ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.
నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్‌ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.
దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.
ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్
వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment