UIDAI
-
ఆధారం..జాగారం!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. స్కూళ్లలో అడ్మిషన్ నుంచి ఉద్యోగం పీఎఫ్ వరకు, మొబైల్ సిమ్‌కార్డు నుంచి ట్రైన్ టికెట్ వరకు ఆధార్ కావాల్సిందే. ఇక ప్రభుత్వ పథకాలను పొందాలనుకునే ఆధార్ తప్పనిసరి. అలాంటి ఆధార్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రతిచోటా సమస్యలే. ఆ మార్పులు, చేర్పుల కోసం జనం తిప్పలు పడుతున్నారు. ఆధార్‌లో మార్పుచేర్పులు, అప్డేషన్కు ఉన్న పరిమితుల కారణంగా.. అవి దాటితే కచ్చితంగా ప్రాంతీయ కార్యాలయానికి రావాల్సిందే. దీనితో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి జనం క్యూకడుతున్నారు. తెల్లవారుజాము నుంచే టోకెన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజుకు 150 టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో మిగతావారు ఉసూరుమనాల్సి వస్తోంది. ప్రధానంగా విద్యార్థుల ఆధార్ కార్డులో అప్డేషన్ సమస్యగా మారింది. చిన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకున్నవారు... నిర్ధారిత వయసు దాటాక బయోమెట్రిక్‌ను అప్డేట్ చేయించుకోవాల్సి రావడమే దీనికి కారణం.అప్డేట్కు పరిమితులతో... భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధార్ రికార్డుల్లో మార్పులు, చేర్పులపై కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆధార్ కార్డులో వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటివి అప్డేట్ చేసుకునేందుకు పరిమితులు పెట్టింది. ఆధార్ కార్డులో పేరును రెండుసార్లు మాత్రమే అప్ డేట్ చేసుకోవచ్చు. ఇంటిపేరు, స్పెల్లింగ్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. ఇందుకోసం తగిన ధ్రువపత్రాలను సమర్పించాలి.. పుట్టిన తేదీని కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. అదికూడా నమోదు సమయంలో ఇచ్చిన తేదీకి మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. ఇందుకోసం తప్పనిసరిగా ఆధారాలు సమర్పించాలి. జెండర్ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా అప్డేట్ చేసుకోవచ్చు. దీనిపై పరిమితి లేదు. జారీ అయి పదేళ్లు దాటిన ఆధార్ కార్డుల్లో ఫొటో అప్డేట్ తప్పనిసరి.రీజనల్ ఆఫీసులోనే మార్పులు.. నిర్దేశిత పరిమితి వరకు ఆన్లైన్లో తగిన ధ్రువపత్రాలను సమర్పించి ఆధార్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. పరిమితి దాటితే యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వాటికి తగిన ఆధారాలను జత చేయడంతోపాటు ఎందుకు వివరాలు మార్చాల్సి వస్తోందనేది స్పష్టంగా పేర్కొనాలి. ఈ–మెయిల్, పోస్ట్ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నా.. దానిపై అవగాహన లేక జనం ఇబ్బందిపడుతున్నారు. అంతేకాదు ఈ దరఖాస్తులకు తగిన ఆధారాలను చేయాలి, ఏమేం సమర్పించవచ్చన్నది తెలియడం లేదని జనం వాపోతున్నారు. దీనితో నేరుగా ప్రాంతీయ కార్యాలయానికి వస్తున్నామని పేర్కొంటున్నారు.9 ఏళ్ల పాపకు 16 ఏళ్ల వయసు వేశారు మాది ఏపీలోని కర్నూలు జిల్లా నందవరం గ్రామం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటా. నా కూతురు పేరు ఇందు. ఆమె వయసు తొమ్మిదేళ్లే. కానీ ఆధార్ కార్డులో 16 ఏళ్లు అని వచ్చిoది. దీనితో ప్రభుత్వ అమ్మ ఒడి పథకం అందలేదు. మూడుసార్లు కర్నూలులో ప్రయత్నించినా ఆధార్‌లో మార్పు జరగలేదు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాలంటే వచ్చాం. రెండు, మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఏం చేయాలో తెలియడం లేదు. – హుసేనమ్మ, నందవరం గ్రామం,కర్నూలు జిల్లానాలుగేళ్లుగా తిరుగుతున్నాం మాది మహబూబ్‌నగర్ జిల్లా కాకర్లపాడు గ్రామం. నా కూతురు మాధవి ఇంటర్ చదువుతోంది. తన ఆధార్‌లో పేరు తప్పుగా ఉండటంతోపాటు బయోమెట్రిక్ తప్పుగా చూపిస్తోంది. నాలుగేళ్ల నుంచి స్థానికంగా ప్రయత్నం చేశాం. తెలిసిన వారు చెబితే ప్రాంతీయ కార్యాలయానికి వచ్చాం. తప్పులు సవరించాలంటే ఏం చేయాలనేది ఎవరూ చెప్పడం లేదు. – భారతమ్మ, కాకర్లపాడు, మహబూబ్‌నగర్ అక్క బయోమెట్రిక్ తమ్ముడికి.. తమ్ముడి బయోమెట్రిక్ అక్కకు.. చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరూ అక్కాతమ్ముళ్లు. కర్నూలు జిల్లా సీ బెళగాల్ మండలం చెందిన కృష్ణ దొడ్డి గ్రామానికి చెందినవారు. వీరి ఆధార్‌కార్డుల్లో అక్క మమత బయోమెట్రిక్‌ను తమ్ముడికి, తమ్ముడు గోవర్ధన్ బయోమెట్రిక్‌ను అక్క ఆధార్‌కు అనుసంధానం చేశారు. దీన్ని సరిచేసుకునేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.ఇప్పటికే హైదరాబాద్‌లోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ ఆఫీస్‌కు మూడు సార్లు వచ్చామని.. ప్రతీసారి ఈ– మెయిల్ పెట్టామని చెప్తున్నారే తప్ప, సమస్య మాత్రం పరిష్కారం కాలేదని చెబుతున్నారు.ఈ చిత్రంలోని విద్యార్థి పేరు మహమ్మద్ అబ్దుల్ గనీ. ఆరేళ్ల ›వయసులో ఉన్నప్పడు 2011లో అతడి తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేయించారు. రెండేళ్ల క్రితం ఫోటో అప్డేట్ చేయించారు. ప్రస్తుతం ఘనీ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ అవసరం ఉండటంతో వేలిముద్ర ఇచ్చాడు. అది మిస్ మ్యాచ్ అని వస్తుండటంతో.. ఆధార్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అప్డేషన్కు ప్రయత్నిoచాడు. కానీ ఆ బయోమెట్రిక్‌తో వేరేవారి పేరుతో ఆధార్ ఉన్నట్లుగా చూపిస్తోంది. యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి ప్రయత్నించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. -
ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ ఉచిత అప్డేట్ గడువును వచ్చే ఏడాదికి పొడిగించింది. గతంలో తెలిపిన విధంగా ఉచిత ఆధార్ అప్డేట్కు ఈ రోజు చివిరి తేదీ. కానీ దాన్ని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు ఆధార్ అధికారిక ఎక్స్ లింక్‌లో వివరాలు పోస్ట్ చేసింది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (2025, జూన్ 14) లోపు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ.50 అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.#UIDAl extends free online document upload facility till 14th June 2025; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAl has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/wUc5zc73kh— Aadhaar (@UIDAI) December 14, 2024ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
ఆధార్ ఉచిత అప్డేట్.. రేపే లాస్ట్ డేట్!
మైఆధార్ పోర్టల్‌లో ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా.. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 'డిసెంబర్ 14' చివరి రోజుగా ప్రకటిస్తూ 'యూఐడీఏఐ' (UIDAI) వెల్లడించింది. అయితే పేర్కొన్న గడువు సమీపిస్తోంది. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. అయితే ఈ డేట్లో ఏమైనా మార్పులు ఉంటాయా? లేదా? అనేది రేపు తెలుస్తుంది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (డిసెంబర్ 14) లోపల ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!
ఆధార్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమిది. ఆధార్ కార్డు తీసుకుని చాలా కాలమైనా అప్డేట్ చేయనివారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చు. కాబట్టి అలాంటి ఆధార్ కార్డులను గడువులోపు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం.ఆధార్ కార్డ్‌లు జారీ చేసి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆన్లైన్ సదుపాయాన్ని అందించింది. ఇందుకు అనేకసార్లు గడువును పొడిగించింది. కానీ ఇప్పటికీ వేలాది మంది ఈ పని చేయలేదు. ఇలాంటి ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు. దీని కోసం, మీరు 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.ఆధార్ అప్డేట్ ఆవశ్యకతప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు అన్నింటికీ ఉపయోగించే ఆధార్ కార్డు ప్రస్తుతం ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. పదేళ్లలో మీ చిరునామా, ఫోటో మారి ఉండవచ్చు. ఆ సమాచారాన్ని ఆధార్‌లో అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.డిసెంబర్ 14 ఆఖరి గడువు?పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. అయితే ఇదే చివరి గడువు అని భావిస్తున్నారు.ఆధార్ కార్డును అప్డేట్ చేయండిలా..⇒ 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.⇒ అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్లోడ్ చేయండి.⇒ ఈ సర్వీస్ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దీన్ని అప్డేట్ చేసుకోండి.ఆధార్ కార్డ్ అప్డేట్కు అవసరమైన పత్రాలురేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి. -
ఇక పోలీస్ వద్ద ‘ఆధార్’
సాక్షి, అమరావతి: ఆధార్ డేటాను పోలీసు శాఖకు అందుబాటులోకి తేవాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. నేర పరిశోధన ప్రక్రియలో పోలీసులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వేలిముద్రలకు సంబంధించిన డేటాను పోలీసు శాఖకు అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఆధార్ డేటాను పర్యవేక్షించే ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)ను ఇప్పటికే ఆదేశించింది. యూఐడీఏఐ చట్ట ప్రకారం ఆధార్ డేటా అత్యంత గోప్యంగా ఉంచాలి. ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కీలక డేటా కావడంతో ఈ మేరకు కఠిన నిబంధనలను రూపొందించింది. ఆధార్ డేటాలోని ప్రాథమికమైన వేలి ముద్రలు, ఐరీష్ స్కాన్లను ఇతరులకు అందుబాటులోకి తేకూడదని ఆధార్ చట్టంలోని సెక్షన్ 29 (1) స్పష్టం చేస్తోంది. కాగా హైకోర్టు అనుమతితో కొంత పరిమిత డేటాను పోలీసులు పొందేందుకు సెక్షన్ 33 (1) అవకాశం కల్పిస్తోంది. దాంతో నిర్దిష్టమైన కేసుల దర్యాప్తు కోసం పోలీసులు హైకోర్టు అనుమతితో ఆధార్ డేటాను పరిశీలిస్తున్నారు. కానీ నేర పరిశోధన తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ప్రధానంగా గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వలస కూలీలు, నిరుపేదలకు ఎలాంటి పత్రాలు ఉండడం లేదు. అందుకే ఆధార్ డేటాను తమకు అందుబాటులోకి తేవాలని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖలు కేంద్ర హోం శాఖను కోరుతున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆధార్ డేటాను అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకోసం అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలని భావిస్తోంది. -
ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం
ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం సెప్టెంబర్ 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ 'మై ఆధార్' (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంది. ఆన్లైన్ పోర్టల్ యూఐడీఏఐ వెబ్సైట్లో పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15 నుంచి పొడిగిస్తూ.. మార్చి 14, ఆ తరువాత జూన్ 14, సెప్టెంబర్ 14కు పొడిగిస్తూ.. ఇప్పుడు తాజాగా ఈ తేదీని డిసెంబర్ 14కు పొడిగించారు.ఇదీ చదవండి: ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే.. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్➤మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి➤క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.➤మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.➤మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.➤'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.➤మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి➤ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.➤'సబ్మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.➤14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది.#UIDAI extends free online document upload facility till 14th December 2024; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/ThB14rWG0h— Aadhaar (@UIDAI) September 14, 2024 -
1.83 కోట్ల మంది ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందే!
సాక్షి, అమరావతి: ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్నప్పటికీ.. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 1,83,74,720 మంది తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు అప్పట్లో నమోదు చేసుకున్న వేలిముద్రలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అలాంటి వారు 18 ఏళ్ల వయసు దాటిన అనంతరం మరోసారి కొత్తగా తమ వేలిముద్రలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. అలాంటి వారు 48,63,137 మంది ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. దీనికి తోడు.. ఎవరైనా ఆధార్‌కార్డు పొందిన తర్వాత పదేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైనా ఆధార్‌లో అంతకు ముందు పేర్కొన్న అడ్రస్‌తో పాటు ఫొటోలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉండగా.. ఆ కేటగిరిలో 1,35,07,583 మంది వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.ఐదు రోజులపాటు ఆధార్ ప్రత్యేక క్యాంపులు ఇటీవల జన్మించిన వారికి తొలిసారి ఆధార్‌కార్డుల జారీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఆధార్ కార్డులు తీసుకుని నిబంధనల ప్రకారం తమ వివరాలను మరోసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిన 1.83 కోట్ల మంది కోసం ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది.దేశవ్యాప్తంగా ఆధార్ జారీచేసే యూఐడీఏఐ సంస్థ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతరెండేళ్లుగా ప్రతినెలా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆ«ధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.అవసరమైనచోట కాలేజీలు, పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని.. తగిన ప్రచారం కల్పించడానికి కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. -
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలు కొన్ని గంటలుగా నిలిచిపోయాయి. ఆధార్‌కు సంబంధించిన విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సర్వర్ మొరాయించింది. దీంతో ఆధార్ సంబంధిత ఓటీపీలు, ఇతర సేవల్లో అంతరాయం ఏర్పడింది.ఆధార్ డౌన్లోడ్, ఇతర సేవల కోసం యూఐడీఏఐ వెబ్సైట్లో ప్రయత్నిస్తుంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తోందని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. బ్యాంకులు, రిజిస్ట్రేషన్ వంటి శాఖల్లో ఆధార్ అనుసంధానిత సేవలకు సంబంధించి ఓటీపీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. #Aadhaar #gvt must if time internal server Error why? When we need that time sooing now a days pic.twitter.com/rs1LDr7GhA— dipullb comedyn (@SinhaDipu59035) July 11, 2024 -
ఉచితంగా ఆధార్ అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరోసారి పొడిగించింది. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14ను చివరి తేదీగా యూఐడీఏఐ వెబ్సైట్లో పేర్కొంది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకునేందుకు రూ .50 రుసుము వసూలు చేస్తారు. ఆన్లైన్ పోర్టల్‌లో యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15గా నిర్ణయించారు. తరువాత మార్చి 14, ఆ తరువాత జూన్ 14 తాజాగా సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..» స్టెప్ 1: మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి» స్టెప్ 2: క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.» స్టెప్ 3: మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.» స్టెప్ 4: మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.» స్టెప్ 5: 'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.» స్టెప్ 6: మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి» స్టెప్ 7: ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.» స్టెప్ 8: 'సబ్మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.» స్టెప్ 9: 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది. -
జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ
ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్ 14 లోపు అప్డేట్ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) స్పష్టతనిచ్చింది. అలా వస్తున్న వార్తలను నమ్మకూడదని చెప్పింది.ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 గడువు విధించినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ గతంలో 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండుసార్లు పొడిగించి చివరగా జూన్ 14 గడువు విధించింది. ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
‘ఆధార్’పై రూమర్లు .. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్’
న్యూఢిల్లీ: ఆధార్‌పై సోషల్ మీడియాలో ఇటీవల ఒక చర్చ విస్తృతంగా జరుగుతోంది. జూన్ 14 లోపు పౌరులు తమ వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకపోతే ఆధార్ పని చేయదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(ఉడాయ్) కొట్టిపారేసింది.ఆధార్‌లో కేవలం ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే జూన్14 గడువని తెలిపింది. వివరాలు అప్డేట్ చేసుకోకపోయినా ఆధార్‌కార్డు పనిచేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. కాగా, ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ తొలుత 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఈ గడువును రెండుసార్లు జూన్ 14 వరకు పొడిగించింది. ఈలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించింది. -
ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం మరో ఛాన్స్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం మార్చి 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫ్రీ సర్వీస్ మై ఆధార్ (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనే వారు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మీ ఆధార్ కార్డును ఎలా అప్డేట్ చేసుకోవాలంటే.. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని ఉపయోగించి లాగిన్ చేయాలి. లాగిన్ అయిన తరువాత మీకు డాక్యుమెంట్ అప్డేట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఏ వివరాలను అప్డేట్ చేసుకోవాలో దాన్ని సెలక్ట్ చేసుకుని, అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయడానికి ముందు మీ వివరాలను ద్రువీకరించుకోవాలి. కేవలం myAadhaar పోర్టల్ మాత్రమే జూన్ 14 వరకు డాక్యుమెంట్ల ఆధార్ అప్డేట్లను ఉచితంగా అందిస్తుంది. ఫిజికల్ ఆధార్ కేంద్రాలలో ఈ దీని కోసం రూ. 50 ఫీజు వసూలు చేస్తారు. 50 రూపాయలకంటే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే ఆపరేటర్ మీద చర్యలు తీసుకుంటారు. #UIDAI extends free online document upload facility till 14th June 2024; to benefit millions of Aadhaar holders. This free service is available only on the #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar pic.twitter.com/eaSvSWLvvt — Aadhaar (@UIDAI) March 12, 2024 -
ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డు.. ఇంటికే కావాలంటే ఇలా చేయండి..
Aadhar PVC Card: ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ. 50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. పీవీసీ కార్డ్‌లను పాలీ వినైల్ క్లోరైడ్‌తో తయారు చేస్తారు. అందుకే వీటిని పీవీసీ కార్డ్‌లు అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ కార్డ్. దీనిపై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయండిలా.. యూఐడీఏఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్సైట్లో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి ఓటీపీ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి. దీని తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి. చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్‌ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్‌కి అందజేస్తుంది. పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది. -
ఆధార్ కార్డ్ దారులకు ముఖ్యగమనిక.. త్వరలో ముగియనున్న డెడ్‌లైన్!
ఆధార్ కార్డ్ దారులకు ముఖ్య గమనిక. ఆధార్‌లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది మార్చి 14తో ముగియనుంది. ఈ తేదీలోపే ఏమైనా మార్పులు చేసుకోవాలని ఆధార్ ప్రతినిధులు కోరుతున్నారు. 2023 డిసెంబర్లో మూడు నెలల పాటు పొడిగించబడిన ఉచిత ఆధార్ అప్డేట్ మార్చి 14, 2024కి ముగియనుంది. ఈ గడువు గతంలో చాలాసార్లు పొడిగించింది కేంద్రం. మార్చి 14 తర్వాత ఈ గడువు పొడిగిస్తుందా?లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు: మార్చి 14, 2024 (ఇది చివరి పొడిగింపు) ఎవరు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు: ఇప్పటికే తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయని వారు ఎవరైనా ఏ వివరాల్ని ఆధార్‌లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు: పేరు, చిరునామా,మొబైల్ నంబర్ వంటి జనాభా వివరాలు (బయోమెట్రిక్ అప్డేట్లకు ఇప్పటికీ ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం అవసరం) మార్చి 14 తర్వాత ఏం జరుగుతుంది: ఆధార్ అప్డేట్ల కోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆధార్‌ను ఆన్లైన్లో ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలంటే ♦ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://myaadhaar.uidai.gov.in/ ♦ మీ ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయండి. ♦ ‘సెండ్ ఓటీపీ’ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన కోడ్‌ను ఎంటర్ చేయండి ♦ అనంతరం అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. ♦ ఇక్కడే మీరు ఆధార్‌లో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. సంబంధిత కాలమ్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ♦ అవసరమైన మార్పులను చేయండి, ఇందుకోసం అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. ♦ సంబంధిత వివరాలను నమోదు చేసి రిక్వెస్ట్‌పై క్లిక్ చేయండి. -
ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం - ఎప్పుడు.. ఎలా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని ప్రకటించింది. అయితే ఇప్పుడు యూఐడీఏఐ ప్రకారం.. కొత్త ఫామ్ ఉపయోగించి 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్ నెంబర్ సైతం రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం, ఆధార్ కార్డు ఉన్న వారు 18 ఏళ్ళు నిండిన తరువాత కార్డుని రద్దు చేసుకోవచ్చు. దీనికోసం యూఐడీఏఐ ఫామ్-9ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డబుల్ ఆధార్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లను కలిగి ఉన్న సందర్భంలో.. ఒక ఆధార్ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అందులో కూడా ఏవైనా మార్పులు.. చేర్పులు వంటివి చేఉకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు ఆధార్ కార్డులో ఫోటొపైన ఫోటో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటో గ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం, లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసిన సందర్భంలో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడిగా నమోదు చేసుకుని ఉంటే.. అలాంటి ఆధార్ నెంబర్ కూడా రద్దు చేసుకోవచ్చు. షెడ్యూల్ VI 27(1)(c) ప్రకారం, ఆధార్ నంబర్ హోల్డర్ అయిన నివాసి, పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, అతని/ఆమె ఆధార్ నంబర్‌ను రద్దు చేయడానికి ప్రాంతీయ అధికార కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఆధార్ నెంబర్ రద్దు చేసుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ హోల్డర్‌కు అథారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్మెంట్స్ అద్దెకు.. నెలకు లక్షల్లో సంపాదన ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ 5 లేదా 15 సంవత్సరాలు నిండిన ఆధార్ నంబర్ హోల్డర్ అతని/ఆమె బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే, అతని/ఆమె ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత అప్డేట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు. -
Aadhaar rules: మారిన ఆధార్ రూల్స్.. ఇకపై మరింత సులువుగా..
ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త నిబంధనలను జారీ చేసింది. ఆధార్ (నమోదు మరియు నవీకరణ) సవరణ నిబంధనలు, 2024గా పేర్కొంటూ దేశ పౌరులు, ప్రవాస భారతీయులకు ఆధార్ నమోదు, అప్డేట్ ప్రక్రియ మరింత సులువుగా ఉండేలా కొత్త మార్పులు చేసింది. యూఐడీఏఐ విడుదల చేసిన జనవరి 16 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నమోదు చేసుకోవడానికి, దానిలోని సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడానికి రెండు కొత్త ఫారమ్‌లను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఆధార్ ఎన్రోల్మెంట్/అప్డేషన్ కోసం దేశ పౌరులు, ఎన్నారైలకు వేర్వేరు ఫారమ్‌లను జారీ చేసింది. సమాచారం అప్డేట్ యూఐడీఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కార్డుదారులు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో తమ సమాచారాన్ని సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. నమోదు కేంద్రం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ తాజాగా అవకాశం కల్పించింది. అంతకుముందు 2016లో ప్రవేశపెట్టిన నియమాల ప్రకారం.. చిరునామాల మార్పునకు మాత్రమే ఆన్లైన్ మోడ్‌లో అవకాశం ఉండేది. డాక్యుమెంట్ అప్డేషన్, సమాచారం, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉండేది. వయసు రుజువు తప్పనిసరి సవరించిన నిబంధనల ప్రకారం.. వయసు రుజువు కోసం డాక్యుమెంటరీ ఫ్రూఫ్ కచ్చితంగా ఉండాలి. దీని ఆధారంగానే ఆధార్ కార్డ్‌పై పూర్తి పుట్టిన తేదీని ముద్రిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా లేదా కుటుంబ పెద్ద నిర్ధారణ ఆధారంగా ఆధార్ కోసం ఎన్రోల్మెంట్, వివరాల అప్డేట్ చేయవచ్చని యూఏడీఏఐ తెలిపింది. మరోవైపు ఎన్నారైలు ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ ఎన్నారైలు విదేశీ మొబైల్ నంబర్‌ను అందిస్తే ఆ నంబర్‌కు ఆధార్ సంబంధిత మెసేజ్‌లు వెళ్లవు. సవరించిన ఫారాలు దరఖాస్తుదారులకు మరింత సులువుగా ఉండేందుకు యూఐడీఏఐ పాత ఫారమ్‌లను సవరించింది. ఫారం 1: ఆధార్ నమోదు, నవీకరణ ఫారం 2: ఎన్నారైల కోసం ఫారం 3: దేశంలో చిరునామా ఉన్న ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం ఫారం 4: ఐదు నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న ఎన్నారై పిల్లల కోసం ఫారం 5: భారతీయ చిరునామా ఉన్న ఐదేళ్లలోపు పిల్లల కోసం ఫారం 6: ఐదేళ్ల లోపు ఎన్నారై పిల్లల కోసం ఫారం 7: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్లు నిండిన విదేశీ పౌరుల కోసం ఫారం 8: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్ల లోపు విదేశీ పిల్లల కోసం ఫారం 9: ఆధార్ నంబర్ రద్దు కోసం -
ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ..
కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకునేవారిని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మాదిరే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఆధార్ ఎన్రోల్మెంట్కు సంబంధించిన ఏ అంశాన్నైనా యూఐడీఏఐ నిర్వహిస్తోంది. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను యూఐడీఏఐకి బదులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్ కేంద్రాల్లోకి వెళ్లి ఈ సర్వీస్ పొందొచ్చు. ఆన్లైన్లో వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసే ముందు అన్ని ఆధార్ అప్లికేషన్లలోని డేటాను క్వాలిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సబ్‌డివిజన్ మేజిస్ట్రేట్ ఈ వెరిఫికేషన్ విధానాన్ని పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తే 180 రోజుల్లో ఆధార్ కార్డును ఇష్యూ చేస్తారు. ఇదీ చదవండి: ఫోన్‌పే క్రెడిట్సెక్షన్, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..! తాజాగా యూఏడీఏఐ తీసుకొచ్చిన మార్పులపై సంస్థ లక్నో రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ స్పందించారు. ఒక్కసారి ఆధార్ కార్డు ఇష్యూ అయితే ఆ తర్వాత ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే యథావిధిగా పాత పద్ధతినే పాటించాలన్నారు. కానీ ఇప్పటివరకు ఆధార్ కార్డు తీసుకోనివారు మాత్రం ఈ కొత్త విధానాన్ని అనుసరించాలని తెలిపారు. -
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పెంపు
సాక్షి, అమరావతి: ఆధార్‌లో అడ్రసు తదితర వివరాలను సొంతంగా అధికారిక ఆన్లైన్ వెబ్‌పోర్టల్‌లో అప్డేట్ చేసుకునే వారికి ఆ సేవలను ఉచితంగా అందజేసే గడువును ఆధార్‌కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ మరోసారి వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ వరకు పొడిగించింది. ఆధార్‌కార్డులు కలిగి ఉన్న ఎవరైనా ఆ కార్డు పొందిన పదేళ్ల గడువులో ఒక్కసారైనా వారికి సంబంధించి తాజా అడ్రసు తదితర వివరాలను కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాల్లో ఆధార్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వినియోగదారుడి పాత సమాచారం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఐడీఏఐ అప్పట్లో ప్రకటించింది. అదే సమయంలో.. ఆధార్‌కు సంబంధించి వివిధ రకాల సేవలను పొందాలంటే యూఐఏడీఐ నిర్ధారించిన నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఆన్లైన్లో సొంతంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునే వారికి ఆ సేవలకు మినహాయింపు ఉంటుందని కూడా అప్పట్లో ప్రకటించింది. మొదట 2023 ఫిబ్రవరి వరకే ఈ ఉచిత సేవలని యూఐడీఏఐ ప్రకటించగా.. అనంతరం ఆ గడువును మూడు దఫాలు పొడిగించింది. తాజాగా నాలుగోసారి 2024 మార్చి 14 వరకు గడువు పొడిగిస్తున్నట్టు పేర్కొంటూ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ ప్రభాకరన్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. -
రూపాయి ఎక్కువ తీసుకున్నా.. రూ.50 వేలు ఫైన్ కట్టాల్సిందే!
దేశంలో ఆధార్ కార్డ్ అప్ డేట్ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆధార్ సేవలకు అధిక ఛార్జీ వసూలు చేస్తున్న ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని, వారిని నియమించిన యాజమాన్యానికి రూ. 50,000 జరిమానా విధిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టం చేసింది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్డేట్తో సహా ఆధార్ సేవలకు అధిక ఛార్జీలు విధించకూడదని..ఇప్పటికే అన్ని ఆధార్ ఆపరేటర్లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘‘అయితే, అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడతామని, నిజమని తేలితే సంబంధిత నమోదు రిజిస్ట్రార్‌పై రూ. 50,000 జరిమానా విధిస్తాం. ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తామని’’ చంద్రశేఖర్ తెలిపారు. ఆధార్ సంబంధిత విషయాలపై ఫిర్యాదు చేయాలంటే యూఐడీఏఐ ఈమెయిల్ ద్వారా లేదంటే టోల్ ఫ్రీ నంబర్ 1947కి కాల్ చేయొచ్చని చెప్పారు. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఆన్లైన్లో ఆధార్ వివరాల్ని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన సమయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకే ఇచ్చింది. అయితే తాజాగా ఆ గడువును 2024 మార్చి 14 వరకు పొడిగించింది. మరోవైపు, ఆధార్ కార్డ్ తీసుకుని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వినియోగదారులు వారి ఆధార్ కార్డ్‌లోని వివరాల్ని అప్డేట్ చేయాలని కోరిన విషయం తెలిసిందే. తద్వారా, పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. -
క్లోనింగ్ ముప్పు : తక్షణమే ఆధార్ బయోమెట్రిక్ డేటా లాక్ చేయండి ఇలా..!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్టం పడటం లేదు.సైబర్ క్రైం నేరాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. మనం ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ మోసానికి పాల్పడుతున్న కొత్త తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేలిముద్రతో తస్కరించి బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు కాజేసిన ఘటన ఆందోళన రేపుతోంది. క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమేంట్ సిస్టం ద్వారా దాదాపు లక్షల మేర టోకరా వేస్తున్నారు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా, చివరికి మొబైల్ సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్‌తోపాటు ఫింగర్ ప్రింట్ కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలా అవసరం ఉన్న ప్రతి చోటా ఆధార్, ఫింగర్ ప్రింట్ ఇస్తాం. దీన్ని అదునుగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు పౌరుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, నగదు స్వాహా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆధార్ కార్డులోని వేలి ముద్రలు, ఇతర బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఈ క్రమంలో UIDAI పోర్టల్ ద్వారా బయోమెట్రిక్ డేటా లాక్ లేదా అన్ లాక్ ప్రక్రియ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బయోమెట్రిక్ లాకింగ్ ఎలా? ♦ ముందుగా మై ఆధార్ పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ♦ మైఆధార్ పోర్టల్‌లోకి ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. ♦ స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ అందులో లాక్, అన్‌లాక్ మీకు ఎలా ఉపయోగపడుతుందనేది వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ వెంటనే ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. తరువాత టర్మ్స్ బ్యాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి. ♦ Your Biometric Have Been Locked Successfully (బయో మెట్రిక్ విజయవంతంగా లాక్ చేయబడింది’) అనే సందేశం డిస్ప్లే అవుతుంది. ♦ లాక్ కాగానే లాక్ లేదా అన్ లాక్ బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ స్క్రీన్‌పై కనబడుతుంది. బయోమెట్రిక్ అన్‌లాక్ ఎలా? ♦పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో నిపిస్తుంది. ఇలా ఉంటే బయోమెట్రిక్ లాక్ అయినట్టే. ♦అన్‌లాక్ ప్రక్రియ కోసం Please Select To Lock టిక్ చేసిన తరువాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ♦బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని మెసేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని, నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి ♦Your Biometrics Have Been Unlocked Successfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది. ♦ తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుంది అనేది గమనించాలి -
ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది!
ఆధార్ తీసుకుని పదేళ్లు దాటితే అప్డేట్ చేయాలని కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు 2023 డిసెంబర్ 14లోపు అప్డేట్ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. త్వరలో గడువు ముగియనుండడంతో ఈ ప్రకటన విడుదల చేసింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన ధ్రువపత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్)లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను నమోదు చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్ తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
ఆధార్ సురక్షితమేనా.. ఇంతకీ కేంద్రం ఏం చెబుతోంది?
గ్లోబుల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఆధార్ కార్డుపై చేసిన వ్యాఖ్యల్ని కేంద్రం ఖండించింది. ఆధార్ బయోమెట్రిక్ టెక్నాలజీ విధానంతో ప్రజల భద్రత, గోప్యతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయాన్ని తప్పు బట్టింది. మూడీస్ ఆరోపణలపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సైతం స్పందించింది. ఆధారాలు లేకుండా మూడీస్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రపంచంలోనే ఆధార్ అంత్యంత నమ్మకమైన డిజిటల్ ఐడీ’ అని తెలిపింది. కాబట్టే భారతీయులు 100 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించారని, దీన్ని బట్టి ఆధార్‌పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అర్ధమవుతుందని మూడీస్‌కు సూచించింది. అంతర్జాతీయ సంస్థలు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకులు ఆధార్ విధానాన్ని ప్రశంసించిన అంశాన్ని ఈ సందర్భంగా యూఐడీఏఐ గుర్తు చేసింది. ప్రపంచంలో పలు దేశాలు సైతం ఆధార్ తరహాలో తమ దేశంలో డిజిటల్ ఐడీ వ్యవస్థను అమలు చేసేలా తమను సంప్రదించినట్లు చెప్పింది. ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్ వంటి బయోమెట్రిక్ టెక్నాలజీలు కాంటాక్ట్‌లెస్ అని గుర్తించడంలో మూడీస్ విఫలమైందని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, ఆధార్ భద్రత విషయంలో మొబైల్ ఓటీపీ వంటి సెక్యూరిటీ అంశాలపై ప్రస్తావించడం లేదని, ఇప్పటి వరకు ఎలాంటి ఆధార్ డేటాబేస్ ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది కేంద్రం. -
Aadhaar card update: ఆధార్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..
Aadhaar card free update: ఆధార్ (Aadhaar) కార్డుల్లో తప్పులుంటే ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గడువును పొడిగించింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఫ్రీగా అప్డేట్ చేసేందుకు విధించిన సెప్టెంబర్ 14తో ముగియనుండగా.. ఇప్పుడు దానిని మరో 3 నెలలు అంటే డిసెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. ఈ మేరకు యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘వీలైనంత ఎక్కువ మంది ఆధార్‌లో తమ డాక్యుమెంట్లు అప్డేట్ చేసుకునేలా ప్రోత్సహించడానికి సెప్టెంబర్ 14 వరకు మై ఆధార్ (myAadhaar) పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్‌లో డాక్యుమెంట్లు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించాం. (పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?) దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సదుపాయాన్ని మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు పొడిగించాలని నిర్ణయించాం. https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫ్రీగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు’ అని యూఐడీఏఐ పేర్కొంది. అలాగే ఆధార్ కార్డు పొంది పదేళ్లు దాటిపోయినవారు కూడా అప్డేట్ చేసుకోవాలని కోరింది. -
డిగ్రీ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు.. యూజీసీ కీలక ఆదేశాలు
డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై విద్యార్థుల ఆధార్ నంబర్ల ముద్రణపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు ముద్రించకూడదంటూ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను ఆదేశించింది. రిక్రూట్మెంట్ లేదా అడ్మిషన్ సమయంలో పేర్కొన్న పత్రాల వెరిఫికేషన్‌లో తదుపరి ఉపయోగం కోసం తాత్కాలిక సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీలపై పూర్తి ఆధార్ నంబర్లను ముద్రించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన ఆధార్ రెగ్యులేషన్స్ 2016 చట్టంలోని రెగ్యులేషన్ 6, సబ్-రెగ్యులేషన్ (3) ప్రకారం ఏ విద్యా సంస్థా విద్యార్థుల ఆధార్ నంబర్లతో కూడిన సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పంపిన సెప్టెంబర్ 1 నాటి లేఖలో యూజీసీ కార్యదర్శి మనోజ్ జోషి పేర్కొన్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. UGC Letter regarding display of Aadhaar number on provisional certificates and degrees issued by universities. Read:https://t.co/jtxN2oDipB pic.twitter.com/TSK9ne8hdV — UGC INDIA (@ugc_india) September 1, 2023 -
యుఐడీఏఐ పార్ట్‌టైం చైర్మన్‌గా నీల్కాంత్..
UIDAI part time chairman Neelkanth Mishra యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, యాక్సిస్ క్యాపిటల్ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ నీల్కాంత్ మిశ్రా కీలక పదవికి ఎంపికయ్యారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పార్ట్ టైమ్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఛైర్పర్సన్, సభ్యులు మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయస్సు వరకు పదవీకాలం కొనసాగుతారు, ఏది ముందుగా ఉంటే అది అని మంగళవారం ఐటీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా, ఐఐటీ ఢిల్లీలోని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొమౌసమ్ పార్ట్ టైమ్ సభ్యులుగా మారనున్నారు. భారత ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో కాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌తో సహా అనేక కమిటీలకు సలహాదారుగా కూడా ఉన్నారు. యుఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్న సమాచారంబోర్డులో ఒక చైర్పర్సన్, ఇద్దరు పార్ట్ టైమ్ సభ్యులు, అథారిటీ మెంబర్-సెక్రటరీ అయిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు.సీనియర్ఐఏఎస్ ఆఫీసర్. ఐటి మంత్రిత్వ శాఖలో మాజీ అడిషనల్సెక్రటరీ అమిత్ అగర్వాల్ జూన్‌లో యుఐడిఎఐ సీఈగా ఎంపికైప సంగతి తెలిసిందే. (అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు) ఎవరీ నీల్కాంత్ మిశ్రా ఐఐటి కాన్పూర్ గోల్డ్‌మెడలిస్ట్. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన మిశ్రా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో సీనియర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ గానూ,హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ లో కూడా పనిచేశారు. గతంలో జ్యూరిచ్-ఆధారిత క్రెడిట్ సూయిస్లో పనిచేసిన మిశ్రాకు ఆర్థిక రంగంలో రెండు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం ఉంది. క్రెడిట్ సూయిస్లో రెండు దశాబ్దాలు గడిపిన తర్వాత మే 2023లో యాక్సిస్ బ్యాంక్‌లో చీఫ్ ఎకనామిస్ట్, గ్లోబల్ రీసెర్చ్ హెడ్‌గా మిశ్రా బాధ్యతలు చేపట్టారు. APAC స్ట్రాటజీ, ఇండియా ఈక్విటీ స్ట్రాటజీకి సహ-హెడ్‌గా, ఇండియా హెడ్ ఆఫ్ రీసెర్చ్‌గా పనిచేశారు. (అంబానీ ప్లాన్లు మామూలుగా లేవుగా: రూ.40 వేల కోట్లపై కన్ను) -
ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక - ఈమెయిల్ & వాట్సాప్‌లో..
ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి మీ డాక్యుమెంట్స్ షేర్ చేయమని ఏదైనా వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్‌లు వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) హెచ్చిరికలు జారీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను భారీగా మోసం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆధార్ అప్డేట్ కోసం ఈ-మెయిల్ లేదా వాట్సాప్ మెజెజ్ రోపంలో సందేశాలు పంపదని, అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని తెలియజేసింది. ఏదైనా ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి సమీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. ఆధార్ అప్డేట్లో భాగంగా ఎవరూ తమ వివరాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపకూడదు. ఇదీ చదవండి: ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకుంటే.. ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటితే వారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పలుమార్లు వెల్లడించింది. ప్రస్తుతం దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. దీనికి చివరి గడువు సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోని వారు గడువు లోపల చేసుకోవచ్చు. #BewareOfFraudsters UIDAI never asks you to share your POI/ POA documents to update your #Aadhaar over Email or Whatsapp. Update your Aadhaar either online through #myAadhaarPortal or visit Aadhaar centers near you. pic.twitter.com/QZlfOnBp54 — Aadhaar (@UIDAI) August 17, 2023 -
ఆధార్ ముఖ ధ్రువీకరణ లావాదేవీలు 1.06 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకణ లావాదేవీలు (గుర్తింపు ధ్రువీకరణ) మే నెలలో 10.6 మిలియన్లు (1.06 కోట్లు) నమోదయ్యాయి. ఈ లావాదేవీలు వరుసగా రెండో నెలలో కోటికి పైగా నమోదయ్యాయి. ‘‘ముఖ ధ్రువీకరణ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. నెలవారీ లావాదేవీలు ఈ ఏడాది జనవరి నెలతో పోల్చి చూసినప్పుడు మే నెలలో 38 శాతం అధికంగా నమోదయ్యాయి. దీని వినియోగం పెరుగుతుందన్న దానికి సంకేతం’’అని యూఐడీఏఐ ప్రకటించింది. 2021లో ఈ సేవను ప్రారంభించిన తర్వాత ఒక నెలలో అత్యధికంగా లావాదేవీల నమోదైంది ఈ ఏడాది మే నెలలోనేనని తెలిపింది. ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణ సేవలకు డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఏఐ/మెíÙన్ లరి్నంగ్ ఆధారిత ముఖ ధ్రువీకరణ సొల్యూషన్‌ను ప్రస్తుతం 47 సంస్థలు వినియోగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంక్‌లు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, పీఎం కిసాన్ పథకంలో లబి్ధదారుల నమోదుకు, పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సరి్టఫికెట్లు పొందేందుకు ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల ప్రారంభానికీ దీన్ని తీసుకుంటున్నారు. వినియోగానికి సులభంగా ఉండడం, వేగంగా గుర్తింపు ధ్రువీకరణ, ఫింగర్ ప్రింట్, ఓటీపీలతో సౌకర్యవంతంగా ఉంటున్నట్టు యూఐడీఏఐ వివరించింది. మే నెలలో ఆధార్‌కు సంబంధించి 1.48 కోట్ల అప్డేట్ అభ్యర్థనలను కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో ఆధార్ ఈ కేవైసీకి డిమాండ్ పెరుగుతోంది. మే నెలలో 25.4 కోట్ల ఈకేవైసీ లావాదేవీలు నమోదైనట్టు యూఐడీఏఐ ప్రకటించింది. -
గుడ్‌న్యూస్! ఆధార్ ఉచిత అప్డేట్ గుడువు పొడగింపు
ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పొడిగించింది. మరో నెలలు అంటే జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్‌కు సంబంధించి గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇచ్చిన పత్రాలను సెప్టెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవాలని యూఏడీఏఐ తన వెబ్సైట్లో పేర్కొంది. డాక్యుమెంట్ల అప్డేట్, అప్లోడ్ కోసం జూన్ 14 వరకే గడువు ఉండేది. ఇప్పుడు దాన్ని యూఏడీఏఐ పొడిగించింది. ఈ అప్డేట్ సౌకర్యం https://myaadhaar.uidai.gov.in వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్లను స్వయంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ఆధార్ సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రంలో అప్డేట్ చేయించుకుంటే రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోండి.. రేపే లాస్ట్ డేట్!
ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా ఆధార్ కార్డ్‌లోని వివరాల్ని అప్డేట్ చేసుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (uidai) ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. యూఐడీఏఐ ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘మై ఆధార్’ను సందర్శించాల్సి ఉంటుంది. యూఐడీఏఐ ట్వీట్ మేరకు.. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకొని పదేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలైందా? అయితే మార్చి 15 నుంచి జూన్ 14, 2023 వరకు ఉచితంగా https://myaadhaar.uidai.gov.inలో ఐడెంటిటీ ఫ్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలని ట్వీట్ చేసింది. దీంతో యూఐడీఏఐ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. గడువు అనంతరం యధావిధిగా డబ్బులు చెల్లించి ఆధార్‌ను ఆప్డేట్ చేసుకోవచ్చు. Keep Demographic Details Updated to Strengthen Your #Aadhaar. If your Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at https://t.co/CbzsDIBUbs ‘FREE OF COST’ from 15 March - June 14, 2023. pic.twitter.com/CFsKqPc2dm — Aadhaar (@UIDAI) March 16, 2023 అడ్రస్ ఫ్రూప్‌ను అప్డేట్ చేసుకోండిలా స్టెప్1 : https://myaadhaar.uidai.gov.inను విజిట్ చేయండి స్టెప్2 : అందులో లాగిన్ అయిన తర్వాత ‘నేమ్/జెండర్/డేట్ ఆఫ్ బర్త్& ఆధార్ అడ్రస్’ స్టెప్3 : అనంతరం అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి స్టెప్4 : అడ్రస్‌ను సెలక్ట్ చేసుకొని మీ ఇంటిపేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలా (డెమోగ్రాఫిక్స్ ఆప్షన్) వివరాల్ని పొందుపరచాలి. అనంతరం ప్రొసీడ్ టూ అప్డేట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. స్టెప్5 : డెమో గ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ వివరాల్ని ఇవ్వాలి. అనంతరం కావాల్సిన కాపీలను స్కాన్ చేయాలి. స్టెప్6 : కాపీలను స్కాన్ చేసి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ (ఎస్ఆర్ఎన్) జనరేట్ అవుతుంది. సేవ్ చేస్తే మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ ట్రాక్ చేసుకునే వీలు కలుగుతుంది. ఇదీ చదవండి : ‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్ మూసివేత! -
ఆధార్ కార్డ్ పోయిందా.. నంబర్ కూడా గుర్తులేదా.. ఎలా మరి?
దేశంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కీలకమైన డాక్యుమెంట్. అనేక ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా అవసరం. మరి ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డ్‌ను పోగొట్టుకుంటే.. ఆధార్ నంబర్ కూడా గుర్తు లేకుంటే ఏం చేయాలి.. డూప్లికేట్ ఆధార్ ఎలా పొందాలి? ఆధార్ కార్డ్ మన రోజువారీ జీవనంలో భాగమైపోయింది. బ్యాంకు వెళ్లినా.. ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైపోయింది. ఒక వేళ మన ఆధార్ కార్డ్ పోగొట్టుకునిపోతే ఆధార్ నంబర్ గుర్తుంటే ఈ ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ నంబర్ కూడా గుర్తు లేనప్పుడు ఆధార్ కార్డ్‌ను పొందడం ఎలాగో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పుడు ఆధార్ నంబర్ గుర్తు లేకపోయినా సరే ఆధార్ కార్డ్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా? ఆధార్ నంబర్ ఉంటే.. https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.inని సందర్శించండి ‘ఆర్డర్ ఆధార్ కార్డ్’ను క్లిక్ చేయండి 12 అంకెల ఆధార్ నంబర్, 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ నంబర్ నమోదు చేయండి. స్క్రీన్‌పై ఇతర వివరాలు, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి అనంతరం మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ వస్తుంది. మళ్లీ యూఐడీఏఐ సెల్ఫ్-సర్వీస్ పోర్టల్‌ని సందర్శించి ‘డౌన్లోడ్ ఆధార్’పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ లేకపోతే.. https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uidని సందర్శించండి. ఆధార్ నంబర్ కావాలో లేదా ఎన్రోల్మెంట్ ఐడీ కావాలో ఎంచుకోండి. పేరు, మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ నమోదు చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ వస్తుంది. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ ద్వారా.. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1800 180 1947 లేదా 011 1947కు డయల్ చేయండి మీ ఆధార్ కార్డును తిరిగి పొందడానికి అవసరమైన ఆప్షన్ ఎంచుకోండి. అన్ని వివరాలను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ వస్తుంది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి యూఐడీఏఐ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయ్యిందో.. ఇప్పుడు మీ మొబైల్ లోనే ఇలా చూసుకోవచ్చు
-
ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా?
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్‌తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్‌కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు! ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! కార్డుదారులు తమ ఆధార్‌కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్‌కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. ఇలా వెరిఫై చేయండి కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్‌ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా
ఆధార్ కార్డ్ దారులకు ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌లో టచ్‌లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఆధార్ కార్డ్ కోసం బయోమెట్రిక్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు) వేయొచ్చు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా ‘ఆధార్ సంస్థ - ఐఐటీ బాంబే’ సంయుక్తంగా ఫోన్ ద్వారా కేవైసీ వివరాలతో ఫింగర్‌ప్రింట్స్ తీసుకునేలా ‘మొబైల్ క్యాప్చర్ సిస్టమ్’ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు. మొబైల్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే టచ్‌లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ సాయంతో ఇంటి వద్ద నుంచే ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్‌ను (వేలిముద్రలు) అప్డేట్ చేయొచ్చు. నిజమైన ఆధార్ లబ్ధి దారుల్ని గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్‌కు సమానంగా ఫింగర్ ప్రింట్ పద్దతి పనిచేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ వ్యవస్థ మరింత మెరుగు పడనుంది. సిగ్నల్/ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్/డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ కలయికతో పనిచేసే ఈ వ్యవస్థ ఆధార్ సంబంధిత సేవల్ని మొబైల్ ద్వారా అందించడలో మరింత సులభతరం చేస్తుంది. రోజుకు 70 మిలియన్ల మంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటి వివరాలను అప్డేట్ చేసుకునే (Aadhaar authentications) వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు గాను యూఐడీఏఐకి రోజుకు 70-80 మిలియన్ల మంది అప్లయ్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 2022 చివరి నాటికి వారి సంఖ్య 88.29 బిలియన్లను దాటింది. సగటున రోజుకు 70 మిలియన్ల మంది ఆధార్‌లో మార్పులు చేసుకుంటున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
ఆధార్ తీసుకుని ఎన్ని రోజులవుతోంది? కేంద్రం కొత్త నిబంధన తెలుసా?
సాక్షి, అమరావతి: ‘ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయి.. ఇప్పటికీ అదే అడ్రస్‌లో ఉన్నా మీరు విధిగా మీ ఆధార్ కార్డును అదే అడ్రస్ ప్రూఫ్‌తో అప్డేట్ చేసుకోవాల్సిందే’.. అంటూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ స్పష్టంచేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు సైతం రాసింది. ఈ మేరకు ఆధార్ కార్డు జారీ చట్టంలోనూ మార్పులు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా ఇచ్చింది. ‘ఆధార్‌ను ఇప్పుడు అనేక ప్రభుత్వ సేవలు పొందేందుకు ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ ప్రామాణీకంతోనే సంబంధిత వ్యక్తి గుర్తింపు రుజువుగానూ మారింది. ఎలాంటి సేవలను పొందాలన్నా ప్రతి ఒక్కరూ తమ తాజా వివరాలను యూఐడీఏఐకు సమర్పించాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్‌ను పొందిన వారు, ఇప్పటికీ అదే చిరునామాలో నివసిస్తున్నందునో, లేదా వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో దానిని అప్డేట్ చేయకపోవచ్చు. కానీ, సరైన ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి చిరునామాను మళ్లీ ధృవీకరించుకోవాలి’.. అంటూ ఆధార్ కార్డు జారీలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అలెక్స్ కుమార్ శర్మ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టంచేశారు. ఆధార్ అప్డేట్ సమయంలో ప్రతి ఆధార్ కార్డుదారుడు తమ చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫొటో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్డేట్ కాని కార్డులు 1.65 కోట్లు.. 2022 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలో మొత్తం 5,19,98,236 మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. అయితే, వీరిలో 1,65,47,906 మంది ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన మేరకు ఆధార్‌కార్డు పొందిన పదేళ్లలో కనీసం ఒక్కసారి తమ అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకోని వారుగా యూఏఐడీఏ గుర్తించింది. రాష్ట్రంలో ఈ కొత్త నిబంధన ప్రకారం ఆధార్ అప్డేట్ చేసుకోని వారు అత్యధికంగా కాకినాడ జిల్లాలో 18 లక్షల మందికి పైగా ఉండగా, అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 1.78లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. ప్రత్యేక క్యాంపులు ఆధార్ కార్డుల జారీలో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఆధార్ సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు లేదా ప్రత్యేక ఆధార్ కార్డు జారీ కేంద్రాలు ఉండే పట్టణాలతో పాటు ఎంపిక చేసుకున్న 2,377 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ ఆ ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు.. ఇప్పటి 15 ఏళ్లలోపు, 15–17 ఏళ్ల మధ్య వయస్సున్న వారి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రతినెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. అయితే, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం అన్ని వయస్సుల వారు తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవడానికి వీలుగా ఆయా సచివాలయాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గ్రామాల వారీగా పదేళ్ల పూర్తయినా ఆధార్ అప్డేట్ చేసుకోని వారి వివరాలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఇప్పటికే యూఐడీఏఐ నుంచి సేకరించి, ఆ వివరాలను కూడా జిల్లాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. -
UIDAI Factcheck: ఆధార్ జిరాక్స్‌లు ఇవ్వకూడదా?
ఆధార్ కార్డ్ ప్రస్తుతం అందరికీ అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. ఏ ప్రభుత్వ పథకానికైనా ఇది కావాల్సిందే. ఎందుకంటే ఇందులో మీ పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలతోపాటు మీ బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది. దీంతో దీని ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ.. కార్డుదారులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇస్తుంటుంది. ప్రస్తుతం యూఐడీఏఐ పేరుతో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. యూఐడీఏఐ పేరుతో వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌లో ఆధార్ కార్డుదారులు తమ ఆధార్ సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, ప్రభుత్వ పథకం కోసం అయినా సరే తమ ఆధార్ కార్డు జిరాక్స్‌లు సైతం ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అందులో ఉంది. Beware! Fake Message Alert! Please Ignore. pic.twitter.com/RNEyzebJ5R — Aadhaar (@UIDAI) February 21, 2023 అయితే ఆ మెసేజ్‌పై యూఐడీఏఐ క్లారిటీ ఇచ్చింది. అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని, అందులో ఇచ్చిన యూఐడీఏఐ లింక్ కూడా తప్పు అని పేర్కొంది. (ఇదీ చదవండి: ఉద్యోగికి యాపిల్ అపూర్వ బహుమతి! స్వయంగా టిమ్‌కుక్...) -
పిల్లల ఆధార్ నమోదుకు కొత్త నిబంధన.. యూఐడీఏఐ ఆదేశాలు జారీ
సాక్షి, అమరావతి: పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూ టీ డైరెక్టర్ ప్రభాకరన్ ఆదేశాలు జారీ చేశారు. వయసును బట్టి దరఖాస్తు ఫారం ► ఐదేళ్లలోపు పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డుల జారీ లేదా ఆధార్‌లో వారి వివరాల అప్డేట్ చేసేందుకు ఒక రకమైన దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ► ఐదు ఏళ్లకు పైబడి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వేరే దరఖాస్తు ఫారం నమూనాను యూఐడీఏఐ సంస్థ విడుదల చేసింది. ► 18 ఏళ్ల పైబడిన వారికి మరో ఫార్మాట్లో దరఖాస్తు ఫారం ఉంటుందని పేర్కొంది. ► ఈ మేరకు మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను యూఐడీఏఐ తాజాగా జారీ చేసిన ఆదేశాలతో పాటే విడుదల చేసింది. ► ఈ నెల 15వ తేదీ నుంచి ఈ మూడు రకాల దరఖాస్తు ఫారాల విధానం అమలులోకి రాగా.. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. -
ఆధార్ కార్డ్‌లో మీ వివరాలు అప్డేట్ చేయాలా? ఇలా సింపుల్‌గా చేయండి!
ఆధార్ కార్డ్(Aadhaar Card).. ప్రస్తుతం ఈ పేరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలు విషయంలో, ఆర్థిక వ్యవహరాల్లో కీలకంగా మారింది. దీంతో కొందరు ఆధార్ కార్డ్‌ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఈ కార్డ్ విషయంలో అక్రమాలను అరికట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలన్న వార్తలు బలంగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి కాకపోయినా, చేయడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. ఇటీవల ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీం లాంటి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ అందిస్తున్న సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. ఇక ఆర్థిక వ్యవహారాల్లోనూ ఆధార్ నెంబర్ కీలక పాత్ర పోషిస్తోంది.ఈ తరుణంలో ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లబ్ధిదారులకు చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించాలి. కేవలం అప్డేట్తో పాటు అందులో తప్పులు ఉంటే మార్చుకోవాలి. కార్డులోని పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. వీటిని అప్డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆన్లైన్లో ఈ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్డేట్ చేసి అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అనంతరం ఈ సేవకు అవసరమయ్యే పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్, ఫోటో అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అప్డేట్ ఇలా చేసుకోండి - ఆధార్ SUP పోర్టల్ uidai.gov.inని సందర్శించండి, ఆన్లైన్లో అప్డేట్ చిరునామాను ఎంచుకోండి - మీ ఆధార్ నంబర్ లేదా VIDని నమోదు చేయండి - మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపే సెక్యూరిటీ కోడ్ OTP వస్తుంది - మీరు అందుకున్న OTPని నమోదు చేయండి - "చిరునామా" ఎంపికను ఎంచుకుని, సబ్మిట్ చేయండి - మీ అన్ని అడ్రస్ వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను నొక్కి, ఆపై చివరగా నిర్ధారించుకోండి - సపోర్టింగ్ డాక్యుమెంట్ రంగు స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి - పత్రం సరైనదని నిర్ధారించుకోండి. అన్నీ సరైనవే అయితే ఎస్ బటన్ ఎంచుకోండి - BPOని ఎంచుకుని, సబ్మిట్పై క్లిక్ చేయండి - మీ అప్డేట్ రిక్వెస్ట్ ఇప్పుడు సబ్మిట్ చేయండి - అనంతరం మీ URN నంబర్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో పాటు మీ ఈమెయిల్‌కి కూడా వస్తుంది. - మీరు మీ URN స్థితిని ఆన్లైన్లో కూడా తనిఖీ చేయవచ్చు -
‘ఆధార్ కార్డు’లో అడ్రస్ మార్పు మరింత ఈజీ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. ఇంటిపెద్ద(హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్‌లో (ఆన్లైన్లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త విధానంలో ఇంటి పెద్దతో సంబంధాన్ని ధ్రువీకరించే ఏదైనా పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి. ఆన్లైన్లో ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా అడ్రస్ మారుతుంది. ఇంటిపెద్ద ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిలేషన్‌షిప్‌ను నిర్ధారించే డాక్యుమెంట్ లేకపోతే ఇంటిపెద్ద సెల్ఫ్–డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఇది యూఐడీఏఐ నిర్దేశించిన ఫార్మాట్లో ఉండాలి. ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి తగిన ధ్రువపత్రాలు లేని వారికి ఈ కొత్త విధానంతో ఏంతో ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ తెలియజేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినవారికి సైతం ఉపయోగకరమని వివరించింది. ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు -
న్యూ ఇయర్ అలర్ట్: ఆధార్ కార్డ్‌ని ఇలా ఉపయోగించండి!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటి వల్ల మంచితో పాటు చెడు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల వ్యక్తిగత వివరాలు( మొబైల్ నంబర్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ , డెబిట్ కార్డ్, పిన్ నంబర్) తెలుసుకుని సైబర్ నేరగాళ్లు మన జేబులకు చిల్లు పెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఆధార్ వినియోగంపై కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆధార్ వినియోగం ఎలా అంటే.. ఇటీవల ఆధార్ కేవలం గుర్తింపు కార్డ్‌లానే కాకుండా పలు సంక్షేమ పథకాలు, బ్యాంక్, పాన్ వంటి వాటితో జత చేయడంతో చాలా క్రీయాశీలకంగా మారింది. దీంతో సైబర్ కేటుగాళ్ల కళ్లు ఆధార్ నెంబర్‌పై పడింది. ఈ నేపథ్యంలో .. మోసాల బారిన పడకుండా యూఐడీఏఐ పలు సూచనలు చేసింది. ఇంత వరకు బ్యాంక్ ఖాతా నంబర్లు, పాన్, పాస్‌పోర్ట్‌లతో సహా ఇతర డ్యాకుమెంట్లు మాదిరిగానే ప్రజలు ఆధార్ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సోషల్ మీడియాతో పాటు ఇతర ప్లాట్‌ఫాంలతో సహా పబ్లిక్ డొమైన్లో ఆధార్ కార్డ్‌లను ఎప్పుడూ షేర్ చేయవద్దని సూచించింది. ఏ పరిస్థితిల్లోనూ ఇతరులతో ఆధార్ ఓటీపీ (OTP)ని పంచుకోకూడదని తెలిపింది. ఒక వేళ ఏదైనా విశ్వసనీయ సంస్థతో ఆధార్‌ను పంచుకునేటప్పుడు, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, పాన్, రేషన్ కార్డ్ వంటి ఏదైనా ఇతర గుర్తింపు పత్రాన్ని పంచుకునే సమయంలో అదే స్థాయి జాగ్రత్తలు పాటించాలని UIDAI సూచనలు చేసింది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
ఇక ఈజీగా ఆధార్ అప్డేట్
సాక్షి, సిటీబ్యూరో: మీరు ఆధార్ నమోదు చేసుకొని పదేళ్లు దాటిందా? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మార్పులతో అప్డేట్ చేసుకోలేదా? అయితే తప్పనిసరి కాకున్నా.. సులభతర గుర్తింపు కోసం ‘మై ఆధార్ పోర్టల్, మై ఆధార్ యాప్’ లేదా దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను సమరి్పంచి, వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచిస్తోంది. తాజాగా ఆధార్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్ సంఖ్య కలిగి ఉన్నవారు నమోదు తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. అథంటికేషన్ కోసమే.. ఆధార్ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభతరంగా పనులు పూర్తి చేసుకునేందుకు అప్డేషన్ తప్ప నిసరిగా తయారైంది. పేరు, ఇంటిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫొటో వంటి వివరాలను ఏమైనా మార్పులు చేయాల్సివచ్చినప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. వయసు, అనారోగ్యం, ప్రమాదం వంటి కారణాలతో మార్పులు రావచ్చు. ఇందుకోసం తమ బయోమెట్రిక్ డేటాను 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేయడం మంచిదని యూఐడీఏ సూచిస్తోంది. 22.49 శాతం అప్డేషన్ తప్పనిసరిగా.. దేశంలోనే ఆధార్ నమోదులో అగ్రగామిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ 22.49 శాతం అప్డేషన్ తప్పనిసరిగా తయారైంది. మొత్తం ఆధార్ కార్డులు కలిగి ఉన్నవారిలో 0 నుంచి ఐదేళ్లలోపు 2.99 శాతం, ఐదు నుంచి 18 ఏళ్లు దాటిన వారు 19.5 శాతం ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఆధార్ నమోదు సంఖ్య 1.25 కోట్లకు చేరింది. అందులో ఐదు నుంచి 15 ఏళ్ల వయసు దాటిన వారికి, ఐదేళ్లలోపు ఆధార్ నమోదు చేసుకున్న వారికి బయోమెట్రిక్ అప్డేట్ తప్పని సరిగా మారింది. స్వయంగా అప్డేట్ ఇలా.. ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు, ఎవరి సాయం అవసరం లేకుండా ఇంటర్నెట్లో.. https://ssup.uidai.gov.in/web/guest/ssup-home నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఆధార్ సంఖ్యను, నమోదు చేసిన మొబైల్ నంబర్ ఉపయోగించి ఈ పోర్టల్‌లో లాగిన్ కావచ్చు. వన్‌టైమ్ పాస్వర్డ్ మొబైల్ ఫోనుకు వస్తుంది. దాని సాయంతో వెబ్సైట్లో ప్రవేశించాలి. ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు స్వీయ ధ్రువీకరణతో వ్యక్తిగత, చిరునామా నిర్ధారణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులోని వివరాలను నవీకరణ కార్యాలయం తనిఖీ చేసి, మార్చాల్సిన సమాచారంతో పోల్చిచూస్తోంది. ఈ ప్రక్రియ కోసం దరఖాస్తుదారు తన మొబైల్ నంబర్‌ను ముందుగానే నమోదు చేసి ఉండాలి. లేదంటే పైన సూచించిన వెబ్ చిరునామాలోనే ఉండే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, పూర్తిచేసి పోస్టులో పంపాలి. ఈ సేవను పొందాలంటే మొబైల్ నంబర్ తప్పక రిజిస్టరై ఉండాలి. -
పాన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారా.. అందుబాటులోకి కొత్త సేవలు వచ్చాయ్!
పాన్ కార్డు పొందాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అప్లై చేసుకుని, అంతే ఈజీగా పొందవచ్చు. ఎలా అంటారా? కేవలం ఆధార్ కార్డు (Aadhaar Card) ఉంటే చాలు, కొన్ని గంటల వ్యవధిలోనే మీరు పాన్ కార్డు పొందచ్చు. ఫినో పేమెంట్స్.. కొత్త సేవలు ఫినో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు కొన్ని గంటల్లో ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా కొత్త పాన్ కార్డ్‌ల డిజిటల్ వెర్షన్లను పొందవచ్చు. ఇందుకోసం ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రోటీన్ ఇగౌవ్ టెక్నాలజీస్ (ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పాన్ కార్డ్ జారీ సేవలను విస్తరించనున్నాయి. ఈ భాగస్వామ్య ఫలితంగా పేపర్‌లెస్ పాన్ కార్డ్ జారీ చేసే సేవలను ప్రారంభించిన మొదటి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 12.2 లక్షలకు పైగా మర్చంట్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఈ పాయింట్లు అన్నింటిలో పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. వినియోగదారులు ఎటువంటి పత్రాలను సమర్పించకుండా లేదా అప్లోడ్ చేయకుండా ఆధార్ ఆధారిత ధృవీకరణను ఉపయోగించి పాన్ కార్డ్ పొందవచ్చు. ఇందుకోసం ఫినో బ్యాంక్ పాయింట్లలో పాన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాన్ కార్డు సేవను ఎంచుకున్న వారికి కొన్ని గంటల వ్యవధిలో ఇపాన్ కార్డు మెయిల్ వస్తుంది. అదే ఫిజికల్ పాన్ కార్డు ఎంచుకుంటే 4 నుంచి 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఈ-పాన్ చట్టబద్ధమైన పాన్ కార్డ్‌గా అంగీకరించబడుతుంది. చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ! -
ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఆధార్.. యూఐడీఏఐ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: వ్యక్తిగత గుర్తింపు ఆధార్ విషయంలో.. ఆధార్ నిర్వహణ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’(యూఐడీఏఐ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఆధార్ వివరాలను ధృవీకరించుకున్నాకే.. ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా అంగీకరించాలంటూ సూచించింది. ఆధార్ లెటర్, ఇ-ఆధార్, ఆధార్ పీవీసీ కార్డ్, ఎం-ఆధార్.. ఇలా ఆధార్ ఏ రూపంలో అయినా సరే ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా తీసుకునే సమయంలో.. అందులో సమాచారం సరైందేనా? కాదా? అని ధృవీకరించాలని యూఐడీఏఐ పేర్కొంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.ఆధార్ వివరాలను ధృవీకరించుకునేందుకు క్యూఆర్ కోడ్లు, ఎం-ఆధార్ యాప్, ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉన్నాయని తెలిపింది. డెస్క్‌యాప్ వెర్షన్‌తో పాటు మొబైల్స్ ద్వారా ఈ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు సెప్టెంబర్‌లో ఆధార్ వివరాల దుర్వినియోగ కట్టడికి పలు కీలక సూచనలు పౌరుల కోసం జారీ చేసిన విషయాన్ని యూఐడీఏఐ గుర్తు చేసింది. అంతేకాదు.. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ దుర్వినియోగానికి ఆస్కారం ఉండదని తెలిపింది. అనైతిక, సంఘ వ్యతిరేక అంశాలను అడ్డుకున్నట్లు అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆధార్ వినియోగం సక్రమంగా జరుగుతుందని, నకిలీ ఆధార్ల కట్టడికి తోడ్పడుతుందని స్పస్టం చేసింది. ఆధార్ పత్రాలను ట్యాంపరింగ్ గనుక చేస్తే.. ఆధార్ యాక్ట్ సెక్షన్ 35 ప్రకారం శిక్షార్హమైన నేరమని, జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుందని తెలిపింది. అంతేకాదు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ సమర్పించేప్పుడు దానిని ధృవీకరించుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్రాలు తప్పనిసరి చేయాలంటూ యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: మీరు నోరు మూస్తారా? సుప్రీంలో ఏజీ అసహనం -
పదేళ్లకోసారి ‘ఆధార్’ అప్డేట్ చేయాల్సిందే
న్యూఢిల్లీ: ఆధార్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్ నంబర్ కలిగి ఉన్నవారు ఎన్రోల్మెంట్ తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్స్) కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల సీఐడీఆర్ డేటాబేస్‌లో ఆధార్‌కు సంబంధించిన సమాచారంలో కచ్చితత్వాన్ని కొనసాగింవచ్చని తెలియజేసింది. ఎన్రోల్మెంట్ జరిగాక ప్రతి పదేళ్లకోసారి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఆప్డేట్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. పదేళ్ల కంటే ఎక్కువ రోజుల క్రితం ఆధార్ కార్డు పొంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్డేట్ చేసుకోనివారు వెంటనే ఆ పూర్తి చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గత నెలలో విజ్ఞప్తి చేసింది. మై ఆధార్ పోర్టల్, మై ఆధార్ యాప్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో డాక్కుమెంట్లు సమర్పించి, వివరాలు ఆప్డేట్ చేసుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటిదాకా 134 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలను జారీ చేశారు. గుర్తింపు కార్డులు, చిరునామా మారినవారు కూడా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి, ఆధార్ కార్డుల్లో వివరాలు మార్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ నంబర్ కలిగి ఉండడం తప్పనిసరిగా మారింది. -
ఆధార్ తీసుకుని పదేళ్లు అయిందా? ఈ బిగ్ అప్డేట్ మీకోసమే
న్యూఢిల్లీ: ఆధార్‌కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) కీలక సూచన చేసింది. పదేళ్ల క్రితం ఆధార్ నంబర్ తీసుకున్న వారు వెంటనే తమ గుర్తింపు, నివాస రుజువులతో వివరాలను అప్డేట్ చేసుకోవాలని కోరింది. అప్డేషన్ను ఆన్లైన్లో మైఆధార్ పోర్టల్ నుంచి లేదా ఆధార్ సేవా కేంద్రాల నుంచి చేసుకోవచ్చని సూచించింది. పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని, తర్వాతి కాలంలో ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకోనివారు.. తమ తాజా వివరాలను అందించాలని కోరింది. ‘‘గత పదేళ్ల కాలంలో వ్యక్తుల గుర్తింపునకు ఆధార్ కీలకంగా మారింది. వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలకు ఆధార్ నంబర్‌ను వినియోగిస్తున్నారు. ఎటువంటి అవాంతరాల్లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను అందుకోవాలంటే, వ్యక్తులు తమ ఆధార్ డేటాను అప్డేట్ చేసుకోవాలి’’అని ఐఆర్డీఏఐ పేర్కొంది. -
పదేళ్లకోసారైనా ఆధార్ అప్డేట్!
సాక్షి, అమరావతి: మీరు ఆధార్ తీసుకొని పదేళ్లు పైనే అయ్యిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆధార్ కార్డులో మీ వివరాలను అప్డేట్ చేసుకోలేదా? అయితే, వీలైనంత త్వరగా ఆధార్ కార్డులో మీ తాజా ఫొటో, అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచిస్తోంది. ఇందుకు గాను ఆధార్ ఆన్లైన్ పోర్టల్‌లో ‘అప్డేట్ డాక్యుమెంట్’ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు ఇప్పుడు ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నా.. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే లావాదేవీలను నిలిపివేసే అవకాశముందంటూ వివిధ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం నాటి మన ఫొటోతో పాటు ప్రస్తుత చిరునామా.. ఆధార్‌లోని చిరునామా సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆధార్ పోర్టల్‌లో ‘అప్డేట్ డాక్యుమెంట్’ ద్వారా ఫొటో, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అవగాహన కలిగించి.. వివరాలు అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి.సంగీత ఇటీవల ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. రాష్ట్రంలో సచివాలయాల ద్వారా.. రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న ఆధార్ సేవల ద్వారా వీలైనంత త్వరగా అందరి ఆధార్ కార్డులను అప్డేట్ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్ల ద్వారా సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు దీని గురించి సమాచారమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,950 సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు అవగాహన కల్పించడంతో పాటు ఆధార్ కార్డులలో వారి వివరాలు అప్డేట్ చేసేందుకు సహకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యాలయం ఆదేశించింది. -
ఆధార్ కార్డ్‌లో ఆ అప్డేట్ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవండోయ్!
ఆధార్ కార్డ్.. ఇటీవల ప్రజలకు ఇది గుర్తింపు కార్డ్‌లా మాత్రమే కాకుండా జీవితంలో ఓ భాగమైందనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అకౌంట్ తెరవడం, పర్సనల్, ఇంటి రుణాల కోసం, సంక్షేమ పథకాల కోసం, ఉద్యోగం కోసం.. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితానే ఉంది. ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన బ్యాంక్, పాన్ కార్డ్‌లకు ఆధార్ కార్డ్‌ని అనుసంధానించిన తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందుకే ఈ కార్డులో ఏ తప్పులు లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కార్డుదారులు ఆఫర్లు, సర్వీస్‌లను, లేదా మొబైల్ పోయిన తరచూ ఫోన్ నెంబర్లను మారుస్తుంటారు. ఆ తర్వాత ఏదో పనిలో పని కొత్త నెంబర్‌ను ఆధార్‌లో అప్డేట్ చేయడం మరిచిపోతుంటారు. ఆపై భవిష్యత్తులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్ వంటితో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబందించిన వాటిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇబ్బందులు రాకుండా ఆధార్‌లో ఫోన్ నంబర్ ఈ విధంగా ఈజీగా అప్డేట్ చేసేయండి. 1: ముందుగా, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ లేదా మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని వెళ్లాల్సి ఉంటుంది. 2: ఆపై ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అధికారిక ఎగ్జిక్యూటివ్‌ని కలిసి అతని వద్ద నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంని తీసుకోవాలి. 3: ఎగ్జిక్యూటివ్‌కు ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంను నింపి, సమర్పించాలి. 4: ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ సమాచారం ద్వారా మీ వివరాలను ధృవీకరిస్తారు. 5: మీ కొత్త ఫోన్ నంబర్ వివరాలు, లేదా మీరు కోరిన విధంగా మార్పులు చేస్తాడు. 6: ఈ మార్పులను ఆధార్ అధికారిక సైట్లలో అప్డేట్ చేశాక, ఈ సేవకు రుసుము చెల్లించాలి. 7: మీరు సంబంధిత అధికారి నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పొందుతారు. ఆ స్లిప్‌లో ఒక అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉంటుంది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. చివరగా మీ ఫోన్ నంబర్ అప్డేట్ లేదా మీ వివరాలు అప్డేట్ అయిన తర్వాత, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ నుంచి ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆపై రుసుము చెల్లించి ఆధార్ కార్డ్ PVC ప్రింట్‌ను కూడా ఆర్డర్ చేయవచ్చు. చదవండి: దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు! -
బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు!
దేశంలో ఆధార్ అనేది సామాన్యుని గుర్తింపుగా ప్రాచుర్యం పొందింది. గత 8 సంవత్సరాలుగా ఆధార్ భారతీయులకు గుర్తింపు పరంగా ముఖ్యంగా మారిందనే చెప్పాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించగా తాజాగా ఈ గుర్తింపు కార్డ్ నిబంధనల్లో మార్పులు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రజలు.. ఆధార్‌లో వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్డేట్ చేసుకోవాలనే రూల్స్ రావొచ్చని నివేదికలు చెప్తున్నాయి. సమాచారం ప్రకారం.. ఆధార్ కార్డు దారులు వారి ఫేస్, ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ డేటాను ప్రతీ 10 ఏళ్లకు అప్డేట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుందట. అయితే ఇందులో 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం, ఐదు నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటే.. వాళ్లు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్‌లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లకు లోపు ఉన్న పిల్లలకు వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు లేనిపక్షంలో వారి సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా ఆ పిల్లలకు ఆధార్ జారీ చేస్తున్నారు. UIDAI తాజాగా గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడానికి రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ఎందుకంటే ఇది నకిలీ లబ్ధిదారులను తొలగించడంతో పాటు, నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తుంది. దీంతో ప్రజల డబ్బును ఆదా చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. చదవండి: మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం.. -
పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్‌గా ‘టెంపరరీ’ ఆధార్!
సాక్షి, న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ).. ఇక నుంచి జననం నుంచి మరణం దాకా మొత్తం జీవిత చక్ర సమాచారాన్ని ‘ఆధార్’తో నిక్షిప్తం చేయనుంది. ఇందులో భాగంగా.. రాబోయే రోజుల్లో బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ల పేరిట ఆటోమేటిక్‌గా టెంపరరీ ఆధార్ జారీ చేయనున్నట్లు సమాచారం. పుట్టిన వెంటనే ఆధార్ నెంబర్ పొందే చిన్నారులు.. మేజర్లు అయిన తర్వాత వేలిముద్రలతో ఆ ఆధార్‌ను అప్ డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు.. త్వరలోనే రెండు పైలట్ కార్యక్రమాలను మొదలుపెట్టనుంది కేంద్రం. ఇందులో భాగంగానే.. యూఐడీఏఐ తరపున తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2010లో ఆధార్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా పెద్దలు అందరికీ ఆధార్ జారీ అయింది. ఇక మీదట జన్మించిన దగ్గర్నుంచి, మరణించే వరకు వ్యక్తులకు సంబంధించి అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే యోచనతో యూఐడీఏఐ ఉంది. కారణం? మరణ రికార్డులతోనూ ఆధార్ డేటాను అనుసంధానించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ఉద్దేశ్యం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి.. మరణించిన వారి వివరాలు వెంటనే ఆధార్ డేటా బేస్ లోకి చేరేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది. ‘‘ఇటీవల మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడంతో వారి పేరిట పెన్షన్.. ఇంకా ఆటోమేటిక్‌గా జమ అవుతోంది’’ అని సదరు అధికారి తెలిపారు. అలాగే, ఒకే వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండేలా యూఐడీఏఐ చర్యలు తీసుకుంటోంది. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఐడీఏఐ సంస్థ ఆధార్ ఆధారిత సేవల్ని వినియోగదారులకు ఇంటి వద్ద నుంచి అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డ్‌లో కాంటాక్ట్ నెంబర్‌ను యాడ్ చేయాలన్నా, లేదంటే పిల్లల పేర్లు జత చేయాలన్నా, ఇతర వ్యక్తిగత వివరాల్ని పొందుపరచలన్నా ఆధార్ సెంటర్‌కు ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చేది. ఒక్కోసారి వ్యయప్రాయాసలు గూర్చి ఆధార్ సెంటర్‌కు వెళ్లినా భారీ క్యూలు, సర్వర్ సమస్యలతో వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి నెలకొనేది. ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా యూఐడీఏఐ డోర్-టూ- డోర్ ఆధార్ సర్వీస్ సేవల్ని అందించాలని భావిస్తుంది. అదే జరిగితే ఆధార్ సెంటర్‌కు వెళ్లే అవసరం తీరిపోనుంది. 48000 పోస్ట్ మెన్లు వినియోగదారులకు ఇంటి వద్ద నుంచే, ప్రత్యేకంగా రిమోట్ ఏరియాల్లో ఆధార్ సేవల్ని అందించేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం పోస్టాఫీస్‌కు సంబంధించిన 48వేల మంది పోస్ట్ మెన్లకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 1.5లక్షల మందికి పైగా అదే సమయంలో 2 దశల్లో 1.5లక్షల మందికి పైగా ఆధార్ డిజిటల్ ఎక్విప్మెంట్ ల్యాప్ ట్యాప్ బేస్డ్ ఆధార్ కిట్లపై ట్రైనింగ్ ఇవ్వనుంది. 13వేల మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి చెందిన 13వేల మంది ఉద్యోగులు సైతం ఆధార్ సేవల్ని అందించనున్నారు. 773జిల్లాల్లో ఏప్రిల్ 4,2022 వీకీపిడియా లెక్కల ప్రకారం..మనదేశంలో ఉన్న మొత్తం 773జిల్లాల్లో ఆధార్ సేవా కేంద్రాల్ని ఏర్పాడు చేయాలని యూఐడీఏఐ భావిస్తోంది. తద్వారా వినియోగదారులు తమ సేవల్ని సత్వరమే ఉపయోగించుకోవచ్చని అంచనా వేస్తోంది. -
ఇంటింటికీ ఆధార్ సేవలు!
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పోస్టమెన్‌ను వినియోగించుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఇండియాపోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48 వేల మంది పోస్ట్మెన్ను రంగంలోకి దించనుంది. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవడం, ఆధార్‌తో సెల్‌ఫోన్ నంబర్లను లింక్ చేయడం, వివరాలను అప్డేట్ చేయడం వంటి సేవలు అందించనున్నారు. రెండో దశ ప్రణాళికలో భాగంగా 1.50లక్షల మంది తపాలా శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వాములను చేయనుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల వారితోపాటు, సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులకు ఆధార్‌ను అందజేయడమే యూఐడీఏఐ లక్ష్యమన్నారు. ఇంటింటికీ వెళ్లే పోస్ట్‌మెన్ ఆధార్ వివరాలను అక్కడికక్కడే అప్డేట్ చేసేందుకు వీలుగా ట్యాబ్లెట్ పీసీ/ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని తెలిపారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 13వేల మంది కామన్ సర్వీస్ సెంటర్ల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఇందులో భాగంగా చేస్తామన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా 755 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి రోజూ ఆన్లైన్ ద్వారా కనీసం 50వేల మంది చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను అప్డేట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికీ 12 అంకెల బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య ఆధార్‌ను అందించేందుకు యూఐడీఏఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. -
క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని ఫోన్.. ఆధార్ వివరాలు చెప్పినందుకు
ఉద్యోగి అయిన మహిజకు క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందని, కార్డ్‌ని మళ్లీ పంపించేందుకు వివరాలు అవసరమని ఫోన్ కాలర్ చెప్పింది. ఫోన్లో ఆధార్ నెంబర్, ఇతర వివరాలనూ పంచుకున్న మహిజ మరుసటి రోజు తన క్రెడిట్‌కార్డ్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్టు గమనించింది. స్కామర్లు మీ ఆధార్‌ను యాక్సెస్ చేయకుండా అడ్డుకట్ట వేయాలంటే... మీకు అందుకు తగిన సమాచారమూ తెలిసి ఉండాలి. మోసగాళ్లు బ్యాంక్ ఖాతాదారుల డబ్బు స్వాహా చేసినందుకు వారి ఆధార్ నంబర్లను రాబట్టేందుకు మభ్యపెట్టడంలో ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టరు. మీ ఆధార్ నంబర్ లేదా OTP లేదా పాస్వర్డ్ కోసం బ్యాంక్ అధికారులమని చెప్పుకునే వ్యక్తులు మీకు ఎప్పుడైనా కాల్ చేసినట్లయితే, వారు మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్న స్కామ్‌స్టర్ అయ్యే అవకాశం ఉంది. 1) మొబైల్/ఇ–మెయిల్ నమోదు ఇటీవలి కాలంలో ఆధార్ వల్ల మీ వివరాలను మార్చడం సులభం అయ్యింది. ఆధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్ లేదా ఇ–మెయిల్ ఐఈకి వన్ టైమ్ పాస్వర్డ్ (OTP )తో ప్రక్రియలో ఎలాంటి జాప్యం కూడా ఉండటం లేదు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు మీ ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా మీ మొబైల్ నంబర్‌ను మార్చుకున్నా, ఇతరులు మీ వివరాలతో మిమ్మల్నే మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మీ ఆధార్ కార్డ్‌ను అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. 2) ఆధార్ బయోమెట్రిక్స్ లాకింగ్ ఐరిస్ స్కాన్లు, వేలిముద్రలు, ఫోటోగ్రాఫ్‌లు వంటి బయోమెట్రిక్‌లు ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యాయి. ఈ అంశంలో మోసం చేయడం చాలా కష్టమైనప్పటికీ, వ్యక్తి బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి వేలిముద్రలను నకిలీ చేసిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బయోమెట్రిక్ లాకింగ్ ఆప్షన్‌తో ఆధార్ బయటకు వచ్చింది. UIDAI దాని కార్డ్ హోల్డర్లకు బయోమెట్రిక్‌ను లాక్ చేసి ఉంచాలని సలహా ఇస్తుంది. దీన్ని వెబ్సైట్ లేదా mAadhaar యాప్ ద్వారా చేయవచ్చు. 3) మాస్క్డ్ ఆధార్, వర్చువల్ ID (VID) eKYC సేవను నిర్వహించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆధార్ నంబర్ స్థానంలో 16 అంకెల సంఖ్యను వాడచ్చు. అప్పుడు వర్చువల్ ట్రాన్స్యాక్షన్స్కి మీ ఆధార్ నంబర్‌ను జత చేయాల్సిన అవసరం పడదు. 4) రెగ్యులర్‌గా తనిఖీ మీ ఆధార్ ధ్రువీకరణకు UIDAI పోర్టల్‌కి వెళ్లి, ప్రామాణీకరణను తనిఖీ చేయాలి. మీ భద్రత– సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి UIDAI ప్రవేశపెడుతున్న కొత్త విధానాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో మరొక ఆధార్ కార్డ్‌ని పొందవచ్చు. ఆన్లైన్లో ఇది సాధారణంగా మూడు దశల ప్రక్రియలో ఉంటుంది. మూడు దశల ప్రక్రియ దశ 1: అధికారిక UIDAI పోర్టల్‌కి వెళ్లి, వెబ్సైట్లో కుడివైపు ఎగువన, డ్రాప్‌డౌన్ మెనూ నుండి "My Aadhaar' ను ఎంచుకోవాలి. దశ 2: ఆధార్ నంబర్ని ధ్రువీకరించాలి. ఎంపికను ఎంచుకొని, మీరు దీన్ని ‘ఆధార్ సర్వీసెస్’ విభాగంలో కనుక్కోవాలి. దశ 3: ఇది మిమ్మల్ని కొత్త పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు క్యాప్చాతో పాటు 12అంకెల ఆధార్ నంబర్(UDI)ని నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని నమోదు చేసిన తర్వాత, దిగువన ఉన్న ‘ధ్రువీకరణకు’ బటన్‌ను క్లిక్ చేయాలి. ఇది మీకు మరో ఆధార్ కార్డ్ చెల్లుబాటు స్థితిని సూచించే పేజీని చూపుతుంది. ఈ కార్డును eKYcకే ఉపయోగిస్తారు. ఆధార్ స్కామ్‌ల బారిన పడకుండా... ►మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం.. ఫోన్ ద్వారా ఆధార్ కార్డ్, ఇతర వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలి. ►భారతదేశంలో ఆధార్ కార్డుకు సంబంధించిన మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అమాయకుల నుండి డబ్బును స్వాహా చేసేందుకు స్కామ్స్టర్లు కొత్త, వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఆధార్ స్కామ్‌ల కారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. ►ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్స్ (AIBOC) మాజీ జనరల్ సెక్రటరీ డి థామస్ ఫ్రాంకో వాట్సాప్‌లోని బ్యాంకింగ్ గ్రూప్‌లో సంభాషణ రూపంలో ఈ హెచ్చరిక వచ్చింది, ఇందులో ఒక అమాయక ఆధార్ కార్డ్ హోల్డర్ తన మొత్తాన్ని వదులుకోవడానికి మోసగించిన సంఘటనలను వివరించాడు. బ్యాంకు అధికారిగా నటిస్తున్న స్కామ్స్టర్ల ద్వారా ఖాతాదారుల డబ్బు లావాదేవీలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారని స్పష్టం చేశారు. ►కిందటేడాది డిసెంబర్ 21న జరిగిన ఒక సంఘటనలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌గా నటిస్తున్న వ్యక్తి నుండి డాక్టర్ లాల్మోహన్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అతని ఆధార్ నంబర్ కోసం డాక్టర్ లాల్మోహన్ను అడిగి, మొదట రూ. 5,000 ఆ పై రూ. 20,000 బదిలీ చేశాడు. అతని ఖాతా బ్లాక్ చేసిన తర్వాత కూడా నగదు బదిలీలు జరిగాయి. డాక్టర్ లాల్మోహన్ తన పాస్‌వర్డ్‌ను ఎవరికీ చెప్పనప్పటికీ, స్కామ్స్టర్లు అతని ఆధార్ నంబర్‌ను ఉపయోగించి పాస్వర్డ్ లేదా OTP అవసరం లేకుండా ►నేరుగా అతని బ్యాంక్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసినట్లు తేలింది. మీకు అనుమానంగా ఉంటే వెంటనే ఖాతాతో లింక్ చేయబడిన ఆధార్‌ను డీ లింక్ చేయమని వెంటనే బ్యాంక్‌ని అడగాలి. మీ ఆధార్ నంబర్, పాస్వర్డ్ లేదా ఏదైనా బ్యాంకింగ్ వివరాలను ఫోన్లో ఎవరితోనూ పంచుకోవద్దు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
Masked Aadhaar Card: ఆధార్ కార్డు వాడకంపై కేంద్రం కీలక సూచన
దేశంలో ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది. ముందు జాగ్రత్త కోసమే ఇలా సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకే ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్డ్ కాపీలను మాత్రమే చూపించాలని స్పష్టం చేసింది. మాస్క్డ్ ఆధార్ కాపీ అంటే.. భారత పౌరుల సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్లైన్లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి మార్పులు చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనినే మాస్క్ ఆధార్ కార్డ్ అని చెబుతున్నారు. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్‌లో మొదటి ఎనిమిది అంకెలు ****-**** గా కనిపిస్తాయి. దీంతో, మాస్క్డ్ ఆధార్ కార్డు.. ఒరిజినల్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది. మాస్క్డ్ ఆధార్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. 1. https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి, 'డౌన్లోడ్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి. 2. మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. 3. మాస్క్డ్ ఆధార్ కావాలి.. అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 4. ధృవీకరణ కోసం అందించబడే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. 5. ‘Send OTP’పై క్లిక్ చేయండి. 6. ఇ-ఆధార్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత PDF కాపీని డౌన్లోడ్ చేసుకోండి. 7. ఆధార్ PDF పాస్వర్డ్ 8 అక్షరాలలో ఉంటుంది.(మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (ఆధార్‌లో ఉన్నట్లు) క్యాపిటల్ అక్షరాలు, YYYY ఆకృతిలో పుట్టిన సంవత్సరంతో ఎంటర్ చేయాలి.) In order to prevent misuse, the central government has asked citizens to share only masked versions of their #Aadhaar cards. Unlicensed private entities are like hotels etc are not allowed to collect or keep copies of Aadhaar card, as par the Ministry of Electronics & IT. pic.twitter.com/QQIvI4y3wi — NIRUPAM ACHARJEE 🇮🇳 (@NirupamAcharjee) May 29, 2022 -
ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎన్ని సార్లు మార్చవచ్చో తెలుసా?
ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు, ఇతర పత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మన దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇది ఒక గుర్తింపు రుజువు పత్రంగా పనిచేస్తుంది. ఇందులో పౌరుల సమాచారం బయోమెట్రిక్ రూపంలో ఉంటుంది. ఇలాంటి, ఆధార్ కార్డులో మన వివరాలు సరిగా ఉండాలి. లేకపోతే గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, స్కాలర్ షిప్, వివిద పథకాలకు అనర్హులం అవుతాము. ప్రజల కష్టాలను గుర్తించిన యుఐడీఏఐ తమ చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటి విషయాలతో పాటు ఇతర వివరాలను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే, మీ ఆధార్ కార్డులో వివరాలను మార్చడానికి కొన్ని షరతులు పెట్టింది. ఎప్పుడు పడితే అప్పుడు ఆధార్ వివరాలను మార్చకుండా ఉండటానికి కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ పై ఉన్న పేరును ఎన్నిసార్లు మార్చవచ్చు? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఒక యూజర్ ఆధార్ కార్డుపై తమ పేరును జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. అంతకన్న ఎక్కువ సార్లు, మార్చుకునే అవకాశం లేదు. ఆధార్ పై పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చవచ్చు? యుఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం.. ఆధార్ కార్డుపై మీ పుట్టిన తేదీని ఎన్నడూ మార్చలేమని గుర్తుంచుకోవాలి. డేటా ఎంట్రీ సమయంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే పుట్టిన తేదీని మార్చడానికి గల ఏకైక మార్గం. ఆధార్ పై చిరునామా, లింగాన్ని ఎన్నిసార్లు మార్చవచ్చు? యుఐడిఎఐ మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డుపై చిరునామాను, లింగాన్ని ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు. ఆధార్ కార్డులో పేరు, లింగం లేదా పుట్టిన తేదీని పరిమితికి మించి మార్పులు చేయాలనుకుంటే ఆధార్ కార్డుదారుడు యుఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఈ వివరాలను మార్చడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. (చదవండి: ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్డేట్ చేయండి?) -
ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు?
ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ భారీ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది. అలాంటి పీవీసీ కార్డ్‌లు ఎలాంటి సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉండవని తెలిపింది. కాబట్టి మీరు ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డ్‌ని తీసుకోకండి. అలాగే, పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించి ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్లో పేర్కొంది. ఆర్డర్ కోసం ఒక లింక్ కూడా యుఐడీఏఐ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. #AadhaarEssentials We strongly discourage the use of PVC Aadhaar copies from the open market as they do not carry any security features. You may order Aadhaar PVC Card by paying Rs 50/-(inclusive of GST & Speed post charges). To place your order click on:https://t.co/AekiDvNKUm pic.twitter.com/Kye1TJ4c7n — Aadhaar (@UIDAI) January 18, 2022 ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి? పీవీసీ ఆధారిత ఆధార్ కార్డు అనేక భద్రతలతో కూడిన ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ వివరాలతో డిజిటల్‌గా సంతకం చేసిన సురక్షిత క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. ఈ కార్డు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. దీనిన్ నీటిలో వేసిన కూడా తడవదు. ఆధార్ పీవీసీ కార్డును మీరు పేర్కొన్న చిరునామాకు ఫాస్ట్ పోస్ట్ ద్వారా సరఫరా చేస్తుంది. పీవీసీ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? యూఐడీఏఐ వెబ్సైట్(https://myaadhaar.uidai.gov.in/) ఓపెన్ చేసి అందులో లాగిన్ అవ్వండి 'ఆర్డర్ ది పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రెస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. (చదవండి: అయ్యో పాపం! రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాది) -
మీ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంక్ ఖాతాలకు లింకు అయ్యిందో తెలుసుకోండిలా..!
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాల్సిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆధార్ కార్డు కేవలం ఒక ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. కొద్దీ రోజుల క్రితం ఎస్బీఐ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఖాతాలకు ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్బీఐ కోరింది. ఈ కరోనా మహమ్మరి సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక కొత్త సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త సేవలనును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సర్విస్ ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంకు ఖాతాలకు లింక్ చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ(https://uidai.gov.in/) వెబ్సైట్ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంక్ ఖాతాలకు లింక్ అయిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ స్టేటస్: ముందుగా యూఐడిఏఐ https://uidai.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత హోమ్ పేజీలో 'ఆధార్ సర్వీసెస్' పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కనిపించే "చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్" పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి "సెండ్ ఓటీపీ" పైన క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి "సబ్మిట్" పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. (చదవండి: ఫ్రీగా మీ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోండి ఇలా..!) -
‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...!
UIDAI To Work With World Bank UN To Globalise Aadhaar Model: యుఐడీఏఐ రూపొందించిన ఆధార్ కార్డు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ గుర్తింపు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకుగాను ఆధార్ కార్డు లాంటి మోడల్‌ను ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితితో కలిసి యూఐడీఏఐ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూఐడీఏఐ యూనివర్సల్ గ్లోబల్ ఐడెంటిటీ సిస్టమ్‌పై చురుగ్గా పనిచేస్తోందని సంస్థ పేర్కొంది. ఆధార్‌పై ఇతర దేశాలు ఆసక్తి..! ఆసియా దేశాలతో పాటుగా, ఇతర దేశాలు కూడా ఆధార్ మోడల్ గురించి తెలుసుకున్నాయని యూఐడీఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ అన్నారు.కొన్ని దేశాలు ఇప్పటికే సంస్థ ఉపయోగించిన మోడల్ అనుసరించినట్లు తెలిపారు. ఆధార్‌లాంటి మోడల్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయని సౌరభ్ వెల్లడించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్‌లో సౌరభ్ గార్గ్ ప్రసంగిస్తూ...ఆధార్ ఆర్కిటెక్చర్‌ను ప్రతిబింబించేలా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. దేశ జనాభాలో 99.5 శాతం మందికి ఆధార్ కార్డు ఉందని తెలిపారు. పలు ఆర్థిక సేవలకు ఆధార్ కీలక అంశం పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. దాంతోపాటుగా భద్రతా ముప్పు సమస్యపై కూడా చర్చించారు. ఆధార్ డిజైన్ అనేది అంతర్నిర్మిత గోప్యతతో కూడిన ఆర్కిటెక్చర్. యూఐడీఏఐ సమ్మతి ద్వారా మాత్రమే ఆధార్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తామని అన్నారు. అంతేకాకుండా భద్రత విషయంలో ఏలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ఆధార్ డేటా సిస్టమ్ భద్రత చాలా ముఖ్యమైనదని గార్గ్ చెప్పారు. ఇట్టే పసిగడతాయి..! ఆధార్ డేటా సెంటర్లు సమాచారాన్ని వేరుగా ఉంచుతాయని, సురక్షితమైన స్నేహపూర్వక యంత్రాంగాల ద్వారా మాత్రమే ఆధార్‌ను యాక్సెస్ అవుతుంది. 24X7 పాటు నడిచే యూఐడీఏఐ సెక్యూరిటీ కేంద్రాల సహాయంతో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఇట్టే పసిగడతాయి. చదవండి: ఆండ్రాయిడ్‌లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....! -
‘ఆధార్‌పై ఆంక్షలు పెడితే.. అసలుకే ఎసరు’
న్యూఢిల్లీ: గోప్యతను కాపాడే పేరుతో ఆధార్ వినియోగంపై విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ ఆంక్షలు విధించడం సరికాదని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ విమర్శించారు. దీని వల్ల నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకుండా పోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డేటా వాల్ట్ అనేది.. ఆధార్ ప్రధాన లక్ష్యాల సాధనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని యూఐడీఏఐ తొలి డైరెక్టర్ జనరల్ అయిన శర్మ పేర్కొన్నారు. అధీకృత ఏజెన్సీలు అన్నీ సేకరించిన ఆధార్ నంబర్లు అన్నింటినీ కేంద్రీకృతంగా భద్రపర్చేందుకు డేటా వాల్ట్ అనే కాన్సెప్టును యూఐడీఏఐ ఇటీవల ప్రకటించింది. ఆయా సంస్థల వ్యవస్థల్లో ఆధార్ నంబర్లు నిక్షిప్తమై ఉండిపోకుండా, అనధికారికంగా ఇతరుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. మరోవైపు, వ్యక్తుల గుర్తింపును ధృవీకరించేందుకు స్మార్ట్ఫోన్లను ’యూనివర్సల్ ఆథెంటికేటర్లు’గా వినియోగంలోకి తేవడంపై కసరత్తు చేస్తున్నట్లు యూఐడీఏఐ సీఈవో సౌరభ్ గర్గ్ తెలిపారు. అయితే, దీన్ని ఏ విధంగా అమల్లోకి తేనున్నది వెల్లడించలేదు. ప్రస్తుతం వేలిముద్రలు, ఐరిస్, వన్–టైమ్ పాస్‌వర్డ్‌ను ధృవీకరణకు ఉపయోగిస్తున్నారు. చదవండి: ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త, ఆధార్ నెంబర్‌తో మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు -
ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారులకు తీపికబురు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) దేశవ్యాప్తంగా కొత్తగా మరో 166 ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా యూఐడీఏఐ విడుదల చేసింది. ప్రస్తుతానికి దేశంలో ఉన్న 166 ఆధార్ సేవా కేంద్రాల్లో 55 మాత్రమే తెరిచి ఉన్నాయి. అంతేగాకుండా, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 52,000 ఆధార్ ఎన్ రోల్ మెంట్ కేంద్రాలను నడుపుతున్నాయి. యుఐడీఏఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 122 ప్రదేశాలలో 166 ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్లను ప్రారంభించాలని భావిస్తోంది. ఇప్పటికే దేశంలో ఉన్న ఆధార్ కేంద్రాలు వికలాంగులతో సహ 70 లక్షల మందికి సేవలందించాయి. మోడల్ ఏలోని ఆధార్ సేవా కేంద్రాలు రోజుకు 1,000 అభ్యర్థనలను మాత్రమే హ్యాండిల్ చేయగలవు. అదే సమయంలో, మోడల్-బి కేంద్రాలు-500, మోడల్-సీ కేంద్రాలు 250 అభ్యర్థనలను మాత్రమే స్వీకరిస్తాయి. (చదవండి: Paytm ఢమాల్.. రెండు రోజుల్లో పదివేల కోట్ల లాస్!) యుఐడీఏఐ ఇప్పటి వరకు 130.9 కోట్ల మందికి ఆధార్ నంబర్లను జారీ చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు, ఆఫీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, యూఐడీఏఐ ఆపరేటెడ్ ఆధార్ సర్వీస్ సెంటర్లలో మాత్రమే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాలను సరిచేయడం, ఫోటోను అప్ డేట్ చేయడం, పీవీసీ కార్డుకు అప్లై చేసుకోవడం వంటి ఇతర సేవలు ఇక్కడ లభిస్తాయి. (చదవండి: రేయ్.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా?) -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త, ఆధార్ నెంబర్‌తో మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు
ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరు ఆధార్ కార్డ్ నెంబర్‌తో భీమ్ యూపీఐ ద్వారా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కరోనా కారణంగా మనదేశంలో ఆన్లైన్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కాలేజీ ఫీజుల నుంచి కిరాణా స్టోర్లలో కొనుగోలు చేసే నిత్యవసర సరుకుల పేమెంట్స్ వరకు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అయితే ఈ సదుపాయం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల ఫోన్లకు మాత్రమే ఉంది. ఉదాహరణకు, స్మార్ట్‌ఫోన్ లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) అడ్రస్‌లేని వారికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కష్టంగా మారింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి, 'భీమ్' (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ)ని ఉపయోగించే వ్యక్తులు ఫోన్ లేదా, యూపీఐ అడ్రస్ లేని వారికి ఆధార్ నెంబర్ని ఉపయోగించి డబ్బు పంపవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (uidai) వెల్లడించింది. భీమ్ అనేది యూపీఐ (Unified Payment Interface-UPI) ఆధారిత యాప్. ఇందులో మొబైల్ నంబర్, పేరుతో మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే యూఐడీఏఐ ప్రకారం.. ఇకపై భీమ్ యాప్‌లో లబ్ధి దారుల అడ్రస్ విభాగంగాలో ఆధార్ నెంబర్‌ను ఉపయోగించి మనీని సెండ్ చేయొచ్చు. భీమ్‌లోని లబ్ధిదారుల చిరునామాలో ఆధార్ నంబర్ని ఉపయోగించి డబ్బు పంపే ఆప్షన్ కనిపిస్తుంది. భీమ్‌లో ఆధార్ నంబర్ని ఉపయోగించి డబ్బు ఎలా పంపాలి? ►భీమ్‌లో ఆధార్ నంబర్ని ఉపయోగించి లబ్ధిదారుని 12 అంకెల ప్రత్యేక ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. ►దీని తర్వాత, సిస్టమ్ ఆధార్ లింకింగ్, లబ్ధిదారుల చిరునామాను ధృవీకరిస్తుంది. యూఐడీఏఐ అందించిన సమాచారం ప్రకారం వినియోగదారుడు నగదును పంపొచ్చు. అలా పంపిన నగదు లబ్ధి దారుడి అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతుంది ►అలాగే, చెల్లింపులను స్వీకరించడానికి ఆధార్ పే పీఓఎస్ని ఉపయోగించే వ్యాపారులకు డిజిటల్ చెల్లింపు చేయడానికి ఆధార్ నంబర్,వేలిముద్రను ఉపయోగించాలి. ►ఒకవేళ, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉండి, ఆ అకౌంట్లకు ఆధార్‌తో లింక్ చేయబడితే, అటువంటి పరిస్థితిలో అన్ని అకౌంట్లను డబ్బుల్ని సెండ్ చేయొచ్చని యూఐడీఏఐ తెలిపింది. చదవండి: గూగుల్ అదిరిపోయే ఫీచర్, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..! -
ఆధార్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై భారీ జరిమానా!
న్యూఢిల్లీ: ఆధార్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) చేతికి కేంద్రం బ్రహ్మాస్త్రాన్ని అందించింది. ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ ఆధార్ చట్టం ఆమోదించిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కోటి రూపాయల జరిమానా విధించడానికి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు వీలు కల్పించే విధంగా నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమనిబంధనల ప్రకారం.. యూఐడీఏఐ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవచ్చు. న్యాయనిర్ణేత అధికారులకు ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలు/వ్యక్తులపై విచారణ జరిపి రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశాన్ని కల్పించింది. న్యాయనిర్ణేత అధికారులు ఇచ్చిన తీర్పుపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే సదరు సంస్థలు టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించవచ్చు. ఈ నిబంధనలను తీసుకొనిరావడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఇతర శాసనాల (సవరణ) బిల్లు, 2019కి ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాలను అమలు చేయడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి రెగ్యులేటర్‌తో సమానమైన అధికారాలు లభించాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్ల డేటకు మరింత రక్షణ లభిస్తుంది. (చదవండి: డేంజరస్ సేల్స్.. ఆర్జీవీనా మజాకా ! మూవీ బిజినెస్‌లో మరో యాంగిల్) -
ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి!
మన దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రాముఖ్యత గురుంచి మన అందరికీ తెలిసిందే. పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న మనకు ఆధార్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, చిత్రం, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ అనేక సేవలను ఆన్ లైన్ చేసింది. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేయాలి అనుకుంటే యూఐడీఏఐ పోర్టల్ ద్వారా మీ చిరునామాలో మార్పు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆధార్ అడ్రస్ మార్చుకోవడం మీకు కష్టమని భావిస్తే.. ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ప్రూఫ్ డాక్యుమెంట్ తీసుకెలితే సరిపోతుంది. అయితే, ఈ అప్ డేట్ కోసం రూ.50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. చిరునామా అప్ డేట్ కోసం పాస్ పోర్ట్, బ్యాంక్ స్టేట్ మెంట్/పాస్ బుక్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్ మెంట్/పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు/వాటర్ బిల్లు/టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్లు/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్/గ్యాస్ కనెక్షన్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు అవసరం. (చదవండి: Xiaomi: షావోమీ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ..! ఎప్పుడు వస్తాయంటే..?) ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ చేసే విధానం : మొదట ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మై ఆధార్ సెక్షన్లోకి వెళ్లాలి. ఇందులో అప్డేట్ యువర్ ఆధార్ అనే ట్యాబ్ ఉంటుంది. అప్డేట్ యువర్ ఆధార్ అడ్రస్ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రూఫ్ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. -
ఏటీఎం కార్డు లాంటి ఆధార్.. అప్లై ఇలా!
ఆధార్ కార్డుకు కొత్త రూపునిస్తోంది యూఐడీఏఐ. 2021లో సరికొత్తగా పీవీసీ ఆధార్‌ను ప్రవేశపెట్టింది. ఇది వరకు ప్రింట్ వెర్షన్లో 'పేపర్' ఆధార్ కార్డు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇకపై ఏటీఎం కార్డుల మాదిరిగా పీవీసీ ఆధార్లను జారీ చేయనుంది. కేవలం రూ.50 చెల్లించి ఈ పీవీసీ కార్డును పొందవచ్చు. కార్డులో పేర్కొన్న ఇంటి వద్దకే పీవీసీ ఆధార్ కార్డును డెలివరీ చేయనుంది. అయితే, దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: గూగుల్ పేలో ఆ సేవలు కష్టమే..!) పీవీసీ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాం. యూఐడీఏఐ వెబ్సైట్(https://myaadhaar.uidai.gov.in/)కి వెళ్లి లాగిన్ అవ్వండి 'ఆర్డర్ ది పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రెస్‌కు పీవీసీ కార్డు వచ్చేస్తుంది. -
మీ ఆధార్ కార్డు ఒరిజినలేనా? ఇలా చెక్ చేస్కోండి
నకిలీ వ్యవహారాలు మామూలు జనాలకు పెద్ద ఇబ్బందులే తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీదానికి ముడిపడి ఉన్న ఆధార్ విషయంలోనూ ఫేక్ కుంభకోణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఆధార్ తీసుకుంటున్నవాళ్లు, లేదంటే మధ్యవర్తి ద్వారా కార్డులు సంపాదించుకుంటున్న వాళ్లు.. తమ 12 డిజిట్ నెంబర్లను ఆధార్ నెంబర్‌గా ఫిక్స్ అయిపోయి అన్నిచోట్లా సమర్పిస్తుంటారు. అయితే ఈ విషయంలో యూఐడీఏఐ ప్రజల కోసం ఓ అలర్ట్‌ను జారీ చేసింది. Aadhar Card Alert: ఆధార్‌ను ఎక్కడైనా సమర్పించే ముందు అసలేనా? నకిలీనా? ఒక్కసారి తనిఖీ చేస్కోమని చెప్తోంది. లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతోంది. ఇందుకోసం resident.uidai.gov.in/verify లింక్‌కు వెళ్లాలి. ఆపై కార్డుపై ఉన్న 12 అంకెల డిజిట్‌ను ఎంటర్ చేయాలి. కింద ఉన్న సెక్యూరిటీ కోడ్ లేదంటే క్యాప్చాను క్లిక్ చేసి వెరిఫై కొట్టాలి. అప్పుడు ఆ ఆధార్ నెంబర్ ఒరిజినలేనా? అసలు ఉందా? అనే వివరాలు కనిపిస్తాయి. చాలామంది ఆధార్ అప్డేట్స్, మార్పుల విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. కానీ, చిన్న చిన్న మార్పులు, సవరణల కోసం ఆన్లైన్లోనే వెసులుబాటు కల్పిస్తోంది యూఐడీఏఐ. ఇక అప్డేషన్, మొత్తంగా మార్పుల కోసం మాత్రం తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. ► ఆధార్ కార్డ్‌పై అడ్రస్ సవరణ కోసం ఆన్లైన్లో వెసులుబాటు కల్పించింది యూఐడీఏఐ ► అడ్రస్ మార్పు కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ అంటే.. దగ్గర్లోని ఆధార్ సెంటర్ ఈ సౌకర్యం కల్పిస్తోంది. సవరించడం ఎలాగో తెలుసా? ► ఫొటో మార్చుకోవడానికి కూడా రీజియన్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషాల్లో ఫొటో మార్చుకోవచ్చు ఇలా ► ఆధార్ కార్డు మీద పేరును రెండు సార్లు మార్చుకోవడానికి వీలుంటుంది. ► డేట్ ఆఫ్ బర్త్, జెండర్(ఆడ/మగ/ట్రాన్స్‌జెండర్) ఒక్కసారే మారతాయి. పుట్టినతేదీ మార్చుకోవాలా? ► జెండర్ మార్పునకు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ► మొబైల్ నెంబర్‌కు తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. లేదంటే మార్పులేవీ జరగవు. క్లిక్ చేయండి: ఇంట్లో నుండే ఆధార్ అప్డేట్ చేసుకోండి ఇలా! ► ఒకవేళ మొబైల్ నెంబర్ వేరే వాళ్లది ఉన్నా.. పాత నెంబర్‌ను మార్చుకోవాలనుకున్నా అప్డేట్ చేసుకోవచ్చు. స్థానిక పోస్ట్ మ్యాన్ లేదా పోస్టు మాస్టర్ కు ఫోన్ చేసి కోరితే ఇంటికే వచ్చి ఈ సేవలు అందిస్తారు. అయితే ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది అమలు అవుతుండడం విశేషం. గ్రామీణ ప్రాంతాల వాళ్లు మాత్రం మండల కేంద్రాలకు ‘క్యూ’ కట్టాల్సి వస్తోంది. ► సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ ద్వారా (SSUP) https://ssup.uidai.gov.in/ssup/ లింక్ క్లిక్ చేసి సంబంధిత స్కాన్ డాక్యుమెంట్లు సమర్పించి చిన్న చిన్న మార్పులు చేసుకునే వీలు మాత్రమే. సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు. ► ముఖ్యమైన విషయం ఏంటంటే.. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్నెంబర్, ఈ-మెయిల్, ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్, ఫొటోగ్రాఫ్.. ఇలాంటి వివరాల అప్డేషన్ కోసం పర్మినెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్‌ను సంప్రదించాల్సిందే. ► సంబంధిత ఫామ్స్ అన్నీ యూఐడీఏఐ వెబ్సైట్లోనే దొరుకుతాయి కూడా. ఒకవేళ పొరపాటున పరిమితులు మించిపోతే ఎలా?.. ఆ టైంలో ఆధార్ ఎన్రోల్మెంట్ లేదంటే అప్డేట్ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం. అక్కడ తప్పిదానికి గల కారణాలు, వివరణలు, పొరపాట్ల సవరణకు సంబంధించిన వివరాలు, సరైన ప్రూవ్స్ సేకరిస్తారు( సంబంధిత ఫామ్స్ ద్వారా). ఆ వివరాలన్నింటిని హెల్ప్ డెస్క్‌కు పంపిస్తారు. అవసరం అయితే ఆఫీసులకు పిలుస్తారు. ఆపై వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అవసరం అనుకుంటే అదనపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు అప్డేట్ లేదంటే మార్పులకు జెన్యూన్ రీజన్ అని తెలిస్తేనే.. ఆ రిక్వెస్ట్‌ను టెక్ సెంటర్‌కు ప్రాసెసింగ్/రీప్రాసెసింగ్ పంపిస్తారు. ఈ ప్రాసెస్ సాగడానికి కచ్చితంగా ఎన్నిరోజులు పడుతుందనేది చెప్పలేం. ఒక్కోసారి ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయినా ఆగిపోవచ్చు!. -
పాన్, పీఎఫ్- ఆధార్ లింక్‌పై కీలక ప్రకటన
పాన్ కార్డు, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) అకౌంట్లతో ఆధార్ కార్డు లింక్ చేసే వ్యవహారంలో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. చివరి తేదీలు ఎప్పుడు?, టెక్నికల్ ఇష్యూస్ తదితరాలపై రకరకాల కథనాలతో స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యూఐడీఏఐ సిస్టమ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయన్న మీడియా కథనాలపై Unique Identification Authority of India (UIDAI) స్పందించింది. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేవని శనివారం ఒక ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది. ఆధార్ లింక్‌కు తేదీలు దగ్గర పడుతుండడంతో సాంకేతిక సమస్యలుంటున్నాయని కొన్ని మీడియా హౌజ్‌లలో కథనాలు రావడం జనాల్లో గందరగోళానికి గురి చేస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే తాము స్పందించాల్సి వచ్చిందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఎన్రోల్మెంట్, మొబైల్ నెంబర్ అప్డేట్ సర్వీసుల్లో మాత్రం కొంత అసౌకర్యం కలిగిందన్న మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యిందని తెలిపింది. వీటికి పాన్ కార్డు, పీఎఫ్ అకౌంట్లకు ఆధార్ లింక్‌కు ఎలాంటి సంబంధం లేదని, లింక్ అప్‌గ్రేడేషన్ కొనసాగుతోందని పేర్కొంది. రోజుకు ఐదు లక్షల మందికి పైగా.. గత తొమ్మిది రోజుల్లో యాభై లక్షల మందికి పైగా అప్‌గ్రేడేషన్ చేసుకున్నారని యూఏడీఐఏ పేర్కొంది. ఇదిలా ఉంటే యూపీఎఫ్‌వో అకౌంట్‌తో ఆధార్ కార్డు లింక్‌కు తుది తేదీ సెప్టెంబర్ 1 కాగా, పాన్ కార్డుతో మాత్రం సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ లో సంస్థ జమ చేసే నగదు మొత్తంపై ప్రభావం పడనుంది. క్లిక్ చేయండి: ఈపీఎఫ్ - ఆధార్ లింకు విధానం ఇలా.. -
ఈ రెండు ఆధార్ సేవలు నిలిపివేసిన యూఐడీఏఐ
మన దేశంలో చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఇప్పుడు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. ఇది అన్నింటిలో ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న ఆధార్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, చిత్రం, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ అనేక సేవలను ఆన్ లైన్ చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్న రెండు సేవలను యూఐడీఏఐ నిలిపివేసింది. అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త!) ఆధార్ కార్డులో మీ చిరునామాను అప్ డేట్ చేయడం కోసం చిరునామా ధ్రువీకరణ లేఖ పంపించేది. ఆ లేఖలో ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. అందులో ఉన్న కోడ్ వివరాలను నమోదు చేసిన తర్వాత మీ చిరునామా మార్పు జరిగేది. అయితే, గత కొంత కాలంగా చిరునామాను అప్ డేట్ చేసేటప్పుడు చిరునామా ధ్రువీకరణ లేఖ ఎంపికను యూఐడీఏఐ పోర్టల్ నుంచి తొలగించింది. ఆధార్ కార్డుదారులు రి ప్రింట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు గతంలో ఒక పెద్ద పేపర్ మీద మీ వివరాలు వచ్చేవి. ఇప్పుడు ఆ సదుపాయాన్ని నిలిపివేసింది. అందుకు బదులుగా యూఐడీఏఐ ప్లాస్టిక్ ఆధార్ కార్డులను మాత్రమే జారీ చేస్తుంది. -
మీ ఆధార్ కార్డ్ పోయిందా..అయితే ఇలా చేయండి!
మన దేశంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఇప్పుడు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరికీ ఆధార్ తో అవసరం చాలా ఉంటుంది. కరోనా టెస్ట్ చేయించుకోవాలన్న, చివరికి వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నఆధార్ నెంబర్ ను ప్రధానంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ సైతం ప్రజల సౌలభ్యం కొరకు అనేక రకాల ఆధార్ సేవలను చాలా సులభతరం చేసింది. అయితే, అలాంటి ఆధార్ కార్డు పోతే ఎలా? ఇలాంటి సమయంలో మీరు ఏమి చింతించాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ అధికారిక పోర్టల్ నుంచి మీరు పీవీసీ లేదా ప్లాస్టిక్ ఆధార్ కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు. పీవీసీ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా: మొదట https://uidai.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి My Aadharపై క్లిక్ చేయండి. గెట్ ఆధార్ సెక్షన్ మీద ట్యాప్ చేసి Order - Aadhar PVC Card అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్, ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ కు వచ్చిన ఓటీపీని కూడా నమోదు చేయాలి. ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు కోసం రూ.50 డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత మీకు వచ్చే ఎస్ఆర్ఎన్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆర్డర్ చేసిన రెండు వారాల తర్వాత మీకు కొత్త పీవీసీ ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది. -
ఆధార్ కార్డుదారులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత
మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురుంచి తప్పక తెలుసుకోండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడిఎఐ) ఇక నుంచి ఎలాంటి ఆధారాలు/రుజువు లేకుండా చిరునామాను అప్ డేట్ చేయడం సాధ్యపడదు అని ట్విటర్ లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు బదులు ఇచ్చింది. యుఐడిఎఐ చేసిన ట్వీట్ ప్రకారం అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసింది. యూజర్ అహ్మద్ మెమోన్ చేసిన ట్వీట్ కు సమాధానమిస్తూ యుఐడిఎఐ జూన్ 14న ఇలా ట్వీట్ చేసింది.. "ప్రియమైన రెసిడెంట్, తదుపరి నోటీసు వచ్చేవరకు అడ్రస్ వాలిడేషన్ లేటర్ సదుపాయం నిలిపివేయబడింది. ఈ జాబితాలో చెల్లుబాటు అయ్యే PAA డాక్యుమెంట్ ఉపయోగించి దయచేసి మీ చిరునామా అప్ డేట్ ని చేసుకోవచ్చు" అని ట్వీట్ లో పేర్కొంది. Dear Resident, the Address Validation Letter facility has been discontinued until further notice. Kindly request your address update using another valid PoA document from the list https://t.co/BeqUA0pkqL — Aadhaar (@UIDAI) June 14, 2021 ఆన్లైన్ లో ఆధార్ కార్డు చిరునామాను మార్చుకోండి ఇలా? ఆధార్ అడ్రస్ అప్డేట్ పోర్టల్ ssup.uidai.gov.in/ssup/ ఓపెన్ చేయండి 'Proceed to Update Aadhaar' మీద క్లిక్ చేయండి 12 అంకెల యుఐడి నెంబరు నమోదు చేయండి సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ నమోదు చేయండి 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై ఓటిపి వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి 'లాగిన్' మీద క్లిక్ చేయండి మీ ఆధార్ వివరాలు చూపిస్తుంది. చిరునామాను మార్చండి, అలాగే చిరునామా రుజువుగా ఆధార్ పేర్కొన్న 32 డాక్యుమెంట్ ల్లో దేనినైనా స్కాన్ కాపీని అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయండి -
ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం?
మీరు 5 ఏళ్ల లోపు చిన్న పిల్లల కోసం ఆధార్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, చిన్న పిల్లల ఆధార్ కోసం మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆధార్ కేంద్రానికి ఒరిజినల్ పత్రాలను తీసుకెళ్లాలి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల బయోమెట్రిక్స్ క్యాప్చర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్(యుఐడీ) అనేది వారి తల్లిదండ్రుల యుఐడీతో లింక్ చేసిన డెమోగ్రాఫిక్ సమాచారం, పిల్లల ముఖ ఛాయాచిత్రం ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. అయితే, ఈ మైనర్లకు 5 ఏళ్ల నుంచి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పది వేళ్లు, ఐరిస్, ఫోటోగ్రాఫ్ వంటి బయోమెట్రిక్ లను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కొరకు తల్లిదండ్రులు బిడ్డతో (5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు) ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ కోసం కింద పేర్కొన్న రెండు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. #AadhaarChildEnrolment To enroll your child for #Aadhaar, you only need the child's birth certificate or the discharge slip from the hospital and the Aadhaar of one of the parents. List of other documents that you can use for the child's enrolment: https://t.co/BeqUA07J2b pic.twitter.com/J1W3AYSVoP — Aadhaar (@UIDAI) July 27, 2021 పిల్లల జనన ధృవీకరణ పత్రం / ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ స్లిప్ / పిల్లల స్కూలు ఐడీ పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ -
మీ పిల్లల బయోమెట్రిక్స్ అప్డేట్ చేశారా?: యుఐడీఏఐ
మీకు 5 సంవత్సరాల వయస్సు నిండిన బాబు/పాప ఉందా? గతంలోనే మీరు పిల్లల కోసం బాల ఆధార్ కార్డు గనుక తీసుకుంటే మీకు ఒక ముఖ్య గమనిక. యుఐడీఏఐ భారతదేశానికి చెందిన చిన్న పిల్లల నుంచి వృద్దులకు ఆధార్ సంబందిత సేవలను అందిస్తుంది. మన దేశంలో ప్రతి చిన్న పిల్లలు తప్పినిసరిగా బాల ఆధార్ తీసుకోవాలి. అయితే, ఈ బాల ఆధార్ తీసుకునే సమయంలో పిల్లల ఫోటో మాత్రమే తీసుకుంటారు. ఆ సమయంలో బయోమెట్రిక్స్ వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు బాల్ ఆధార్ కార్డుతో లింకు చేయబడవు. పిల్లలకు 5 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్(ఐరిస్ స్కాన్, వేలిముద్రలు)ని ఆధార్ కార్డులో తప్పనిసరిగా నవీకరించాలి. తాజాగా మరోసారి యుఐడీఏఐ 5 సంవత్సరాల నిండిన పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ తప్పనిసరిగా అప్ డేట్ చేయాల్సిన అవసరం ఉందని ట్వీట్ ద్వారా తెలిపింది. #AadhaarChildEnrolment In #Aadhaar, fingerprints and iris scans are not captured while enrolling the children below 5 years of age, only a photograph is taken. Once the child attains the age of 5, biometrics need to be updated mandatorily. #AadhaarEnrolment #BiometricUpdate pic.twitter.com/Fn6mHSW1Ui — Aadhaar (@UIDAI) July 26, 2021 -
ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నెంబరు అప్డేట్ సేవలు
ఆధార్ కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ఆధార్ హోల్డర్ తన ఇంటి వద్దనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ లో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేయడానికి కొత్త సేవలను ప్రారంభించినట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) నేడు(జూలై 20) ప్రకటించింది. ఆధార్ హోల్డర్ ఇంటి వద్దే మొబైల్ నంబర్ ను పోస్ట్ మాన్ ఆధార్ లో అప్డేట్ చేయనున్నట్లు ఐపిపీబి ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 650 ఐపిపీబి బ్రాంచీలు, 1,46,000 పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవక్ ల ద్వారా ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం, ఐపీపీబి మొబైల్ అప్డేట్ సేవలను మాత్రమే అందిస్తోంది. అతి త్వరలోనే ఐపీపీబి నెట్ వర్క్ ద్వారా పిల్లల నమోదు సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ తో పాటు, పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవకులు అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. "ఆధార్ సంబంధిత సేవలను సులభతరం చేయడానికి యుఐడీఎఐ తన నిరంతర ప్రయత్నంలో భాగంగా పోస్ట్ మాన్, గ్రామీణ్ డాక్ సేవకుల ద్వారా నివాసితుల ఇంటి వద్దే మొబైల్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అనేక యుఐడీఎఐ ఆన్ లైన్ అప్ డేట్ సదుపాయాలతో పాటు అనేక ప్రభుత్వ సంక్షేమ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు" అని యుఐడీఎఐ సిఈఓ సౌరభ్ గార్గ్ తెలిపారు. Now a resident Aadhaar holder can get his mobile number updated in Aadhaar by the postman at his door step. 👉👉@IPPBOnline launched today a service for updating mobile number in Aadhaar as a Registrar for @UIDAI . pic.twitter.com/TGjiGhHPeG — PIB_INDIA Ministry of Communications (@pib_comm) July 20, 2021 -
మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కేటుగాళ్లు ఆధార్ కార్డ్‌ను అస్త్రంగా ఉపయోగించుకుంటుంటారు. అయితే అలాంటి వారి నుంచి సురక్షితంగా ఉండేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈనేపథ్యంలో 12 అంకెల ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా ఉండేలా మరో ఫీచర్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్/ అన్ లాక్ చేసేలా డిజైన్ చేసింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.ఆధార్ కార్డ్ సురక్షితంగా ఉండేలా బయో మెట్రిక్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. మీ ఆధార్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి mAadhaar యాప్ లేదా https://resident.uidai.gov.in/aadhaar-lockunlock పైన క్లిక్ చేయాలి. ఇందుకోసం మీ ఐడీ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రాసెస్ ఎలా చేయాలి? ► https://resident.uidai.gov.in/aadhaar-lockunlock వెబ్ సైట్ లోకి వెళ్లాలి ► అనంతరం Secure UID Authentication Channel సెక్షన్లోకి వెళ్లి Lock UID లేదా Unlock UID ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ► అలా చేసిన తరువాత మీరు మీ 12అంకెల ఆధార్‌తో పాటు సంబంధిత వివరాల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ► ఫైనల్ గా మీఫోన్ నెంబర్ కు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ► ఆ ఓటీపీని యాడ్ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది. చదవండి: రూ.93,520 కోట్ల బకాయిలు, సుప్రీంకోర్ట్‌కు ఎయిర్టెల్-వొడాఫోన్ -
ఆధార్ కార్డ్ మీద ఫోటో నచ్చలేదా.. ఇలా మార్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: మన గుర్తింపునకు ఆధార్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. కానీ ఆధార్ కార్డులో ఉండే ఫోటోలు చూస్తే.. మనమా కాదా అని డౌట్ వస్తుంది. అంత చిత్రవిచిత్రమైన ఫోటో ఎలా తీశారబ్బ అనే అనుమానం కూడా కలగకమానదు. ఇక ఆధార్ కార్డు మీద ఫోటోల మీద బోలెడు మీమ్స్. కానీ ఏం చేస్తాం.. మనకు నచ్చినా, నచ్చకపోయినా ఆ ఫోటోతేనే అడ్జస్ట్ కావాలి. కొన్ని సార్లు గుర్తుపట్టరాని విధంగా ఉన్న ఫోటోలతో సమస్యలు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. కానీ ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఆధార్‌కార్డ్ మీద ఫోటోని మార్చుకోవచ్చు. అదెలాగంటే.. ఆధార్ కార్డ్‌లో ఫోటో మార్చి.. కొత్త దాన్ని అప్లోడ్ చేయాలంటే.. ►ఆధార్ కార్డ్ మీద ఫోటో మార్చడం కోసం ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది. దీన్ని కూడా యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ నుంచి సులభంగా యాక్సెస్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►మీ ఫోటోను మార్చడానికి మీరు మీ ప్రాంతంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. ►ఇందుకోసం అవసరమైన ఫీజు చెల్లించాలి. ►ఆధార్ నమోదు కేంద్రంలోని సంబంధిత అధికారి మీ కొత్త ఫోటోను క్లిక్ చేసి, మీ ఆధార్ కార్డుకు అప్లోడ్ చేస్తారు. ►ఆ తర్వాత నిర్ణీత వ్యవధిలోగా మీ ఆధార్ కార్డ్ మీద కొత్త ఫోటో వస్తుంది. -
మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా తెలుసుకోండిలా?
