ఆధార్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమిది. ఆధార్ కార్డు తీసుకుని చాలా కాలమైనా అప్‌డేట్ చేయనివారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చు. కాబట్టి అలాంటి ఆధార్ కార్డులను గడువులోపు అప్‌డేట్ చేసుకోవడం చాలా అవసరం.
ఆధార్ కార్డ్‌లు జారీ చేసి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆన్‌లైన్ సదుపాయాన్ని అందించింది. ఇందుకు అనేకసార్లు గడువును పొడిగించింది. కానీ ఇప్పటికీ వేలాది మంది ఈ పని చేయలేదు. ఇలాంటి ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు. దీని కోసం, మీరు 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
ఆధార్ అప్‌డేట్ ఆవశ్యకత
ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు అన్నింటికీ ఉపయోగించే ఆధార్ కార్డు ప్రస్తుతం ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. పదేళ్లలో మీ చిరునామా, ఫోటో మారి ఉండవచ్చు. ఆ సమాచారాన్ని ఆధార్‌లో అప్‌డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.
డిసెంబర్ 14 ఆఖరి గడువు?
పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. అయితే ఇదే చివరి గడువు అని భావిస్తున్నారు.
ఆధార్ కార్డును అప్‌డేట్ చేయండిలా..
⇒ 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
⇒ అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్‌లోడ్ చేయండి.
⇒ ఈ సర్వీస్ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దీన్ని అప్‌డేట్ చేసుకోండి.
ఆధార్ కార్డ్ అప్‌డేట్‌కు అవసరమైన పత్రాలు
రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్‌ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి.
Comments
Please login to add a commentAdd a comment