ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు | mAadhaar: Add up to 5 Aadhaar Profiles in Your mAadhaar App | Sakshi
Sakshi News home page

ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు

Published Sun, Feb 14 2021 3:20 PM | Last Updated on Sun, Feb 14 2021 3:56 PM

mAadhaar: Add up to 5 Aadhaar Profiles in Your mAadhaar App - Sakshi

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి యూఐడీఏఐ ఆధ్వర్యంలో ఎంఆధార్ యాప్‌ను 2017లో రూపొందించింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులు తమ ఆధార్ డేటా తస్కరించ ఉండటానికి ఆధార్ ప్రొఫైల్ కి లాక్ వేయవచ్చు. తాజాగా మరో ఫీచర్ ను ఎంఆధార్ వినియోగదారుల కోసం యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎంఆధార్ యాప్‌లో మరో ఐదుగురి ఆధార్ కార్డు ప్రొఫైల్‌లను జత చేసుకునే వెసులుబాటు కల్పించింది. యూఐడీఏఐ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

ఇంతకముందు ఎంఆధార్ యాప్‌లో గరిష్టంగా మూడు ప్రొఫైల్‌లను చేర్చే అవకాశం ఉండేది. ఇప్పడు ఐదు ప్రొఫైల్ జత చేసుకోవచ్చు. ఆధార్‌కు సంబంధించిన ఏదైనా సేవను ఆధార్ లాక్/అన్‌లాక్, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, విఐడి జెనరేటర్, ఇకెవైసి మొదలైన వాటిని ఎంఆధార్ మీ మొబైల్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. మీరు ప్రతి ప్రొఫైల్‌ను జతచేయాలి అనుకున్నప్పుడు ఆధార్ నెంబర్ ధృవీకరించడం కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ యాప్‌లో వినియోగదారుల పేరు, పుట్టిన తేదీ, లింగం మరియు చిరునామా, ఫోటో, ఆధార్ నంబర్ లింక్‌లను కలిగి ఉంటుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు వారి ప్రొఫైల్‌ డేటాను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.

చదవండి:

ఆపిల్‌ కంప్యూటర్‌ ఖరీదు రూ.11కోట్లు?

ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement