
ఆధార్ డేటా లీకేజీలపై ఇప్పటికే పలు సందేహాలు, అనుమానాలు, పలు కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆధార్ డేటా లీకేజీ అవడానికి వీలుపడదంటూ యూఐడీఏఐ వాదిస్తుండగా.. మరోవైపు ఎప్పడికప్పుడూ ఆధార్ లీకేజీలను పలువురు బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆధార్ డేటా లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కల ప్రధాన కారణం గూగుల్ సెర్చ్‌లో పలువురు ఆధార్ వివరాలు బయటపడటమే. సింపుల్‌గా గూగుల్‌లో ‘మేరా ఆధార్ మేరి పెహచాన్’ ఫైల్‌టైప్:పీడీఎఫ్ అని సెర్చ్ చేస్తే చాలు పలువురు ఆధార్ వివరాలు బయటపడుతున్నాయని తెలిసింది.
మేరా ఆధార్ మేరి పెహచాన్’ ఫైల్‌టైప్:పీడీఎఫ్ టైప్ చేసి, సెర్చ్ చేస్తే పలు పీడీఎఫ్ ఫైల్స్ చూపిస్తున్నాయని, వాటిని డౌన్‌లోడ్ చేస్తే, అపరిచితుల ఆధార్ వివరాలన్నీ మీ డెస్క్‌టాప్‌లపై సేవ్ అవుతున్నట్టు వెల్లడైంది. ఈ వివరాల్లో ఆధార్ కార్డుదారుని పేరు, ఆధార్‌నెంబర్, తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్ ఉన్నట్టు తెలిసింది. ఇలా ఆధార్ కార్డు వివరాలు గూగుల్ సెర్చ్ ద్వారా బహిర్గతమవుతున్నట్టు తెలిసింది. ఆధార్ డేటా లీకేజీపై ట్విటర్ యూజర్లు మండిపడుతున్నారు. ఎంత తేలికగా ఆధార్ కార్డు యాక్సస్ అవుతోందో, ఎలా దుర్వినియోగమవుతుందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మేరా ఆధార్ మేరి పెహచాన్’ ఫైల్‌టైప్:పీడీఎఫ్ అని టైప్ చేయండి చాలు అని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేయగా.. మరో ట్విటర్ యూజర్ ఈ విషయం సుప్రీంకోర్టుకు తెలుస్తోందా? యూఐడీఏఐ ఆధార్ విషయంలో ఎలా విఫలమవుతోందో అని మండిపడుతున్నాడు. యూఐడీఏఐ దీనిపై సమాధానం చెప్పాలని, మరోసారి ప్రజల ఆధార్ వివరాలను భద్రంగా ఉంచడంలో విఫలమైందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment