Aadhar
-
ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ ఉచిత అప్డేట్ గడువును వచ్చే ఏడాదికి పొడిగించింది. గతంలో తెలిపిన విధంగా ఉచిత ఆధార్ అప్డేట్కు ఈ రోజు చివిరి తేదీ. కానీ దాన్ని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు ఆధార్ అధికారిక ఎక్స్ లింక్‌లో వివరాలు పోస్ట్ చేసింది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (2025, జూన్ 14) లోపు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ.50 అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.#UIDAl extends free online document upload facility till 14th June 2025; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAl has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/wUc5zc73kh— Aadhaar (@UIDAI) December 14, 2024ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
ఈ ఒక్క ఐడీ చాలు.. ఆధార్ నెంబర్‌తో పనే లేదు!
ఆధార్ కార్డ్ అనేది భారతీయ పౌరులకు అవసరమైన గుర్తింపు పత్రం. దీనిని చాలా సందర్భాల్లో వివిధ పనులకు వినియోగించుకుంటారు. అయితే ప్రతి పనికి ఆధార్ నెంబర్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి బదులు 'వర్చువల్ ఐడీ' (VID) ఉపయోగించవచ్చు. ఇంతకీ ఈ వర్చువల్ ఐడీ అంటే ఏమిటి? దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే విషయాలను ఇక్కడా వివరంగా తెలుసుకుందాం.వర్చువల్ ఐడీవర్చువల్ ఐడీ అనేది ఆధార్ కార్డ్‌తో అనుసంధానమైన 16 అంకెల సంఖ్య. దీనిని అసలైన ఆధార్ నెంబర్‌కు బదులుగా ఉపయోగించుకోవడానికి మాత్రమే కాకుండా.. ఈ-కేవైసీ వంటి వాటికోసం కూడా వినియోగించుకోవచ్చు. ఆధార్ నెంబర్ స్థానంలో.. వీఐడీ నెంబర్ ఉపయోగించడం వ్యక్తిగత గోప్యతను నిర్ధారిస్తుంది.ఆధార్ వర్చువల్ ఐడీ ఉపయోగాలు ● బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడనికి ● ప్రభుత్వ సర్వీసులకు అప్లై చేసుకోవడనికి ● ఈ-కేవైసీ ప్రక్రియ కోసం ● ఆధార్ పీవీసీ కార్డ్ లేదా ఈ-ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి ● ప్రభుత్వ సబ్సిడీలను పొందటానికి ● పాస్‌పోర్టు కోసం అప్లై చేసుకోవడానికి ● కొత్త బీమా పాలసీని కొనుగోలు చేయడానికిఆధార్ వర్చువల్ ఐడీని ఎలా పొందాలి?▸ఆధార్ వర్చువల్ ఐడీ కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI)ను సందర్సించాలి.▸అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.▸ఆధార్ సర్వీస్ అనే సెక్షన్లో 'వర్చువల్ ఐడీ జనరేటర్'పైన క్లిక్ చేయాలి. ▸వర్చువల్ ఐడీ జనరేటర్‌పై క్లిక్ చేసిన తరువాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.▸ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు ఒక 16 అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ కనిపిస్తుంది.▸స్క్రీన్‌పైన వర్చువల్ ఐడీ నెంబర్ కనిపించడమే కాకుండా.. మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ రూపంలో కూడా వస్తుంది.ఇదీ చదవండి: బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా? -
విద్యార్థులకు ఆధార్.. బాధార్..
ప్రభుత్వం నుంచి పొందే సేవలన్నింటినీ ఆధార్‌తో ముడిపెట్టడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోను ఆధార్ కార్డునే పరిగణనలోకి తీసుకుంటుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డును గుర్తింపు ధ్రువీకరణగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆధార్ సమస్య వేధిస్తోంది. జనవరిలో జరగనున్న జేఈఈ మెయిన్–2025 మొదటి సెషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు గడువు ఈనెల 22న ముగియనుంది. దరఖాస్తు చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలు విద్యార్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోను, టెన్త్ సర్టిఫికెట్లోను విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఒకే విధంగా ఉండాలనే నిబంధన చాలా ఇబ్బందిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 20 వేలమందికిపైగా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఆధార్‌కార్డు, టెన్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగానే నేమ్స్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోందని ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. –గుంటూరు ఎడ్యుకేషన్ఆధార్ కేంద్రాల వద్ద ఆలస్యం దీంతో జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క గుంటూరు నగరంలోనే వందలమంది విద్యార్థులు నెలరోజులుగా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పేర్ల సవరణల కోసం ప్రయత్నిస్తున్నారు. పేరులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పు ఒకేసారి చేయడం కుదరదని, మరోసారి రావాలని ఆయా కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తుండటం వారిని కలవరపరుస్తోంది. ఆధార్‌కార్డులో సవరణలకు 15 రోజుల నుంచి నెలరోజుల సమయం పట్టడం కూడా ఇబ్బందిగా మారింది. తగినన్నిఆధార్ కేంద్రాలేవి?జేఈఈ మెయిన్‌తోపాటు ఇంటర్మీడియెట్, అపార్ నమోదు కోసం ఆధార్‌లో సవరణలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే ఉన్న ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులో సవరణలు కోసం ఎక్కడో మారుమూల ఉన్న ఊర్ల నుంచి తల్లిదండ్రులు వచి్చ, పిల్లలను వెంటబెట్టుకుని ఆ«ధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉండాలంటే వారికి కష్టంగా ఉంటోంది. పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సిన విద్యార్థుల సమయం ఆధార్ కేంద్రాల వద్దే గడిచిపోతోంది. దీనికితోడు గుంటూరులో చంద్రమౌళీనగర్‌లోని పోస్టాఫీసులో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఇటీవల మూసేశారు. విద్యార్థుల కోసం ఆధార్ సవరణలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జిల్లా అధికారులు తరువాత పట్టించుకోలేదు. -
పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!పలు ఫిన్‌టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.లింక్ చేయకపోతే ఏమౌతుంది? డిసెంబరు 31 లోపు ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డ్‌లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. -
డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!
ఆధార్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమిది. ఆధార్ కార్డు తీసుకుని చాలా కాలమైనా అప్డేట్ చేయనివారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చు. కాబట్టి అలాంటి ఆధార్ కార్డులను గడువులోపు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం.ఆధార్ కార్డ్‌లు జారీ చేసి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆన్లైన్ సదుపాయాన్ని అందించింది. ఇందుకు అనేకసార్లు గడువును పొడిగించింది. కానీ ఇప్పటికీ వేలాది మంది ఈ పని చేయలేదు. ఇలాంటి ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు. దీని కోసం, మీరు 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.ఆధార్ అప్డేట్ ఆవశ్యకతప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు అన్నింటికీ ఉపయోగించే ఆధార్ కార్డు ప్రస్తుతం ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. పదేళ్లలో మీ చిరునామా, ఫోటో మారి ఉండవచ్చు. ఆ సమాచారాన్ని ఆధార్‌లో అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.డిసెంబర్ 14 ఆఖరి గడువు?పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. అయితే ఇదే చివరి గడువు అని భావిస్తున్నారు.ఆధార్ కార్డును అప్డేట్ చేయండిలా..⇒ 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.⇒ అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్లోడ్ చేయండి.⇒ ఈ సర్వీస్ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దీన్ని అప్డేట్ చేసుకోండి.ఆధార్ కార్డ్ అప్డేట్కు అవసరమైన పత్రాలురేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి. -
అన్నింటికి ‘ఆధార’మేనా!.. మాకేంటి ఈ గోల బాబూ?
ఏపీలోనే కాదు.. మన దేశంలోనూ ప్రజలు నిత్యం వినియోగించే డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. అధికారిక గుర్తింపుకార్డుగా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, రుణం పొందాలన్నా, అంతెందుకు ప్రయాణాలు చేయాలన్నా ఈ కార్డ్ ఉండాల్సిందే. అయితే రాష్ట్రంలో మాత్రం ఎగస్ట్రా కార్యకలాపాలకూ ఆధార్ తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రూల్స్ పెడుతోంది.👉కర్నూలు పుచ్చకాయలమాడ గ్రామంలో ఇవాళ సీఎం చంద్రబాబు ఫించన్ల పంపిణీలో పాల్గొన్నారు. అయితే.. పోలీసుల వలయంగా మారిన ఆ ఊర్లోకి.. స్థానిక ప్రజల్నే పోలీసులు అనుమతించకపోవడం గమనార్హం. పైగా ఊరిలోపలికి వెళ్లడానికి ఆధార్ కార్డు కచ్చితంగా చూపించాలని షరతు పెట్టారు. దీంతో.. తమ ఊరికి వెళ్లడానికి తమకు ఇన్ని ఆంక్షలేంటో అనుకున్నారు.👉విజయవాడలో మొన్న బుడమేరు వరద బాధితులకూ ఆధార్ కష్టాలు తప్పలేదు. ప్రభుత్వం తరఫున 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఆదేశించిన చంద్రబాబు.. అందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖకు సూచించారు. అయితే వరదలతో కట్టుబట్టలతో బయటకు వచ్చేసిన బాధితులు.. ఆ ఆధార్ నిబంధనతో సరుకుల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది.👉మరోవైపు.. సంక్షేమ పథకాల విషయంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏనాడూ రూల్స్ కొర్రీ పెట్టలేదు. వలంటీర్ల లాంటి క్షేత్రస్థాయి సిబ్బందితో అర్హులను గుర్తించడం ద్వారా ఆ పని తేలికైంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ‘ఆధార్’ తప్పనిసరి అనే నిబంధనను జొప్పిస్తోంది. తల్లికి వందనం లాంటి ఆచరణకు నోచుకోని పథకానికి సైతం ఆ మధ్య ఆధార్ తప్పనిసరి అనే ప్రకటన చేసింది. మొన్నీమధ్య బడులలో విద్యా కానుక కిట్లను సంఖ్యను బట్టి ఇచ్చినప్పటికీ.. ఇకపై మాత్రం కచ్చితంగా ఆధార్ ఉంటేనే అని చెప్పేసింది. ఆధార్ కచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిందేనని తేల్చేసింది . ఇది లబ్ధిదారులను ఇబ్బందులకూ గురి చేయడం కాకపోతే మరేమిటి?.👉చివరగా .. తిరుమల శ్రీవారి లడ్డూ అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. తిరుమలకు వచ్చేవారు ఒకప్పుడు 10–20 లడ్డూలను తీసుకెళ్లేవారు. ఇలా తీసుకెళ్లిన వీటిని ఆఫీసుల్లో.. ఇంటి చుట్టుపక్కల వారికి పంచి పెట్టేవాళ్లు. అలాంటిది ఉచితంగా ఇచ్చే లడ్డూకు అదనంగా కేవలం రెండు మాత్రమే విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. పైగా.. ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలిక పెట్టింది. ఇది బాబుగారి హయాంలోనే జరగడం కాకతాళీయమేనంటారా?. మునుముందు ఆధార్‌ను ఇంకా దేనికి దేనికి వర్తింపజేస్తారో?!. కొసమెరుపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గతంలో వలంటీర్ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో.. వలంటీర్లు ఏపీ ప్రజల ఆధార్ కార్డ్ తదితర వివరాలు తీసుకుని చేయరాని , చేయకూడని పనులు చేశారంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పుడు ఎంతలా విమర్శలకు తావిచ్చాయో తెలిసిందే. మరి ఇప్పుడు ఏపీలో ఆధార్ కంపల్సరీ రూల్ వెనుక మతలబు ఏంటన్నది పవన్ అయినా చెప్తారా?. వెయిట్ అండ్ సీ.. -
రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి
2024 సెప్టెంబర్ నెల ఈ రోజుతో (సోమవారం) ముగుస్తోంది. రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభమవుతుంది. అయితే వచ్చే నెల (అక్టోబర్) నుంచి మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్, టీడీఎస్, స్మాల్ సేవింగ్ స్కీమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలలో చాలా మార్పులు సంభవిస్తాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..👉ఆధార్ నెంబర్‌కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని వెల్లడించడానికి సంబంధించిన నిబంధనను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు.. పాన్ కేటాయింపు పత్రాలలో తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించాల్సిన అవసరం లేదు.👉సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF ) అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణ కోసం కొత్త నియమాలు 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.👉కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. జీవిత బీమా పాలసీ, లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్, కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ శుభవార్త!.. డిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్..👉ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)కి వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) అక్టోబర్ 1 నుంచి పెరగనుంది. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మార్పులు ఏర్పడతాయి. -
ఆధార్‌కార్డుల జారీకి ‘ఎన్ఆర్సీ’ మెలిక
గువహటి: ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అస్సాంలో ఆధార్ కార్డు కావాలంటే జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి దరఖాస్తు చేసుకున్న నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. అస్సాంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత శర్మ అన్నారు. అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇందుకే ఎన్ఆర్సీ దరఖాస్తు రసీదు నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అస్సాంలో ఆధార్ కార్డుల జారీ ఇక ఎంతమాత్రం సులభం కాదని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలని కోరారు. బంగ్లాదేశ్ వంటి పొరుగుదేశాల నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. ఈ రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వ్యక్తులకు ఆధార్ కార్డు జారీపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే కేంద్రం వదిలేసిందని ఈ సందర్భంగా హిమంత గుర్తు చేశారు. ఇందుకే తాము కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. -
రుణమాఫీపై తెలంగాణ సీఎంవో కీలక ప్రకటన
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రుణమాఫీ వర్తించే రైతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రూ. 2 లక్షల లోపు రుణాలుండీ ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి.. అందుకు కారణం తెలుసుకోవాలని కోరింది. తద్వారా త్వరగతిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. రూ.2 లక్షల లోపు రుణమున్నప్పటికీ, మాఫీ కాని రైతులెవరైనా ఉంటే ఆ బ్యాంకు బ్రాంచీ ఉన్న మండలం వ్యవసాయ అధికారిని (MAO) కలిసి ఫిర్యాదు చేయాలి. రుణమాఫీ పోర్టల్ లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణ మాఫీ వర్తించిందా? లేదంటే వర్తించకపోవడానికి కారణమేమిటో ఉంటుంది. ఉదాహరణకు.. ఆధార్ లేదని గుర్తిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏవోకు అందించాలి. ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్‌తో పాటు, ఓటర్ ఐడీ లేదా, వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఈవోకు అందించాలి. వాటిని పోర్టల్‌లో అప్ లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ.. కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులుంటే.. ఎంఈవో క్షేత్రస్తాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకోని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆధార్ లో, బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు సరిపోలకపోతే, రైతులు సరైన పేరున్న అప్ డేటేడ్ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది అని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆ ఐడీతో కుదరదు!
దేశంలో ప్రజలు కొన్ని పత్రాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ పత్రాలలో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. దేశంలో చాలా చోట్ల ఆధార్ కార్డును ముఖ్యమైన పత్రంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఆ పనులు చేయలేరు. ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన రూల్స్ తాజాగా మారాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకోండి..దేశంలో మొదటి ఆధార్ కార్డ్ 2010 సంవత్సరంలో జారీ అయింది. ఇప్పటి వరకు, దేశంలోని జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డ్ ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా నిబంధనలు మారాయి. తాజాగా ఆధార్ కార్డుకు కొత్త రూల్ జారీ అయింది.ఇంతకు ముందు, ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడీని కొన్ని పనులకు ఉపయోగించేవారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడీని జారీ చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని పనులకు ఈ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించలేరు.ఇప్పుడు పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంతకుముందులాగా ఆధార్ కార్డ్ లేకపోతే, ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డ్‌ని పొందేందుకు ఇప్పుడు వీలులేదు. అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ సరిపోదు. ఆధార్ కార్డు నంబర్ ఉండాల్సిందే. -
‘‘నా ఆధార్, నా ఫోటో..’’ క్యూట్ బేబీ ఫోజులు వైరల్ వీడియో
భారత దేశంలో అపుడే పుట్టిన శిశువు నుంచి వయో వృద్ధుల దాకా పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇది ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రం. అలాగే బ్యాంకింగ్ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా. ఇలా దేనికోసమైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. తాజాగా ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.సాధారణంగా ఆధార్ కార్డులో ఫోటో చూసుకొని దేవుడా.. అనుకునే వాళ్లు చాలామంది (ఇపుడు ఫోటో మార్చుకునే అవకాశం ఉందనుకోండి) ఉన్నారు. ఇలాంటి ఫోటోలపై చాలా జోక్స్ వినే వింటాం. ఈ సంగతి తనకు తెలుసులే అన్నట్టు ఆధార్ కార్డ్ ఫొటోకు ఓ చిన్నారి (గున్‌గున్) ఇచ్చిన ఫోజులు విశేషంగా నిలిచాయి. అసలే పింక్ గౌన్‌లో చందమామలా ముద్దుగాముద్దుగా ఉంది. దీనికి తోడు ఎవరో చెప్పినట్టు రకాల రకాలుగా క్యూట్ , క్యూట్‌గా ఫోజులిచ్చింది. < View this post on Instagram A post shared by BabyNaysha (@gungun_and_mom) బుగ్గలపై చేయి పట్టుకుని ఒకసారి, అమాయకంగా చూస్తూ ఒకసారి, చిలిపిగా, అందంగా మల్లెపువ్వులా నవ్వుతూ కనిపించింది. అచ్చంగా పార్లే జీ పాపాలాగా కనిపించింది. దీంతో ఈ చిట్టి తల్లి వాళ్ల అమ్మ వీడియో తీసి గున్‌గున్ అండ్ మామ్అనే ఇన్‌స్టా ఐడీలో పోస్ట్ చేసింది. అంతే ఇది వైరల్ అయిపోయింది.‘పార్లే జీ గర్ల్’ అంటూ నెటిజన్లు తెగ పొగిడేశారు. ఆధార్ ఫోటో అందంగా కనిపించేది ఈ బేబీ ఒక్కతే ఒక యూజర్ కమెంట్ చేయగా, ‘నేను నా రెండేళ్ల కుమార్తెను ఆధార్ కార్డ్ ఫోటో కోసం వెళ్లినపుడు నాకూ ఇదే అనుభవం" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇన్‌స్టాలో 18.3 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. -
ఉచితంగా ఆధార్ అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరోసారి పొడిగించింది. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14ను చివరి తేదీగా యూఐడీఏఐ వెబ్సైట్లో పేర్కొంది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకునేందుకు రూ .50 రుసుము వసూలు చేస్తారు. ఆన్లైన్ పోర్టల్‌లో యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15గా నిర్ణయించారు. తరువాత మార్చి 14, ఆ తరువాత జూన్ 14 తాజాగా సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..» స్టెప్ 1: మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి» స్టెప్ 2: క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.» స్టెప్ 3: మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.» స్టెప్ 4: మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.» స్టెప్ 5: 'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.» స్టెప్ 6: మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి» స్టెప్ 7: ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.» స్టెప్ 8: 'సబ్మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.» స్టెప్ 9: 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది. -
ఆధార్ - రేషన్ కార్డు లింక్.. మరో అవకాశం
ఆధార్ - రేషన్ కార్డు ఇంకా లింక్ చేసుకోని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వాస్తవానికి వీటిని లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. వీటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో లింక్ పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయవచ్చు. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024 -
‘ఆధార్’పై రూమర్లు .. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్’
న్యూఢిల్లీ: ఆధార్‌పై సోషల్ మీడియాలో ఇటీవల ఒక చర్చ విస్తృతంగా జరుగుతోంది. జూన్ 14 లోపు పౌరులు తమ వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకపోతే ఆధార్ పని చేయదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(ఉడాయ్) కొట్టిపారేసింది.ఆధార్‌లో కేవలం ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే జూన్14 గడువని తెలిపింది. వివరాలు అప్డేట్ చేసుకోకపోయినా ఆధార్‌కార్డు పనిచేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. కాగా, ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ తొలుత 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఈ గడువును రెండుసార్లు జూన్ 14 వరకు పొడిగించింది. ఈలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించింది. -
‘ఆధార్ ఏటీఎం’ వచ్చేసింది..అదెలా పనిచేస్తుందంటే?
మీకు అత్యవసరంగా డబ్బులు కావాలా? బ్యాంక్ లేదంటే ఏటీఎంకు వెళ్లేందుకు సమయం లేదా? మరేం ఫర్లేదు. మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ద్వారా ఆన్లైన్ ఆధార్ ఏటీఎం( ఏఈపీఎస్) సేవను ఉపయోగించి ఇంటి నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీ కనీస అవసరాల్ని తీర్చుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అందులో ‘అత్యవసర నగదు కావాలి కానీ బ్యాంక్‌కు వెళ్లేందుకు సమయం లేదా? చింతించకండి! ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్లో ఆధార్ ఏటీఎం(ఏఈపీఎస్) ద్వారా మీ ఇంటి నుంచే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీ పోస్ట్‌మాన్ ఇప్పుడు మీ ఇంటి వద్దే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు మీకు సహాయం చేస్తారు.’ అంటూ ట్వీట్లో పేర్కొంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)తో ఒక వ్యక్తి తన బయోమెట్రిక్‌ని ఉపయోగించి నగదు తీసుకోవడానికి, ఆధార్-లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతరులకు నగదు పంపుకోవచ్చు. కస్టమర్లు ఏటీఎం లేదా బ్యాంక్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఏఈపీఎస్ని ఉపయోగించి చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. ఏఈపీఎస్ అంటే ఏఈపీఎస్ అంటే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) అనేది ఒక చెల్లింపు సేవ. ఈ సేవల ద్వారా ఒక బ్యాంక్ కస్టమర్ తన ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేయడంతో పాటు ప్రాథమిక్ బ్యాంకింగ్ అవసరాలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడం, కొద్ది మొత్తంలో డబ్బులు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు పంపుకోవచ్చు. ఏఈపీఎస్ సేవల్ని పొందడం ఎలా? ఏఈపీఎస్ సర్వీసుల్ని పొందాలనుకునే కస్టమర్‌కు తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయాలి. బయోమెట్రిక్‌ను ఉపయోగించి డబ్బుల్ని పంపడం,విత్ డ్రాయిల్ వంటి సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి క్యాష్ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌కు లిమిట్ అనేది ఏం లేదు. కానీ గరిష్టంగా రూ. 10 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. In need of urgent cash but don’t have time to visit the bank? Worry not! With @IPPBOnline Aadhaar ATM (AePS) service, withdraw cash from the comfort of your home. Your Postman now helps you to withdraw cash at your doorstep. Avail Now! 👉For more information Please visit:… pic.twitter.com/4NNNM6ccct — India Post Payments Bank (@IPPBOnline) April 8, 2024 -
ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డు.. ఇంటికే కావాలంటే ఇలా చేయండి..
Aadhar PVC Card: ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ. 50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. పీవీసీ కార్డ్‌లను పాలీ వినైల్ క్లోరైడ్‌తో తయారు చేస్తారు. అందుకే వీటిని పీవీసీ కార్డ్‌లు అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ కార్డ్. దీనిపై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయండిలా.. యూఐడీఏఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్సైట్లో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి ఓటీపీ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి. దీని తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి. చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్‌ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్‌కి అందజేస్తుంది. పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది. -
8 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి యూపీఐ, ఆధార్ కీలకం.. ఎలాగో తెలుసా..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) వల్ల 2030 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 8 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో కీలకంగా పనిచేయనున్నాయని నివేదికలు చెబుతున్నాయి. యూపీఐ, డీపీఐల ద్వారానే ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించగలదని నాస్కామ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలియజేస్తుంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్‌తో కలిసి నాస్కామ్ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. డీపీఐలు భారతదేశ జనాభాలో 97 శాతం మందిపై ప్రభావం చూపుతున్నాయి. మెచ్యూర్డ్ డీపీఐల వల్ల 31.8 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరిగింది. ఇది 2022లో భారతదేశ జీడీపీలో 0.9 శాతానికి సమానం. ఇదీ చదవండి: ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే.. డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ విధానంలో ఆధార్‌ను పరిచయం చేయడం ద్వారా దాదాపు 15.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. యూపీఐ వల్ల నగదు లావాదేవీలు, పేపర్ వాడకం తగ్గింది. దాంతో కాలుష్యమూ తగ్గినట్లు నివేదికలో తేలింది. పేపర్వాడకం తగ్గడం వల్ల లాజిస్టిక్స్, రవాణా రంగంలో 2022లో 3.2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. -
బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?
భారతదేశంలోని ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో అవసరం. అటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా, ఇటు విద్యా సంబంధిత విషయాలకైనా ఆధార్ తప్పనిసరి. ‘ఆధార్’ అనేది దేశంలోని అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అయ్యే ప్రధాన గుర్తింపు కార్డు అని చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎవరికి జారీ చేస్తారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. ఈ ప్రత్యేక కార్డును దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు. సాధారణ ఆధార్ కార్డుకు ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దల మాదిరిగా కాకుండా, పిల్లలకు కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనికి బదులుగా యూఐడీకి లింక్ అయిన ఆ చిన్నారుల తల్లిదండ్రుల సమాచారం, వారి ఫొటోల ఆధారంగా పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది. అయితే, పిల్లలకు ఐదేళ్లు దాటాక ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫొటో కూడా అవసరమవుతుంది. పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్‌ను చూపించి నవజాత శిశువుకు సంబంధించిన బాల్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోందా?
న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ తొలగింపులంటూ వస్తున్న ఆరోపణలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ డేటా బేస్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని, తమ నుంచి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపింది. అంతే తప్పా.. ఆధార్ కార్డులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాల కోసం ఆధార్ కార్డ్ అత్యవసరం. కాబట్టే, ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని కొనసాగిస్తూ, కార్డు దారులు మార్పులు చేసుకుంటుంటే సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర సమాచారం డేటాబేస్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ ఆధార్ కార్డ్ దారులు సమస్యలు తలెత్తితే యూఐడీఏఐకి ఫిర్యాదు చేయాలని కోరింది. రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఉండేలా యూఐడీఏఐ ద్వారా కేంద్రం ఆధార్ కార్డ్ లను డీయాక్టీవేట్ చేస్తుందన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో యూఐడీఏఐ పై విధంగా స్పందించింది. కుట్రపూరితంగా కేంద్రం కేంద్రం కుట్రపూరితంగా తమ రాష్ట్ర ప్రజల ఆధార్ కార్డ్ లను నిరుపయోగం చేస్తుందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూఐడీఏఐపై పలు ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజలు వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందకుండా నిరోధించేలా వారి ఆధార్ కార్డ్ లను డీయాక్టీవ్ చేసిందని అన్నారు. బీర్ భూమ్ జిల్లాలో జరిగిన ప్రజా పంపిణీ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఆధార్ కార్డు లేని లబ్ధిదారులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్వహించే సంఓేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. ఆందోళన వద్దు..మీకు నేనున్నా బెంగాల్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కోసం నేను ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి. వారు (కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) ఆధార్ కార్డ్ లను డీయాక్టీవేట్ చేస్తున్నారు. బెంగాల్ లోని అనేక జిల్లాల్లో అనేక ఆధార్ కార్డ్ లు డీయాక్టీవేట్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలు ఉచిత రేషన్, బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్ పథకం ప్రయోజనాలను పొందకూడదనేదే కేంద్రం ఉద్దేశమని, దీనిని తెలుసుకోవాలని ప్రజలను కోరారు. తన ప్రభుత్వం ఆధార్ కార్డు లేనివారికి సైతం పథకాలను అందించడం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. పుర్బా బర్ధమాన్ జిల్లా పరిధిలోని జమాల్‌పూర్‌లో 50 మంది, బీర్భూం, నార్త్, సౌత్ 24 పరగణాలు జిల్లాతో పాటు ఉత్తర బెంగాల్లో అనేక మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు డీలింక్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
ఆధార్ కార్డ్ దారులకు ముఖ్యగమనిక.. త్వరలో ముగియనున్న డెడ్‌లైన్!
ఆధార్ కార్డ్ దారులకు ముఖ్య గమనిక. ఆధార్‌లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది మార్చి 14తో ముగియనుంది. ఈ తేదీలోపే ఏమైనా మార్పులు చేసుకోవాలని ఆధార్ ప్రతినిధులు కోరుతున్నారు. 2023 డిసెంబర్లో మూడు నెలల పాటు పొడిగించబడిన ఉచిత ఆధార్ అప్డేట్ మార్చి 14, 2024కి ముగియనుంది. ఈ గడువు గతంలో చాలాసార్లు పొడిగించింది కేంద్రం. మార్చి 14 తర్వాత ఈ గడువు పొడిగిస్తుందా?లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు: మార్చి 14, 2024 (ఇది చివరి పొడిగింపు) ఎవరు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు: ఇప్పటికే తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయని వారు ఎవరైనా ఏ వివరాల్ని ఆధార్‌లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు: పేరు, చిరునామా,మొబైల్ నంబర్ వంటి జనాభా వివరాలు (బయోమెట్రిక్ అప్డేట్లకు ఇప్పటికీ ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం అవసరం) మార్చి 14 తర్వాత ఏం జరుగుతుంది: ఆధార్ అప్డేట్ల కోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆధార్‌ను ఆన్లైన్లో ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలంటే ♦ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://myaadhaar.uidai.gov.in/ ♦ మీ ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయండి. ♦ ‘సెండ్ ఓటీపీ’ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన కోడ్‌ను ఎంటర్ చేయండి ♦ అనంతరం అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. ♦ ఇక్కడే మీరు ఆధార్‌లో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. సంబంధిత కాలమ్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ♦ అవసరమైన మార్పులను చేయండి, ఇందుకోసం అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. ♦ సంబంధిత వివరాలను నమోదు చేసి రిక్వెస్ట్‌పై క్లిక్ చేయండి. -
పాన్-ఆధార్ లింక్ ఆలస్యం.. కేంద్రానికి ఊహించనంత ఆదాయం!
నిర్ణీత గడువు లోపు ఆధార్ - పాన్ లింక్ చేయని వినియోగదారుల నుంచి కేంద్రం పెనాల్టీల రూపంలో సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఆధార్ - పాన్ లింక్ చేయని వారు 11.48 కోట్ల మంది ఉండగా.. వారందరూ బయోమెట్రిక్ ఐడెంటిటీని పూర్తి చేయలేదని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆధార్ - పాన్ లింక్‌పై లోకసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ అవర్‌లో కేంద్రం ఉచితంగా ఆధార్ - పాన్ లింక్ చేసుకునేందుకు జూన్ 30,2023కి చివరి తేదీగా నిర్ణయించింది. గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవరైతే ఆధార్ - పాన్ లింక్ చేయాలనుకుంటారో వాళ్లు తప్పని సరిగా అదనపు రుసుము కింద రూ.1000 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత అంటే జులై 1,2023 నుంచి జనవరి 31,2024 వరకు ఆధార్ - పాన్ లింక్ కోసం వినియోగదారుల నుంచి అదనపు రుసుము కింద రూ. 601.97 కోట్లు వసూలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ట్యాక్స్ పేయిర్స్కి డెడ్ లైన్ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పన్ను చెల్లింపు దారులకు ఆధార్ - పాన్ లింక్‌పై పలు సూచనలు చేశారు. జులై1,2023 వరకు ఆధార్- పాన్ లింక్ చేయని పక్షంలో వారి పాన్ కార్డ్ బ్లాక్ అవుతుందని, ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినా ఫండ్ రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. అంతేకాదు టీడీఎస్, టీసీఎస్ సైతం అధిక మొత్తంలో ట్యాక్స్ పేయిర్స్ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ పాన్ కార్డ్ మళ్లీ పునరుద్దరించాలంటే లేట్ ఫీ కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆ సందర్భంలో ట్యాక్స్ పేయిర్లకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరించారు. -
Aadhaar rules: మారిన ఆధార్ రూల్స్.. ఇకపై మరింత సులువుగా..
ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త నిబంధనలను జారీ చేసింది. ఆధార్ (నమోదు మరియు నవీకరణ) సవరణ నిబంధనలు, 2024గా పేర్కొంటూ దేశ పౌరులు, ప్రవాస భారతీయులకు ఆధార్ నమోదు, అప్డేట్ ప్రక్రియ మరింత సులువుగా ఉండేలా కొత్త మార్పులు చేసింది. యూఐడీఏఐ విడుదల చేసిన జనవరి 16 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నమోదు చేసుకోవడానికి, దానిలోని సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడానికి రెండు కొత్త ఫారమ్‌లను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఆధార్ ఎన్రోల్మెంట్/అప్డేషన్ కోసం దేశ పౌరులు, ఎన్నారైలకు వేర్వేరు ఫారమ్‌లను జారీ చేసింది. సమాచారం అప్డేట్ యూఐడీఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కార్డుదారులు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో తమ సమాచారాన్ని సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. నమోదు కేంద్రం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ తాజాగా అవకాశం కల్పించింది. అంతకుముందు 2016లో ప్రవేశపెట్టిన నియమాల ప్రకారం.. చిరునామాల మార్పునకు మాత్రమే ఆన్లైన్ మోడ్‌లో అవకాశం ఉండేది. డాక్యుమెంట్ అప్డేషన్, సమాచారం, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉండేది. వయసు రుజువు తప్పనిసరి సవరించిన నిబంధనల ప్రకారం.. వయసు రుజువు కోసం డాక్యుమెంటరీ ఫ్రూఫ్ కచ్చితంగా ఉండాలి. దీని ఆధారంగానే ఆధార్ కార్డ్‌పై పూర్తి పుట్టిన తేదీని ముద్రిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా లేదా కుటుంబ పెద్ద నిర్ధారణ ఆధారంగా ఆధార్ కోసం ఎన్రోల్మెంట్, వివరాల అప్డేట్ చేయవచ్చని యూఏడీఏఐ తెలిపింది. మరోవైపు ఎన్నారైలు ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ ఎన్నారైలు విదేశీ మొబైల్ నంబర్‌ను అందిస్తే ఆ నంబర్‌కు ఆధార్ సంబంధిత మెసేజ్‌లు వెళ్లవు. సవరించిన ఫారాలు దరఖాస్తుదారులకు మరింత సులువుగా ఉండేందుకు యూఐడీఏఐ పాత ఫారమ్‌లను సవరించింది. ఫారం 1: ఆధార్ నమోదు, నవీకరణ ఫారం 2: ఎన్నారైల కోసం ఫారం 3: దేశంలో చిరునామా ఉన్న ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం ఫారం 4: ఐదు నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న ఎన్నారై పిల్లల కోసం ఫారం 5: భారతీయ చిరునామా ఉన్న ఐదేళ్లలోపు పిల్లల కోసం ఫారం 6: ఐదేళ్ల లోపు ఎన్నారై పిల్లల కోసం ఫారం 7: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్లు నిండిన విదేశీ పౌరుల కోసం ఫారం 8: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్ల లోపు విదేశీ పిల్లల కోసం ఫారం 9: ఆధార్ నంబర్ రద్దు కోసం -
ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ..
కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకునేవారిని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మాదిరే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఆధార్ ఎన్రోల్మెంట్కు సంబంధించిన ఏ అంశాన్నైనా యూఐడీఏఐ నిర్వహిస్తోంది. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను యూఐడీఏఐకి బదులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్ కేంద్రాల్లోకి వెళ్లి ఈ సర్వీస్ పొందొచ్చు. ఆన్లైన్లో వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసే ముందు అన్ని ఆధార్ అప్లికేషన్లలోని డేటాను క్వాలిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సబ్‌డివిజన్ మేజిస్ట్రేట్ ఈ వెరిఫికేషన్ విధానాన్ని పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తే 180 రోజుల్లో ఆధార్ కార్డును ఇష్యూ చేస్తారు. ఇదీ చదవండి: ఫోన్‌పే క్రెడిట్సెక్షన్, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..! తాజాగా యూఏడీఏఐ తీసుకొచ్చిన మార్పులపై సంస్థ లక్నో రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ స్పందించారు. ఒక్కసారి ఆధార్ కార్డు ఇష్యూ అయితే ఆ తర్వాత ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే యథావిధిగా పాత పద్ధతినే పాటించాలన్నారు. కానీ ఇప్పటివరకు ఆధార్ కార్డు తీసుకోనివారు మాత్రం ఈ కొత్త విధానాన్ని అనుసరించాలని తెలిపారు. -
ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయంపై పరిశీలించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. వివరాల ప్రకారం.. దేశంలో ప్రతీ ఒక్కరి ఆస్తులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. కాగా, విచారణ సందర్బంగా ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఇదే సమయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. అయితే, అవినీతి, నల్లధనం ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర, స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీంతో, జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని పైవిధంగా ఆదేశించింది. [Linking property with #Aadhar] Delhi High Court says it is a policy decision, asks Centre and Delhi governments to take decision on the issue within three months. Court asks the authorities to treat BJP leader Ashwini Upadhyay's plea as a representation. — Lawstreet Journal (@LawstreetJ) December 21, 2023