మన దేశంలో ఆధార్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. భారత దేశ పౌరులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ ఉచితంగా జారీ చేస్తుంది. ఇప్పుడు, మోసగాళ్లకు వ్యతిరేకంగా ముందు జాగ్రత్తగా, ఆధార్ ఇటీవల తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో ఆధార్ ను ఎలా ధృవీకరించాలో ట్వీట్ చేసింది. తదుపరి వివరాల కోసం uidai.gov.in ఆధార్ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ చేయవచ్చు అని పేర్కొంది. "ఏదైనా ఆధార్ ను ఆన్ లైన్/ఆఫ్ లైన్ ద్వారా ధృవీకరించవచ్చు. ఆఫ్ లైన్ లో వెరిఫై చేయడం కొరకు, #Aadhaarపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఆన్ లైన్ లో వెరిఫై చేయడం కొరకు, లింక్(link: https://resident.uidai.gov.in/verify)లో 12 అంకెల ఆధార్ నమోదు చేయండి" అని ట్విటర్ లో పేర్కొంది. మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా గుర్తించండి ఇలా? మొదట resident.uidai.gov.in/verify లింకు మీద క్లిక్ చేయాలి ఇచ్చిన స్థలంలో ఆధార్ నెంబరు, కాప్చాను నమోదు చేయాలి. తర్వాత 'Proceed to Verify' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే, మీ వయస్సు, జెండర్, రాష్ట్రం, మొబైల్ నెంబర్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేల అది నకిలీది అయితే ఈ వివరాలు కనిపించవు. పైన పేర్కొన్న పద్దతులు ద్వారా మీ ఆధార్ నకిలీదా లేదా నిజమైందా తెలుసుకోవచ్చు. #BewareOfFraudsters Any Aadhaar is verifiable online/offline. To verify offline, scan the QR code on #Aadhaar. To verify online, enter the 12-digit Aadhaar on the link: https://t.co/cEMwEa1cb4 You can also do it using the #mAadhaar app#AadhaarAwareness pic.twitter.com/5Z2enlYrTn — Aadhaar (@UIDAI) July 9, 2021 -
మీ 'ఆధార్' మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండిలా!
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) తన పోర్టల్ లో అనేక కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు యూజర్ల కోసం తీసుకొస్తుంది. యుఐడీఏఐ తీసుకొచ్చిన అలాంటి ఒక సౌకర్యం వల్ల మీ పాత ఆధార్ మొబైల్ నెంబర్ స్థానంలో సులభంగా కొత్త నెంబర్ జత చేసుకునే అవకాశం ఉంది. మీ ఆధార్ కార్డుకు మరో కొత్త మొబైల్ నెంబరు జత చేయాలని అనుకుంటే ముందుగా మీరు ఈ దశలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 'ఆధార్' మొబైల్ నెంబర్ అప్డేట్ విధానం మీ మొబైల్ నెంబరు అప్డేట్ చేయడం కొరకు యుఐడీఏఐ వెబ్ పోర్టల్(ask.uidai.gov.in)ను సందర్శించండి. ఆ తర్వాత, మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఫోన్ నెంబరు, క్యాప్చాను సంబంధిత బాక్సుల్లో టైప్ చేయండి. 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ మీద క్లిక్ చేసి, మీ ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి 'సబ్మిట్ ఓటీపీ & ప్రొసీడ్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అనంతరం ఓపెన్ అయిన డ్రాప్‌డౌన్ బాక్స్‌లో ‘అప్డేట్ ఆధార్’పై క్లిక్ చేసి ముందుకెళ్లండి. ఆపై ఆధార్ నంబర్, పూర్తి పేరు నమోదు చేసి మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ‘మొబైల్ నంబర్’ కింద ఎంచుకొని ప్రోసిడ్ అవ్వండి. మొబైల్ నెంబరు సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా మళ్లీ నమోదు చేసి కొత్తగా వచ్చిన ఓటీపీని సరిచూసుకోని సేవ్&ప్రోసిండ్ క్లిక్ చేయండి. దీని తర్వాత, రూ.25 ఫీజు చెల్లించడానికి అవసరమైన అదనపు సమాచారాన్ని నమోదు చేసి మీ దగ్గరల్లో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లడానికి మీరు ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి వివరాలు తెలియజేస్తే సరిపోతుంది. -
ఆధార్ కార్డులో ఈ రెండు సర్వీసులు నిలిపివేత
సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఎఐ) షాక్ ఇచ్చింది. యూఐడీఏఐ తాజాగా రెండు సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ధృవీకరణ లేఖ ద్వారా ఆధార్ కార్డులోని చిరునామాలను అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేసింది.దీంతో ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇకపై సాధ్యం కాదు. అలాగే ఆధార్ కార్డు రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. అయితే ఆధార్ కార్డులో తప్పులును సరిచేసుకొనే అవకాశం యథావిధిగాఉంటుంది. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే ఆన్‌లైన్‌ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. -
ఆధార్ యూజర్లకు షాక్.. 2 సేవలు నిలిపివేత!
ఆధార్ యూజర్లకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) చిరునామా ధ్రువీకరణ ప్రక్రియను, డాక్యుమెంట్ల పునఃముద్రణకు సంబంధించిన రెండు సేవలను నిలిపివేసినట్లు తెలిపింది. యుఐడీఏఐ పోస్టల్ చిరునామా ధ్రువీకరణ లేఖ ద్వారా ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని నిలిపివేసింది. యుఐడీఏఐ ఇచ్చిన సమాచారం ప్రకారం తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు అడ్రస్ వాలిడేషన్ లెటర్ సదుపాయాన్ని నిలిపివేసింది. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం ఇక కష్టం కావొచ్చు. అలాగే, యుఐడీఏఐ పాత కార్డును రి ప్రింట్ చేసే అవకాశాన్ని నిలిపివేసింది. ఇంతకు ముందు కార్డుదారులు అసలు కార్డును కోల్పోతే పాత ఆధార్ కార్డును తిరిగి ముద్రించుకునే అవకాశం ఉంది. లైవ్ హిందుస్థాన్ ప్రకారం ఈ సేవలు ఇప్పుడు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, ట్విట్టర్ లో ఒక వ్యక్తి ఆధార్ కార్డు రీప్రింట్, అడ్రస్ వాలిడేషన్ లెటర్ గురించి ఆధార్ కార్డు హెల్ప్ లైన్ ను అడిగాడు. దీనికి, హెల్ప్ సెంటర్ నుంచి సర్వీస్ అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. ఆధార్ కార్డు రీప్రింట్ స్థానంలో పీవీసీ కార్డును పొందవచ్చు. ఇది ఏటీఎం పరిమాణంలో ఉంటుంది. -
ఆధార్ కు కూడా మాస్క్.. ఇక మీ ఆధార్ నెంబర్ మరింత సురక్షితం!
మన దేశంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ ఇప్పుడు ఆధార్ కలిగి ఉండాల్సిందే. చిన్న పిల్ల వాడి నుంచి 60 ఏళ్ల వృద్దిడి వరకు ప్రతి ఒక్కరికీ దీనితో చాలా అవసరం ఉంటుంది. చివరికి కరోనా టెస్ట్ చేయించుకోవాలన్న, వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నఆధార్ నెంబర్‌నే ప్రధానంగా వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ సైతం అనేక రకాల ఆధార్ సేవలను చాలా సులభతరం చేసింది. పలు రకాల సేవలను ఆన్లైన్లోనే అందిస్తోంది. మాస్క్డ్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది యూఐడీఏఐ. ఈ ఫీచర్ వల్ల మీ ఆధార్ కార్డుకు మరింత భద్రత చేకూరుతుంది. కొత్తగా తీసుకొచ్చిన మాస్క్ ఆధార్ ఆప్షన్ వల్ల మీరు డౌన్లోడ్ చేసిన ఈ-ఆధార్ లో మొదటి 8 అంకెలను "ఎక్స్ ఎక్స్ ఎక్స్" వంటి కొన్ని అక్షరాలతో భర్తీ చేయనున్నారు. అయితే ఇందులో మీ ఆధార్ నెంబరు చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల మీ ఆధార్ ఇతరులు తెలుసుకోలేరని యూఐడీఏఐ పేర్కొంది. ఇతర వివరాలు అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, క్యూఆర్ కోడ్ తదితర వివరాలు ఎప్పటిలాగే కనిపిస్తాయి. ఈ ఫీచర్ మీ కార్డును మరింత సురక్షితంగా మారుస్తుంది. మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా..? మొదట యూఐడీఏఐ వెబ్ సైట్(https://uidai.gov.in/) ఓపెన్ చేయండి. "మై ఆధార్ ఆప్షన్" ఎంచుకోండి. "మై ఆధార్" ట్యాబ్ కింద 'డౌన్లోడ్ ఆధార్' మీద క్లిక్ చేయండి. ఈ-ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆధార్ నంబర్, ఎన్ రోల్ మెంట్ ఐడీ(ఈఐడీ), వర్చువల్ ఐడీ(విఐడీ) 3 ఆప్షన్లు ఉన్నాయి. పై ఆప్షన్ లన్నింటిలో ఏదో ఒకటి ఎంచుకొని 'I want a masked Aadhaar?' అనే దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు క్యాప్చ ఎంటర్ చేసి, సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. వెబ్ సైట్ లో ఓటీపీని నమోదు చేసి మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: జూలై ఒకటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్! -
కోల్పోయిన ఆధార్ నెంబర్ తిరిగి పొందడం ఎలా..?
వివిద ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు పొందాలంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. కాబట్టి భారత పౌరులు ఆధార్ కార్డును ముఖ్యమైన గుర్తింపు పత్రంగా పరిగిణిస్తారు. 12 అంకెల గల ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) జారీచేస్తుంది. అలాంటి ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోతే/ ఎక్కడైన పోయిన ఏమి జరుగుతుంది అనేది ఒకసారి ఊహించుకోండి. దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎవరైనా ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోయిన, కార్డు ఎక్కడైనా పోయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లేదా హెల్ప్ లైన్ నెంబరు ద్వారా ఆన్ లైన్ లో తమ ఎన్ రోల్ మెంట్ నెంబరు లేదా యుఐడీని తిరిగి పొందవచ్చు. అది ఎలా అనేది ఈ క్రింది విదంగా తెలుసుకోండి. https://uidai.gov.in అధికారిక వెబ్ సైట్ కు సందర్శించండి. హోమ్ పేజీలో 'మై ఆధార్' అనే ఆప్షన్ కింద 'ఆధార్ సర్వీసెస్' అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు 'Retrieve Lost or Forgotten EID/UID' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వంటి వివరాలను నమోదు చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, వెరిఫికేషన్ కొరకు క్యాప్చా ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్లో వచ్చిన ఆరు అంకెల ఓటీపీని నమోదు చేయండి. ఇప్పుడు మీకు యుఐడీ/ ఈఐడీ నెంబరు ఎస్ఎమ్ఎస్ ద్వారా మీ మొబైల్ కు వస్తుంది. ఈ నెంబర్ తో మీరు ఈ-ఆధార్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు కోల్పోయిన ఆధార్ యుఐడీ/ఈఐడీ నంబర్ ను తెలుసుకోవడానికి ప్రజలు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి హెల్ప్ లైన్ నెంబరు '1947'కు డయల్ చేయాల్సి ఉంటుంది. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం -
Aadhar Card: చిరునామాని ఆన్లైన్లో సవరించండి ఇలా!
మీరు కొత్త ఇంటికి మారరా? ఆధార్ కార్డు ఇంకా చిరునామాని చేంజ్ చేయలేదా? అయితే, ఇప్పుడు సులభంగానే ఇంట్లో నుంచే ఆధార్ కార్డులో చిరునామాని మార్చవచ్చు. ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆధార్ యూజర్ కొన్ని వివరాలను అప్ డేట్ చేయవచ్చు. ఆధార్ కార్డుదారులు స్వీయ సేవా పోర్టల్ ద్వారా చిరునామాను అప్ డేట్ చేయవచ్చు అని ఆధార్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. "మీరు ఇప్పుడు చిరునామాని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు" అని ట్వీట్ లో పేర్కొంది. ఈ సేవను ఉపయోగించుకోవాలంటే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరును కలిగి ఉండాలని ఆధార్ యూజర్ గమనించాలి. అలాగే, ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేసినందుకు రూ.50 చార్జి చెల్లించాలి. సెల్ఫ్ సర్వీస్ ఆన్ లైన్ పోర్టల్ చిరునామాను అప్ డేట్ చేయడం కొరకు యుఐడీఎఐ వెబ్ సైట్ లో పేర్కొన్న పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్ ల కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. #AadhaarOnlineServices You can now update your address in your Aadhaar online through Aadhaar Self Service Update Portal at https://t.co/II1O6Pnk60 to update. To see the list of valid documents, click here: https://t.co/BeqUA0pkqL #UpdatedAddressOnline #UpdateOnline pic.twitter.com/iMM1qqcEqm — Aadhaar (@UIDAI) June 18, 2021 ఆధార్‌కార్డులో చిరునామాని ఇలా సవరించండి: ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి. అందులో ఫ్రోసిడ్ టూ ఆప్డేట్ ఆధార్‌ను క్లిక్ చేయాలి. ఆప్డేట్ ఆధార్ ఆన్‌లైన్‌ను క్లిక్ చేసిన తరువాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తరువాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ ఐనా ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్ టైం పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు డెమోగ్రాఫిక్ ఆప్షన్ ఎంచుకొని మీ కొత్త చిరునామా వివరాలు సమర్పించాలి. పీపీఎ డాక్యుమెంట్ ల మీ ఒరిజినల్ కలర్ స్కాన్ డ్ కాపీలను అప్ లోడ్ చేయండి. నమోదు చేసిన డేటాను ఇంగ్లిష్, స్థానిక భాషలో కనిపిస్తుంది. ఇప్పుడు అభ్యర్థనను సబ్మిట్ చేయండి. మీ ఆధార్ అప్ డేట్ స్టేటస్ ట్రాక్ చేయడం కొరకు మీరు మీ అప్ డేట్ రిక్వెస్ట్ నెంబరు(ఆర్ ఎన్ ఆర్ ఎన్)ని సేవ్ చేసుకోవాలి. చదవండి: పీఎఫ్ యూఎన్ నెంబర్ ను ఆధార్‌తో లింకు చేసుకోండి ఇలా..?