేషన్ కార్యాలయానికి వెళ్లాలి ♦ అక్కడ ఆధార్ కార్డ్ డేటా బేస్‌లో మీ వివరాలని గుర్తించేలా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి ♦ ఆధార్ డేటా బేస్‌లో ఉన్న మీ వివరాలు మ్యాచ్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది. ♦ అనంతరం రేషన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేస్తారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్! -
కేంద్రం శుభవార్త .. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్ లింక్ చేశారా?
ఓటర్ ఐడీ,ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేసే సమయాన్ని ఏప్రిల్1, 2023 నుంచి మార్చి 31,2024 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్టం న్యాయ మంత్రిత్వ శాఖ (Ministry of Law and Justice) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూన్ 17న న్యాయ మంత్రిత్వ శాఖ ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్‌ను ఏప్రిల్ 1, 2023 లోపు లింక్ చేయాలని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల సంఘం ఆగస్టు 1 న నమోదైన ఓటర్ ఐడిలతో ఆధార్ కార్డ్ లింక్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక ఓటర్ ఐడీకి ఆధార్‌ని లింక్ చేసే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఓటర్ ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం ద్వారా బోగస్ ఓట్లను గుర్తించొచ్చు. అంటే ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉంటే.. అవి రద్దు అవుతాయి. దీని వల్ల పారదర్శకత వస్తుందని కేంద్రం ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. Centre extends the deadline for linking Aadhaar number with voter ID to March 31, 2024 from April 1, 2023.#Aadhaar pic.twitter.com/YRDseimiPp — Live Law (@LiveLawIndia) March 22, 2023 -
ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్
ఆధునిక కాలంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ అకౌంట్స్ మొదలైన వాటికోసం ఆధార్ తప్పనిసరి అయిపోయింది. కావున ఆధార్ కార్డు వినియోగంలో ఎటువంటి అసౌకర్యం ఎదుర్కోకుండా ఉండాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్డేట్ చేసుకోవాలి. గతంలో ఆధార్ అప్డేట్ చేయడానికి రూ. 25 చెల్లించాల్సి ఉండేది, అయితే ప్రస్తుతం 2023 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితం. ఇతర ఆధార్ సెంటర్ల వద్ద పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటివి అప్డేట్ చేయాలనుకుంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఆధార్ అప్డేట్ గడువు ఈ నెల చివరి వరకు మాత్రమే అని తెలిపారు. కాగా ఇప్పుడు ఈ గడువు మూడు నెలలకు పెంచడం జరిగింది. 'యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' ఆధార్ కార్డుని ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి అనుమతించింది. కావున మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. (ఇదీ చదవండి: బైక్ ప్రేమికులారా ఊపిరి పీల్చుకోండి.. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్ వస్తున్నాయ్) ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్, ఆధార్ నంబర్ హోల్డర్, ఆధార్ కోసం ఎన్రోల్మెంట్ చేసిన తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ (POI) సమర్పించడం ద్వారా కనీసం ఒక్కసారైనా ఆధార్‌లో తమ సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్డేట్ చేయవచ్చు. ఇది భవిష్యత్తులో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ''ఒకవేళా పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేయబడిందా.. లేదా అని తెలుసుకోవడానికి, అదే సమయంలో పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనుకునేవారు'' ఈ లింకుపై క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. -
ఆధార్ కార్డ్‌లో మీ వివరాలు అప్డేట్ చేయాలా? ఇలా సింపుల్‌గా చేయండి!
ఆధార్ కార్డ్(Aadhaar Card).. ప్రస్తుతం ఈ పేరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలు విషయంలో, ఆర్థిక వ్యవహరాల్లో కీలకంగా మారింది. దీంతో కొందరు ఆధార్ కార్డ్‌ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఈ కార్డ్ విషయంలో అక్రమాలను అరికట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలన్న వార్తలు బలంగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి కాకపోయినా, చేయడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. ఇటీవల ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీం లాంటి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ అందిస్తున్న సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. ఇక ఆర్థిక వ్యవహారాల్లోనూ ఆధార్ నెంబర్ కీలక పాత్ర పోషిస్తోంది.ఈ తరుణంలో ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లబ్ధిదారులకు చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించాలి. కేవలం అప్డేట్తో పాటు అందులో తప్పులు ఉంటే మార్చుకోవాలి. కార్డులోని పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. వీటిని అప్డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆన్లైన్లో ఈ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్డేట్ చేసి అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అనంతరం ఈ సేవకు అవసరమయ్యే పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్, ఫోటో అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అప్డేట్ ఇలా చేసుకోండి - ఆధార్ SUP పోర్టల్ uidai.gov.inని సందర్శించండి, ఆన్లైన్లో అప్డేట్ చిరునామాను ఎంచుకోండి - మీ ఆధార్ నంబర్ లేదా VIDని నమోదు చేయండి - మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపే సెక్యూరిటీ కోడ్ OTP వస్తుంది - మీరు అందుకున్న OTPని నమోదు చేయండి - "చిరునామా" ఎంపికను ఎంచుకుని, సబ్మిట్ చేయండి - మీ అన్ని అడ్రస్ వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను నొక్కి, ఆపై చివరగా నిర్ధారించుకోండి - సపోర్టింగ్ డాక్యుమెంట్ రంగు స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి - పత్రం సరైనదని నిర్ధారించుకోండి. అన్నీ సరైనవే అయితే ఎస్ బటన్ ఎంచుకోండి - BPOని ఎంచుకుని, సబ్మిట్పై క్లిక్ చేయండి - మీ అప్డేట్ రిక్వెస్ట్ ఇప్పుడు సబ్మిట్ చేయండి - అనంతరం మీ URN నంబర్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో పాటు మీ ఈమెయిల్‌కి కూడా వస్తుంది. - మీరు మీ URN స్థితిని ఆన్లైన్లో కూడా తనిఖీ చేయవచ్చు